Breaking News

Kamareddy

పోలీసు అమర వీరులకు నివాళి – కర్షక్‌ బిఇడి కళాశాల ఆధ్వర్యంలో ర్యాలీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నల్గొండ ఘటనలో మృతి చెందిన పోలీసు అమరవీరులకు కామారెడ్డి కర్షక్‌ బిఇడి కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులు నివాళి అర్పించారు. బుధవారం కళాశాలలో పోలీసు అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కళాశాల నుంచి నిజాంసాగర్‌ చౌరస్తా వరకు పోలీసులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అక్కడ మానంహారం ఏర్పాటు చేసి శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా దేశంకోసం ప్రాణాలు అర్పించిన పోలీసుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ రషీద్‌, ...

Read More »

అభివృద్ధి పనులు ప్రారంభం

కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 8వ వార్డులో మంగళవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ పలు అభివృద్ది పనులు ప్రారంభించారు. 13వ ఆర్థిక సంఘం నిధులు రూ. 4 లక్షలతో చేపట్టిన సిసి డ్రైన్‌ పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు చేసిన వాగ్దానాల ప్రకారం హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నట్టు తెలిపారు. మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు యాదమ్మ, బట్టు మోహన్‌, ఏ.ఇ. ...

Read More »

బిజెపి పాలనలో మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం, – బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గీతారెడ్డి

కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నరేంద్ర మోడి ఆధ్వర్యంలోని బిజెపి పాలనలో కేంద్ర ప్రబుత్వం మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తుందని బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గీతారెడ్డి అన్నారు. కామారెడ్డిలో మంగళవారం నిర్వహించిన మహిళా మోర్చా సభ్యత్వ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలకు రిజర్వేషన్‌, విద్య, ఉద్యోగం, ఉపాధి తదితర వసతుల కల్పనలో బిజెపి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని తెలిపారు. మోడి ఆశయాలకు అనుగుణంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ...

Read More »

పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి – మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ

కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అన్నారు. కామారెడ్డి పట్టణంలో మంగళవారం బ్రిలియంట్‌ గ్రామర్‌ హైస్కూల్‌, లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నల్గొండ ఘటనలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరై ఆమె ప్రసంగించారు. ప్రజలకు రక్షణ కల్పించేందుకు అహర్నిశలు పాటుపడుతూ తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించే పోలీసుల సేవలను కొనియాడారు. తీవ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించడంలో ...

Read More »

సిసి డ్రైన్‌ పనులు ప్రారంభం

కామారెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 1వ వార్డులో సోమవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ సిసి డ్రైన్‌ పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డుల్లో సిసి డ్రైన్‌ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. అందులో భాగంగానే 1వ వార్డుకు సైతం నిదులు కేటాయించామన్నారు. అన్ని వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు పనులు నాణ్యతతో చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కాళ్ళ గణేశ్‌, నాయకులు రాంకుమార్‌గౌడ్‌, తదితరులు ...

Read More »

ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవం

కామారెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో సోమవారం భారతీయ జనతాపార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణ బిజెపి కార్యాలయం వద్ద బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్‌ సిద్దిరాములు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ బిజెపిని స్థాపించి నేటికి 35 సంవత్సరాలు అవుతోందని తెలిపారు. ఈకాలంలో కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాడి మూడుసార్లు అధికారంలోకి వచ్చామని పేర్కొన్నారు. పీడిత పాలననుంచి ప్రజలను విముక్తులను ...

Read More »

అంబలి కేంద్రం ప్రారంభం

కామారెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 11వవార్డులో సుభాష్‌ రోడ్డులో మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అంబలి కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. వినాయక్‌నగర్‌ ఆర్యవైశ్య సంఘం ఆద్వర్యంలో అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవి కాలం ప్రజల దాహార్తి తీర్చేందుకు అంబలి కేంద్రాలు, చలి వేంద్రాలు ఉపయుక్తంగాఉంటాయని అన్నారు. అంబలి కేంద్రాలు, చలి వేంద్రాలను దాతలు ముందుకు వచ్చి ఏర్పాటు చేయాలని సూచించారు. సంఘం ప్రతినిధులు దిగంబర్‌, చంద్రశేఖర్‌, ఆంజనేయులు, రమేశ్‌, ...

Read More »

ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు సన్మానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ను కామారెడ్డి ఆర్యక్షత్రియ సంఘం ప్రతినిదులు సన్మానించారు. ఎమ్మెల్యే స్థాయినుంచి అంచెలంచెలుగా ఎదిగి ప్రభుత్వ విప్‌ స్థాయికి చేరుకున్న గంప గోవర్దన్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరారు. సన్మానించిన వారిలో సంఘం ప్రతినిధులు నిట్టు విఠల్‌రావు, నిట్టువేణుగోపాల్‌రావు, బలవంతరావు, రాజగంభీర్‌రావు, బాపురావు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

కాల్పుల ఘటనలో పోలీసులు కోలుకోవాలని పూజలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నల్గొండ జిల్లాలో ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల ఘటనలో గాయాలపాలై చికిత్స పొందుతున్న పోలీసులు వెంటనే కోలుకోవాలని పట్టణంలోని కోడూరి వీరాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక నాయకులు పుల్లూరి సతీష్‌ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. దేశం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా తీవ్రవాదులతో పోరాడి ప్రాణాలు వదిలిన పోలీసుల త్యాగాలను కొనియాడారు. మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారుత్వరగా కోలుకోవాలని అభిప్రాయపడ్డారు.

Read More »

ఘనంగా జగ్జీవన్‌రాం జయంతి వేడుకలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ఆదివారం బాబు జగ్జీవన్‌రాం జయంతి వేడుకలను వివిధ పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మునిసిపల్‌ కార్యాలయం వద్ద ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ జగ్జీవన్‌ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. టిడిపి కార్యాలయంలో నాయకులు చీల ప్రభాకర్‌, నజీరోద్దీన్‌, రాజమౌళిలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగ్జీవన్‌ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆనంద్‌, నర్సింలు, ఎం.జి.వేణుగోపాల్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

గుర్తు తెలియని మహిళ శవం లభ్యం

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని తహసీల్‌ కార్యాలయం సమీపంలో శనివారం గుర్తు తెలియని మహిళా శవాన్ని కనుగొన్నట్టు పట్టణ ఎస్‌ఐ సంతోష్‌ తెలిపారు. మృతురాలికి 40 సంవత్సరాల వయసు ఉంటుందని చెప్పారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు. శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచుతామని, ఎవరైనా సంబంధీకులు వస్తే అందజేస్తామన్నారు.

Read More »

ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కార్మికుల ధర్నా

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట శనివారం కాంట్రాక్టు కార్మికులు ధర్నా నిర్వహించారు. తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్టు వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆద్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని నెలలుగా ప్రభుత్వం తమకు వేతనాలు చెల్లించడం లేదని నిరసన వ్యక్తం చేశారు. వేతనాలు చెల్లించినప్పటికి ఎలాగో అలా జీవితాలు వెళ్లదీస్తూ వెట్టిచాకిరి చేస్తున్నామని పేర్కొన్నారు. తమచేత పని చేయించుకుంటున్న ప్రభుత్వం వైద్యశాఖ వెంటనే తమ పట్ల స్పందించి తమకు రావాల్సిన ...

Read More »

కామారెడ్డిలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

– పట్టణంలో భారీ బైక్‌ ర్యాలీ కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శనివారం హనుమాన్‌ జయంతి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో పట్టణంలో వందలాది ద్విచక్ర వాహనాలతో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. యువకులు విహెచ్‌పి, భజరంగ్‌దళ్‌ నాయకులు వందల సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీని విహెచ్‌పి రాష్ట్ర కార్యదర్శి జగదీశ్వర్‌ ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు ...

Read More »

వైభవంగా గణపతి ఆలయంలో హోమం

కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని హౌజింగ్‌ బోర్డులోగల సంకష్ట హర మహాగణపతి ఆలయంలో శుక్రవారం పౌర్ణమిని పురస్కరించుకొని గణపతి హోమాన్ని వైభవంగా జరిపారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య యాగాన్ని జరిపించారు. అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, విఘ్నాలు తొలగిపోయి సుభిష్టంగా వర్దిల్లాలని హోమం నిర్వహించినట్టు తెలిపారు. ప్రతి పౌర్ణమినాడు హోమం చేస్తున్నట్టు అన్నారు. పట్టణప్రజలు వందల సంఖ్యలో తరలివచ్చి యజ్ఞ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

Read More »

తెరాస పట్టణ వార్డు కమిటీల ఎన్నిక

కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని వివిధ వార్డుల తెరాస నూతన కమిటీలను శుక్రవారం ఎన్నుకున్నారు. 29వ వార్డు అధ్యక్షునిగా కొమ్యాడం శ్రీనివాస్‌, కార్యదర్శిగా కొడిశ్యామ గంగాధర్‌, 30వ వార్డు అధ్యక్షునిగా పిట్ల శంకర్‌, కార్యదర్శిగా పి.శ్రీహరి, 31వ వార్డు అధ్యక్షునిగా బోజ వినోద్‌, కార్యదర్శిగా బట్టు సంతోష్‌, తదితరులను ఎన్నుకున్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో నూతన కమిటీలను ఎన్నుకొని పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తామని తెరాస నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ ప్రతినిదులు రామారావు,తిరుమల్‌రెడ్డి, ...

Read More »

మునిసిపల్‌ సమావేశాన్ని ‘మమ’ అనిపించేశారు – ఎటువంటి చర్చ లేకుండానే ఎజెండా అంశాలకు ఆమోదముద్ర

కామారెడ్డి, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ కార్యాలయంలో మంగళవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అధ్యక్షతన జరిగిన మునిసిపల్‌ సర్వసభ్య సమావేశాన్ని ఎప్పటిలాగానే మమ అనిపించేశారు. ఎజెండాపై ఎలాంటి చర్చ లేకుండానే నామమాత్రపు చర్చ జరిపి ఎజెండాకు సభ్యులు ఆమోదముద్ర వేశారు. సమావేశంలోని ఎజెండాలో మొత్తం 66అంశాలను పొందుపరచగా కొన్నింటికి మాత్రమే పెండింగ్‌లో ఉంచి మిగతావాటికి ఆమోదముద్ర వేశారు. సమావేశంలో కొన్ని అంశాలు చర్చకు వచ్చాయి. ప్రధానంగా గోదావరి జలాల నీటి విషయమై కొందరు సభ్యులు ఆగ్రహం ...

Read More »

పట్టణంలో అభివృద్ధి పనులు ప్రారంభం

కామారెడ్డి, మార్చి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 31వ వార్డులో సోమవారం పలు అభివృద్ధి పనులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిఆర్‌జిఎఫ్‌ నిధులు రూ. 2 లక్షలతో సిసి డ్రైన్‌ పనులు చేపట్టినట్టు తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో ప్రగతిపనులు చేపడుతున్నామని, విడతల వారిగా అన్ని వార్డుల్లో సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రజలు కౌన్సిలర్ల భాగస్వామ్యంతో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్‌ ఛైర్మన్‌ మసూద్‌ అలీ, ...

Read More »

ప్రజావాణిలో ఆరు ఫిర్యాదులు

కామారెడ్డి, మార్చి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆరుఫిర్యాదులు అందినట్టు కామారెడ్డి ఆర్డీవో నగేశ్‌ తెలిపారు. అటవీశాఖ అధికారులు తమకు కేటాయించిన అసైన్డ్‌ భూముల్లో వారి హద్దురాళ్లను పాతుతున్నారని రైతులు ఆర్డీవోకు విన్నవించారు. అటవీ శాఖాధికారులు సక్రమంగా సర్వే నిర్వహించి తమ భూముల్లో కాకుండా వారి భూముల్లో హద్దులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను కోరారు. వీరితోపాటు పింఛన్లు, తదితర సమస్యలపై ఫిర్యాదులు వచ్చినట్టు ఆర్డీవో వివరించారు.

Read More »

చెరుకు రైతుల బకాయిలు చెల్లించాలి

కామారెడ్డి, మార్చి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాయత్రీ షుగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం చెరుకు రైతులకు బకాయి పడిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలని చెరకు ఉత్పత్తి దారుల సంఘం జిల్లా నాయకుడు, మాజీ జడ్పి ఛైర్మన్‌ కాటిపల్లి వెంకటరమణారెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం కామారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏప్రిల్‌ 1న సదాశివనగర్‌ మండలం మల్లన్నగుట్ట వద్ద చెరుకు రైతుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అదే సమావేశంలో చెరుకు రైతుల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటామని చెప్పారు. చెరుకు రైతుల సమస్యలు ...

Read More »

హత్య కేసు మిస్టరీని చేదించిన పోలీసులు – ఐదుగురు నిందితుల అరెస్టు, రిమాండ్‌

కామారెడ్డి, మార్చి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండలం పద్మాజివాడ ఎక్స్‌రోడ్డు వద్ద ఈనెల13న జరిగిన హత్యకు సంబంధించిన మిస్టరీని పోలీసులు చేదించారు. కేసు వివరాలను కామారెడ్డి రూరల్‌ సిఐ కోటేశ్వర్‌రావు సోమవారం వెల్లడించారు. నిందితులను విలేకరుల ముందు ప్రవేశపెట్టారు. సిఐ కథనం ప్రకారం… ఈనెల 13న సదాశివనగర్‌ మండలం పద్మాజివాడి ఎక్స్‌రోడ్డు వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృత దేహాన్ని కనుగొన్నామన్నారు. ఎవరో తలపై రాతితోబాది చంపి పడేసినట్టు తెలిపారు. అప్పుడు ఆ కేసును గుర్తు తెలియని వ్యక్తి మృతిగా ...

Read More »