Breaking News

Kamareddy

బిజెపి విస్తారక్‌ సప్తా సభ్యత్వ నమోదు

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ విస్తారక్‌ సప్తా సభ్యత్వ నమోదులో భాగంగా కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి రమణారెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో శుక్రవారం విస్తతంగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారెడ్డి మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర అనంతరం కాంగ్రెస్‌ వ్యతిరేకులు, జాతీయ వాదులు కలిసి శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ నేతత్వంలో మొదట జనసంఘ్‌గా ఏర్పడి, తరువాత వాజపేయి, అద్వాణీల మార్గ ...

Read More »

పంటల సాగుకు వ్యవసాయశాఖ చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో రైతులు పంటలు సాగుచేస్తుండడంతో వ్యవసాయ శాఖ తగు చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, మత్స్యశాఖలతో ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్‌ సీజన్‌ 2019లో సంవత్సరానికిగాను లక్ష 20 వేల 895 హెక్టార్లలో రైతులు ఆయా పంటలు సాగుచేయనున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా రైతులకు సూచనలు, సలహాలు అందజేయాలని పేర్కొన్నారు. రైతుబంధు, ...

Read More »

విద్యార్థులు సరైన పోషకాహారం తీసుకోవాలి

కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు సరైన పోషకాహారం తీసుకోవాలని తద్వారా ఆరోగ్యంతో పాటు చదువుపై ఏకాగ్రత ఉంటుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. గురువారం సీతాయిపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నిత్య అల్పాహార కార్యక్రమాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. శ్రీ సత్యసాయి ట్రస్టు ప్రతినిధి రామ్మూర్తి జిల్లాలో మొదటిసారిగా సీతాయిపేట పాఠశాలలో అల్పాహార వితరణ కార్యక్రమం ప్రారంభించినట్టు తెలిపారు. ప్రతిరోజు పాఠశాలలో 430 మంది విద్యార్థులకు అల్పాహారం అందించనున్నట్టు తెలిపారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వందశాతం హాజరు ...

Read More »

రోడ్లు, మునిసిపల్‌ పనులు త్వరితగతిన పూర్తిచేయాలి

కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్‌అండ్‌బి, పంచాయతీ రాజ్‌ ద్వారా మంజూరైన రోడ్లు, మునిసిపల్‌ పనులను వెంటనే పూర్తి చేసేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఆర్‌అండ్‌బి, పంచాయతీ, మునిసిపల్‌, డిఇ, ఇఇలతో ఏర్పాటైన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. జివో 129 అనుసరించి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం కలిపే సింగిల్‌ లైన్‌ను డబుల్‌ లైన్‌గా మార్చడం, జివో 130 అనుసరించి డబుల్‌ లైన్‌ రహదారిగా ...

Read More »

పోలియా దాసరి సంక్షేమ సంఘం కార్యవర్గం ఎన్నిక

కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలియా దాసరి సంక్షేమ సంఘం దేవునిపల్లి గ్రామ నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నపోచయ్య, గ్రామ మాజీ అధ్యక్షుడు చిన్న నర్సింలు, శ్రీరాం గంగారాంల ఆద్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా నరేందర్‌, ఉపాధ్యక్షునిగా రాజు, కార్యదర్శిగా చిన్న నర్సింలు, కోశాధికారిగా శ్రీనివాస్‌, సలహాదారునిగా మధుకుమార్‌, సహాయ కార్యదర్శిగా సాయికృష్ణ, కార్యనిర్వాహన అధికారిగా శ్రీకాంత్‌, ప్రచార కార్యదర్శిగా రాము, కార్యవర్గ సభ్యులుగా అశోక్‌, మధు, నరేశ్‌, నర్సింలు, గంగాధర్‌, ...

Read More »

రోళ్లగడ్డ బూటకపు ఎన్‌కౌంటర్‌పై కేసు నమోదు చేయాలి

కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోళ్లగడ్డ బూటకపు ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులందరిపై హత్యకేసు, ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటి కేసు నమోదు చేయాలని సిపియుఎస్‌ఐ రాష్ట్ర నాయకులు కట్ల భూమన్న, కమ్యూనిస్టు నాయకులు డిమాండ్‌ చేశారు. సిపిఐ ఎంఎల్‌ రాష్ట్ర నాయకుడు, అజ్ఞాత దళ కమాండర్‌ కామ్రేడ్‌ లింగన్న బూటకపు ఎన్‌కౌంటర్‌ను దేశంలోని కమ్యూనిస్టు పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఆదివాసీల హక్కుల కోసం వారు సాగుచేసుకుంటున్న పోడు భూముల రక్షణ కోసం నిరంతరం శ్రమించి పోరాడిన లింగన్నను ఎన్‌కౌంటర్‌ ...

Read More »

ఈ ఆటో స్కీంకు దరఖాస్తు చేసుకోవాలి

కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంబిసి కులాలకు ప్రవేశపెట్టిన ఈ ఆటో స్కీమ్‌ను వినియోగించేందుకు ఎంబిసి, అత్యంత వెనుకబడిన బీసీ కులాలు సంచారజాతి కులాలకు చెందిన యువకులు, నిరుద్యోగులు స్కీమ్‌ వినియోగించుకొని స్వయం ఉపాధిని పొందాలని ఎంబీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు మఠం విజయ్‌, కార్యదర్శి రాజలింగం, ఉపాధ్యక్షుడు పూసల రమేష్‌, సహాయ కార్యదర్శి వాల్మీకి బోయ శ్యాం కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఎంబిసి కులాల ప్రజలు గత సంవత్సరం ...

Read More »

మానవ జీవితానికి సార్ధకత పరోపకారమే

కామారెడ్డి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌ జిల్లా షోనపూర్‌కు చెందిన సరిత అనే మహిళ కామారెడ్డి సాయిసింహ వైద్యశాలలో రక్తహీనతతో బాధ పడడంతో ఓ పాజిటివ్‌ రక్తం అవసరమైంది. వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల నిర్వాహకుడు బాలును సంప్రదించడంతో వారు చిన్న మల్లారెడ్డిలో ప్రైవేటు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న శ్రీనివాస్‌ ఐదవసారి వి.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడడం జరిగింది. రక్తదాతకు కామారెడ్డి రక్త దాతల సమూహం తరపున బాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ...

Read More »

ఘనంగా టిజివిపి ఆవిర్భావ దినోత్సవం

కామారెడ్డి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిజివిపి కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్‌ పక్కన చర్చ్‌ ముందు గల టీజీవిపి జెండాను రాష్ట్ర కార్యదర్శి ఏనుగందుల నవీన్‌ చేతుల మీదుగా బుధవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టిజివిపి 2012 జులై 31న రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకులతో టిజివిపి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. టిజివిపి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అవిర్భవించడం జరిగిందని, తెలంగాణ ఉద్యమంలో గల్లీ నుండి ...

Read More »

టిజివిపి ధర్నా

కామారెడ్డి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా డిపో మేనేజర్‌ కార్యాలయము ముందు టిజివిపి ఆధ్వర్యంలో ఆందోళన, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టిజివిపి రాష్ట్ర కార్యదర్శి ఏనుగందుల నవీన్‌, రాష్ట్ర కో ఆర్డినేటర్‌ ప్రకాష్‌ మాట్లాడుతూ లింగంపేట్‌ మండలంలోని చెట్‌పల్లి, సంగారెడ్డి, పర్మల్లా, పర్మల్లా తండా, గ్రామాలకు చెందిన విద్యార్థులు లింగంపేట్‌ మండలంలోని కళాశాలలో చదివే విద్యార్థులు కళాశాలకు ఆలస్యంగా రావడంతో గ్రామాలకు అదనపు బస్సులు నడపాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఒక్క గంట ముందు రావాలని ...

Read More »

అభివృద్ది పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

కామరెడ్డి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 26 వార్డులో 78 లక్షల 76 వేల రూపాయలతో, 27వ వార్డులో 1 కోటి 10 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, సీసీ మురుగు కాల్వల నిర్మాణ పనులకు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సుమారు 1 కోటి 60 లక్షల రూపాయలతో ఆరు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఆయన వెంట తెరాస నాయకులు, ...

Read More »

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ

కామారెడ్డి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ సోమవారం పలు అభివృద్ది పనులకు భూమిపూజ, శంకుస్థాపనలు చేశారు. కామారెడ్డి పట్టణంలోని 32 వార్డులో రూ. 2.16 కోట్లతో సిసి రోడ్లు, సిసి డ్రెయిన్లు నిర్మాణ పనులకు, రూ. 26 లక్షలతో శిశు మందిర్‌ పాఠశాల నుండి హానీ బేకరి వరకు నిర్మించనున్న పైప్‌ లైన్‌ నిర్మాణాలకు, జంగంపల్లి గ్రామంలో రూ. 24 లక్షలతో నిర్మించనున్న పిఏసీఎస్‌ భవన నిర్మాణ పనులకు భూమి పూజ, శంకుస్థాపనలు చేశారు. ...

Read More »

కామారెడ్డిలో బోనాలు

కామారెడ్డి, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి పట్టణంలోని విద్యుత్‌ నగర్‌ కాలనీలో ఆదివారం బోనాల పండగ వైభవంగా నిర్వహించారు. మాజీ వార్డు మెంబర్లు నాగరాజు, రియాజ్‌, రాజగౌడ్‌, సంతోష్‌, కిరణ్‌, మైశాగౌడ్‌, మునీర్‌, రాకేశ్‌, కాంగ్రెస్‌ కార్యకర్తలు పండగలో పాల్గొన్నారు. అందంగా అలంకరించిన బోనాలను మహిళలు నెత్తినెత్తుకొని అమ్మవారికి సమర్పించారు.

Read More »

యోగాతో వ్యక్తిత్వ వికాసం

కామారెడ్డి, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేటి కాలమాన పరిస్థితులలో యోగ పాటించి ఒత్తిడిని దూరం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ అన్నారు. ఆదివారం స్థానిక గంజిలోని రామాలయంలో పతంజలి యోగ సమితి వారి 9వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ యోగా ద్వారా శరీరము, బుద్ధి, ఆత్మ ఏకాగ్రతతో ఆధీనంలో ఉంటాయని, ఎన్ని ఇబ్బందులున్నా మనోధైర్యంతో అధిగమించవచ్చని, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవచ్చునని అన్నారు. వ్యక్తి వికాసానికి యోగా చాలా అవసరమని ...

Read More »

క్యాసంపల్లి లో హరితహారం

కామారెడ్డి, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్యాసంపల్లి గ్రామంలో ఆదివారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి నీరుపోశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 2016 రూపాయల పింఛన్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిపి ఆంజనేయులు, వైస్‌ ఎంపిపి ఉరుదొండ నరేశ్‌, జడ్పిటిసి చిదుర రమాదేవి, లక్ష్మారెడ్డి, ఎంపిటిసి భాగ్యలక్ష్మిరాజు, సర్పంచ్‌ సందిరి మంజుల నారాయణరెడ్డి, ఉపసర్పంచ్‌ బాలకిషన్‌గౌడ్‌, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More »

రక్తదాన శిబిరాలను విరివిగా నిర్వహించాలి

కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వ్యాప్తంగా విరివిగా రక్తదాన శిబిరాలు నిర్వహించాలని, అందరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. శనివారం జనహిత భవనంలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆద్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇందులో జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డితోపాటు పలువురు అధికారులు రక్తదానం చేశారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, రక్తదాన ఆవశ్యకతను తెలిపే రక్తదాన శిబిరాల్లో స్వచ్చందంగా పాల్గొనాలని కోరారు. ఇంతవరకు జిల్లాలో 88 శిబిరాలు జిల్లాలో ఏర్పాటు ...

Read More »

హరితహారంలో వందకోట్ల మొక్కలు నాటడం లక్ష్యం

కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంలో భాగంగా ఈయేడు రాష్ట్రంలో వందకోట్ల మొక్కలు నాటడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రాష్ట్ర, అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని రాశివనంలో పర్యటించారు. ముఖ్యమంత్రి నాటిన చెట్టును సందర్శించారు. రాశివనం నిర్వహణ పట్ల జిల్లా కలెక్టర్‌ను అభినందించారు. అనంతరం మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ చెట్ల వల్లే వర్షాలు కురుస్తాయని, ఇందుకోసం రాష్ట్రంలో 33 శాతం వృక్ష సంపదను పెంచడాన్ని ...

Read More »

సామూహిక అన్నప్రాసన

కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం రాఘవపూర్‌ గ్రామంలో పోషణ ఆరోగ్య దినము సందర్భంగా తల్లులకు అవగాహన కల్పించడానికి అన్నప్రాసన, సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. పిల్లలకు అనుబంధ ఆహారం మొదలుపెట్టే విధానం గురించి తల్లులకు తయారు చేసి చూపించడం జరిగింది. అదే విదంగా. కొత్త ఆసరా ఫించన్‌ 2016 రూపాయలు పంపిణీ చేశారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటి నీరుపోశారు. కార్యక్రమంలో కామారెడ్డి మండల జడ్పిటిసి చిదుర రమాదేవి, లక్మరెడ్డి, ఎంపిపి అంజన్న, వైస్‌ ఎంపిపి ఉరుడొంద ...

Read More »

విఆర్వోల సమస్యలు పరిష్కరించాలి

కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం వి.ఆర్‌.ఓల సమస్యలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. రెవెన్యూ శాఖ ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై న్యాయ నిపుణుల సూచనల మేరకు సమగ్రమైన నివేదిక తయారు చేసి వినతిపత్రం సమర్పించారు.

Read More »

యువతి పెళ్ళికి బియ్యం సహాయం

కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేవునిపల్లి గ్రామంలో పేద ముస్లిం యువతి వివాహానికి 50 కిలోల బియ్యం సహాయంగా అందజేశారు. చందు పాషా, తహెరా బిడ్డ హీన వివాహానికి కామారెడ్డి మండల వైస్‌ ఎంపీపీ ఉరుడొంద నరేశ్‌ 50 కిలోల బియ్యం అందజేశారు. కార్యక్రమంలో ఎం.డి. సజెడ్‌, ఎస్‌డి ఆరిఫ్‌, అసిఫ్‌, సాకలి సంజయ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »