Breaking News

Kamareddy

కలాం ఆశయాలను సాకారం చేయాలి

కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం సంస్థ, సాంధీపని డిగ్రీ కళాశాల సంయుక్త ఆద్వర్యంలో శనివారం అబ్దుల్‌ కలాం వర్దంతిని పురస్కరించుకొని కామారెడ్డి పట్టణంలో యువ చైతన్య స్పూర్థి ర్యాలీ నిర్వహించారు. 83 మీటర్ల జాతీయ జెండాతో సాందీపని కళాశాల విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీని సాంధీపని కళాశాల డైరెక్టర్‌ బి.బాలాజిరావు ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబ్దుల్‌ కలాం ఆశయాలను సాకారం చేయాల్సిన బాద్యత నేటి యువతపై ఉందన్నారు. శాస్త్ర సాంకేతిక, అణ్వస్త్ర ...

Read More »

కార్గిల్‌ అమరవీరులకు నివాళి

కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏబివిపి కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కోవ్వత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పూర్వ ఏబివిపి రాష్ట్రాధ్యక్షులు రణజిత్‌ మోహన్‌ మాట్లాడుతూ కార్గిల్‌ యుద్దంలో విజయం సాధించి నేటికి 20 సంవత్సరాలు పూర్తయిందన్నారు. ఉగ్రవాదుల ముసుగులో కశ్మీర్‌ను కబళించేందుకు పాక్‌ చేసిన కుటిల ప్రయత్నాలను భారత్‌ తిప్పికొట్టి నేటికి 20 ఏళ్లు గడిచిందన్నారు. ఉగ్రమూకలతో చేతుల కలిపిన పాక్‌ ‘భారత్‌తో పోరాడుతోంది మేం కాదు.. కశ్మీర్‌ స్వాతంత్య్రాన్ని ఆకాంక్షించే వాళ్లే’ అని ...

Read More »

అమ్మ ఒడి, మాతా శిశు సంరక్షణ సేవలను సమర్థంగా అందించాలి

కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమ్మ ఒడి పోషణ అభియాన్‌, మాతా శిశు సంరక్షణ సేవలను సిబ్బంది సమర్థవంతంగా అందించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఐసిడిఎస్‌, వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు. శుక్రవారం జనహితలో అమ్మఒడి, మాతా శిశు సంరక్షణ సేవలపై ఆయా శాఖలతో సమీక్షించారు. ఆ శాఖల ప్రగతిపై సమీక్షించారు. అంగన్‌వాడిల ద్వారా తల్లి, పిల్లలకు పోషక పదార్థాలు సమర్థవంతంగా అందించాలని, మాతృ శిశు మరణాలు జరగకుండా శ్రద్ద వహించాలని సూచించారు. గర్భిణీలను 12 వారాలలోపు ...

Read More »

భూ రికార్డుల సమస్యలు పరిస్కరించాలి

కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూ రికార్డుల సమస్యలపై నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో భాగంగా వచ్చిన 19 ఫిర్యాదులను వెంటనే పరిశీలించి వాటిని పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తహసీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం ఫోన్‌ ఇన్‌ ద్వారా భూ రికార్డుల సమస్యలను స్వీకరించారు. వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, భూ రికార్డుల తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

రోగులకు మెరుగైన సేవలందించాలి

కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు వైద్యులు మెరుగైన సేవలందించాలని ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఆయన కామారెడ్డి ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. డ్యూటీలో ఉన్న వైద్యులు, సిబ్బంది హాజరు పట్టిక పరిశీలించారు. అన్ని విభాగాల సిబ్బంది ఉన్నారా లేదా, ఏఏ విభాగాల్లో సిబ్బంది ఎలా పనిచేస్తున్నారన్న దానిపై తనిఖీ చేశారు. అన్ని వార్డుల్లో పర్యటించి పారిశుద్యాన్ని పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారి కందుతున్న వసతులు, ...

Read More »

ఎంసిపిఐయు ఆధ్వర్యంలో రిజర్వేషన్‌ డే

కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఛత్రపతి సాహు మహరాజ్‌ 145వజయంతి పురస్కరించుకొని దేశంలో ఈరోజు రిజర్వేషన్‌ డే గా ఎంసిపిఐయు పార్టీ పాటిస్తుందని పార్టీ జిల్లా కార్యదర్శి రాజ లింగం, జబ్బర్‌ నాయక్‌ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలో 145 సంవత్సరాల క్రితం చత్రపతి సాహు మహారాజ్‌ వెనుకబడిన కులాలకు అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు అమలుచేసి దేశానికి ఆదర్శ నేతగా ఆవిర్భవించిన రోజు నేడు కామారెడ్డి జిల్లా ఎంసిపిఐయు పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డిఓ కార్యాలయం ముందు ...

Read More »

పశువులకు టీకాలు

కామారెడ్డి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాఘవపూర్‌ గ్రామంలో ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ క్యాంపు నిర్వహించారు. ఇందులో 56 గేదెలు, 18 ఆవులు, ఎద్దులకి డాక్టర్‌ రవికిరణ్‌, మండల పశువైద్య అధికారి ఆధ్వర్యంలో టీకాలు వేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సాగర్‌ గౌడ్‌, పాడి రైతులు పాల్గొన్నారు.

Read More »

సిసి రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

కామారెడ్డి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 33 వ వార్డులో సుమారు 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ సోమవారం శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. పనులు నాణ్యతతో చేపట్టి వేగవంతంగా పూర్తిచేయాలని గుత్తేదారుకు సూచించారు.

Read More »

బీడీ కార్మికులకు జీవనభృతి మంజూరుపై హర్షం

కామారెడ్డి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలోని బీడీ కార్మికులందరికి ఎలాంటి షరతులు లేకుండా ముఖ్యమంత్రి కెసిఆర్‌ జీవనభృతి మంజూరు చేయడం పట్ల నూతన బీడీ కార్మికుల సంఘం తెలంగాణ ప్రధాన కార్యదర్శి శివంగి సత్యం హర్షం వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గల సుమారు 7 లక్షల మంది బీడీ కార్మిక కుటుంబాలు జీవనభృతి పట్ల లబ్దిపొందనున్నట్టు తెలిపారు. గతంలో పాలకులు బీడీ కార్మికులను పట్టించుకోలేదని, ముఖ్యమంత్రి కెసిఆర్‌, కెటిఆర్‌ కృషి ...

Read More »

జలశక్తి అభియాన్‌ ర్యాలీ

కామారెడ్డి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జలశక్తి అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా జలవనరుల సంరక్షణ, వర్షపు నీటి రక్షణపై సోమవారం కామారెడ్డిలో నిర్వహించిన విద్యార్థుల ర్యాలీని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ప్రారంభించారు. నీటి సంరక్షణపై ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు బ్యానర్లు, ప్లకార్డులతో కళాశాల నుంచి పట్టణం వరకు ర్యాలీ నిర్వహించారు. జలవనరుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ప్రవీణ్‌కుమార్‌, జిల్లా వ్యవసాయాధికారి నాగేంద్రయ్య, విద్యాశాఖాధికారి రాజు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఫోన్‌ఇన్‌లో 13 ఫిర్యాదులు

కామారెడ్డి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూ రికార్డుల సమస్యలు తెలుసుకునేందుకు కలెక్టర్‌ సత్యనారాయణ నిర్వహిస్తున్న ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి 13 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ నియోజకవర్గాలు, గ్రామాలకు చెందిన రైతులు తమ భూ సమస్యలను నేరుగా కలెక్టర్‌కు తెలియజేశారు. సంబంధిత అదికారులు సమస్యలు పరిష్కరించకుండా ఆలస్యం చేస్తున్నారని విన్నవించుకున్నారు. వేరు వేరు సమస్యలపై ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ స్పందిస్తు సంబంధిత ఆర్డీవోలు, తహసీల్దార్లకు ఆయా ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశాలు జారీచేశారు. పలు సమస్యలపై విచారణకు ఆదేశించారు. కార్యక్రమంలో ...

Read More »

ప్రజావాణిలో 51 పిర్యాదులు

కామారెడ్డి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వివిద శాఖలకు సంబంధించి 51 ఫిర్యాదులు అందినట్టు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. రెవెన్యూ- 36, అటవీశాఖ-2, ఆర్‌అండ్‌బి-1, డిఆర్‌డివో-1, డిపివో-4, ఎస్‌సి కార్పొరేషన్‌-1, మత్స్యశాఖ-1, డిపిఆర్‌ఇ-1, సివిల్‌ సప్లయ్‌-1, బిసి వెల్పేర్‌-1, ఎంసి-1, సిడబ్ల్యువో-1 ఫిర్యాదులు నేరుగా స్వీకరించిన కలెక్టర్‌ సత్యనారాయణ వాటిని పరిశీలించి పరిష్కరించాలని సంబందిత అదికారులకు ఉత్తర్వులు జారీచేశారు.

Read More »

మునిసిపల్‌ ఎన్నికలపై కలెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మునిసిపాలిటి ఎన్నికలకు సంబందించి సోమవారం కామారెడ్డి కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, మునిసిపల్‌ ఎన్నికల పరిశీలకుడు సందీప్‌ కుమార్‌ ఝా ఆధ్వర్యంలో సమీక్ష జరిపారు. రెండవ ర్యాండమైజేషన్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల విధి నిర్వహణ కోసం 215 ప్రీసైండింగ్‌ అధికారులు, 215 అసిస్టెంట్‌ ప్రీసైడింగ్‌ అధికారులు, 645 మంది పోలింగ్‌ అధికారులు, మొత్తం 1075 పోలింగ్‌ సిబ్బంది నియామకం కోసం 4575 మంది ...

Read More »

26న సాహు మహరాజ్‌ జయంతి

కామారెడ్డి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఛత్రపతి సాహుజి మహారాజ్‌ జన్మదిన వేడుకలు ఈనెల 26న నిజామాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు సోమవారం కామారెడ్డి పట్టణంలో జన్మదిన వేడుకలకు సంబంధించి గోడప్రతులు ఆవిష్కరించారు.

Read More »

అతివేగం ఇద్దరి ప్రాణాలు బలిగొంది

కామారెడ్డి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అతివేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని 44వ నెంబరు జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మత్యువాత పడ్డారు. సీఐ రాజశేఖర్‌ కథనం ప్రకారం… హైదారాబాద్‌ ఉప్పల్‌కు చెందిన శ్రీనివాస్‌ (37), స్వామి (30)లు వీరిద్దరు వరుసకు బావబావమరుదులు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో హైదరాబాద్‌ నుంచి ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. శ్రీనివాస్‌ బైక్‌ నడుపుతుండగా స్వామి వెనక ...

Read More »

భిక్కనూరు రెసిడెన్సియల్‌ పాఠశాలలో నీటి కొరత

కామారెడ్డి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉత్తమ విద్య, క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాల్సిన గురుకుల పాఠశాలలు సమస్యలకు నిలయాలుగా మారాయి. తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని భిక్కనూరు గురుకుల పాఠశాలలో పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. ముఖ్యంగా గురుకులంలో విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపించింది. విద్యార్థులు మద్యం, సిగరెట్లకు బానిసలుగా మారారు. దీంతో విద్యార్థులు నిత్యం గొడవలకు దిగుతున్నారు. పాఠశాల ఆవరణ అంతా అపరిశుభ్రంగా మారి కంపు కొడుతోంది. మరుగుదొడ్ల పరిస్థితి దారుణం, ప్రహరీ గోడ లేకపోవడం, విద్యార్థులు తరచూ బయటికి ...

Read More »

వి.టి. ఠాకూర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

కామారెడ్డి, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వి.టి. ఠాకూర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్‌ అండ్‌ లాల్‌ శస్త్ర చికిత్స అవసరమున్న 30 మందికి తమ సొంత ఖర్చులతో మెడిసిటి ఆసుపత్రి హైదరాబాద్‌కు తరలించారు. మరియు 30 మందికి కుట్టుమిషన్లు పంపిణి చేశారు. వారి సేవా భావం చాలా గొప్పదని పలువురు ప్రశంసించారు.

Read More »

సమాజానికి ఆదర్శం కామారెడ్డి రక్తదాతల సమూహం

కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రక్తదాతల సమూహం ఆపదలో ఉన్న వారికి సరైన సమయంలో రక్తాన్ని అందిస్తూ వందలాది మంది ప్రాణాలను కాపాడడం జరిగిందని కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రక్త హీనతతో బాధపడుతున్న సుంకరి అర్చన అనే మహిళకు ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో తుజాల్‌ పూర్‌ గ్రామానికి చెందిన వెంకటేష్‌, ప్రవీణ్‌, రాజులు ఓ పాజిటివ్‌ రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు. ...

Read More »

ఆసరా పింఛన్ల ఉత్తర్వు పత్రాల పంపిణీ

కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పార్శి రాములు ఫంక్షన్‌ హాల్లో ఏర్పాటు చేసిన పెంచిన ఆసరా పింఛన్ల మంజూరీ ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ బిబి పాటిల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఉత్తర్వు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ పాటిల్‌ మాట్లాడుతూ నేను మంత్రైన తర్వాత కామారెడ్డి జిల్లాలో పెంచిన పింఛన్లు నా ...

Read More »

తక్కువ నీటితో ఎక్కువ పంట వచ్చేలా చూడాలి

కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జల వనరులను సద్వినియోగం చేసుకొని తక్కువ నీటితో ఎక్కువ పంట రాబడి వచ్చేలా రైతులు తమ పంటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ రైతులను కోరారు. జలశక్తి అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా గురువారం బీబీపేట మండల కేంద్రంలో జిల్లా వ్యవసాయశాఖ, కృషి విజ్ఞాన్‌ కేంద్రం రుద్రూర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిసాన్‌ మేళ రైతు అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయ కర్త డాక్టర్‌ బాలూ నాయక్‌, ...

Read More »