Breaking News

Kotagiri

కోటగిరిలో కోవిడ్‌ నిబంధనల‌పై అవగాహన

బాన్సువాడ, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రచ్చగల్లి, చావిడి గల్లి, బస్టాండు, మార్కెట్‌, బిసి కాల‌నీ, వినాయక్‌ నగర్‌లో ప్రజల‌కు, దుకాణ యాజమానుల‌కు ‘‘కోవిడ్‌ 19’’ నిబంధనలు ప్రజలు అందరూ తప్పనిసరిగా పాటించాల‌ని నిజామాబాద్‌ పోలీస్‌ కళా బృందం వారి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రజలు అందరు మాస్క్‌ తప్పకుండా ధరించాల‌ని, సోషల్‌ డిస్టెన్స్‌ తప్పకుండా పాటించాల‌ని, సానీటైజర్‌ వాడాల‌ని సూచించారు. అలాగే ప్రజలు అనవసరంగా బయట తిరుగవద్దని, ఎవరికైనా కరోన ...

Read More »

అధికారుల కనుసన్నల్లోనే!

♦ రాయకూర్ కెనాల్ వద్ద ఇసుక డంప్‌లు ♦ ప్రభుత్వ అనుమతుల పేరుతో పక్కదారి.. ♦ ఒక్కో ఇసుక ట్రాక్టర్‌కు రూ. 2,300 ♦ అత్యవసరం అయితే రూ. 2,500 ♦ చోద్యం చూస్తున్న రెవెన్యూ సిబ్బంది కోటగిరి : ఇసుక అనుమతుల విషయంలో సామాన్యులకు చుక్కలు చూపే అధికారులు.. యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా అవుతున్నా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. కళ్లముందే సాక్ష్యాలున్నా.. చర్యలకు ముందుకు రావడం లేదు. సులేమాన్‌ఫారం సమీపంలోని నిజాంసాగర్ కెనాల్ కట్ట వద్ద కొందరు ఇసుక వ్యాపారులు ...

Read More »

కొత్త రకం విత్తనంతో అధిక ఆదాయం

కోటగిరి : మద్రాస్ నుంచి కొత్త రకం పసుపు విత్తనం తీసుకొచ్చి సబ్సిడీపై ఇక్కడి రైతులకు ఇస్తున్నామని, ఈ విత్తనం విత్తితే ఎకరానికి రూ.2 లక్షలకు పైగా అధికంగా ఆదాయం వస్తుందని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గురువారం కోటగిరి మండలం ఎత్తొండక్యాంప్ శివారులో పసుపు పంట సాగు-కొత్త పద్ధతిలో నాటే విధానం అనే అంశంపై ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. జిల్లాలోని 100 ఎకరాల్లో పసు పు విత్తేటట్లు రైతులను సిద్ధం చేశామన్నారు. ఎత్తొండ క్యాంప్ లో ...

Read More »

పొంగిన లెండి వాగు

కోటగిరి : ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లెండి వాగులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. గురువారం ఉదయం 10 గంటల వరకు లెండిలో చుక్కనీరు కనబడలేదు. ఒక్కసారిగా వరద రావడంతో అరగంటలోపే పరిస్థితి మారిపోయింది. ఉదయం 9 గంటల వరకు మహారాష్ట్ర నుంచి సాంగ్వీ, మండిగి, తమ్లూర్, సావర్‌గావ్, నరంగల్, దెగ్లూర్ నుంచి ప్రయాణికులు తెలంగాణ రాష్ర్టానికి వచ్చారు. ఆటోలు, బైక్‌లు నడిచాయి. అరగంట సమయంలోనే వాగు పొంగింది. దీంతో పొతంగల్-సాంగ్వీ మధ్య వాగుపై తాత్కాలికంగా నిర్మించిన మట్టిరోడ్డు ...

Read More »

వికటించిన విందు భోజనం

కోటగిరి: విందు భోజనం వికటించింది. దాదాపుగా 80 మంది అస్వస్థతకు గురయ్యారు. కోటగిరి మండలం సులేమన్‌నగర్‌ గ్రామంలో సోమవారం పాషా, సాధక్‌ ఇళ్ల వద్ద వారి కుమార్తెల వివాహం జరగడంతో విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ విందు భోజనం ఆరగించిన పలువురు గ్రామస్థులు సాయంత్రం వాంతులు, విరేచనాలతో బాధపడుతూ అస్వస్థతకు గురయ్యారు. ఒక్క బోధన్‌ ప్రభుత్వ ఆసుపత్రిలోనే 40 మందికి పైగా బాధితులు చేరారు. మరో 40 మంది ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకుంటున్నారు.ఈ విషయం తెలుసుకున్న బోధన్‌ ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్‌ బోధన్‌ ...

Read More »

పొతంగల్‌లో వడదెబ్బకు 12 గొర్రెలు మృతి

  కోటగిరి : మండలంలోని పొతంగల్ గ్రామం లో వడదెబ్బతో 12 గొర్రెలు మృతి చెందాయని బాధితుడు ఈరుగొండ ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా మేతకు వెళ్లి రాత్రికి ఇంటికి రాగానే రెండు, మూడు గొర్రెలు చనిపోతున్నాయ ని వాపోయారు. పశు వైద్యశాల డాక్టట్ కిరణ్‌దేశ్‌పాండేకు చెప్పడంతో ఆయన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. గొర్రెలు మృతికి కారణలు అడిగి తెలుసుకున్నారు. గొర్రెకు పోస్టుమార్టం చేసి వడదెబ్బతో మృతి చెందాయని తెలిపారు.

Read More »

వేర్వేరు ప్రాంతాల్లో వడదెబ్బతో ముగ్గురి మృతి

  కోటగిరి : మండలంలోని సిద్ధాపూర్ క్యాంపులో కోటేశ్వర్ రావు (59) అనే వృద్ధుడు వడదెబ్బతో మృతి చెందినట్లు కోటగిరి ఎస్సై బషీర్‌అహ్మద్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. సిద్ధాపూర్‌క్యాంపునకు చెందిన కోటేశ్వరావు వ్యవసాయ కూలీ. పశువుల మేత కోసం గడ్డి తీసుకొచ్చేందుకు పొలం వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. ఎండలో నుంచి రాగానే నీళ్లు తాగి పడుకున్నాడు. శుభకార్యానికి వెళ్లిన వచ్చిన భార్య భర్త లేపేందుకు ప్రయత్నించగా కదలిక లేకపోవడంతో 108 సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూసేసరికి కోటేశ్వరావు మృతి చెంది ...

Read More »

దళితుల అభ్యున్నతికి పెద్దపీట

  కోటగిరి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తోందని, దళితుల అభ్యున్నతికి సీఏం కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మాలమహానాడు మండల అధ్యక్షుడు మిర్జాపూర్ చిన్న సాయన్న, కాలే సాయిలు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి రాయకూర్ సర్పంచి చెలిమెల సావిత్రి, శ్రీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్న సాయన్న మాట్లాడుతూ దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాలుగా అభివృద్ధి పాటుపడుతోందన్నారు. ...

Read More »

ఆన్‌లైన్‌లో దత్తత

కోటగిరి : ఆన్‌లైన్ దత్తతకు ఆదరణ లభిస్తోంది. బాల బాలికలను దత్తత తీసుకునే విధానంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను మార్చింది. దత్తత కోరుకునే దంపతులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే దత్తత తీసుకునే వెసులుబాటు కల్పించింది. గత ఏడాది ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చిన కొత్త విధానంతో దత్తత స్వీకరణ జాప్యం లేకుండా విజయవంతంగా సాగుతోంది. పాత నిబంధనల ప్రకారం దత్తత తీసుకోవాలంటే కనీసం ఏడాదిన్నర పాటు వేచి చూడాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆ అవసరం లేకుండా 30 రోజుల ...

Read More »

పొతంగల్ విండో పనితీరు బాగుంది

కోటగిరి : రైతుల సంక్షేమం కోసం సంఘాన్ని అభివృద్ధి చేయడం అభినందనీయమని, భారతదేశంలోనే నంబర్ వన్‌గా నిలవడం భేష్ అని ఖమ్మం జిల్లాలోని 22 మంది సహకార సంఘాల చైర్మ న్లు అన్నారు. అధ్యయనంలో భాగంగా శనివారం మండలంలోని పొతంగల్ సహకార సంఘాన్ని సందర్శించారు. పొతంగల్ విండో ఎప్పుడు ప్రా రంభమైందని, మొదటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన వ్యాపారాలు, లావాదేవీల గురించి అడిగి తెలుసుకున్నారు. 4 సంవత్సరాల్లోనే సుమారు 30 లక్షలు వచ్చిందని, ముఖ్యంగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని వాటి ...

Read More »

సిలిండర్‌ పేలి ఇల్లు దగ్ధం

వల్లభాపూర్‌(కోటగిరి): వల్లభాపూర్‌ గ్రామానికి చెందిన మేకల రాజు ఇల్లు గ్యాస్‌సిలిండర్‌ పేలి దగ్ధమైంది. శనివారం రాత్రి ఇంట్లో వంటచేస్తుండగా ప్రమాధ వశాత్తు వంటగ్యాస్‌ లీకయ్యిందని దాంతో మంటలు చెలరేగాయన్నారు. భయభ్రాంతులకు గురైన కుటుంబీకులు ప్రాణభీతితో ఇంట్లో నుంచి బయటకు పరుగుతీసి ప్రాణాలను కాపాడుకోగలిగారు. సిలిండర్‌ పేలి ఇల్లు దగ్ధమైందన్నారు. ఇంట్లో ఉన్న వస్తుసామాగ్రితోబాటు ద్విచక్రవాహం సహా సుమారు రూ. 1.70 లక్షల ఆస్థినష్టం జరిగిందన్నారు. గ్యాస్‌సిలిండర్‌ పేలి ఇల్లు దగ్ధమై నిరాశ్రయులైన రాజు కుటుంబానికి స్ధానిక సర్పంచి, గ్రామస్థులు ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఎత్తోండ ...

Read More »