Breaking News

Medak District News

20 మండలాలతో కూడిన జిల్లాను ప్రకటించాలి

  – బిజేపి డిమాండ్‌ రామాయంపేట, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఏర్పడిన రెండు సంవత్సరాల తర్వాత జరుగుతున్న కొత్త జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ లో భాగంగా మెదక్‌ జిల్లాను 14 మండలాలు కాకుండా 20 మండలాలతో కూడిన జిల్లాగా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రామాయంపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని భారతీయ జనతాపార్టీ సోమవారం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు తహసీల్దార్‌ శంకర్‌ నాయక్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం ...

Read More »

నాలుగిళ్లలో చోరీ

  రామాయంపేట, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌ జిల్లా రామాయంపేటలో సోమవారం రాత్రి నాలుగైదు ఇళ్లల్లో చోరీ జరిగినట్లు ఎస్‌ఐ అశోక్‌కుమార్‌ తెలిపారు. ఇళ్లకు తాళాలు వేసి ఉండడంతో గమనించిన దుండగులు దొంగతనానికి పాల్పడినట్టు పేర్కొన్నారు. కాగా వీరందరు కృష్ణా పుష్కరాలకు వెళ్లారని, వారు వచ్చిన తర్వాత ఎంత సొమ్ము చోరీకి గురైందనే వివరాలు వెల్లడవుతాయని అన్నారు. క్లూస్‌ టీం సహాయంతో వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించారు. విచారణ చేపడతామని ఎస్‌ఐ పేర్కొన్నారు.

Read More »

కీలిమంజారో పర్వతంపై భారత జాతీయపతాకం

  – తెలంగాణ ముద్దుబిడ్డల సాహసయాత్ర సక్సెస్‌ రామాయంపేట, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆఫ్రికా ఖండంలో ఎత్తైన కీలిమంజారో పర్వతాన్ని తెలంగాణ ముద్దుబిడ్డలు అధిరోహించి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు. ఈనెల 14న చేరుకొని 70 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న జాతీయ జెండా ఆవిష్కరించారు. మెదక్‌ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 15 మంది విద్యార్థుల బృందం ఈ సాహసయాత్రలో పాల్గొన్నారు. కాగా రామాయంపేట కస్తూర్బా పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న భూలికూడా బృందంలో పాల్గొంది. 19 ...

Read More »

పటాన్‌చెరులో జగ్గారెడ్డి అరెస్టు

మెదక్ : మాజీ ప్రభుత్వ విప్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూర్పు జయప్రకాష్‌రెడ్డి(జగ్గారెడ్డి)ని మెదక్ జిల్లా పటాన్‌చెరులో ఆదివారం మధ్యాహ్నం పోలీసులు అరెస్టు చేశారు. పటాన్‌చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కుమారుడి వివాహానికి హాజరైన జగ్గారెడ్డి… అనంతరం బయటకు వస్తుండగా పోలీసులు అరెస్టు చేసి సంగారెడ్డికి తరలించారు. ఆదివారం గజ్వేల్‌లో జరుగుతున్న ప్రధాని నరేంద్రమోదీ సభలో అలజడి సృష్టిస్తారనే సమాచారంతో అయన్ను ముందస్తుగా అరెస్టు చేశారని తెలుస్తోంది. కాగా.. జిల్లా వ్యాప్తంగా విపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్న సంగతి తెలిసిందే.

Read More »

జయశంకర్ కలలుగన్న రాష్ట్రాన్ని నిర్మిస్తాం : హరీష్

మెదక్: జయశంకర్ కలలుగన్న తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మిస్తామని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఐదేళ్లలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధిని కాంగ్రెస్ అడ్డుకుంటోందని ఆరోపించారు. మినీ స్టేడియంకు జయశంకర్ పేరు నామకరణం చేయనున్నట్లు హరీశ్‌రావు ప్రకటించారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఆవరణలో నిర్వహించిన జయశంకర్ జయంతి వేడుకలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ విగ్రహాన్ని హరీష్‌రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ మధుసూదనాచారి పాల్గొన్నారు.

Read More »

‘కేసీఆర్‌ను, మంత్రులను రాళ్లతో కొట్టే రోజులొచ్చాయ్’

మిర్యాలగూడ/హైదరాబాద్‌/సంగారెడ్డి:ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, సకల జనుల అభిలాషను పక్కన పెట్టి సీఎం కేసీఆర్‌ చేస్తున్న పాలనతో వచ్చేది బంగా రు తెలంగాణ కాదని, భ్రష్టు తెలంగాణేనని సీఎల్పీ నేత కే జానారెడ్డి విమర్శించారు. మిర్యాలగూడలో కాంగ్రెస్‌ కార్యకర్తల సభలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రమొస్తే నీళ్లు, నిధులు, ఉద్యోగాలతో పాటు ఆత్మాభిమానం వస్తుందని ఆశించిన తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ పాలనతో చేదు అనుభవాలే ఎదురవుతున్నాయన్నారు. కేసీఆర్‌ అబద్ధాలపై కాంగ్రెస్‌ నాయకులు పోరు సాగించాలని సూచించారు. ప్రాజెక్టు డిజైన్లు మార్చి కోటి ఎకరాలకు నీరందిస్తానంటూ ...

Read More »

కేసీఆర్ అంచనా తలకిందులైంది..!

సంగారెడ్డి: సీఎం కేసీఆర్ ఈసారి తన ఫాంహౌస్‌లో బొప్పాయి సాగు చేయాలని నిర్ణయించారు. మొత్తం 65 ఎకరాల్లో ఈ 15 నుంచి మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయిస్తున్నారు. నాలుగు రోజులపాటు ఫాంహౌస్‌లోనే ఉన్న కేసీఆర్ వ్యవసాయ పనులు పర్యవేక్షించారు. గత ఏడాది 50 ఎకరాల్లో అల్లం సాగు చేసిన ఆయన.. ఈ ఏడాది బొప్పాయిని ఎంచుకున్నట్టు తెలిసింది. తైవాన్ రెడ్‌లేడీ 786 రకం విత్తన మొక్కలను జైపూర్ నుంచి తెప్పించినట్టు సమాచారం. మొక్క నాటిన 8 నెలల నుంచి పంట దిగుబడి మొదలై దాదాపు ...

Read More »

కేసీఆర్, హరీశ్ మధ్య కోల్డ్వార్

తొగుట(మెదక్): మల్లన్న సాగర్ నిర్మాణంపై సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ మధ్య కోల్డ్‌వార్ నడుస్తోందనీ, అందుకే వేర్వేరు ప్రకటనలు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ముంపు బాధితులకు మద్దతుగా సీపీఎం చేపట్టిన పాదయాత్ర శనివారం మెదక్ జిల్లా వేములగాట్ గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారమిస్తామని ప్రకటిస్తే, మంత్రి హరీశ్ 123 జీవో ప్రకారం చెల్లిస్తామంటూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అంతర్గత ...

Read More »

చెత్తకుప్పలో మృత శిశువు

మాచారెడ్డి : మానవత్వం మంటగలుస్తున్నది. పెళ్లి కాకముందే తప్పటడుగు వేసి, తీరా గర్భం దాల్చిన వారు శిశువులను పురిట్లోనే చంపేస్తున్న సంఘటన ఎన్నో జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటననే మాచారెడ్డి మండలం మంథనిదేవునిపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామంలోని 8వ వార్డు లో నివాసపు గుడిసె వెనుకాల మృతశిశువును చెత్తకుప్పలో పడివేసి ఉండడంతో గ్రామస్తులు గమనించి స్థానిక సర్పంచి దుర్గయ్య, ఉపసర్పంచి రామలింగంకు సమాచారం అందించారు. వారు పోలీసులు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతశిశువును పోస్ట్‌మార్టం నిమిత్తం ...

Read More »

వామ్మో ఎన్‌ఆర్‌ఐ సంబంధం..

కట్నం వేధింపులపై బెంబేలు  మూడు రోజుల్లో నాలుగు కేసులు.. సిద్దిపేట : ఎన్‌ఆర్‌ఐ సంబంధాలంటేనే అమ్మాయిల తల్లిదండ్రులు భయపడుతున్నారు. అక్కడ వారికి ఆదాయం ఎంతున్నా అబ్బాయిల వైఖరి ఎలా ఉంటుందోనన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. సిద్దిపేటలో మూడురోజుల్లో నలుగురు ఎన్నారైలు అదనపు కట్నంకోసం వేధిస్తున్నారన్న కేసులు నమోదవ్వడం సంచలనం కలిగిస్తోంది. ఎన్‌ఆర్‌ఐ సంబంధాలైతే భార్యాభర్తల మధ్య విబేధాలు తలెత్తినపుడు కౌన్సెలింగ్‌ తదితర సర్దుబాటు చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోవడం సమస్యగా మారుతుంది. సాధారణంగా భార్యాభర్తల మధ్య విబేధాలు తలెత్తినా, అదనపు కట్నంకోసం అత్తింటివారు వేధించినా ...

Read More »

సీఎం దత్తత గ్రామాల్లో నవశకం

సంగారెడ్డి: సీఎం కేసీఆర్ దత్తత గ్రామాలైన మెదక్ జిల్లా ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. శ్రావణమాసం(ఆగస్టు)లో డబుల్‌బెడ్‌రూం ఇండ్లలోకి గృహప్రవేశం చేయాలన్న సీఎం ఆదేశాలతో పనుల్లో వేగం పెరిగింది. రెండు గ్రామాల్లోని 550 ఇండ్లలో 350 పూర్తయ్యాయి. డ్రైనేజీ, ఇంకుడు గుంతలు, ఎల్‌ఈడీ వీధిలైట్ల బిగింపు, మిషన్ భగీరథ పనులు పూర్తి కావొస్తున్నాయి. బిందుసేద్యం కోసం పైపుల బిగిం పు, ఏడు సంపుహౌజ్‌లు, 14 పంపింగ్ స్టేషన్ల నిర్మాణం కొనసాగుతున్నది.70 బోర్లతోపాటు, చేబర్తి చెరువు, చెక్‌డ్యాముల్లోకి వచ్చే నీటిని చెరువుల్లోకి పంపింగ్ ...

Read More »

ఉపాధి హామీ… ఇక హక్కు!

– పని  డిమాండ్ మేరకు కూలీల నుంచి దరఖాస్తుల స్వీకరణ – ప్రతి రోజూ గంటసేపు పంచాయతీల్లో ఫీల్డ్‌అసిసెంట్ల విధులు – పని కల్పించలేని సిబ్బందిపై వేటుకు అధికారుల ప్రణాళికలు – స్థిరాస్తుల రిజిస్ట్రార్ల నిర్వహణ కట్టుదిట్టం నల్లగొండ : వలసల నివారణే ధ్యేయంగా వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇక కూలీలకు హక్కుగా మారనుంది. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు ఆచరణలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు కూలీల పని డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్‌గా ఉపాధి ...

Read More »

ఇది మామూలు నాటు కోడి కాదు!

  మెదక్ జిల్లా నారాయణఖేడ్ లో ఇప్పుడు ఓ నాటు కోడి హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ సంగతేంటే.. సదరు కోడి ఏడు నెలలుగా ప్రతి రోజు గుడ్డు పెడుతోంది. సాదారణంగా నాటు కోళ్లు ఇరవయ్యో.. ముప్పయ్యో గుడ్లు పెడతాయి. ఐతే.. ఇక్కడ కనిపిస్తున్న కోడి మాత్రం.. ఇప్పటి వరకు రోజుకోకటి చెప్పున .. ఏకంగా 215 గుడ్లు పెట్టింది. యజమాని రాజుకు కాసుల వర్షం కురిపిస్తోంది. నారాయణఖేడ్ పట్టణంలోని మన్సూర్ పూర్ లో నివాసం ఉంటున్న రాజు..ఏడు నెలల క్రితం స్థానిక ...

Read More »

అక్కన్నపేట్‌లో పోలీసు పల్లెనిద్ర

  మెదక్‌, మార్చి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీసులకు, ప్రజలకు మధ్య స్నేహభావం పెంపొందించేందుకే పల్లెనిద్ర కార్యక్రమమని ఎస్‌ఐ నాగార్జునగౌడ్‌ అన్నారు. ఈ మేరకు రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో బధవారం రాత్రి పోలీసు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఫ్రెండ్లీ పోలీసు ద్వారానే గ్రామాల్లో శాంతి నెలకొంటుందన్నారు. ప్రజలకు ఏ సందర్భంలో ఏ సమస్య ఎదురైనా, ఎవరిద్వారానైనా ఇబ్బందులు కలిగినా నిర్బయంగా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ వెలుముల మహేశ్వరి, వెలుముల సీతారాములు గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More »

రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని పునరుద్దరించాలి

మెదక్‌, మార్చి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని పునరుద్దరించాలని కోరుతూ అదేవిధంగా కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలలో రామాయంపేరు ప్రతిపాదించాలని బిజెపి నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు బుధవారం తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామాయంపేట, చిన్నశంకరంపేట, చేగుంట, భిక్కనూరులను కలుపుతూ రామాయంపేట పాత అసెంబ్లీని యధావిధిగా కొనసాగించేలా ప్రభుత్వం అసెంబ్లీ స్తానాన్ని పునరుద్దరించాలన్నారు. అదేవిధంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఇటీవల పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని అసెంబ్లీ ...

Read More »

అల్ఫాజోలం, డైజోఫాం పట్టివేత

లింగంపేట: మండలంలోని శెట్పల్లిసంగారెడ్డి గ్రామంలో బుధవారం ఉదయం ఎక్సైజ్ అధికారులు దాడి చేసి రెండు కిలోల అల్ఫాజోలం, రెండు కిలోల డైజోఫాం పట్టుకున్నట్లు ఎల్లారెడ్డి ఎక్సైజ్ ఎస్సై సృజన తెలిపారు. కామారెడ్డికి చెందిన ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు ఫీర్‌సింగ్ ఆధ్వర్యంలో పక్కా సమాచారం మేరకు గ్రామానికి చెందిన బట్టికాడి లలిత ఇంటిపై దాడి నిర్వహించినట్లు చెప్పారు. లలిత ఇంటిని సోదా చేయగా బీరువాలో అల్ఫాజోలం, డైజోఫాం లభించినట్లు తెలిపారు. లలిత సోదరుడు కిషన్‌గౌడ్ కల్లులో కలిపే మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. లలిత నివాసంలో ...

Read More »

పిఇటి కాదు… కామాంధుడు

  రామాయంపేట ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓ స్కూల్లో పిఇటి టీచర్‌గా పనిచేస్తున్న కిరణ్‌ పిఇటి టీచరే కాదు కామాంధుడు కూడా…7 సంవత్సరాల చిన్నారిపై కొన్నిరోజులుగా అత్యాచారానికి పాల్పడి అడ్డంగా దొరికిపోయాడు. ఇపుడు జైళ్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. వివరాల్లోకి వెళితే… మెదక్‌ జిల్లా దుబ్బాక మండలం భూంపల్లి ఎక్స్‌రోడ్డు లోగల వికాస్‌ పబ్లిక్‌ స్కూల్లో కిరణ్‌ పిఇటి టీచర్‌గా పనిచేస్తున్నాడు. 7 సంవత్సరాల విద్యార్థినిని గత 20 రోజులుగా అత్యాచారానికి గురిచేస్తున్నాడు. విషయం ఎవరికైనా చెబితే కొడతానని, భవనం ...

Read More »

మెదక్ లో రెండువర్గాల ఘర్షణ.. పరిస్థితి ఉద్రిక్తం

మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం ఇబ్రహీంపూర్ లో ఉద్రిక్తత నెలకొంది. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం.. తెర్లమద్దికి చెందిన శ్రీహరి టూవీలర్ తో స్థానిక సర్పంచ్… లక్ష్మిని ఢీ కొట్టాడు. దీంతో తీవ్ర స్థాయిలో ఆవేశంతో ఊగిపోయిన ఆమె కుమారులు శ్రీహరిపై దాడి చేశారు. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు శ్రీహరి. సర్పంచ్ లక్ష్మి కుమారులు కొట్టడంతోనే చనిపోయారని ఆరోపిస్తూ శ్రీహరి బంధువులు సర్పంచ్ ఇంటిముందు డెడ్ బాడీతో నిరసనకు దిగారు. ఆగ్రహంతో సర్పంచ్ ఇంటికి నిప్పుపెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని ...

Read More »

అవినీతి అంతానికి సహచట్టం రామబాణం

  కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతిని అంతం చేసేందుకు సమాచార హక్కు చట్టం రామబాణం లాంటిదని కామారెడ్డి ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి ఎం.ఎ. సలీం అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సహ చట్టాన్ని ఉపయోగిస్తూ అవినీతిని పారద్రోలడానికి అందరు తమవంతు కృషి చేయాలన్నారు. అక్రమాలు బయటపెట్టేందుకు సహచట్టం మంచి ఆయుధమని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ప్రభాకర్‌, ప్రతినిదులు ...

Read More »

ఎన్‌డిఎస్‌ఎల్ పరిశ్రమల మూత

మెదక్, డిసెంబర్ 23: మెదక్ జిల్లాలోని మెదక్, నిజామాబాద్ జిల్లా బోధన్, కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలోని నిజాం దక్కన్ సుగర్స్ లిమిటెడ్ పరిశ్రమలను లే ఆఫ్ చేస్తున్నట్లు మెదక్ ఎన్‌డిఎస్‌ఎల్ పరిశ్రమ ప్రధాన గేటుకు బుధవారం నోటీసు అంటించారు. దీంతో కార్మికులు నివ్వెరబోయారు. దాంతో 51 శాతం ఎన్‌డిఎస్‌ఎల్ పరిశ్రమలో వాటా ఉన్న గోకరాజు గంగరాజు దిష్టిబొమ్మకు ఎన్‌డిఎస్‌ఎల్ పరిశ్రమ నుంచి మంబోజిపల్లి చౌరస్తా వరకు కార్మికులు శవయాత్ర నిర్వహించారు. మంబోజిపల్లి చౌరస్తాలో దిష్టిబొమ్మ మెడకు ఉరివేసి, చెప్పులతో కొట్టి, ఆ తరువాత దిష్టిబొమ్మను ...

Read More »