Breaking News

Medak

ఎంపి క‌విత‌ను క‌లిసిన మెద‌క్ డ‌యాసీస్ బిష‌ప్‌

నిజామాబాద్ ఎంపి శ్రీమ‌తి క‌ల్వ‌కుంట్ల క‌వితను మెద‌క్ డ‌యాసీస్ బిష‌ప్ రెవ‌రెండ్ డాక్ట‌ర్ ఎ.సి సాల్మ‌న్ రాజ్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర మొద‌టి బిష‌ప్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన సాల్మ‌న్‌రాజ్‌ను క‌విత అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అభినందించిన బిష‌ప్, క్రైస్త‌వ‌ స‌మాజానికి ముఖ్య‌మంత్రి కేసిఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌శంసించారు.అయితే ఈ ఫ‌లాల‌ను ప్ర‌తి క్రిస్టియ‌న్‌కు అందిన‌ప్పుడే అన్నిరంగాల్లో వారు అభివృద్ధి చెందుతార‌న్నారు. టిఆర్ఎస్ ప్ర‌భుత్వం అన్ని మ‌తాల వారినీ స‌మ‌దృష్టితో చూస్తున్న‌ద‌న్నారు ...

Read More »

కేసీఆర్, హరీశ్ మధ్య కోల్డ్వార్

తొగుట(మెదక్): మల్లన్న సాగర్ నిర్మాణంపై సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ మధ్య కోల్డ్‌వార్ నడుస్తోందనీ, అందుకే వేర్వేరు ప్రకటనలు చేస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ముంపు బాధితులకు మద్దతుగా సీపీఎం చేపట్టిన పాదయాత్ర శనివారం మెదక్ జిల్లా వేములగాట్ గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారమిస్తామని ప్రకటిస్తే, మంత్రి హరీశ్ 123 జీవో ప్రకారం చెల్లిస్తామంటూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అంతర్గత ...

Read More »

సీఎం దత్తత గ్రామాల్లో నవశకం

సంగారెడ్డి: సీఎం కేసీఆర్ దత్తత గ్రామాలైన మెదక్ జిల్లా ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. శ్రావణమాసం(ఆగస్టు)లో డబుల్‌బెడ్‌రూం ఇండ్లలోకి గృహప్రవేశం చేయాలన్న సీఎం ఆదేశాలతో పనుల్లో వేగం పెరిగింది. రెండు గ్రామాల్లోని 550 ఇండ్లలో 350 పూర్తయ్యాయి. డ్రైనేజీ, ఇంకుడు గుంతలు, ఎల్‌ఈడీ వీధిలైట్ల బిగింపు, మిషన్ భగీరథ పనులు పూర్తి కావొస్తున్నాయి. బిందుసేద్యం కోసం పైపుల బిగిం పు, ఏడు సంపుహౌజ్‌లు, 14 పంపింగ్ స్టేషన్ల నిర్మాణం కొనసాగుతున్నది.70 బోర్లతోపాటు, చేబర్తి చెరువు, చెక్‌డ్యాముల్లోకి వచ్చే నీటిని చెరువుల్లోకి పంపింగ్ ...

Read More »

ఇది మామూలు నాటు కోడి కాదు!

  మెదక్ జిల్లా నారాయణఖేడ్ లో ఇప్పుడు ఓ నాటు కోడి హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ సంగతేంటే.. సదరు కోడి ఏడు నెలలుగా ప్రతి రోజు గుడ్డు పెడుతోంది. సాదారణంగా నాటు కోళ్లు ఇరవయ్యో.. ముప్పయ్యో గుడ్లు పెడతాయి. ఐతే.. ఇక్కడ కనిపిస్తున్న కోడి మాత్రం.. ఇప్పటి వరకు రోజుకోకటి చెప్పున .. ఏకంగా 215 గుడ్లు పెట్టింది. యజమాని రాజుకు కాసుల వర్షం కురిపిస్తోంది. నారాయణఖేడ్ పట్టణంలోని మన్సూర్ పూర్ లో నివాసం ఉంటున్న రాజు..ఏడు నెలల క్రితం స్థానిక ...

Read More »

భగీరథ ప్రయత్నం..!

నిజామాబాద్:దేవుడు వరమిచ్చినా పూజరి కరుణించని చందంగా మారింది మిషన్ భగీరథ పనుల పరిస్థితి. మెదక్ జిల్లా గజ్వేల్, రంగారెడ్డి జిల్లా మేడ్చల్ తదితర ప్రాంతాల్లో ఫలాలు అందబోతుండగా జిల్లాలో మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఈ పథకానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇసుక సమస్య ప్రధానంగా మారింది. 30 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను వాటర్ గ్రిడ్ పథకానికి ఇవ్వాలని 20 నెలల క్రితం కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇప్పటి వరకు కేవలం 10 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక రవాణాకు మాత్రమే అనుమతించారు. ...

Read More »

అక్కన్నపేట్‌లో పోలీసు పల్లెనిద్ర

  మెదక్‌, మార్చి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీసులకు, ప్రజలకు మధ్య స్నేహభావం పెంపొందించేందుకే పల్లెనిద్ర కార్యక్రమమని ఎస్‌ఐ నాగార్జునగౌడ్‌ అన్నారు. ఈ మేరకు రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో బధవారం రాత్రి పోలీసు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఫ్రెండ్లీ పోలీసు ద్వారానే గ్రామాల్లో శాంతి నెలకొంటుందన్నారు. ప్రజలకు ఏ సందర్భంలో ఏ సమస్య ఎదురైనా, ఎవరిద్వారానైనా ఇబ్బందులు కలిగినా నిర్బయంగా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ వెలుముల మహేశ్వరి, వెలుముల సీతారాములు గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More »

రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని పునరుద్దరించాలి

మెదక్‌, మార్చి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని పునరుద్దరించాలని కోరుతూ అదేవిధంగా కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలలో రామాయంపేరు ప్రతిపాదించాలని బిజెపి నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు బుధవారం తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామాయంపేట, చిన్నశంకరంపేట, చేగుంట, భిక్కనూరులను కలుపుతూ రామాయంపేట పాత అసెంబ్లీని యధావిధిగా కొనసాగించేలా ప్రభుత్వం అసెంబ్లీ స్తానాన్ని పునరుద్దరించాలన్నారు. అదేవిధంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఇటీవల పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని అసెంబ్లీ ...

Read More »

పిఇటి కాదు… కామాంధుడు

  రామాయంపేట ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓ స్కూల్లో పిఇటి టీచర్‌గా పనిచేస్తున్న కిరణ్‌ పిఇటి టీచరే కాదు కామాంధుడు కూడా…7 సంవత్సరాల చిన్నారిపై కొన్నిరోజులుగా అత్యాచారానికి పాల్పడి అడ్డంగా దొరికిపోయాడు. ఇపుడు జైళ్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. వివరాల్లోకి వెళితే… మెదక్‌ జిల్లా దుబ్బాక మండలం భూంపల్లి ఎక్స్‌రోడ్డు లోగల వికాస్‌ పబ్లిక్‌ స్కూల్లో కిరణ్‌ పిఇటి టీచర్‌గా పనిచేస్తున్నాడు. 7 సంవత్సరాల విద్యార్థినిని గత 20 రోజులుగా అత్యాచారానికి గురిచేస్తున్నాడు. విషయం ఎవరికైనా చెబితే కొడతానని, భవనం ...

Read More »

మెదక్ లో రెండువర్గాల ఘర్షణ.. పరిస్థితి ఉద్రిక్తం

మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం ఇబ్రహీంపూర్ లో ఉద్రిక్తత నెలకొంది. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం.. తెర్లమద్దికి చెందిన శ్రీహరి టూవీలర్ తో స్థానిక సర్పంచ్… లక్ష్మిని ఢీ కొట్టాడు. దీంతో తీవ్ర స్థాయిలో ఆవేశంతో ఊగిపోయిన ఆమె కుమారులు శ్రీహరిపై దాడి చేశారు. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు శ్రీహరి. సర్పంచ్ లక్ష్మి కుమారులు కొట్టడంతోనే చనిపోయారని ఆరోపిస్తూ శ్రీహరి బంధువులు సర్పంచ్ ఇంటిముందు డెడ్ బాడీతో నిరసనకు దిగారు. ఆగ్రహంతో సర్పంచ్ ఇంటికి నిప్పుపెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని ...

Read More »

ఎన్‌డిఎస్‌ఎల్ పరిశ్రమల మూత

మెదక్, డిసెంబర్ 23: మెదక్ జిల్లాలోని మెదక్, నిజామాబాద్ జిల్లా బోధన్, కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలోని నిజాం దక్కన్ సుగర్స్ లిమిటెడ్ పరిశ్రమలను లే ఆఫ్ చేస్తున్నట్లు మెదక్ ఎన్‌డిఎస్‌ఎల్ పరిశ్రమ ప్రధాన గేటుకు బుధవారం నోటీసు అంటించారు. దీంతో కార్మికులు నివ్వెరబోయారు. దాంతో 51 శాతం ఎన్‌డిఎస్‌ఎల్ పరిశ్రమలో వాటా ఉన్న గోకరాజు గంగరాజు దిష్టిబొమ్మకు ఎన్‌డిఎస్‌ఎల్ పరిశ్రమ నుంచి మంబోజిపల్లి చౌరస్తా వరకు కార్మికులు శవయాత్ర నిర్వహించారు. మంబోజిపల్లి చౌరస్తాలో దిష్టిబొమ్మ మెడకు ఉరివేసి, చెప్పులతో కొట్టి, ఆ తరువాత దిష్టిబొమ్మను ...

Read More »

విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

  మెదక్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యుత్‌ శాఖ అదికారుల నిర్లక్ష్యం వలన ఓ నిండు ప్రాణం బలైంది. గురువారం సాయంత్రం రామాయంపేట్‌ బైపాస్‌ రోడ్డు వద్ద విద్యుత్‌ పనులు జరుగుతుండగా అకస్మాత్తుగా విద్యుత్‌ సరఫరా కావడంతో తీగలతో పని చేస్తున్న నెనావత్‌ రాజేందర్‌ (26) అక్కడికక్కడే మృతి చెందాడు. కాంట్రాక్టర్‌ వద్ద కూలీగా పనిచేస్తున్న రాజేందర్‌ బచ్చరాజుపల్లి గిరిజన తాండాకు చెందినవాడు. దీంతో ఆగ్రహించిన తోటి కార్మికులు అధికారుల నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం బలైందని సబ్‌స్టేషన్‌ ...

Read More »

అక్రమంగా ఇసుక రవాణా

  మెదక్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్రమ ఇసుక ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే గురువారం రామాయంపేటలో ఏకంగా 7 ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకోవడం జరిగింది. రామాయంపేట మండలంలోని రాంపూర్‌ గ్రామ వాగు నుంచి రామాయంపేటకు అక్రమంగా తరలిస్తున్న 7 ఇసుక ట్రాక్టర్లను రామాయంపేట పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు వాహనాలు పట్టుకున్నట్టు ఏఎస్‌ఐ బేతప్ప అన్నారు. పట్టుకున్న ట్రాక్టర్లను మైనింగ్‌, రెవెన్యూ అదికారులకు అప్పగించామన్నారు. మండలంలో ఎవరైనా ఎక్కడైనా ...

Read More »

ఉచితంగా ఐడియా సిమ్‌కార్డులు

  700 కార్డులు అందజేసి రికార్డు సృష్టించిన వెంకటసాయి కమ్యూనికేషన్స్‌ మెదక్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామాయంపేట మండలం నిజాంపేట గ్రామంలోని వెంకటసాయి కమ్యూనికేషన్స్‌ దుకాణం ఆదివారం రికార్డు సృస్టించింది. వివరాల్లోకి వెళితే ఐడియా కంపెనీవారు దీపావళి పండగను పురస్కరించుకొని వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు ఇచ్చారు. ఐడియా టు ఐడియా 10 పైసలు అలాగే మిగతా నెట్‌వర్క్‌లకు 30 పైసలు నిమిషానికి ఇలా 90 రోజుల వరకు ఆఫర్‌ఇస్తు సిమ్‌కార్డు ఉచితంగా అందజేయడంతో వినియోగదారులు బారులుతీరి సిమ్‌కార్డులు పొందారు. ...

Read More »

ఆర్టీసి బస్సు ఢీకొని వ్యక్తి మృతి

  మెదక్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామాయంపేట లోని సిద్దిపేట చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాదచారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు ఎస్‌ఐ నాగార్జునగౌడ్‌ కథనం ప్రకారం… నిజామాబాద్‌ కు చెందిన వీరబత్తిని భద్రయ్య (55) దసరా పండగ సందర్భంగా రామాయంపేటలోని కూతురు వద్దకొచ్చాడు. వారికి ఇక్కడ బట్టల దుకాణం ఉండడంతో చేదోడువాదోడుగా పనిచేశాడు. కాగా శుక్రవారం రాత్రి 7.30 సమయంలో సిద్దిపేట చౌరస్తాలో నడుచుకుంటూ వెళ్తుండగా దుబ్బాక డిపోకు చెందిన ఆర్టీసి బస్సు ...

Read More »

పంజరంలో బందీగా పాలపిట్ట

మహావిష్ణనీువు కు ప్రతిరూపంగా భావించే ఈ పక్షి రాజన్ని దసరా పండగ రోజు దర్శనం చేసుకుంటే అద్ర్రుష్టామన్న ప్రజల విశ్వాసమే ఇప్పుడు దీని పాలిట శాపంగా మారింది నీలి నీలి రంగుల అందాలతో కనువిందు చేసే తెలుగు రాష్ట్రాల రాష్ట్ర పక్షి పాలపిట్ట ప్రమాదములొ పడింది రైతులకు మేలుచేయడములొ రైతు మిత్రపక్షులఅన్నింటిలోను పాలపిట్టదే అగ్రస్థానం పంటలను ఆశించే క్రిమికీటకాలతో పాటు ఛిన్న చిన్న పాములను సైతమ ఇవి వెంటాడుతుంటఈ అందుకే ఇవి రైతునేస్తాలుగా పేరుపొందినవిదసరా రోజు పాలపిట్టను చూడకపోతే ఏదో లోటుగా భావించి..ఎలాగైనా పండగ ...

Read More »

నిలిచిన ‘మీ’ సేవలు

  మెదక్‌, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వ్యాప్తంగా మీసేవా కేంద్రాల్లో సేవలు నిలిచిపోయాయి. చాలీచాలని కమీషన్‌తో కేంద్రాలు నిర్వహించడం భారంగా మారిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమీషన్‌ పెంచాలంటూ బుధవారం నుంచి మీసేవా నిర్వాహకులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా సుమారు 250 మీసేవా కేంద్రాల్లో సేవలు నిలిచిపోయాయి. మీసేవా కేంద్రాలు ప్రభుత్వ సేవలను వేగంగా అందిస్తాయి. కాగా ఖర్చు అదికకావడం, కమీషన్‌ తక్కువగా చెల్లించడంతో కేంద్రాల నిర్వహణ కష్టతరమవుతుందని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ ...

Read More »

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

  మెదక్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌ జిల్లా రామాయం పేట బైపాస్‌ రోడ్డు వద్ద 44వ జాతీయ రహదారి వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక ఎస్‌ఐ నాగార్జునగౌడ్‌ కథనం ప్రకారం…. బ్యాతోల్‌ గ్రామానికి చెందిన తొనిగండ్ల నర్సింలు (54) శుభకార్య నిమిత్తం టివిఎస్‌ మోపెడ్‌ వాహనంపై పెద్ద మల్లారెడ్డి గ్రామానికి ఆదివారం బయల్దేరాడు. కాగా హైదరాబాద్‌ నుంచి నాందేడ్‌ వెళ్తున్న స్విఫ్టు కారు ఎంపి 20 ...

Read More »

చికిత్స పొందుతూ బాలుని మృతి

  మెదక్‌, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 1వ తేదీ గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వంశీకృష్ణ (17) 9వ తరగతి విద్యార్థి శనివారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే… భద్రాచలం నుంచి బతుకుదెరువు కోసం వచ్చి నిజాంపేట్‌ శివారులోని పౌల్ట్రీ ఫాంలో వంశీకృష్ణ తల్లిదండ్రులు కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు వంశీకృష్ణ రోజులాగే పాఠశాలకు వెళ్లి ఇంటికి వస్తున్న సమయంలో 1వ తేదీ ఎదురుగా వచ్చిన డిసిఎం వ్యాన్‌ ఢీకొని ...

Read More »

మెదక్‌ జిల్లాలో పోలీసు పల్లె నిద్ర

  మెదక్‌, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె నిద్ర కార్యక్రమం ద్వారా పోలీసులకు, ప్రజలకు మధ్య స్నేహ భావం పెరుగుతందని ఏఎస్‌ఐ శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. అలాగే గ్రామంలోని సమస్యలు తెలుస్తాయని, తద్వారా వాటికి పరిష్కార మార్గం చూడవచ్చని ఆయన అన్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి రామాయంపేట మండలం నిజాంపేట గ్రామంలో ఏఎస్‌ఐ పల్లె నిద్రలో పాల్గొన్నారు. ఆయన వెంట కానిస్టేబుల్‌ రాజాగౌడ్‌, గ్రామ సర్పంచ్‌ తిరుమల్‌గౌడ్‌ తదితరులున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎవరైనా ...

Read More »

నవోదయ దరఖాస్తులకు ఈనెల 30 చివరితేది

  మెదక్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జవహార్‌ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశం పొందేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డిఇవో నజీమోద్దీన్‌ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు వచ్చే విద్యాసంవత్సరంలో 6వ తరగతిలో చేరేందుకు రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఇందుకోసం దరఖాస్తు ఫారాలను ఎంఇవో కార్యాలయంలో పొందవచ్చని తెలిపారు. అలాగే పూర్తిచేసిన దరఖాస్తులను ఈనెల 30 లోగా ఎంఇవో కార్యాలయంలో అందజేయాలని ...

Read More »