Breaking News

Mortad

13 మంది పేకాటరాయుళ్ల అరెస్టు

మోర్తాడ్, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మోర్తాడ్ మండలం వడ్యాట్ గ్రామ శివారులో మంగళవారం పేకాట ఆడుతున్న 13 మందిని అరెస్టు చేసినట్లు మోర్తాడ్ ఎస్ఐ సురేష్ కుమార్ తెలిపారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుండి 9 వేల 930 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. మోర్తాడ్ పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో గ్రామ పొలిమేరలో పేకాట ఆడుతున్న సమాచారం తెలియగానే పోలీసులు వెళ్లి పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నామని, వారిని అరెస్టు చేసి రిమాండ్ ...

Read More »

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

మోర్తాడ్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండలంలోని ఆయా గ్రామాల‌లో లాక్‌ డౌన్‌ సమయంలో ఎవరైనా ప్రభుత్వ ఆదేశాల‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మోర్తాడ్‌ పోలీసులు హెచ్చరించారు. పోలీసులు శుక్రవారం గ్రామంలోని వీధుల‌లో లాక్‌ డౌన్‌ను పరిశీలించారు. అలాగే లాక్‌ డౌన్‌ సమయంలో రోడ్డుపై సంచరించే వాహనదారుల‌ను ఆపి వివరాల‌ను సేకరించి లాక్‌డౌన్‌ సమయంలో ఎవరు కూడా బయట సంచరించరాదని తెలుపుతూ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మోర్తాడ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆయా గ్రామాల‌లో ప్రజలు ఎవరూ ...

Read More »

రోడ్డు ప్రమాదంలో విఆర్‌ఏ మృతి

మోర్తాడ్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాల‌యంలో విఆర్‌ఎ గా పనిచేస్తున్న మస్తా బాబన్న బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు మోర్తాడ్‌ తహసిల్దార్‌ శ్రీధర్‌ తెలిపారు. మోర్తాడ్‌ గ్రామానికి చెందిన విఆర్‌ఏ బాబన్న తన కుమారుడు మాస్ట ప్రాంతీష్‌ను ఆరోగ్యం బాగాలేక నిజామాబాదులోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించాడు. కాగా ఆరోగ్యం క్షీణించడం వ‌ల్ల‌ అతని కుమారుడు మరణించినట్లు వైద్య సిబ్బంది తెల‌పడంతో బుధవారం జిల్లా కేంద్రం నుండి పార్థివ దేహాన్ని ...

Read More »

లాక్‌ డౌన్‌ పరిశీలించిన అధికారులు

మోర్తాడ్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఉదయం 10 గంటల‌ నుండి లాక్‌ డౌన్‌ విధించడంతో మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో బుధవారం వ్యాపార సంస్థలు, వివిధ దుకాణ సముదాయాలు స్వచ్చందంగా మూసి ఉంచి ప్రభుత్వ అధికారుల‌ ఆదేశాల‌కు కట్టుబడి ఉంటామని గుడిపాడు గ్రామస్తులు వివరించారు. మండలంలోని అన్ని గ్రామాల‌లో లాక్‌ డౌన్‌ ఎలా జరుగుతుందోనని ప్రభుత్వ అధికారులు పరిశీలించారు. అన్ని గ్రామాల‌లోని దుకాణ యజమానులు ప్రభుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా అన్ని దుకాణ సముదాయాలు మూసి ...

Read More »

కరోనా నివారణకు ప్రజలు సహకరించాలి

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో కరోనా నివారణకు ప్రభుత్వం చేపట్టిన చర్యల‌కు ప్రజలు అందరూ సహకరించాల‌ని మోర్తాడు ఎస్‌ఐ సురేష్‌ కుమార్‌ అన్నారు ఆయన ఆదివారం మాట్లాడుతూ మోర్తాడ్‌ మండలంలో కూడా అన్ని గ్రామాల‌లో ప్రజలు కరోనా నివారణకు చేపట్టిన చర్యల‌కు అనుకూలంగా మసులుకుంటూ అధికారుల‌కు సహాయ సహకారాలు అందివ్వాల‌న్నారు. దేశంలో కోవిద్‌ 19 సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని అందువ‌ల్ల‌నే ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని ఎస్సై సురేష్‌ కుమార్‌ వివరించారు. రాష్ట్రంలో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ...

Read More »

కరోనాతో కానిస్టేబుల్‌ మృతి

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండల‌ కేంద్రంలోని పోలీస్‌ స్టేషనులో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అనంతయ్య కరోనా బారిన పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతయ్య నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలంలోని ల‌క్కొర గ్రామానికి చెందిన వాడని, గతంలో మోర్తాడ్‌ పోలీసు స్టేషన్‌లో చాలా రోజులుగా విధులు నిర్వహించి ఇక్కడి ప్రజల‌ మన్ననలు పొందారన్నారు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నట్టు తెలిసింది. అనంతయ్య మృతిచెందడంతో కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయామని కుటుంబ ...

Read More »

పాఠశాలల‌ ఉపాధ్యాయుల‌కు బియ్యం పంపిణీ

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో పాఠశాల‌లు మూతపడడంతో ప్రయివేటు టీచర్లకు వేతనాలు లేక అవస్థలు పడుతున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్‌ పాఠశాల‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల‌ను ఆదుకునేందుకు సాయం ప్రకటించింది. ప్రతి టీచర్‌కు రూ.2 వేల‌ నగదు, అలాగే ఒక్కో టీచర్‌కు 25 కిలోల‌ బియ్యం అందిస్తున్నారు. ఇందులో భాగంగా మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో గురువారం స్థానిక మండల‌ ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు శివలింగం శ్రీనివాస్‌ బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిపి శ్రీనివాస్‌ ...

Read More »

కరోనాతో ఐకెపి ఎపిఎం మృతి

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి ఐకెపి కార్యాల‌యంలో ఏపీఎంగా విధులు నిర్వహిస్తున్న ఉమాకాంత్‌ బుధవారం కరోన వ్యాధితో కన్నుమూశారని మోర్తాడ్‌ ఐకెపి కార్యాల‌యం అధికారులు తెలిపారు. ఉమాకాంత్‌కు భార్య పిల్లలు ఉన్నారని, వారిని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాల‌ని ఐకెపి సిబ్బంది ప్రభుత్వాన్ని కోరారు.

Read More »

ఎక్కడివక్కడే… ఏమిటివి…

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో పిఎసిఎస్‌ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ తూకం వేయడంలో ఆల‌స్యం అవ్వడం వ‌ల్ల‌ ధాన్యం కుప్పలు ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ శాఖ అధికారులు వాతావరణంలో మార్పు జరిగి కొన్నిచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పడంతో ధాన్యం రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తూకం వేయడంలో సొసైటీ అధికారుల‌ నిర్లక్ష్యం అని రైతులు అంటున్నారు. దాదాపు గత పది పన్నెండు రోజుల‌ నుండి దాన్యం ...

Read More »

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న సిబ్బంది

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో శనివారం ఆయా గ్రామాల‌కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది మొత్తం కలిపి 46 మందికి కరోనా వ్యాక్సిన్‌ చేయడం జరిగిందని మోర్తాడ్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో డిఎల్‌పిఓ శ్రీనివాస్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌ రెడ్డి, ఎంపిఓ తదితరులు పాల్గొన్నారు.

Read More »

టీకాతోనే రక్షణ

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆయా గ్రామాల‌ ప్రజలు టీకా తీసుకొని కోవీడు మహమ్మారిని తరిమివేయాల‌ని మోర్తాడ్‌ ఎస్‌ఐ సురేష్‌ కుమార్‌ ఆయా గ్రామాల‌ ప్రజల‌కు సూచించారు. టీకా తీసుకొని ప్రాణాలు రక్షించుకోవాల‌న్నారు. టీకాతో ప్రాణానికి వంద శాతం మేలు జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాల‌ని, ప్రజలందరూ మాస్కు ధరిస్తే లాక్‌ డౌన్‌తో సమానమేనని ఎస్‌ఐ వివరించారు. ప్రజలు ఎవరూ కూడా గుంపులుగుంపులుగా ఉండరాదని సభలు సమావేశాలు నిర్వహించకూడదని ప్రజలు ...

Read More »

మోర్తాడ్‌లో కుంటను మింగిన పెద్దలు

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో పంట పొలాల‌కు సాగునీరు అందించే ఇప్ప కుంటను గ్రామానికి చెందిన కొందరు రైతులు గత కొన్నాళ్ల నుండి కబ్జా చేసుకొని పంటలు పండించుకుంటున్నప్పటికీ రెవెన్యూ ఇరిగేషన్‌ శాఖల‌ అధికారుల‌కు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. కబ్జాకు గురైన ఇప్ప కుంటను ప్రభుత్వ అధికారులు చూసి కూడా చూడనట్టుగా వ్యవహరించడం ఏమిటని ప్రజలు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెరువులు కుంటల‌ను లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా నీటిని ...

Read More »

సిఎం చిత్రపటానికి పాలాభిషేకం

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలోని రజకులందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర రావు 250 యూనిట్ల నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా ఇస్తున్నందుకు మంగళవారం మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో చాకలి ఐల‌మ్మ విగ్రహం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర రావు, రాష్ట్ర మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి చిత్రపటాల‌కు పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని రజకుల‌కు 250 యూనిట్ల ఉచిత విద్యుత్తును సరఫరా చేయడం చాలా సంతోషమని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ...

Read More »

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళ నిర్మాణాల‌ను పరిశీలించిన మంత్రి

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణ పనుల‌ను ఆదివారం మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి పరిశీలించారు. అధికారుల‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణ పనుల‌ను‌ వేగవంతం చేయాల‌ని అధికారుల‌ను, కాంట్రాక్టరును ఆదేశించారు. పనుల్లో నాణ్యత లోపం ఉండరాదని అన్నారు. కార్యక్రమంలో మండల‌ ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు శివలింగ శ్రీనివాస్‌, మోర్తాడ్‌ సర్పంచ్‌ భోగ ధరణి ఆనంద్‌, ఎన్‌డిసిసిబి డైరెక్టర్‌ మెతుకు భూమన్న, టిఆర్‌ఎస్‌ మండల‌ పార్టీ ...

Read More »

ముగిసిన బ్రహ్మోత్సవాలు

మోర్తాడ్‌, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో గత వారం రోజుల‌ నుండి జరుగుతున్న శ్రీ ల‌క్ష్మీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు బుధవారంతో ముగిశాయి. బ్రహ్మోత్సవాల‌లో మోర్తాడ్‌, కమ్మర్‌పల్లి, ఎరుగట్ల మండలాల‌లోని ఆయా గ్రామాల‌ నుండి అనేకమంది భక్తులు పాల్గొని విజయ విజయవంతం చేశారు. బ్రహ్మోత్సవాల‌ సందర్భంగా మంగళవారం రాత్రి 12 గంటల‌ తర్వాత రథయాత్ర నిర్వహించారు. రథయాత్రలో అనేక గ్రామాల‌ భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలు బుధవారం తెల్ల‌వారుజామున చక్రతీర్థంతో ముగిశాయి. బ్రహ్మోత్సవాల‌ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ...

Read More »

నేడు మోర్తాడ్‌లో రథోత్సవం

మోర్తాడ్‌, మార్చ్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో శ్రీ ల‌క్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతరకు సంబంధించి వారం రోజుల‌ నుండి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా మోర్తాడ్‌లో మంగళవారం అర్ధరాత్రి రథోత్సవం జరగనుంది. జాతరకు చుట్టు పక్కల‌ మండలాల‌ నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. భక్తుల‌ సౌకర్యార్థం వారికి కావల‌సిన సౌకర్యాల‌ను గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ గ్రామాల‌ నుండి వచ్చే భక్తుల‌కు ఎటువంటి అసౌకర్యం కల‌గకుండా గ్రామస్తులు వారికి సౌకర్యాలు కల్పించారు. ...

Read More »

ఈజీఎస్‌ పనులు పరిశీలించిన ఎంపీడీవో

మోర్తాడ్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో జరుగుతున్న ఈజీఎస్‌ పనుల‌ను శనివారం మోర్తాడ్‌ ఎంపీడీవో శ్రీనివాస్‌ రెడ్డి పరిశీలించారు. గ్రామంలోని ఇప్పకుంటలో జరుగుతున్న ఈజీఎస్‌ పనుల‌ను గ్రామ సెక్రెటరీ రామకృష్ణతో కలిసి అక్కడ జరుగుతున్న పనుల‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అక్కడ పనిచేస్తున్న కూలీల‌ను వారి సమస్యల‌ను అడిగి తెలుసుకున్నారు.

Read More »

ఎన్‌డిసిసిబి డైరక్టర్‌కు సన్మానము

మోర్తాడ్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్‌డిసిసిబి డైరెక్టర్‌గా ఏకగ్రివంగా ఎన్నికైన మెతుకు భూమన్నను టీఆర్‌ఎస్‌ నాయకులు కల్లెడ ఏలీయా, మండల‌ ప్రజా పరిషత్ అద్యక్షుడు శివలింగు, శ్రీనివాస్‌, జడ్పీటీసి బద్దం రవి, పిఏసిఎస్‌ చైర్మన్‌ కళ్లెం అశోక్‌ రెడ్డి, ధోన్పాల్‌ సర్పంచ్‌ పర్సా దేవన్న, వైస్‌ ఎంపిపి తోగట్టి శ్రీనివాస్‌, ఎంపిటీసి అజార్‌ తదితరులు సన్మానం చేశారు.

Read More »

బీసీలు ఐక్యంగా పోరాడాలి

జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం మోర్తాడ్‌లోని ప్రజానిలయంలో బీసీ విద్యార్థి సంఘం నిజామాబాద్‌ జిల్లా క్యాలెండర్‌ను బహుజన సమాజ్‌ వాదీ పార్టీ నాయకులు ముత్యాల సునీల్‌ కుమార్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాట్లాడుతూ బీసీలు ఐక్యంగా ఉండి బీసీ రిజర్వేషన్‌, బీసీ హక్కులకోసం పోరాడాలాన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్‌ అమలు చేయాలని, అప్పుడే బీసీలు రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా జనరల్‌ సెక్రటరీ ద్యాగ శేఖర్‌, బీసీ విద్యార్థి ...

Read More »

గ్రామ గ్రామాన అన్నసత్రాలు

మోర్తాడ్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని మండలంలోని ఆయా గ్రామాల్లోని హనుమాన్‌ ఆలయాల్లో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి సిందూరపూజలు, అభిషేకాలు, అర్చనలు, హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హనుమాన్‌ ఆలయాల వద్ద పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయాల వద్ద భక్తుల సౌకర్యార్థం షామియానాలు, తాగునీరు, అన్నదానం ఏర్పాటుచేశారు. పలు గ్రామాల్లో హనుమాన్‌ శోభాయాత్ర నిర్వహించారు. యువకులు కేరింతలు కొడుతూ ...

Read More »