Morthad

ప్రభుత్వ సంక్షేమ పథకాలను చిత్తశుద్దితో అమలు చేయాలి

  మోర్తాడ్‌, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని అర్హులైన వారికి అందిస్తు అభివృద్ది పనులను చిత్తశుద్దితో అమలు చేయాలని మోర్తాడ్‌ ఐకెపి ఎపిఎం ప్రమీల అన్నారు. బుధవారం ఐకెపి భవనంలో మండల సిసిలతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం చేపడుతున్న హరితహారం పథకాన్ని జూన్‌లో అమలు చేయాలని అదేవిధంగా స్వయం సహాయక మహిళల సాధికారతకై స్త్రీనిధి రుణాలను, బ్యాంకు లింకేజీ రుణాలను అందించాలన్నారు. అంతేగాకుండా సారా విక్రయించి, మానుకున్న వారికి ప్రభుత్వం అందిస్తున్న …

Read More »

తెరాసకు అండగా ధర్మోరా ముదిరాజ్‌ సంఘ సభ్యులు

  మోర్తాడ్‌, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస పార్టీకి, బాల్కొండ ఎమ్మెల్యేకు ఎల్లవేళలా అండగా ఉంటామని ధర్మోరా ముదిరాజ్‌ సంఘం సభ్యులు బుధవారం ఎమ్మెల్యేకు తీర్మాన పత్రం అందజేశారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ధర్మోరా ముదిరాజ్‌ సంఘ సభ్యులు తీర్మానం చేసి పెర్కిట్‌లోని కార్యాలయంలో ఎమ్మెల్యేను సన్మానించి తీర్మాన పత్రం అందజేశారు. ముదిరాజ్‌ సంఘ సభ్యులకు ఆలయ నిర్మాణానికి 7 లక్షల నిధులు మంజూరు చేశారని, ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే తమకు సహకరించలేదని, …

Read More »

మోర్తాడ్‌ పోలీసుశాఖ ఆద్వర్యంలో చలివేంద్రం

    మోర్తాడ్‌, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా పోలీసు ఉన్నతాదికారుల ఆదేశాల మేరకు మోర్తాడ్‌ పోలీసు శాఖ ఆధ్వర్యంలో మోర్తాడ్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు ప్రజలు, బాటసారులు దాహార్తి తీర్చుకునేందుకు చలివేంద్రం ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని మోర్తాడ్‌ ఏఎస్‌ఐ నర్సయ్య చేతుల మీదుగా ప్రారంభించి ప్రయాణీకులకు తాగునీరు అందజేశారు. పోలీసులు ప్రజల్లో భాగస్వామ్యం అని చాటేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో హెడ్‌ కానిస్టేబుళ్లు సిబ్బంది పాల్గొన్నారు. Email this page

Read More »

నిత్యవసర సరుకులు సక్రమంగా పంపిణీ చేయాలి

  -డీలర్లపై ఫిర్యాదులొస్తే శాఖాపరమైన చర్యలు మోర్తాడ్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిత్యవసర సరుకులు సక్రమంగా పంపిణీ చేయాలని డీలర్లపై ఫిర్యాదులు వస్తే శాఖాపరమైన చర్యలు చేపడతామని ఆర్మూర్‌ ఆర్డీవో శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం మోర్తాడ్‌ తహసీల్‌ కార్యాలయంలో విజిలెన్సు మానిటరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు ఎంపిపి కల్లడ చిన్నయ్య, జడ్పిటిసి ఎనుగందుల అనిత, సర్పంచ్‌లు, రేషన్‌ డీలర్‌యూనియన్‌ అధ్యక్షులు ఆయా పార్టీల మండల అధ్యక్షులు, ఎన్‌ఫోర్సుమెంట్‌ డిప్యూటి తహసీల్దార్‌లు శంకర్‌, విజయలక్ష్మిలు, ఏర్గట్ల, మోర్తాడ్‌ …

Read More »

ఒంటరి మహిళల లబ్దిదారుల ఎంపిక

  మోర్తాడ్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండలంలో ఒంటరి మహిళలు 384 మంది దరఖాస్తులు చేసుకున్నారని, వాటిని పరిశీలించి 178 మంది లబ్దిదారులను ఎంపిక చేయడం జరిగిందని మోర్తాడ్‌ తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌ తెలిపారు. ఏర్గట్ల మండలంలో 181 ఒంటరి మహిళా దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 135 మంది లబ్దిదారులను ఎంపిక చేయడం జరిగిందని ఏర్గట్ల తహసీల్దార్‌ ముల్తాజుద్దీన్‌ అన్నారు. Email this page

Read More »

బీడీ కార్మికుల జీవనభృతి దరఖాస్తుల పరిశీలన

  మోర్తాడ్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న రెండవ విడత ఆసరాపింఛన్లలో మోర్తాడ్‌, ఏర్గట్ల మండలాల్లో మొత్తం 1600 మంది బీడీ కార్మికుల దరఖాస్తులు అందినట్టు ఎంపిడివో శ్రీనివాస్‌ తెలిపారు. 1200 దరకాస్తుల విచారణ చేపట్టామని, మరో 400 దరఖాస్తులు పరిశీలించాల్సి ఉందని, ఈ నెలాఖరులోపు దరఖాస్తులు పరిశీలించి అన్ని గ్రామ పంచాయతీల్లో లబ్దిదారుల జాబితా ఉంచుతామని పేర్కొన్నారు. Email this page

Read More »

ఒంటరి మహిళల జీవనభృతి జాబితా సిద్దం

  మోర్తాడ్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం అందిస్తున్న ఒంటరి మహిళల జీవనభృతి కోసం దరఖాస్తులను సోమవారం పూర్తిస్థాయి విచారణ చేపట్టామని అన్ని గ్రామాల జాబితా సాయంత్రం లోపు సిద్దంచేసి గ్రామ పంచాయతీల్లో అతికిస్తామని తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌ రావు తెలిపారు. Email this page

Read More »

తొర్తి చెరువులో చేపల మృతి

  – ఆందోళనలో గంగపుత్రులు మోర్తాడ్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తొర్తి గ్రామ ఊరచెరువులో ఒకలక్ష 50 వేలతో గత జూన్‌లో చేప పిల్లలను వదిలినట్టు గంగపుత్రుల సంఘం సభ్యులు తెలిపారు. గత పదినెలలుగా పెంచి చేతికొచ్చిన చేపలు గత ఐదురోజులుగా చనిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష 50 వేలు అప్పుచేసి చేపపిల్లలు కొనుగోలు చేసి పెంపకం చేశామని, ఒక్కో చేప ఐదుకిలోల మేర పెరిగిందని దీంతో తాము తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం …

Read More »

అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్దం

  మోర్తాడ్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మార్కెట్‌ వద్దగల గజవాడ భూమేశ్వర్‌కు చెందిన నివాసపు పురాతన ఇల్లు ఆదివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్దమై, ఇంట్లోని వస్తువులు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. అర్ధరాత్రి వేళ మంటలు లేవడంతో గమనించిన స్థానికులు కేకలు, అరుపులు వేయడంతో ప్రజలు గుమిగూడి ఇంట్లోకి వెళ్లి నిద్రిస్తున్న కుటుంబ సభ్యులను బయటికి తీసుకొచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. నలుగురైదుగురు యువకులు ధైర్యంతో ఇంట్లోని గ్యాస్‌ సిలిండర్‌ను ప్రమాదం జరగకుండా బయటకు తీసుకొచ్చారు. ప్రమాదంలో …

Read More »

గొల్ల కుర్మల అభివృద్దే ధ్యేయం

  మోర్తాడ్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గొల్ల కుర్మలు ఆర్థికంగా రాణించేందుకు తెరాస ప్రభుత్వం గొర్రెల పెంపకం పథకాన్ని అమలు చేస్తుందని మోర్తాడ్‌ జడ్పిటిసి ఎనుగందుల అనిత, సర్పంచ్‌లు తుమ్మల మారుత, లోలం లావణ్య, బుక్య రాణిబాయి, తహసీల్దార్‌ ముల్తాజుద్దీన్‌లు అన్నారు. శుక్రవారం మండలంలోని తాళ్లరాంపూర్‌, తడపాకల్‌, బట్టాపూర్‌ గ్రామ పంచాయతీల కార్యాలయ ఆవరణలో సర్పంచ్‌ల అధ్యక్షతన ఆయాగ్రామాల గొల్ల, కుర్మ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రజాప్రతినిధులు, అధికారులు లాటరీ పద్దతిలో తాళ్లరాంపూర్‌లో – 26 మంది …

Read More »