Breaking News

Morthad

తెరాసతోనే గ్రామాల అభివృద్ది

  మోర్తాడ్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వ పాలనలోనే అన్ని వర్గాల అభివృద్ది జరుగుతుందని మోర్తాడ్‌ జడ్పిటిసి ఎనుగందుల అనిత పూర్ణానందం అన్నారు. గురువారం మోర్తాడ్‌ గ్రామంలోని తక్కురివాడ నిరంకారి బాబా అశ్రమం ముందు సిసి రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేసి ప్రారంభించారు. అనంతరం జడ్పిటిసి మాట్లాడుతూ సిఎం కెసిఆర్‌ ఆశయాల మేరకు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్దికి,ప్రజా సేవకోసం కృసి చేస్తున్నారని అన్నారు. ప్రజలు తెరాసకు, ఎమ్మెల్యేకు అండగా ...

Read More »

బాల్య వివాహాన్ని అడ్డుకున్న మండల అధికారులు

  మోర్తాడ్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రామన్నపేట గ్రామానికి చెందిన ఆర్‌ఎంపి వైద్యుడు శ్రీనివాస్‌తో బాల్కొండ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కాల్వ శ్రీలత అనే మైనర్‌ బాలికతో గురువారం రాత్రి వివాహం జరిపేందుకు ఇరువురు తల్లిదండ్రులు సిద్దం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న మోర్తాడ్‌ ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ జ్ఞానేశ్వరి గ్రామాన్ని సందర్శించి జరుగుతున్న పెళ్ళి ఇంటి వారి వివరాలు తెలుసుకొని జిల్లా, మండల అధికారులకు సమాచారం అందించారు. దీంతో మోర్తాడ్‌ తహసీల్దార్‌ వెంకట్రావు, ఏఎస్‌ఐ నర్సయ్య, ఐసిడిఎస్‌ ...

Read More »

700 మంది లబ్దిదారులకు డబుల్‌బెడ్‌ రూం పథకాన్ని అందించాలి

  మోర్తాడ్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల కేంద్రంలో ఇళ్లులేని నిరుపేదలు 700 మందికి పైగా ఉంటారని, తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న డబుల్‌బెడ్‌ రూం పథకాన్ని ప్రతి నిరుపేద కుటుంబానికి అందించాలని సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి సారా సురేశ్‌, కిషన్‌, సత్తక్కలు అన్నారు. మంగళవారం సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసి ఆధ్వర్యంలో మోర్తాడ్‌ బస్టాండ్‌ నుంచి తహసీల్‌ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి బైఠాయించారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ...

Read More »

మోర్తాడ్‌, ధర్మోరాలో గ్రామసభలు

  మోర్తాడ్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ధర్మోరా, మోర్తాడ్‌ గ్రామాల్లో స్థానిక సర్పంచ్‌లు దడివె నవీన్‌, రాజేందర్‌ అధ్యక్షతన మంగళవారం గ్రామసభలు నిర్వహించారు. ఇందులో కార్యదర్శులు గంగాదాస్‌, శ్రీనివాస్‌రెడ్డిలు గ్రామంలో చేపట్టిన అభివృద్ది పనులను చదివి వినిపించారు. నీటి ఎద్దడిపై గ్రామస్తులు అధికారుల దృస్టికి తీసుకొచ్చారు. మోర్తాడ్‌లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకై దరఖాస్తులు చేసుకున్నారు. పలు తీర్మానాలు చేసి నివేదికలు జిల్లా కలెక్టర్‌కు ఎండివోద్వారా పంపనున్నట్టు వారు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వెంకట్రావు, ఉపసర్పంచ్‌లు గంగారెడ్డి, ...

Read More »

వైభవంగా సంతమల్లన్న జాతర

  మోర్తాడ్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రామన్నపేట గ్రామ శివారులోని కుర్మ గొల్ల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సంతమల్లన్న స్వామి జాతర వైభవంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మహా అన్నదానం ఏర్పాటు చేశారు. నూతన ఆలయాన్ని నిర్మించిన సందర్భంగా మూడురోజులుగా విశేష పూజలు చేస్తున్నారు. గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు.

Read More »

సంక్షేమ పథకాల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

  మోర్తాడ్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా అన్నారు. మంగళవారం టెలికాన్పరెన్సు ద్వారా మండలంలోని వివిధ అదికారులతో మాట్లాడారు. రెవెన్యూ అధికారులు డబుల్‌ బెడ్‌ రూం దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశించారు. ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు గ్రామాల్లో నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టాలని ఇజిఎస్‌ అధికారులు ఉపాది హామీ కూలీలకు వేతనాలు వెంటనే చెల్లించాలని ప్రతి ఒక్కరికి ...

Read More »

నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా కృషి

  మోర్తాడ్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మేనిఫెస్టోమేరకు, సిఎం ఆశయాల మేరకు బాల్కొండ నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం కమ్మర్‌పల్లి మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు వెళుతూ మోర్తాడ్‌ తెరాస పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో ముచ్చటించారు. జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేనివిధంగా బాల్కొండలో వందకోట్ల అభివృద్ధి పనులు చేశామని, మరో వంద కోట్ల అభివృద్ది పనులు చేపట్టనున్నట్టు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ...

Read More »

సుంకెట్‌లో నూతన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను నియమించాలి

  మోర్తాడ్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సుంకెట్‌ గ్రామంలో గత 8 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ రాజును అవినీతి ఆరోపణలపై తొలగించారు. గత నెలరోజులుగా ఫీల్డ్‌ అసిస్టెంట్‌ లేకపోవడంతో ఉపాధి హామీ కూలీలు, మేట్‌లు ఆందోళన చెంది జిల్లా కలెక్టర్‌కు, మండల అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అధికారులు స్పందించకపోవడంతో సోమవారం గ్రామంలో ఉపాధి హామీ కూలీలు సమావేశం ఏర్పాటు చేసుకొని సంతకాలు సేకరించి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను వెంటనే నియమించాలని కోరుతూ వినతి ...

Read More »

రామన్నపేటలో మల్లన్న బ్రహ్మూెత్సవాలు

  మోర్తాడ్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రామన్నపేట గ్రామ శివారులోగల మల్లన్న ఆలయంలో కుర్మగొల్ల సంఘం ఆధ్వర్యంలో సంతమల్లన్న బ్రహ్మూెత్సవాలు ఆది, సోమవారాల్లో ఘనంగా నిర్వహించారు. సోమవారం మల్లన్న నాగవెల్లి, యజ్ఞం, ప్రత్యేక పూజలు చేశారు. మల్లన్నను పల్లకిలో, డప్పు వాయిద్యాలతో గ్రామం నుంచి దేవాలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. కుర్మగొల్ల సంఘం వారు నూతన సంత మల్లన్న ఆలయాన్ని నిర్మించి ఆదివారంవిగ్రహ ప్రతిష్టాపన చేసి, సోమవారం పూజా కార్యక్రమాల అనంతరం అన్నదానం చేశారు. భక్తులు అధిక ...

Read More »

బాల్య వివాహాలను జరిపిస్తే కఠిన చర్యలు

  మోర్తాడ్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాల్య వివాహాలపై కఠినమైన చట్టాలను అమలు చేస్తున్నాయని, అధికారులు సైతం చట్టం, నిబంధనల మేరకు విధులు నిర్వహిస్తున్నారని, అందుకు నిదర్శనం ఆదివారం బాల్య వివాహాన్ని అడ్డుకున్న పోలీసు, రెవెన్యూ, ఐసిడిసి అధికారులేనని జిసిబివో శకంతలా దేవి, టిఎంఓ స్వర్ణలత అన్నారు. సోమవారం మండలంలోని కస్తూర్బా పాఠశాలను సందర్శించి వివాహం నిలిచిపోయిన విద్యార్థిని పరామర్శించారు. విద్యార్థిని తల్లిదండ్రులతో చర్చించి బాల్య వివాహాలు జరపడం వల్ల, యువతులు ఆరోగ్యంగా దెబ్బతింటారని, ...

Read More »

బాల్య వివాహాన్ని అడ్డుకున్న మండల అధికారులు

  మోర్తాడ్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రమైన మోర్తాడ్‌లోగల కస్తూర్బా పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న రమ్య అనే విద్యార్థిని తల్లిదండ్రులు గుట్టు చప్పుడు కాకుండా ఆదివారం ధర్పల్లి మండలం సీతాయిపేట్‌ గ్రామానికి చెందిన యువకునితో వివాహం చేసేందుకు వెళ్లారు. బాల్య వివాహం జరుగుతున్న విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌, ఎస్‌పిలు మండల అధికారులకు సమాచారం అందించారు. మోర్తాడ్‌ ఎస్‌ఐ అశోక్‌రెడ్డి, తహసీల్దార్‌ వెంకట్‌రావు, ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ జ్ఞానేశ్వరి, పాఠశాల ప్రిన్సిపాల్‌ స్వప్న, అంగన్‌వాడి కార్యకర్తలు, విఆర్వోలు ...

Read More »