Nandipet

నందిపేటలో నవవసంతం

  నందిపేట, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మళ్లీ పూలపండుగ వచ్చింది. తంగేడు, గునుగు, బంతి, చామంతి పూలతో పూల సందడి బుధవారం నుంచి నందిపేట మండలంలో మొదలైంది. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన పండగ 28న సద్దుల బతుకమ్మతో ముగియనుంది. ఈ పండుగను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం 9 రోజుల పాటు గత సంవత్సరం కంటే భారీగా పండగ జరిపేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యంలో జరిగే ఉత్సవాలకు మహిళా సంఘాలు, తెలంగాణ …

Read More »

సూర్యోదయ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

  నందిపేట, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని సూర్యోదయ పాఠశాలలో మంగళవారం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. గును, తంగేడు పూలతో అందంగా ముస్తాబుచేసిన బతుకమ్మను శ్రద్దతో పూజించి ఆడి పాడారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Email this page

Read More »

వ్యక్తి అదృశ్యం

  నందిపేట, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :మండలంలోని చింరాజ్‌పల్లి గ్రామానికి చెందిన ఐలపురం గంగాధర్‌ (24) గత 20 రోజుల నుంచి కనిపించకుండా పోయాడని తండ్రి మల్లయ్య పోలీసులకు ఫిర్యాదుచేసినట్టు ఎస్‌ఐ జాన్‌రెడ్డి తెలిపారు. మూడు సంవత్సరాల క్రితం దుబాయ్‌కి వెళ్లిన గంగాధర్‌ మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఇంటింకి పంపించారని, నిజామాబాద్‌ ఆసుపత్రిలో వైద్యం చేయించగా కొంతమేర నయమైందని మల్లయ్య తెలిపారు. కాగా గత 20 రోజుల క్రితం ఇంటినుంచి వెళ్లి ఇంతవరకు తిరిగి రాలేదని, చుట్టాలు, బంధువుల …

Read More »

బతుకమ్మ చీరల పంపిణీ

  నందిపేట, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో సోమవారం బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. మండల పరిసత్‌ అధ్యక్షురాలు అంకంపల్లి యమున అధ్యక్షతన మండల కేంద్రంలోని మండల కార్యాలయ సముదాయంలో జరిగిన కార్యక్రమంలో పంపిణీ ప్రారంభించి, తర్వాత మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సర్పంచ్‌, ఎంపిటిసిల ఆధ్వర్యంలో చీరలు పంపినీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని కులాలను, అన్ని వర్గాలను ఆదరించే ఏకైక ప్రభుత్వమని వక్తలన్నారు. ప్రతి ఒక్కరు పండగకు కొత్తబట్టలు కొనుక్కోలేదని బాధ పడకూదనే …

Read More »

బుధవారం రాత్రి పల్లెనిద్ర

  నందిపేట, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి బుధవారం రాత్రి మండలంలోని వెల్మల్‌ గ్రామంలో ప్రజాదర్బార్‌, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జీవనన్న యువసేన అధ్యక్షుడు మహేందర్‌ తెలిపారు. రాష్ట్రంలో ఎవరూ చేయని వినూత్న రీతిలో పల్లెనిద్ర, ప్రజాదర్బార్‌ కార్యక్రమం ద్వారా దళితవాడలో నిద్రపోతూ ప్రజా సమస్యలు తెలుసుకొని వెనువెంటనే పరిష్కరిస్తున్నారని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులను కోరారు. Email this page

Read More »

విద్యార్థులకు నోటుపుస్తకాల పంపిణీ

  నందిపేట, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఐడెంటిటి కార్డులు, నోటుపుస్తకాలు లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో దాత చేపూరు నారాయణ చేతుల మీదుగా పంపిణీ చేసినట్టు క్లబ్‌ అధ్యక్షుడు గంగాదర్‌ తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ముత్తెన్న, ఉపాధ్యాయులు, లయన్స్‌ క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు. Email this page

Read More »

ఎమ్మెల్యేను కలిసిన కోమట్‌పల్లి వాసులు

  నందిపేట, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని కోమట్‌పల్లి వాసులు మంగళవారం ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో కలిసి గ్రామ సమస్యలు వివరించారు. అభివృద్ది పనులు మంజూరు చేయాలని కోరగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గ్రామంలోని రామాలయానికి రూ. 12 లక్షల 50 వేలు మంజూరు చేసినట్టు తెలిపారు. అదేవిధంగా నికాల్‌పూర్‌ ఎత్తిపోతల పథకం ద్వారా కోమట్‌పల్లి గ్రామ చెరువు నింపడానికి కావాల్సిన పైప్‌లైన్‌ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సంజీవ్‌, …

Read More »

రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం

  – గుత్ప ఎత్తిపోతల నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే నందిపేట, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నందిపేట మండలం ఉమ్మెడ పాత గ్రామంలో ఉన్న గుత్ప ఎత్తిపోతల పథకం నీటిని విడుదల చేయడానికి గురువారం ఉదయం ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పంప్‌హౌజ్‌ మోటారు స్విచ్‌ ఆన్‌చేసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రైతు శ్రేయస్సుకోసమే ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు ఉన్నందున ఎంపి కల్వకుంట్ల కవిత, …

Read More »

నందిపేటలో కొనసాగుతున్న పోలీసు పికెటింగ్‌

  నందిపేట, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో మంగళవారం రాత్రి జరిగిన ఘర్షణ నేపథ్యంలో విధించిన 144 సెక్షన్‌ గురువారం సాయంత్రం ముగియనుంది. అయినప్పటికి ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో పోలీసు కమీషనర్‌ కార్తికేయ పది పోలీసు పికెటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కమీషనర్‌, కలెక్టర్‌లు నందిపేటను సందర్శించి పెద్ద మొత్తంలో పోలీసులను మోహరించడంతో గ్రామంలో శాంతియుత వాతావరణం ఏర్పడింది. రెండ్రోజుల నుంచి ప్రశాంతంగా ఉండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. …

Read More »

కలకలం రేపిన ఫేస్‌బుక్‌ ఫోటో

  పోలీసుల సమయస్పూర్తితో సద్దుమణిగిన వివాదం – పోలీసు నిఘాలో నందిపేట్‌ నందిపేట, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకున్న ఓవివాదం చినుకు చినకు గాలివానలా మారింది. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామానికి చెందిన ఓ యువకుడు ఫేస్‌బుక్‌లో వివాదాస్పద ఫోటోను తన ప్రొపైల్‌గా మంగళవారం సాయంత్రం పోస్టు చేశాడు. రెండు మూడు గంటలలోపు మరో వర్గం ప్రజలకు తెలియడంతో ఫోటో పోస్టుచేసిన యువకునిపై చర్య తీసుకోవాలని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న …

Read More »