Breaking News

nandipeta

ఘనంగా ఎల్లమ్మ పండుగ ఏర్పాట్లు

  నందిపేట, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఖుదావన్‌ గ్రామ సమీపంలోగల శ్రీరేణుకామాత ఎల్లమ్మ దేవి ఆలయం వద్ద ఆదివారం జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత, ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిలు మొక్కులు తీర్చుకునేందుకు ఆదివారం ఆలయానికి విచ్చేస్తున్నారు. కాగా ఇందులో భాగంగా తెరాస నాయకులు, కార్యకర్తలు గత వారంరోజుల నుండి ఏర్పాట్లలో నిమగ్నమైఉన్నారు. శనివారం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆలయం వద్ద ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ …

Read More »

మురికి కూపంలో పాఠశాల పరిసరాలు

  నందిపేట, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం ప్రభుత్వ పాఠశాల పరిసరాలు మురికి కూపంలో ఉండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక ముస్తాయిద్‌పూరాలో ఉన్న ప్రభుత్వ స్కూల్‌ కాంప్లెక్సులో ప్రాథమిక, ఉన్నత పాఠశాల ఉన్నాయి. సుమారు 300 మంది విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. స్కూలు ముందు భాగంలో ప్రహరీ గోడ ఉన్నప్పటికి వెనకవైపు లేకపోవడంతో అక్కడినుంచి పందులు పదుల సంఖ్యలో స్వైర విహారం చేస్తున్నాయి. అంతేకాకుండా పాఠశాలకు దగ్గర్లో పశు …

Read More »

సైనికులకు సన్మానం

  నందిపేట, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని ఐలాపూర్‌ గ్రామంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ మీసాల సుదర్శన్‌ జెండా ఎగురవేసి వందనం చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఐలాపూర్‌ గ్రామానికి చెందినవారు దేశ రక్షణ కోసం సైన్యంలో ఉన్నవారిని శాలువాలతో సత్కరించారు. గ్రామం నుంచి ఎక్కువ మంది సైనికులు ఆర్మీలో ఉండడం విశేషమన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రక్షణలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సొసైటీ …

Read More »

25న జిల్లా ఎంపి కవిత రాక

  నందిపేట, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత బుధవారం జిల్లా పర్యటనలో భాగంగా నందిపేట మండలంలో పర్యటించి పలు అభివృద్ది పనులను ప్రారంభించనున్నారని తెరాస మండల పార్టీ అధ్యక్షుడు నక్కల భూమేశ్‌ తెలిపారు. ఎంపితో పాటు ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి కూడా పర్యటిస్తారన్నారు. మండలంలోని వెల్మల్‌ గ్రామంలో వివేకానంద విగ్రహ ఆవిష్కరణ, మండల కేంద్రంలో స్త్రీశక్తి భవనం ప్రారంభోత్సవం, సిహెచ్‌ కొండూరు, ఉమ్మెడ, మాయాపూర్‌లలో నెలకొల్పిన పిఏసిఎస్‌ గోదాములను ప్రారంభిస్తారన్నారు. అనంతరం …

Read More »

వైభవంగా వివేకానంద విగ్రహావిష్కరణ

  నందిపేట, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని పాత పెట్రోల్‌ పంప్‌ చౌరస్తా వద్దఏర్పాటుచేసిన వివేకానంద స్వామి విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు. ముందుగా యువకులు శోభాయాత్రగా గ్రామ ప్రధానవీధుల గుండా వెళ్లి విగ్రహం వద్దకు చేరుకొని కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్‌చేతుల మీదుగా జ్యోతిప్రజ్వలన చేసిన అనంతరం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆరెస్సెస్‌ విభాగ్‌ ప్రచారక్‌ రాజారెడ్డి మాట్లాడుతూ వివేకానందుని యువకులు ఆదర్శంగా తీసుకొని, ఆయన ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేయాలని కోరారు. …

Read More »

12న వివేకానంద విగ్రహ ఆవిష్కరణ

  నందిపేట, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని పాత పెట్రోల్‌ పంప్‌ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించనున్నారు. నందిపేట యువకులు పార్టీలకు అతీతంగా వివేకానంద సేవాసమితి ఏర్పాటుచేసి తద్వారా విరాళాలు సేకరించి వివేకానంద విగ్రహం ఏర్పాటుచేశారు. 12 జనవరి వివేకానంద జయంతి రోజు కావడంతో విగ్రహావిష్కరణ చేయడానికి ఏర్పాట్లు చేశారు. 2015 సెప్టెంబరు 17న కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్‌ చేత భూమిపూజ చేశారు. సుమారు మూడు లక్షల …

Read More »

కాంగ్రెస్‌ గ్రామ కమిటీల ఏర్పాటు

  నందిపేట, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మూడు గ్రామాల్లో శుక్రవారం మండల కాంగ్రెస్‌పార్టీ ఆద్వర్యంలో గ్రామ కమిటీలను నియమించారు. ఈసందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులను పార్టీ కండువాలతో మండల పార్టీ అధ్యక్షుడు బండి నర్సాగౌడ్‌, ఆర్మూర్‌ బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పెంట ఇంద్రుడు సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీకి రోజురోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని పేర్కొన్నారు. చిమ్రాజ్‌పల్లి గ్రామాధ్యక్షునిగా తోట రవి, ఖుదావన్‌పూర్‌ గ్రామ అధ్యక్షునిగా గంగాధర్‌, వన్నెల్‌.కె. గ్రామాధ్యక్షునిగా మహ్మద్‌గౌస్‌ను …

Read More »

సిర్పుర్‌ లో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

  నందిపేట, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో గత వారంరోజులుగా జరుగుతున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో గురువారం సిర్పుర్‌, జిజి నడ్కుడ గ్రామాల్లో పశు సంవర్ధకశాఖ ఆద్వర్యంలో నిర్వహించారు. సుమారు 1100 పశువులకు టీకాలు వేసినట్టు డాక్టర్‌ లక్కం ప్రభాకర్‌ తెలిపారు. Email this page

Read More »

నగదు రహిత లావాదేవీల పర్యవేక్షణ

  నందిపేట, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సిహెచ్‌ కొండూరు గ్రామంలో మంగళవారం ఇవో పిఆర్‌డి రవిశ్వర్‌ గౌడ్‌ కొండూరు, ఉమ్మెడ గ్రామాల్లో జరుగుతున్న నగదు రహిత లావాదేవీల అవగాహన కార్యక్రమాన్ని పరిశీలించారు. మండలంలోని ఉమ్మెడ, సిహెచ్‌ కొండూరు, జిజి నడ్కుడ గ్రామాలను నగదు రహిత లావాదేవీల గ్రామాలుగా గుర్తించామని ఆయన తెలిపారు. గ్రామాల్లో కిరాణ, రేషన్‌ దుకాణాలతోపాటు అన్ని వ్యాపార లావాదేవీలు నగదు రహితంగా జరిగేటట్టు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇదివరకే ఎంపిక చేసిన మారంపల్లి గ్రామంలో నగదు …

Read More »

కొత్త సంవత్సరంలో పాత కష్టాలు…

  నందిపేట, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రంలోని మోడి ప్రభుత్వం 500, 1000 నోట్లు రద్దుచేసి ప్రజలనుంచి 50 రోజుల సమయం తీసుకొని 50 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పినప్పటికి ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకుల ముందు అవే క్యూలైన్లు కనిపిస్తున్నాయి. పాత సంవత్సరం 31 డిసెంబరు కల్లా సమస్యలు తీరి కొత్త సంవత్సరం ఆనందంగా జరుపుకోవాలని ఆశించిన ప్రజలకు 31 డిసెంబరు రోజున మోడి చేసిన ప్రసంగం నిరాశే మిగిల్చింది. తాము 50 రోజుల నుంచి పడుతున్న …

Read More »