Breaking News

National

చుక్కలు చూపిస్తున్న ఓలా డ్రైవర్‌

ఓలాకు ఫోన్‌ చేసి.. మొబైల్‌ ఆఫ్‌ చేసి… రోజుకో సిమ్‌ మారుస్తూ ఒక్కోచోట నుంచి ఫోన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులకే సవాల్‌ 9 రోజులవుతున్నా దొరకని శ్రీకాంత్‌ జాడ న్యూఢిల్లీ, గద్వాల: పోలీసింగ్‌లో నంబర్‌వన్‌ అంటే ఢిల్లీ పోలీసులని చెబుతారు. అంతటి పోలీసులకే ఓ ఓలా డ్రైవర్‌ చుక్కలు చూపిస్తున్నాడు. ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. తూర్పు ఢిల్లీ జిల్లాలోని 90 శాతం మంది పోలీసులు కేవలం గద్వాలకు చెందిన డాక్టర్‌ శ్రీకాంత్‌ను కిడ్నాప్‌ చేసిన ఓలా డ్రైవర్‌ను పట్టుకునే పనిలోనే ఉన్నారంటే …

Read More »

ఇక వివాహ రిజిస్ట్రేషన్లపై కేంద్రం సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ : ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్, పాన్ కార్డు, బ్యాంకు ఖాతా, మొబైల్ ఫోన్ నంబర్లకు ఆధార్ నంబరును లింక్ చేసిన కేంద్రం తాజాగా వివాహాల రిజిస్ట్రేషన్ కు కూడా ఆధార్ ను అనుసంధానం చేయాలని నిర్ణయించింది. మోసపూరిత వివాహాలను నిరోధించేందుకే తాము వివాహ రిజిస్ట్రేషనుకు ఆధార్ నంబరును అనుసంధానం చేయాలని లా కమిషన్ నిర్ణయించింది. జనన, మరణాలతోపాటు వివాహాలకు తప్పనిసరిగా ఆధార్ నంబరును అనుసంధానించేలా కొత్త చట్టంతో ఓ బిల్లును కేంద్రం తీసుకురావాలని నిర్దేశించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిఎస్ చౌహాన్ నేతృత్వంలోని …

Read More »

జీఎస్టీ ఎఫెక్ట్: ఐఫోన్ ధరలను భారీగా తగ్గించిన ఆపిల్!

న్యూఢిల్లీ: దేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి రావడంతో ఆపిల్ తన ఉత్పత్తుల ధరలను 7.5 శాతం తగ్గించింది. భారత్‌లో ఐఫోన్, ఐప్యాడ్, వాచ్‌లపై రిటైల్ ధరలను గణనీయంగా తగ్గిస్తున్నట్టు పేర్కొంది. అంతేకాదు కొన్ని మినహాయింపులతో మ్యాక్‌లైన్ కంప్యూటర్ల ధరలను కూడా తగ్గిస్తున్నట్టు తెలిపింది. ఐఫోన్ ఎస్ఈ 32 జీబీ అసలు ధర రూ.27,200 కాగా ప్రస్తుతం రూ.26 వేలకే అందిస్తోంది. అలాగే ఇదే ఫోన్ 128 జీబీ అసలు ధర రూ.37,200 కాగా తగ్గింపు తర్వాత రూ.35వేలుగా సంస్థ పేర్కొంది. ఐ ఫోన్ …

Read More »

12 సింహాల మధ్య ప్రసవం!

అహ్మదాబాద్‌, జూలై 1: చుట్టూ అటవీ ప్రాంతం.. చిమ్మచీకటిలో నడుస్తున్న 108 అంబులెన్సు.. అందులో పురిటి నొప్పులు పడుతున్న మహిళ.. అంతలోనే అంబులెన్సును ఒకటి, రెండు కాదు ఏకంగా 12 సింహాలు చుట్టుముట్టాయి. కొన్ని దారికి అడ్డంగా పడుకుంటే, మరికొన్ని దాని చుట్టూ తిరుగాడుతున్నాయి! చేసేది లేక డైవర్‌ అంబులెన్సును నిలిపేశాడు. మృగరాజుల గర్జనల మధ్యే ఆ మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన గుజరాత్‌లోని గిర్‌ అభయారణ్యం సమీపంలో జరిగింది. అమ్రేలీ జిల్లాలోని లున్సాపుర్‌కు చెందిన మక్వానా(32) అనే మహిళకు గురువారం …

Read More »

రైలులో బాత్‌రూంకు వెళ్లిన మహిళను అర్దనగ్నంగా వీడియో తీసి…

ముంబై : రైలులో బాత్‌రూంకు వెళ్లిన మహిళా ప్రయాణికురాలిని వెంటిలేటరు నుంచి తన మొబైల్ ఫోన్‌తో అర్దనగ్నంగా చిత్రీకరించిన రైల్వే ఉద్యోగిని ప్రయాణికులు పట్టుకొని పోలీసులకు అప్పగించిన ఘటన గోరఖ్‌పూర్ -లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్ లో జరిగింది. థానే నగరానికి చెందిన 50 ఏళ్ల ఓ మహిళ ఎ-1 ఏసీ కోచ్ లో ప్రయాణిస్తూ బాత్‌రూంకు వెళ్లింది.అంతే  కళ్యాణ్ నగరానికి చెందిన షేక్ సలీం అనే యువకుడు రైల్వేలో ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. విధినిర్వహణలో భాగంగా గోరఖ్‌పూర్ -లోకమాన్య తిలక్ టెర్మినస్ …

Read More »

బెడ్రూమ్‌లో నగ్నంగా వ్యక్తి.. యువతి షాక్!

గ్రేటర్ నోయిడా: ఫ్లాట్‌లో ఒంటరిగా ఉన్న యువతిపై అపార్ట్ మెంట్ సెక్యూరిటీ గార్డు అత్యాచారయత్నం చేశాడు. యువతి వేగంగా స్పందించి అలారమ్ ఆన్ చేయడంతో నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. ఆ వివరాలిలి.. గ్రేటర్ నోయిడాలోని ఏవీజే హైట్స్ వద్ద 11 భవనాలు ఉన్నాయి. 1800 ఫ్లాట్స్ ఉండగా, వాటిలో ఓవరాల్‌గా 1100 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. 25 ఏళ్ల యువతి ప్రైవేట్ కాలేజీలో జాబ్ చేస్తూ ఇక్కడి ఫ్లాట్‌లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో శుక్రవారం …

Read More »

బస్టాప్‌లో యువతికి ముద్దులిచ్చిన ఆగంతకుడు

బెంగళూరు : బస్టాప్‌లో క్యాబ్ కోసం ఎదురు చూస్తున్న ఓ యువతికి ముద్దులిచ్చి పారిపోయిన ఆగంతకుడి బాగోతం బెంగళూరు నగరంలో వెలుగుచూసింది. 24 ఏళ్ల యువతి తన బాయ్‌ఫ్రండ్‌తో కలిసి ఓ స్నేహితుడి ఇంటికి రాత్రి పార్టీకి వెళ్లింది. విందు అర్దరాత్రి దాటడంతో పాటు మద్యం తాగి ఉండటంతో బైక్‌పై వద్దని క్యాబ్ బుక్ చేసి దానికోసం జేబీనగర్ బస్టాప్ వద్ద వేచి యువతి తన బాయ్‌ఫ్రండ్‌తో వేచి ఉంది. అంతలో నల్లరంగు టీషర్టు ధరించిన ఓ ఆగంతకుడు ఒక్కసారిగా వచ్చి యువతిపై ముద్దుల …

Read More »

సినీ నటి అంజలి శ్రీవాస్తవ ఆత్మహత్య.. ఇంటిలో చీరతో ఉరి!

ముంబై: భోజ్‌పురి హీరోయిన్ అంజలి శ్రీవాస్తవ (29) తన ఇంటిలో శవమై కనిపించింది. సోమవారం మధ్యాహ్నం ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ముంబైలోని పశ్చిమ అంధేరీలోని జుహులేన్‌లో ఉంటున్న ఆమె చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఆమెకు పలుమార్లు ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆమె ఉంటున్న ఇంటి యజమాని డూప్లికేట్ తాళంతో ఇంటి తలుపులు తెరిచి చూడగా ఆమె సీలింగ్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించి అంజలిని …

Read More »

‘చెన్నై సిల్క్స్‌’ భవనం ఆహుతి

పేక మేడలా కూలిన ఐదంతస్తులు.. 400 కేజీల బంగారం భస్మం.. 300 కోట్ల నష్టం పూర్తిగా కూల్చివేయనున్న ప్రభుత్వం చెన్నై: చెన్నైలోని టి.నగర్‌లో ఉన్న ‘చెన్నై సిల్క్స్‌’ భవనంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో రూ.300 కోట్ల మేరకు ఆస్తినష్టం సంభవించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. బుధవారం వేకువజాము నుండి రాత్రి దాకా ఆ ఏడంతస్తుల భవనంలో అగ్నిజ్వాలలకు 400 కేజీల బంగారు ఆభరణాలు, 2 వేల కిలోల వెండి నగలు బుగ్గిపాలయ్యాయి. ఈ ప్రమాదంలో రూ.20 కోట్ల విలువైన వజ్రాభరణాలు సైతం మాడిమసయ్యాయని …

Read More »

ఎఫ్‌డిఐలకు ఆకర్షణీయ గమ్యం భారత్

న్యూఢిల్లీ: ప్రపంచంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యంగా భారత వరుసగా రెండో ఏడాది కూడా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2016 సంవత్సరంలో 6230 కోట్ల డాలర్ల (రూ.4.05 లక్షల కోట్లు) ఎఫ్‌డిఐలు ఆకర్షించిన భారత ప్రథమస్థానంలో నిలవగా చైనా, అమెరికా దిగువ స్థానాలతోనే సరిపెట్టుకోవలసివచ్చింది. ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రికకు చెందిన ఎఫ్‌డిఐ ఇంటెలిజెన్స్‌ విభాగం రూపొందించిన నివేదిక ఈ విషయం వెల్లడిచింది. 2016 సంవత్సరంలో ఎఫ్‌ఢిఐల విభాగంలో భారీ మార్పు చోటు చేసుకున్నదని, బలమైన ఆర్థిక వృద్ధిని కనబరుస్తున్న దేశాల వైపు ఎఫ్‌ఢిఐలు తరలి …

Read More »