Breaking News

Nizamabad Rural

వృద్ధాశ్రమంలో దుస్తుల పంపిణీ

  కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని తెరాస పార్టీ నాయకులు కామారెడ్డి శివారులోని వృద్దాశ్రమంలో వృద్దులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. పంచముఖి హనుమాన్‌ ఆలయ కమిటీ ఛైర్మన్‌ గైని శ్రీనివాస్‌ గౌడ్‌, పార్టీ సీనియర్‌ నాయకులు జూకంటి ప్రభాకర్‌రెడ్డి ఆద్వర్యంలో వీటిని పంపిణీ చేశారు. పట్టణ తెరాస నాయకుడు సంగమేశ్వర్‌, మైనార్టీ నాయకులు షౌకత్‌ అలీ ఖాన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు అల్పాహారం పంపిణీ చేశారు. …

Read More »

కార్పొరేటర్‌పై చర్యలు తీసుకోవాలి

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్పొరేటర్‌ షకీల్‌పై చర్యలు తీసుకొని తమ భూమి కబ్జానుంచి రక్షించాలని నిజామాబాద్‌ నగరానికి చెందిన ఏ.ఆనంద్‌కుమార్‌, అతని సోదరులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితుడు ఆనంద్‌ మట్లాడుతూ తమకు మాలపల్లి ప్రాంతంలో వారసత్వంగా లభించిన భూమి (సర్వే నెంబరు 2481, 2482, 2484)ని స్థానిక కార్పొరేటర్‌ కబ్జాచేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, ఇది గమనించి హైకోర్టును ఆశ్రయించామని, హైకోర్టు కూడా తమకు అనుకూలంగా స్టే ఆర్డర్‌ ఇచ్చిందని, …

Read More »

చట్టాలపై అవగాహన అవసరం

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో ప్రతి ఒక్కరికి చట్టాలపై కనీస అవగాహన ఉండాలని జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి సూర్యచంద్రకళ అన్నారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమాచార హక్కు చట్టం -2005 అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ఆమె మాట్లాడారు. సమాచార హక్కు చట్టం వల్ల సామాన్యునికి న్యాయం జరుగుతుందని, ప్రతి ఒక్కరు దీనిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, చట్టం కార్యకర్తలను ప్రోత్సహించాలని ఆమె అన్నారు. సమాచారహక్కు చట్టం వికాస …

Read More »

మహాగణపతి ఆలయంలో సంకట హర చతుర్థి

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని బొడ్డెమ్మ చెరువు వద్ద గల మహా గణపతి ఆలయంలో శనివారం సంకట హర చతుర్థిని పురస్కరించుకొని స్వామివారికి పంచామృతాభిషేకం, సింధూర సమర్పణ, గరికపూజ, గణపతి హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ ఛైర్మన్‌ భూషణ్‌చారి, పూజారులు రాజీవ్‌శర్మ, రాజు, సత్యం, శ్రీనివాస్‌, మురళి, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు. Email this page

Read More »

వేములపల్లి కిరణ్‌ 27వ వర్ధంతి

  ఆర్మూర్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పివైఎల్‌ జిల్లా తొలి కన్వీనర్‌ వేముల కిరణ్‌కుమార్‌ 27వ వర్ధంతి సందర్భంగా పివైఎల్‌ ఆధ్వర్యంలో కుమార్‌ నారాయణ భవన్‌లో బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పివైఎల జిల్లా అధ్యక్షుడు కిషన్‌ మాట్లాడుతూ కామ్రేడ్‌ కిరణ్‌కుమార్‌ జిల్లాలో పల్లెపల్లెలో యువజన సంఘాన్ని విస్తరింపజేయడానికి కృషిచేశారని, యువత పెడదోవ పట్టకుండా వారిని సమీకరించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించేలా యువతను చైతన్యం చేశారని గుర్తుచేశారు. కిరణ్‌ మరణం …

Read More »

వైభవంగా మార్కండేయ జయంతి

  కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి పట్టణంలో శనివారం మార్కండేయ జయంతి వేడుకలను పద్మశాలీలు వైభవంగా నిర్వహించారు. మార్కండేయ జయంతిని పురస్కరించుకొని పద్మశాలీలు వేలాదిగా తరలివచ్చి కళశాలతో శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు కళశాలను నెత్తినబెట్టుకొని బ్యాండు మేళాలతో యాత్రలో పాల్గొన్నారు. పట్టణ పద్మశాలి భవనం ముందు ప్రారంభమైన శోభాయాత్ర పాతబస్టాండ్‌, రైల్వే వంతెన మీదుగా నిజాంసాగర్‌ చౌరస్తా, కొత్త బస్టాండ్‌ మీదుగా స్నేహపురి కాలనీలోని మార్కండేయ మందిరం వరకు సాగింది. అనంతరం మహిళలు కళశాలతో తెచ్చిన నీటిని …

Read More »

అఖిలపక్ష బంద్‌ విజయవంతం

  కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిగ్రీ కళాశాల భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించుకొని దున్నడాన్ని నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో శనివారం కామారెడ్డిలో నిర్వహించిన బంద్‌ విజయవంతమైంది. బంద్‌లో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌తోపాటు అన్ని పార్టీల నాయకులు, విప్లవ సంఘాల నేతలు, కార్మిక నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. వాణిజ్య, వ్యాపార సంస్థల ప్రతినిధులు, ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు స్వచ్చందంగానే బంద్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూమిని …

Read More »

వార్డ్‌ ఎన్నికలలో నామినేషన్‌

  బీర్కూర్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో 8వ వార్డు ఎన్నికల్లో భాగంగా శనివారం నసురుల్లాబాద్‌ గ్రామనికి చెందిన పాషా బేగం నామినేషన్‌ వేసినట్లు ఎంపిడివో భరత్‌కుమార్‌ తెలిపారు. దివంగత వార్డు మెంబర్‌ బాబూమియ భార్య పాషాబేగం నామినేషన్‌ వేశారని, తనకు తెరాస పార్టీ మద్దతు ఉందని గ్రామ తెరాస పార్టీ అధ్యక్షుడు లక్ష్మినారాయణ గౌడ్‌ అన్నారు. ఎంపిటిసి కంది మల్లేశం, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు. Email this page

Read More »

గణిత శిక్షణకు టిటిసి విద్యార్థులు

  కామారెడ్డి, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూరు హైమద్‌ టిటిసి కళాశాల విద్యార్తులు కామారెడ్డి ఆర్‌కె కళాశాలలో ఏర్పాటు చేసిన మ్యాథమేటిక్స్‌ శిక్షణకు వెళ్లారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జాతీయ సామర్థ్య పరీక్ష శిక్షణను ఇస్తున్నారు. విద్యార్థుల సామర్థ్యాలు అంచనా వేయడం కోసం టిటిసి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ బాలు ఆధ్వర్యంలో విద్యార్థులు శిక్షణలో పాల్గొన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీనివాస్‌, సత్యనారాయణ, స్వప్న, సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు. Email this page

Read More »

ప్రజలకు చట్టాలపై అవగాహన ఉండాలి

  కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలకు చట్టాలపై అవగాహన ఉండాలని, అప్పుడే వాటిని వినియోగించుకోగలుగుతారని మండల న్యాయసేవా అధికార సంస్థ ఛైర్మన్‌, జిల్లా జడ్జి ఉదయ్‌ కుమార్‌ అన్నారు. స్థానిక ఎస్‌పిఆర్‌ పాఠశాలలో శనివారం నిర్వహించిన న్యాయచైతన్య సదస్సుకు ఆయనతో పాటు సీనియర్‌ సివిల్‌ జడ్జి జైరాజ్‌లు హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరికి చట్టాలు, హక్కులపై అవగాహన ఉండాలని అన్నారు. ఉచిత న్యాయ సహాయం, వివిధ చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు …

Read More »