Breaking News

Nizamabad Rural

వేములపల్లి కిరణ్‌ 27వ వర్ధంతి

  ఆర్మూర్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పివైఎల్‌ జిల్లా తొలి కన్వీనర్‌ వేముల కిరణ్‌కుమార్‌ 27వ వర్ధంతి సందర్భంగా పివైఎల్‌ ఆధ్వర్యంలో కుమార్‌ నారాయణ భవన్‌లో బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పివైఎల జిల్లా అధ్యక్షుడు కిషన్‌ మాట్లాడుతూ కామ్రేడ్‌ కిరణ్‌కుమార్‌ జిల్లాలో పల్లెపల్లెలో యువజన సంఘాన్ని విస్తరింపజేయడానికి కృషిచేశారని, యువత పెడదోవ పట్టకుండా వారిని సమీకరించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించేలా యువతను చైతన్యం చేశారని గుర్తుచేశారు. కిరణ్‌ మరణం ...

Read More »

వైభవంగా మార్కండేయ జయంతి

  కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి పట్టణంలో శనివారం మార్కండేయ జయంతి వేడుకలను పద్మశాలీలు వైభవంగా నిర్వహించారు. మార్కండేయ జయంతిని పురస్కరించుకొని పద్మశాలీలు వేలాదిగా తరలివచ్చి కళశాలతో శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు కళశాలను నెత్తినబెట్టుకొని బ్యాండు మేళాలతో యాత్రలో పాల్గొన్నారు. పట్టణ పద్మశాలి భవనం ముందు ప్రారంభమైన శోభాయాత్ర పాతబస్టాండ్‌, రైల్వే వంతెన మీదుగా నిజాంసాగర్‌ చౌరస్తా, కొత్త బస్టాండ్‌ మీదుగా స్నేహపురి కాలనీలోని మార్కండేయ మందిరం వరకు సాగింది. అనంతరం మహిళలు కళశాలతో తెచ్చిన నీటిని ...

Read More »

అఖిలపక్ష బంద్‌ విజయవంతం

  కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిగ్రీ కళాశాల భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించుకొని దున్నడాన్ని నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో శనివారం కామారెడ్డిలో నిర్వహించిన బంద్‌ విజయవంతమైంది. బంద్‌లో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌తోపాటు అన్ని పార్టీల నాయకులు, విప్లవ సంఘాల నేతలు, కార్మిక నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. వాణిజ్య, వ్యాపార సంస్థల ప్రతినిధులు, ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు స్వచ్చందంగానే బంద్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూమిని ...

Read More »

వార్డ్‌ ఎన్నికలలో నామినేషన్‌

  బీర్కూర్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో 8వ వార్డు ఎన్నికల్లో భాగంగా శనివారం నసురుల్లాబాద్‌ గ్రామనికి చెందిన పాషా బేగం నామినేషన్‌ వేసినట్లు ఎంపిడివో భరత్‌కుమార్‌ తెలిపారు. దివంగత వార్డు మెంబర్‌ బాబూమియ భార్య పాషాబేగం నామినేషన్‌ వేశారని, తనకు తెరాస పార్టీ మద్దతు ఉందని గ్రామ తెరాస పార్టీ అధ్యక్షుడు లక్ష్మినారాయణ గౌడ్‌ అన్నారు. ఎంపిటిసి కంది మల్లేశం, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

గణిత శిక్షణకు టిటిసి విద్యార్థులు

  కామారెడ్డి, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూరు హైమద్‌ టిటిసి కళాశాల విద్యార్తులు కామారెడ్డి ఆర్‌కె కళాశాలలో ఏర్పాటు చేసిన మ్యాథమేటిక్స్‌ శిక్షణకు వెళ్లారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జాతీయ సామర్థ్య పరీక్ష శిక్షణను ఇస్తున్నారు. విద్యార్థుల సామర్థ్యాలు అంచనా వేయడం కోసం టిటిసి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ బాలు ఆధ్వర్యంలో విద్యార్థులు శిక్షణలో పాల్గొన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీనివాస్‌, సత్యనారాయణ, స్వప్న, సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రజలకు చట్టాలపై అవగాహన ఉండాలి

  కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలకు చట్టాలపై అవగాహన ఉండాలని, అప్పుడే వాటిని వినియోగించుకోగలుగుతారని మండల న్యాయసేవా అధికార సంస్థ ఛైర్మన్‌, జిల్లా జడ్జి ఉదయ్‌ కుమార్‌ అన్నారు. స్థానిక ఎస్‌పిఆర్‌ పాఠశాలలో శనివారం నిర్వహించిన న్యాయచైతన్య సదస్సుకు ఆయనతో పాటు సీనియర్‌ సివిల్‌ జడ్జి జైరాజ్‌లు హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరికి చట్టాలు, హక్కులపై అవగాహన ఉండాలని అన్నారు. ఉచిత న్యాయ సహాయం, వివిధ చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు ...

Read More »

స్వావ‌లంభ‌న‌తోనే మ‌హిళల‌ వికాసం

బ్రిటిష్ కౌన్సిల్ మ‌హిళాదినోత్స‌వంలో ఎంపి క‌విత‌ ఆర్థిక స్వావ‌లంభ‌న‌తోనే మహి|ళల‌ వికాసం సాధ్య‌మ‌వుతుంద‌న్నారు నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత‌. దేశంలో నెల‌కొన్న నిరుద్యోగ స‌మ‌స్య కూడా మ‌హిళ‌ల వ‌ల్ల రూపుమాపు వ‌చ్చ‌న్నారు. సోమ‌వారం హైద‌రాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోట‌ల్‌లో బ్రిటిష్ కౌన్సిల్‌-డ‌యాజియో సంయుక్తంగా అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని నిర్వ‌హించాయి. సెలెబ్రేటింగ్ ది యంగ్ విమెన్ సోష‌ల్ ఇంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రోగ్రాంకు క‌విత ముఖ్య అతిథిగా హాజ‌ర‌యి ప్ర‌సంగించారు. బ్రిటిష్ కౌన్సిల్ మంచి కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసింద‌న్నారు. నిరుద్యోగ స‌మ‌స్య తీరాలంటే ప్ర‌భుత్వాల వ‌ల్లనో..కార్పొరేట్ సంస్థ‌ల వ‌ల్ల‌నో ...

Read More »

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన TNREDCL చైర్మ‌న్

నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత‌తో క‌లిసి తెలంగాణ నూత‌న పున‌రుద్ధ‌ర‌ణీయ ఇంధ‌న అభివృద్ధి సంస్థ (TNREDCL) చైర్మ‌న్ స‌య్య‌ద్ అబ్దుల్ అలీం ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావును మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆలీం సిఎంకు పుష్ప‌గుచ్ఛం అంద‌జేసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. త‌న‌పై న‌మ్మ‌కంతో ఛైర్మ‌న్ ప‌ద‌విని ఇచ్చార‌ని, మీ న‌మ్మ‌కాన్ని నిల‌బెడ‌తాన‌ని అలీం సిఎంతో అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు కూడా పాల్గొన్నారు.

Read More »

విద్యార్థులు ఔషధ ప్రాముఖ్యత తెలుసుకోవాలి

  కామారెడ్డి, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు ఔషద ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలని తెలంగాణ యూనివర్సిటీ అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ విద్యావర్ధిని అన్నారు. కామారెడ్డి డిగ్రీ, పిజి కళాశాలలో సోమవారం విద్యార్థులకు లైఫ్‌ సైన్స్‌, ఔషదశాస్త్రంపై సెమినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్య జీవితంలో ఔషద మొక్కలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని అవి ప్రజలకెంతో ఉపయోగపడుతున్నాయన్నారు. ఈ క్రమంలోనే వాటిపై పరిశోధనలు ఎక్కువయ్యాయని తెలిపారు. ఆలోట్రోఫి ఆయుర్వేదిక్‌ వంటి శాస్త్రాలు ఔషద మొక్కలపై ...

Read More »

స్వయం శిక్షణ శిబిరం ప్రారంభం

  కామారెడ్డి, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సన్‌ స్కిల్స్‌, రాజా ఫౌండేషన్‌ సంయుక్త ఆద్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం స్వయం ఉపాధి శిక్షణ శిబిరం ప్రారంభించారు. దీనికి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరిసుష్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ప్రయివేటు సంస్థల ఆద్వర్యంలో స్వయం ఉపాధి కోసం యువతకు శిక్షణ అందించడం అభినందనీయమన్నారు. అనుభవజ్ఞులైన వారిచే నిరుద్యోగులకు శిక్షణ తరగతులు ఇప్పించడం ప్రశంసించారు. ల్యాబులు, పనిముట్లు పరిశీలించారు. శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం ...

Read More »

బ్యాంకుల ముందు బారులు తీరిన ప్రజలు

  పెర్కిట్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెర్కిట్‌లో ఆంధ్రాబ్యాంకు, స్టేట్‌ బ్యాంక్‌ ఆప్‌ ఇండియా బ్యాంకుల ముందు క్యూలో నిలబడి డబ్బు కొరకు పెర్కిట్‌, కోటార్మూర్‌ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బ్యాంకులకు శని, ఆది, సోమవారాలు బంద్‌ కావడంతో, ఎటిఎంలలో కూడా డబ్బు లేకపోవడంతో ఇబ్బంది తలెత్తింది. మంగళవారం తిరిగి బ్యాంకులు సేవలందించడంతో ప్రజలు బ్యాంకుల ముందు బారులు తీరారు. ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఆంధ్రాబ్యాంకు సిబ్బంది ప్రజల సౌకర్యం కోసం బ్యాంకుల ముందు టెంట్లు ...

Read More »

మోర్తాడ్‌లో దీక్షా దివస్‌…

  మోర్తాడ్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవంబర్‌ 29న తెలంగాణ రాష్ట్ర సాధనకై సిఎం కెసిఆర్‌ ఆమరణ దీక్ష చేపట్టిన రోజు కావడంతో తెరాస పార్టీ పిలుపు మేరకు మోర్తాడ్‌లో మండల తెరాస నాయకులు ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలల విద్యార్థులు దీక్షా దివస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకై ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఆమరణ దీక్ష చేపట్టి రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణకు కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మండల తెరాస ...

Read More »

అభివృద్దే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం కృషి

  మోర్తాడ్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌దేనని మిషన్‌ భగీరథ వైస్‌ఛైర్మన్‌, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో తహసీల్దార్‌, ఎంపిడివో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి పథకం చెక్కుల పంపిణీ, మోర్తాడ్‌ డిగ్రీకళాశాల భవన ప్రారంభోత్సవానికి, ఏర్గట్ల మండల కేంద్రంలోని పలు అభివృద్ది పనులకు ముఖ్యఅతిథిగా విచ్చేసి భూమిపూజచేసి ప్రారంభించారు. స్థానిక సర్పంచ్‌ దడివె నవీన్‌, ఎంపిపి కల్లడ చిన్నయ్య అధ్యక్షతన ...

Read More »

జిఎస్‌టి బిల్లుకు రాజ్యసభ ఆమోదం

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) సవరణ బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది.’ ఈ బిల్లుపై రాజ్యసభలో సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించగా యావత్ సభ మద్దతు తెలిపింది. జిఎస్‌టికి మద్దతు తెలిపిన సందర్భంలో సభలో 197 మంది సభ్యులు సభలో ఉన్నారు. జిఎస్‌టి చట్టం రూపు సంతరించుకొని అమలులోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఒకటే పన్ను అమలులోకి రానుంది. జిఎస్‌టి బిల్లును స్వాగతిస్తున్నాం : కెటిఆర్‌ జిఎస్‌టి బిల్లును తాము స్వాగతిస్తున్నామని తెలంగాణ మంత్రి కెటిఆర్‌ అన్నారు.

Read More »

తెలంగాణ జాగృతి పదవ వార్షికోత్సవ ప్రతినిధుల సభ

తెలంగాణ జాగృతి పదవ వార్షికోత్సవ ప్రతినిధుల సభ నల్లగొండలో జరుగనుంది. ఆగస్టు 5, 6 తేదీలలో జరగబోయే ఈ ప్రతినిధుల సభకు రాష్ట్రం నుండి దేశం నుండి 2 వేల మంది ప్రతినిధులు హాజరవనున్నారు. ఈ సమావేశాల్లో జాగృతి పదేళ్ల ప్రస్థానం యొక్క సింహావలోకనం తో పాటు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఆగస్టు 5 వ తేదీన నల్లగొండలో తెలంగాణ జాగృతి స్కిల్ డెవెలప్ మెంట్ సెంటర్ ను అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత ప్రారంభిస్తారు. అనంతరం రెండు రోజులపాటు జరిగే సమావేశాల్లో గత ...

Read More »

నల్లవాగు ప్రాజెక్టుకు జలకళ

  నిజాంసాగర్‌ రూరల్‌, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మెదక్‌-నిజామాబాద్‌ మధ్యలోగల నల్లవాగుకు భారీగా వరదనీరు వచ్చి చేరడంతో జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1493 అడుగులు కాగా, పూర్తి నీటి నిలువ 776.13 ఎంసిఎఫ్‌టిలు, ప్రస్తుత నీటి మట్టం 1490.8 అడుగులు ఉంది. ఎగువ భాగంలోని కంతి మండలంలో కురిసిన వర్షానికి ఒక అడుగుకు పైగా నీరు వచ్చి చేరింది. భారీగా నీరు రావడంతో నల్లవాగు మత్తడికి జలకళ ఏర్పడుతుంది. నేడో, ...

Read More »

బీర్కూర్‌ కెజిబివిని సందర్శించిన జిల్లా కలెక్టర్‌

  బీర్కూర్‌, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ కెజిబివిలో నెలకొన్న పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేయిస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. శుక్రవారం ఈ కెజిబివిలో వాంతులు, విరోచనాలతో పలు విద్యార్థులు అనారోగ్యానికి గురైనందున ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. చికిత్స పొందుతున్న విద్యార్థినిలను కలెక్టర్‌ పరామర్శించారు. వంట గదిని పరిశీలించి, పిల్లల అనారోగ్యానికి గల కారణాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వంటకు వినియోగించిన నీటిని, వంట సామగ్రిని, కోడిగుడ్ల నాణ్యతను పరిశీలింపచేస్తున్నట్టు ...

Read More »

బ్యాంకుల వద్ద రైతుల సందడి

  నిజాంసాగర్‌ రూరల్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుతం మండలంలో ఏబ్యాంకు వద్దకు వెళ్లిన రైతులతో సందడి నెలకొంది. రైతులు బ్యాంకులకు బాకీ ఉన్న వ్యవసాయ రుణాలను ఈనెల 31లోపు రినివల్‌ చేసుకుంటేనే జీరో వడ్డి వర్తిస్తుంది. దీనికితోడు ఈనెల 31లోపు రుణాలు రినివల్‌ చేసుకుంటేనే ఫసల్‌బీమా యోజన ఇన్సురెన్సు పథకం వర్తిస్తుందని ఆదేశాలు జారీచేయడంతో బ్యాంకుల వద్ద ఉదయం నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలి వెళుతున్నారు.

Read More »

మొక్కలు పరిశీలించిన సోషల్‌ ఆడిట్‌ బృందం

  నిజాంసాగర్‌ రూరల్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మాగి, గున్కుల్‌, నర్సింగ్‌రావుపల్లి, ఒడ్డేపల్లి గ్రామాల్లో హరితహారం పథకం కింద నాటిన మొక్కలను గిరిరాజ్‌ కళాశాల విద్యార్థులు మొక్కలు పరిశీలించారని ఇజిఎస్‌ ఎపివో సుదర్శన్‌ తెలిపారు. గ్రామ పంచాయతీకి ఇద్దరు చొప్పున 8 మంది సభ్యుల బృందాన్ని జిల్లా కలెక్టర్‌ నియమించారన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్మశాన వాటికలు, వ్యవసాయ భూములు తదితర ప్రాంతాల్లో నాటిన మొక్కలను క్షుణ్ణంగా పరిశీలిస్తారన్నారు.

Read More »

వేల్పూర్‌ ఎస్‌సి రెసిడెన్సియల్‌ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలి

  మోర్తాడ్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌లో బాల్కొండ నియోజకవర్గ స్థాయిలో ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్‌సి బాలుర రెసిడెన్షియల్‌ పాఠశాలలో 5వ తరగతి విద్యార్థులను చేర్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు మోర్తాడ్‌ ఎంపిడివో శ్రీనివాస్‌ తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామం నుంచి 5వ తరగతికి చెందిన ఎస్‌సి బాలురకు మాత్రమే ఒకరికి అవకాశం కల్పించబడిందని ఇట్టి అవకాశాన్ని ఆయా గ్రామాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, ఆయా మండలాల ఎంఇవోలను సంప్రదించాలని తెలిపారు.

Read More »