Breaking News

Nizamabad Rural

బాల్కొండ మండలంలో హరితహారం…

  బాల్కొండ, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకం శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ సందర్బాన్ని పురస్కరించుకొని బాల్కొండ మండలంలోని పోలీసు స్టేషన్‌లో ఉపసర్పంచ్‌ లావణ్య, విద్యాసాగర్‌, వేల్పూర్‌ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ బాల రాజేశ్వర్‌, సతీష్‌ మొక్కలు నాటి నీరుపోశారు. అదేవిధంగా మండల కేంద్రంలోని జూనియర్‌ కళాశాల వద్ద మిషన్‌ భగీరథ వైస్‌ఛైర్మన్‌, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇతర అధికారులతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. అలాగే ...

Read More »

బిపిఎంల పేరాశ…

  ఆసరా పింఛన్‌ దారులకు శాపం ఫీల్డ్‌ అసిస్టెంట్లు, బిపిఎంల కుమ్ముక్కు నష్టపోతున్న లబ్దిదారులు మోర్తాడ్‌, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వం నిరుపేద, వృద్దులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు, చేనేత, గీత కార్మికులకు, వికలాంగులను ఆదుకునేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆసరా పథకం బిపిఎం, ఫీల్డ్‌ అసిస్టెంట్ల నిర్లక్ష్యం కారణంగా నీరుగారిపోయి ప్రభుత్వం అభాసుపాలవుతోంది. మండలంలోని తొర్తి గ్రామంలో అవుసుల రాములు, అహ్మద్‌ హుస్సేన్‌, మరో ఇద్దరు వృద్దులకు ఆసరా పింఛన్‌ పథకం మంజూరైనప్పటికి అదే గ్రామానికి చెందిన ...

Read More »

జిల్లాలో హరితహారం పథకాన్ని విజయవంతం చేయాలి

  మోర్తాడ్‌, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఎక్కడా చేపట్టని విధంగా హరితహారం పథకాన్ని చేపట్టి విజయవంతం చేయాలని మోర్తాడ్‌ ఎంపిపి కల్లడ చిన్నయ్య, మండల ప్రత్యేకాధికారి శంకరయ్య, ఎంపిడివో శ్రీనివాస్‌, తహసీల్దార్‌ వెంకట్రావులు అన్నారు. శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం, తెలంగాణ హరితహారంపై అవగాహన కార్యక్రమం ఎంపిపి అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, జడ్పిటిసి, ఎంపిపిలు మండల కార్యదర్శులు, విఆర్వోలు, నోడల్‌ అధికారులు, పీల్డ్‌ అసిస్టెంట్‌లు, వివోలు ...

Read More »

రంజాన్‌ కిట్‌ పంపిణీ

  నందిపేట, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం డొంకేశ్వర్‌ గ్రామ ఉపసర్పంచ్‌ మహ్మద్‌ బషీర్‌తన సొంత ఖర్చుతో రంజాన్‌ మాసం సందర్భంగా పేద ముస్లింలకు బియ్యం, గోధుమ పిండి, నూనె తదితర వంటసామగ్రిని సెట్‌ను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధనిక ముస్లింలతో పాటు పేద ముస్లింలు కూడా పండగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్ధేశంతో పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ధనిక ముస్లింలు తమ సంపాదనలోంచి 2.5 శాతం రూపాయలను జఖాత్‌ రూపంలో తీసి పేదలకు ...

Read More »

251 కొత్త రెసిడెన్సియల్‌ పాఠశాలలకు రూ. 5 వేల కోట్లు

  – మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజాంసాగర్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2016-17 విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలో ప్రారంభించిన 251 రెసిడెన్షియల్‌ పాఠశాలలకు 5 వేల కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బుధవారం నిజాంసాగర్‌ మండలం అచ్చంపేటలో 3 కోట్ల రూపాయలతో నిర్మించిన సమీకృత బాలుర వసతి గృహ సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరం నుంచి 71 మైనార్టీ, 100 షెడ్యూలు కులాలకు, ...

Read More »

అటవీశాఖ అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళన

  – డిఎఫ్‌వో కార్యాలయం ఎదుట ధర్నా కామరెడ్డి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగంపేట మండల పరిధిలోని మోతె గ్రామంలో అటవీశాఖాధికారులు రైతులపై చేస్తున్న దౌర్జన్యాన్ని నిరసిస్తూ బుధవారం కామారెడ్డిలో కమ్యూనిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. డిఎప్‌వో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అక్కడి నుంచి ఆర్డీవో కార్యాలయం చేరుకొని కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. డిఎఫ్‌వో, ఆర్డీవోలకు వినతి పత్రం సమర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మోతె ...

Read More »

సీమాంధ్ర జడ్జిల దిష్టిబొమ్మ దగ్దం

  కామారెడ్డి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి బార్‌ అసోసియేషన్‌ ఆద్వర్యంలో బుధవారం కామారెడ్డిలో ఆంద్రా జడ్జిల దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించారు. సీమాంధ్ర న్యాయమూర్తుల కేటాయింపు ప్రాథమిక జాబితాను వ్యతిరేకిస్తూ చేపడుతున్న న్యాయవాదుల ఆందోళనలో భాగంగా సీమాంధ్ర జడ్జిల దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించారు. అనంతరం నిజాంసాగర్‌ చౌరస్తాకు చేరుకొని దగ్దం చేశారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు క్యాతం సిద్దిరాములు మాట్లాడుతూ ఆంధ్రా న్యాయమూర్తులు తమ ఆప్షన్లను విరమించుకునేవరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. తెలంగాణ హైకోర్టు ఏర్పాటు చేయాలని ...

Read More »

చికిత్స పొందుతూ మహిళ మృతి

  నందిపేట, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం తల్వేద గ్రామానికి చెందిన యాతాలర భూలక్ష్మి అనే మహిళ ఈనెల 11న ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. చుట్టుపక్కల వారు గమనించి మంటలు ఆర్పి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా నిజామాబాద్‌ ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ బుధవారం మృతి చెందినట్టు తెలిపారు. బూలక్ష్మి కూతురు లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్టు ప్రొబిషినరీ ఎస్‌ఐ వినయ్‌కుమార్‌ తెలిపారు.

Read More »

కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలి

  బోదన్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన హరితహారం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు బాధ్యత వహించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా పిలుపునిచ్చారు. బుధవారం బోధన్‌ పట్టణంలో హరితహారం, జాతీయ ఉపాది హామీ పథకంపై డివిజన్‌ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ గత ఏడాది హరితహారం కార్యక్రమం వర్షాభావ పరిస్థితుల వల్ల పూర్తిస్థాయి లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని, ...

Read More »

ఇద్దరు మట్కారాయుళ్ళ అరెస్టు

  ఆర్మూర్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని పంత్‌ రోడ్డులోని విఎన్‌ టేలర్స్‌లో మట్కా ఆడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టుచేసి వారి వద్దనుంచి 4180 రూపాయలు, మట్కా చిట్టీలను స్వాధీనం చేసుకున్నట్టు ఆర్మూర్‌ ఎస్‌హెచ్‌వో సీతారాం తెలిపారు. వీరిని కోర్టులో హాజరు పరచగా నేరస్తులకు బుధవారం ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి దత్తయ్య ఐదురోజుల జైలుశిక్ష విధించినట్టు సిఐ వివరించారు.

Read More »

దామాషా ప్రకారం రెడ్డిలకు రిజర్వేషన్లు కల్పించాలి

  రాష్ట్ర రెడ్డి సంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ సంతోష్‌రెడ్డి కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనాభా ఆధారంగా రెడ్డిలకు 17 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర రెడ్డి సంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ సంతోష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కామారెడ్డి పట్టణానికి బుధవారం హైదరాబాద్‌నుంచి రెడ్డి చైతన్యయాత్ర వచ్చింది. ఈ సందర్భంగా పట్టణంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెడ్డి సామాజిక వర్గంలో అణగారిన పేదలకు ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. రెడ్డికులాలవారికి 2 వేల కోట్లు బడ్జెట్‌లో ...

Read More »

వైభవంగా వెంకటేశ్వరస్వామి కళ్యాణం

  కామారెడ్డి, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని శ్రీపంచముఖి హనుమాన్‌ ఆలయంలో బుధవారం శ్రీవెంకటేశ్వరస్వామివారి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రభాత సేవ, అభిషేకం, తిరు ఆరాధన, తిరుమంజన సేవ, అలంకార సేవ, తులసీ అర్చన, కుంకుమార్చన, హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. స్వామివారి కళ్యాణోత్సవంలో భక్తులు అదిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిదులు రాజు, కుంభాల రవి, సతీష్‌, లక్ష్మణ్‌, రాజ్‌కుమార్‌, శ్రీనివాస్‌, శ్రీధర్‌, లక్ష్మిపతి ఇవో ...

Read More »

గోదావరి జలాల పనులు ప్రారంభం

  కామారెడ్డి, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 19వ వార్డులో గోదావరి జలాల ఇంటర్నల్‌ కనెక్షన్‌ పనులను గురువారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. మునిసిపల్‌ సాధారణ నిదులు లక్ష రూపాయలతో పనులు చేపట్టినట్టు తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో గోదావరి జలాల పైప్‌లైన్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇంటింటికి గోదావరి జలాలను అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ శశిరేఖ, కౌన్సిలర్‌ జొన్నల నర్సింలు, నాయకులు కృపాల్‌, దయానంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఈనెల 23లోపు మైనార్టీ గురుకులాల్లో చేర్పించండి

  – జిల్లా కలెక్టర్‌ నిజామాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిన ఆరుమైనార్టీ గురకుల పాఠశాలల్లో ఈవిద్యాసంవత్సరంలో 1440 సీట్లు ఉన్నాయని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రానా ఒక ప్రకటనలో తెలిపారు. మైనార్టీలోని పేద కుటుంబాల పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియంలో కార్పొరేట్‌ స్థాయి ప్రామాణిక విద్యను అందించేందుకు ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 80 వేల రూపాయలను ప్రభుత్వ పరంగా ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఈనెల 23లోపు మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు ...

Read More »

సెస్‌తో తెలంగాణ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం

  డిచ్‌పల్లి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రముఖ పరిశోధనా సంస్థ సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ తో తెలంగాణ యూనివర్సిటీ ఎంఓయు కుదుర్చుకుంది. ఈ అవగాహన ఒప్పందంతో తెయు, సెస్‌ సంయుక్తంగా పిహెచ్‌డి డెవలప్‌మెంట్‌ స్టడీస్‌తో అందిస్తాయి. సామాజిక శాస్త్రాల పరిశోధనలో ఈ ఒప్పందం ఒక నూతన అధ్యాయానికి నాంది పలికిందని తెవివి వైస్‌చాన్స్‌లర్‌ సి.పార్ధసారథి అన్నారు. బుధవారం సెస్‌తో ఒప్పంద పత్రాలు మార్పిడి చేసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. పరిశోధనల్లో సెస్‌ ఒక ప్రత్యేక ...

Read More »

తెలంగాణ తెలుగు సంచిక ఆవిష్కరణ

  డిచ్‌పల్లి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ తెలుగు అధ్యయనశాఖ సాహిత్య సంచిక తెలంగాణ తెలుగును తెవివి ఉపకులపతి సి.పార్థసారధి బుధవారం ఆవిష్కరించారు. తెలుగు అధ్యయనశాఖ అధ్యక్షులు ఆచార్య కనకయ్య ప్రధాన సంపాదకుడుగా, అధ్యయన అధ్యాపకులు సంపాదకులుగా వెలువడుతున్న ఈ సంచికలో తెలుగు అధ్యయనశాఖ అధ్యాపకులు రచించిన సాహిత్య విశ్లేషణ వ్యాసాలు ఉన్నాయని అన్నారు. తెలుగుభాష, తెలంగాణ భాష, తెలుగు సాహిత్యంపై ఈ సంపుటిలో వ్యాసాలున్నట్టు ఆచార్య కనకయ్య తెలిపారు.

Read More »

7వరోజు ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమ్మె

  మోర్తాడ్‌, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ కనీస వేతనాలు పరిష్కరించాలంటూ మండల ఫీల్డ్‌ అసిస్టెంట్లు గత వారంరోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు. సోమవారం 7వ రోజు మండల కార్యాలయం ముందు బైఠాయించి సమ్మె కొనసాగించారు.

Read More »

ఐసెట్‌ పరీక్షకు 8 కేంద్రాలు

  డిచ్‌పల్లి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల ప్రవేశాలకై నిర్వహించనున్న ఐసెట్‌-2016 పరీక్ష ఈనెల 19న నిజామాబాద్‌లో మొత్తం 8 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు తెవివి రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు. నిజామాబాద్‌ రీజనల్‌ కో ఆర్డినేటర్‌గా బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఖైసర్‌ మహ్మద్‌ను నియమించినట్టు తెలిపారు. ఆమె ఆధ్వర్యంలో సోమవారం పరీక్షా కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ...

Read More »

కల్తీకల్లు, నాటుసారాపై ఉక్కుపాదం

  – ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌ కామారెడ్డి, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం, ఎక్సైజ్‌ డైరెక్టర్‌ అకుల్‌ సబర్వాల్‌ ఆదేశాల మేరకు కల్తీకల్లు, నాటుసారా నియంత్రణకు ఉక్కుపాదం మోపుతున్నట్టు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. శుక్రవారం ఆయన కామారెడ్డి ఎక్సైజ్‌ సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డి ఎక్సైజ్‌ యూనిట్‌కు సంబంధించి ఐదు స్టేషన్ల పరిధిలో గత సంవత్సరం సెప్టెంబర్‌ నుంచి కల్తీకల్లు, నాటుసారా నియంత్రణకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామన్నారు. వీటిపై దాడులు ...

Read More »

పేదరికాన్ని జయించిన విజేతలు

  నందిపేట, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కృషి, పట్టుదల ఉంటే విజయం సాధించవచ్చని నిరూపించారు నందిపేట మండల కేంద్రంలోని షేక్‌ హర్షద్‌, మహ్మద్‌ అమేర్‌ఖాన్‌లు. ఉన్నత చదువులు చదివి ఏఇ ఉద్యోగాలు సాధించారు. సైకిల్‌ మెకానిక్‌ కొడుకు ఏ.ఇ. నందిపేట మండల కేంద్రానికి చెందిన షేక్‌ మహమూద్‌, రయిషా బాను దంపతుల కుమారుడు షేక్‌ హర్సద్‌ 10వ తరగతి వరకు స్థానిక నవోదయ హైస్కూల్లో చదివాడు. నిజామాబాద్‌లో ఇంటర్మీడియట్‌, హైదరాబాద్‌లో బి.టెక్‌ పూర్తిచేసి క్యాంపస్‌ సెలక్షన్‌ ద్వారా హైదరాబాద్‌లో ...

Read More »