Breaking News

Nizamabad Rural

ఉపాధి పనులపై కో ఆర్డినేటర్లకు అవగాహన

  నిజాంసాగర్‌ రూరల్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మె బాట పట్టడంతో ఉపాధి పనులు ఎక్కడ కూడా నిలిచిపోవద్దని సాక్షర భారతి కో ఆర్డినేటర్లతో పనులు నిర్వహించాలని జిల్లా పాలనాధికారి డాక్టర్‌ యోగితా రాణా సూచించారు. నిజాంసాగర్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన సాక్షరభారతి గ్రామ కో ఆర్డినేటర్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎంపిడివో రాములు నాయక్‌ మాట్లాడుతూ క్షేత్ర సహాయకులు సమ్మెచేస్తున్నందున ...

Read More »

తాగునీటి సమస్య పరిష్కారానికి అద్దెబోరు

  నిజాంసాగర్‌ రూరల్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మాగి గ్రామంలో తాగునీటి సమస్యతీవ్రంగా ఉండడంతో ఎంపిడివో రాములు నాయక్‌ ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎ.ఇ. లక్ష్మణ్‌ గ్రామాన్ని సందర్శించి తాగునీటి సమస్య పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామానికి దగ్గర్లో ఉన్న ఓ రైతుకు చెందిన వ్యవసాయ బోరుబావిలో పుష్కలమైన నీరు ఉండడంతో బోరుబావిని అద్దెకు తీసుకున్నారు. రెండ్రోజుల్లో పైప్‌లైన్లు ఏర్పాటుచేసి తాగునీటి సమస్య తీరుస్తామని తెలిపారు. ఆయన వెంట కార్యదర్శి బస్వరాజ్‌, ఉపసర్పంచ్‌ రాములు, తదితరులున్నారు.

Read More »

సిబిసిఎస్‌పై అవగాహన కార్యక్రమాలు

  – తెవివి రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి డిచ్‌పల్లి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉన్నతవిద్యామండలి ఆదేశాల మేరకు సిబిసిఎస్‌ పద్దతిని తప్పకుండా అమలు చేయాల్సి ఉంటుందని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు. గురువారం వివిధ విభాగాల డీన్‌లు, పరీక్షల నియంత్రణ అధికారితో ఈ విషయమై సమావేశమయ్యారు. సిబిసిఎస్‌ విధానం పట్లఅందరికి అవగాహన ఏర్పడేందుకు వీలుగా రూసాలో భాగంగా ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు రిజిస్ట్రార్‌ తెలిపారు. అదేవిధంగా వివిధ విభాగాలకు చెందిన ...

Read More »

జేఇఇ ఎంట్రెన్స్‌లో కామారెడ్డి విద్యార్థి ప్రతిభ

  కామారెడ్డి, మే 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జేఇఇ-2016 ఎంట్రెన్స్‌ ఫలితాల్లో కామారెడ్డి సాందీపని కళాశాలకు చెందిన విద్యార్థి కె.విష్ణుతేజ 168 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. ఇదే విద్యార్థి ఇంటర్‌ ఫలితాల్లో 1000 మార్కులకు గాను 984 మార్కులు సాధించారు. ఇటీవల ప్రకటించిన ఏపి ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ పలితాల్లో విష్ణుతేజ 1790 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించాడు. 587వ లోకల్‌ ఏరియా ర్యాంకు సాధించినట్టు కళాశాల సిఇవో హరిస్మరన్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విస్ణుతేజను కళాశాల బృందం సన్మానించారు. ...

Read More »

నిజామాబాద్‌ జిల్లాను అన్నపూర్ణగా పూర్వవైభవం తీసుకొస్తా

  నీటి కోసం తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్నాం టిడిపి, ఆంధ్రాబాబు అడ్డుపడితే తెలంగాణ టిడిపి నాయకులేం చేస్తున్నారు రెండేళ్ళలో నిండుకుండలా నిజాంసాగర్‌ – మంత్రి హరీష్‌రావు బీర్కూర్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాను అన్నపూర్ణగా, ఆకుపచ్చని పంట పొలాలతో రెండు పంటలు పండేవిధంగా సస్యశ్యామలంగా తీర్చిదిద్ది పూర్వవైబవం తీసుకొస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నూరి హరీష్‌రావు అన్నారు. మండలంలో గురువారం పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ...

Read More »

మే 5న యూనివర్సిటీ కళాశాల వార్షికోత్సవం

  డిచ్‌పల్లి, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌ కళాశాల వార్షికోత్సవం మే 5వ తేదీ గురువారం సాయంత్రం నిర్వహించనున్నట్టు రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి వెల్లడించారు. వార్షికోత్సవానికి అతితులుగా ప్రముఖ ప్రజా వాగ్గేయకారుడు గోరెటి వెంకన్న, జెఎన్‌టియు మొదటి వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ డి.ఎన్‌.రెడ్డి, జాతీయ బాలికల టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌ నైనాజైశ్వాల్‌, ఎవరెస్టు అదిరోహించిన మాలావత్‌ పూర్ణలు పాల్గొంటారన్నారు. ముఖ్య అతిథిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి విసి పార్థసారధి విచ్చేయనున్నట్టు తెలిపారు. ఈసందర్భంగా నిర్వహించిన క్రీడా, ...

Read More »

నరకయాతన పెడుతున్న ప్రాజెక్టు రహదారి

  నిజాంసాగర్‌ రూరల్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్‌ ప్రాజెక్టును తిలకించేందుకు వచ్చే పర్యాటకులకు తిప్పలు తప్పడం లేదు. నిజాంసాగర్‌ నుంచి 12 గేట్లకు వెల్లే రహదారి అధ్వాన్నంగా మారడంతో రాకపోకలకు పర్యాటకులు నరకం చూస్తున్నారు. ఈ రోడ్డు కంకరతేలి అధ్వాన్నంగా మారింది. నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు వెళ్లాలంటే ఎల్లారెడ్డి, బాన్సువాడ వైపు నుంచి నిజాంసాగర్‌కు వచ్చే రహదారిలో సుల్తాన్‌ నగర్‌ చౌరస్తా నుంచి రోడ్డుంది. అలాగే అచ్చంపేట వైపునుంచి మరో రోడ్డు ఉంది. నిజాంసాగర్‌ నుంచి ...

Read More »

జిల్లా కలెక్టర్‌ గారూ… జర ఇటు చూడండి…

  నిజాంసాగర్‌ రూరల్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుచేసి నిర్మాణం చేపట్టి అన్ని హంగులు పూర్తిచేసుకున్న హాస్టల్‌ భవన నిర్మాణం ప్రారంభానికి నోచుకోవడం లేదు. దీంతో ఈ హాస్టల్లో ప్రవేశాలు సకాలంలో పూర్తవుతాయా అని మండలవాసులు ఎదురుచూస్తున్నారు. జూన్‌లో ప్రారంభమవుతున్న విద్యాసంవత్సరం నిరుపేద విద్యార్థులకు ఈ హాస్టల్‌లో అడ్మిషన్లు పొంది విద్యాభ్యాసం చేయాల్సి ఉండగా విద్యార్థుల చదువు ప్రశ్నార్థకంగా మారుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. 2013లో 3 కోట్ల ...

Read More »

పిహెచ్‌డి ప్రవేశ పరీక్ష కీ విడుదల

  డిచ్‌పల్లి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ మార్చి 11న నిర్వహించిన పిహెచ్‌డి ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రానికి జవాబుల కీ సోమవారం తెవివి రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి తన చాంబర్‌లో విడుదల చేశారు. మొత్తం 16 సబ్జెక్టుల్లో పిహెచ్‌డి ప్రవేశాలకై నిర్వహించిన ఎంట్రెన్సు టెస్టుకు మొత్తం 755 మంది హాజరయ్యారు. పరీక్షకు సంబంధించిన కీని వెబ్‌సైట్‌లో చూడవచ్చని అన్నారు. అభ్యర్థులకు జవాబుల పట్ల ఏమైనా సందేహాలుంటే మే 7వ తేదీలోపు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ పాతనాగరాజును ...

Read More »

ఎమ్మెల్సీ నిధుల నుంచి తెవివికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం

  డిచ్‌పల్లి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ ఆకుల లలిత తన నియోజకవర్గ అభివృద్ది నిదుల నుంచి తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కోసం 20 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రికి అందజేశారు. గతనెలలో ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు యూనివర్సిటీ అభివృద్ధికి తమ అభివృద్ది నిధులను కేటాయించాలన్న పిలుపుమేరకు ఆకుల లలిత సాయం అందజేశారు. ఇందుకు సంబంధించిన అంగీకార పత్రాన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి పంపించారు. ఎమ్మెల్సీ ఆకుల ...

Read More »

అంటరానితనం అమానుషం

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంటరానితనం అమానుషమని, సామాజిక జీవనంలో అంటరానితనాన్ని నిషేదించబడిందని బీర్కూర్‌ ఎంపిడివో భరత్‌కుమార్‌ అన్నారు. ప్రతినెల చివరి రోజున పౌరహక్కుల దినోత్సవంలో భాగంగా మండలంలోని నెమ్లి గ్రామంలో శనివారం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపిడివో మాట్లాడుతూ సామాజిక జీవనంలో ప్రతి ఒక్కరు సమానులేనని, రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధుల్లో ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. గ్రామంలోగల ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులున్నాయా అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. బలహీన వర్గాల మహిళలకు లైంగిక ...

Read More »

పరిస్థితులను మార్చేశక్తి మనలోనే ఉంది

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరిస్థితులను మార్చేశక్తి మనలోనే ఉందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న కుటుంబాలకు చెందిన ముందు తరాలవారు కష్టపడటం వల్ల పేదరికం నుంచి బయటకు వచ్చాయని అన్నారు. నేటి తరం కష్టపడితేనే ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతామని సూచించారు. ఇపుడు మీరు కష్టపడకపోతే మీ పిల్లలు కూడా పేదరికంలోనే వుంటారని తెలిపారు. పశు పక్ష్యాదులు తమ సంతానం కొద్దిరోజులు ...

Read More »

28న కలెక్టరేట్‌ ముట్టడి

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ కార్మికుల జీవనోపాదిని కొల్లగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీవో 727 రద్దు చేయాలంటూ గురువారం జిల్లా కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమానికి మండలంలోని బీడీ కార్మికులు, ప్యాకర్లు, టేకేదారులు తరలిరావాలని తెలంగాణ బీడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్తక్క, కిషన్‌లు కోరారు. బుధవారం మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి టేకేదారులను కలిసి కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమానికి తరలిరావాలని ప్రచారం చేశారు. 40 వేల మంది బీడీ కార్మికులు ...

Read More »

తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఏర్పాటు

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో నూతన విద్యార్థి సంఘంగా యూనివర్సిటీ విద్యార్థి సంఘం – టియు పేరుతో బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎ.తిరుపతి, ఆత్మీయ అతిథిగా ప్రిన్సిపాల్‌ ఆచార్య కనకయ్య, అతిథులుగా ప్రొఫెసర్‌ సత్యనారాయణచారి, డాక్టర్‌ ప్రవీణ్‌ మామిడాల విచ్చేసి మాట్లాడారు. విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అన్ని యూనివర్సిటీలకు ఆదర్శంగా నిలుస్తుందని, విద్యార్థి నాయకులు క్రమశిక్షణగా ఉండాలని, లక్ష్యాలను సాధించాలని అన్నారు. యూనివర్సిటీ చరిత్రలో విద్యార్థి సంఘం ...

Read More »

ఉద్యోగ సాధనలో నైపుణ్యాలు కీలకం

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగ సాదనలో ఇంటర్వ్యూ నైపుణ్యాలు కీలకమని తెవివి రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అన్నారు. సమర్థవంతంగా మంచి విషయ పరిజ్ఞానంతో ఇంటర్వ్యూ ఎదుర్కోవడం ఉద్యోగాల వేటలో అత్యంత ప్రాధాన్యమని ఆయన తెలిపారు. మంగళవారం సమాన అవకాశాల విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ కె.అపర్ణ ఆద్వర్యంలో నిర్వహించిన ఒకరోజు వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘ఇంటర్వ్యూ స్కిల్స్‌ అండ్‌ టెక్నిక్స్‌’ అన్న అంశంపై కార్యశాల నిర్వహించారు. ఇంటర్వ్యూలో విషయ పరిజ్ఞానంతో పాటు అభ్యర్థి ...

Read More »

స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రాల తనిఖీ

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌ లా కళాశాలలో జరుగుతున్న డిగ్రీ స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రాలను రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. స్పాట్‌ వాల్యుయేషన్‌లో ఎలాంటి అలసత్వానికి తావులేకుండా మూల్యాంకనం చేయాలని, ఎలాంటి చిన్న పొరపాట్లు చేసినా విద్యార్థులకు భవిష్యత్‌కు గొడ్డటి పెట్టవుతుందన్నారు. వాల్యుయేషన్‌లో పాల్గొంటున్న ప్రతి అధ్యాపకుడు జాగ్రత్తగా మూల్యాంకనం చేయాలని ఆచార్య లింబాద్రి సూచించారు. ఈ సందర్భంగా ఆయన కామర్స్‌, ఎకనామిక్స్‌, ఫిజిక్స్‌, బొటని, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ ...

Read More »

భూమాతను కాపాడుకుందాం..

  డిచ్‌పల్లి : ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి ప ర్యావరణ పరిరక్షణకు కృషిచేయాలని న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జట్లింగ్ యెల్లోసా సూచించారు. టీయూలోని న్యాయ కళాశాలలో శుక్రవారం ప్రపంచ భూ దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రిన్సిపాల్‌జ ట్లింగ్ యె ల్లోసా మాట్లాడుతూ విద్యార్థులు భూగోళం, పర్యావరణం, సంబంధిత చ ట్టాల గురించి అవగాహన పెంచుకోవాలని సూచించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ స్రవంతి మాట్లాడుతూ పర్యావరణ ప్రాధాన్యతను ఈ సంవత్సర ముఖ్య శీర్షిక అయినా భూగోళం కోసం మొక్కలు నినాదం ...

Read More »

ప్రైవేటు కళాశాలల నూతన కార్యవర్గాన్ని అభినందించిన రిజిస్ట్రార్‌

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్‌ డిగ్రీ, పిజి కళాశాలల అసోసియేషన్‌కు కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అభినందించారు. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు గంగామోహన్‌, జనరల్‌ సెక్రెటరీ ఎ.హరిప్రసాద్‌, కోశాధికారి రవిపటేల్‌, ఇతర సీనియర్‌ నాయకులు రాజు, హరిస్మరణ్‌ రెడ్డి, సూర్యప్రకాశ్‌, లక్ష్మారెడ్డి, ఇతరులు రిజిస్ట్రార్‌ను కలిసిన వారిలో ఉన్నారు. వారికి పుష్పగుచ్చం అందించి, శుభాకాంక్షలు తెలిపిన రిజిస్ట్రార్‌ వర్సిటీకి యాజమాన్యాలు అసోసియేషన్‌ పూర్తిగా సహకరించాలని, ప్రమాణాలు ...

Read More »

కంటి అద్దాల పంపిణీ

  రెంజల్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కందకుర్తి గ్రామంలో మంగళవారం డిఎం అండ్‌ హెచ్‌వో వెంకట్‌ కంటి అద్దాల పంపినీ చేశారు. గత 15 రోజుల క్రితం ఎంపి దత్తత గ్రామమైన కందకుర్తిలో కంటి పరీక్షలు నిర్వహించిన రోగులకు కళ్లద్దాలు పంపినీ చేశారు. ఆయన వెంట వైద్యాధికారి నస్రీన్‌ ఫాతిమా, ఉపసర్పంచ్‌ యాదవరావు, సూపర్‌వైజర్లు రమేశ్‌, సాయిలు, ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.

Read More »

నీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు

  పిట్లం, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం పట్టణంలో అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద మహిళలు నీటికోసం రోడ్డెక్కారు. గ్రామ పంచాయతీ వేయించిన బోరుబావులు ఎండిపోవడంతో ప్రజలు కష్టాలపాలవుతున్నారు. గ్రామపంచాయతీ ట్యాంకర్లు కూడా సరిపోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. తమ కష్టాన్ని అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read More »