Nizamabad

రంజాన్‌లో మైనార్టీలకు సహకరించాలని వినతి

  కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంజాన్‌ మాసంలో ముస్లింలు వేకువజామున, రాత్రి వేళల్లో ప్రత్యేక నమాజ్‌లు ఆచరిస్తున్న నేపథ్యంలో వారికి సహకరించాలని ప్రజాసేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు షేక్‌ మహమూద్‌ షరార్‌ గురువారం జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 27వ తేదీ నుంచి రంజాన్‌ మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ముస్లింలు నమాజ్‌లు …

Read More »

భూ కబ్జాదారులను కఠినంగా శిక్షించాలి

  కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ మండలం ముత్యంపేట గ్రామ పంచాయతీ పరిధిలో దళితుల భూములను కబ్జాచేసిన వారిని కఠినంగా శిక్షించాలని గురువారం ఆర్‌ఎస్‌పి పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఆర్డీవో శ్రీనుకు వినతి పత్రం అందజేశారు. ఆర్‌ఎస్‌పి జిల్లా కార్యదర్శి కొత్త నర్సింలు మాట్లాడుతూ ముత్యంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని 134 సర్వేనెంబరులో 16 దళిత కుటుంబాలకు, వారి పూర్వీకుల నుంచి సంక్రమించిన పది ఎకరాల …

Read More »

కాంగ్రెస్‌ నేతలకు ఎమ్మెల్యేను విమర్శించే అర్హత లేదు

  కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ను విమర్శించే అర్హత, నైతిక హక్కు శాసనమండలి విపక్షనేత షబ్బీర్‌ అలీ, కాంగ్రెస్‌ నేతలకు లేదని తెరాస నాయకులు అన్నారు. గురువారం తెరాస మండల, పట్టణ అధ్యక్షుడు పిప్పిరి ఆంజనేయులు, మామిండ్ల రమేశ్‌లు, జిల్లా ఉపాధ్యక్షుడు గోపిగౌడ్‌, ఆత్మ ఛైర్మన్‌ బల్వంతరావులు విలేకరులతో మాట్లాడారు. ప్రయివేటు, ప్రభుత్వ భూములను కబ్జాచేసి, వందల కోట్ల ఆస్తులు కాంగ్రెస్‌ నేతలు కూడగట్టుకున్న సంగతి ప్రజలకు తెలుసునన్నారు. మునిసిపల్‌ స్థలంలో అక్రమంగా …

Read More »

స్థూపం నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

  కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో చేపట్టిన తెలంగాణ అమరవీరుల స్థూపం నిర్మాణ పనులను గురువారం కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గంపగోవర్ధన్‌ పరిశీలించారు. జూన్‌ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థూపం ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. హౌజింగ్‌ బోర్డు కాలనీలోని మునిసిపల్‌ స్థలంలో స్థూపం నిర్మాణ పనులను ఆర్‌అండ్‌బి అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తిచేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఆత్మ ఛైర్మన్‌ బలవంతరావు, …

Read More »

విద్యావాలంటీర్లను యదావిధిగా కొనసాగించాలి

  కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2016-17 విద్యాసంవత్సరం విద్యావాలంటీర్లను 2017-18 విద్యాసంవత్సరంలో యధావిధిగా కొనసాగించాలని పేర్కొంటూ గురువారం తెలంగాణ రాష్ట్ర విద్యావాలంటీర్ల సంఘం ఆధ్వర్యంలో డిఇవోకు వినతి పత్రం సమర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ విద్యావాలంటీర్‌గా పనిచేసిన తమకు విద్యాబోధనలో మూల్యాంకన పద్దతుల గ్రేడింగ్‌తో పాటు వివిధ అంశాల్లో అనుభవముందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని 2017-18 విద్యాసంవత్సరంలో తమను కొనసాగించాలని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకునేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిదులు ప్రభాకర్‌, శశిదర్‌రెడ్డి, …

Read More »

రోడ్డు భద్రత నియమాలను పాటించండి

  బీర్కూర్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు భద్రత నియమాలను పాటించినపుడే ఎటువంటి ప్రమాదాలు జరగవని బాన్సువాడ రూరల్‌ సిఐ శ్రీనివాస్‌ రావు అన్నారు. నసురుల్లాబాద్‌ మండలంలోని మీర్జాపూర్‌ గ్రామంలో బుధవారం రాత్రి పోలీసులు పల్లెనిద్ర, గ్రామసభ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఆర్థిక, సామాజిక రుగ్మతలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గుట్కా, మట్కా తదితరాలు గ్రామంలో నిషేదించాలని గ్రామస్తులకు సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమని, ప్రమాదాల ద్వారా కుటుంబ పెద్దను కోల్పోతే కుటుంబం వీధిన పడే …

Read More »

బెల్టుషాపులపై దాడి

  బీర్కూర్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం గ్రామంలో బీర్కూర్‌ పోలీసులు బెల్టుషాపులపై దాడి చేపట్టారు. సంగం గ్రామానికి చెందిన రూప్‌సింగ్‌, వసంత్‌ల ఇంట్లో మద్యం సీసాలు లభ్యంకావడంతో కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ గోపి తెలిపారు. సంగం గ్రామంలో కిరాణ దుకాణాలపై దాడిచేసి, జర్దా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. గ్రామంలో అనుమతులు లేకుండా మద్యం విక్రయాలు చేపట్టవద్దని, ఎవరైనా విక్రయిస్తే 100 నెంబరుకు డయల్‌ చేసి సమాచారం అందించాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని …

Read More »

మరుగుదొడ్ల నిర్మాణాలపై శ్రద్ద వహించండి

బీర్కూర్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మరుగుదొడ్ల నిర్మాణాలపై గ్రామ పెద్దలు, వార్డుసభ్యులు శ్రద్ద వహించాలని బీర్కూర్‌ గ్రామ సర్పంచ్‌ దూలిగె నర్సయ్య అన్నారు. బీర్కూర్‌ మండల కేంద్రంలో నసురుల్లాబాద్‌ మండలంలోని మీర్జాపూర్‌ గ్రామంలో అధికారులు గ్రామజ్యోతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారులు మాట్లాడుతూ 2017 ఆగష్టు 17 నుంచి మండలంలోని ఆయా గ్రామాల్లో గ్రామ జ్యోతి ద్వారా గ్రామాభివృద్దికి ఏడు కమిటీలు నిర్వహించడం జరిగిందని, గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య, వ్యవసాయం, మరుగుదొడ్ల నిర్మాణం, ఆరోగ్యం, …

Read More »

స్వచ్చందంగా గుట్కా ప్యాకెట్ల దహనం

  గాంధారి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలో గురువారం గుట్కా ప్యాకెట్లను కిరాణ వర్తక సంఘం ఆద్వర్యంలో స్వచ్చందంగా దహనం చేశారు. ఈ సందర్భంగా స్థానిక నెహ్రూ చౌరస్తా వద్ద కిరాణ దుకాణాలు, పాన్‌షాపులు, చిల్లర దుకాణాల నుంచి గుట్కా ప్యాకెట్లను సేకరించి దహనం చేశారు. నిషిద్ద గుట్కాప్యాకెట్లు విక్రయించవద్దని గతంలో చాలాసార్లు కిరాణ వర్తక సంఘం ద్వారా సూచించినప్పటికి మండల కేంద్రంలో గుట్కాల అమ్మకం తగ్గలేదు. దీనికితోడు గత పదిరోజుల క్రితం స్థానిక పోలీసులు …

Read More »

లిప్‌లాక్‌ వద్దన్న హీరో.. కారణం ఇదేనా!

చెన్నై: సాధారణంగా లిప్‌లాక్‌ సన్నివేశాలకు కథానాయికలు నో చెబుతుంటారు. అయితే తమిళ నటుడు సిబిరాజ్‌ హీరోయిన్‌తో లిప్‌లాక్‌ సన్నివేశంలో నటించడానికి ససేమిరా అన్నారు. ఆ సంగతేమిటో చూద్దాం. సత్యరాజ్‌ సమర్పణలో ఆయన కొడుకు సిబిరాజ్‌ హీరోగా నటిస్తూ, నాదాంబాళ్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం సత్య. ప్రదీప్‌ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నటి రామ్యానంబీశన్‌ హీరోయిన్ గానూ, నటి వరలక్ష్మీ పోలీస్‌ అధికారిగా నటిస్తున్నారు.  555 చిత్రం ఫేమ్‌ సైమన్‌ సంగీతాన్ని అందించారు. సత్య మూవీ జూన్‌ చివర్లో తెరపైకి …

Read More »