Breaking News

Nizamabad

లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో దుప్పట్ల పంపిణీ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇందూర్‌ ఆద్వర్యంలో శుక్రవారం రాత్రి నిజామాబాదు నగరంలో నిరాశ్రయులైన పేదలకు రగ్గులు పంపిణీ చేశారు. నగరంలోని రైల్వే స్టేషన్‌, బస్‌ స్టాండ్‌, గాంధీచౌక్‌ తదితర ప్రాంతాలలో చలికి వణుకుతూ రోడ్లపై నిద్రిస్తున్న వారికి లయన్స్‌ సభ్యులు రగ్గులు అందజేశారు. ప్రతీ సంవత్సరం చలి కాలంలో చలి వల్ల ఇబ్బందులు కలగకూడదని రగ్గులు పంపిణీ చేస్తామని లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇందూర్‌ అధ్యక్షుడు లక్ష్మినారాయణ భరద్వాజ్‌ తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్‌ ...

Read More »

ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతోనే పల్లె ప్రగతి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతోనే పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమవుతుందని రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు, రహదారులు- భవనముల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌ మైదానంలో గ్రామ పంచాయతీలకు పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సంబంధిత గ్రామ పంచాయతీల సర్పంచులకు ట్రాక్టర్లను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎంతో నమ్మకంతో ప్రారంభించిన 30 రోజుల పల్లె ...

Read More »

యాసంగికి రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు ప్రతిపాదనలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యాసంగిలో 2 లక్షల 45 వేల ఎకరాల్లో సాగుకు గాను 20 టీఎంసీల నీటిని అందించడానికి జిల్లా నీటి పారుదల సలహా కమిటీ సమావేశంలో ప్రభుత్వానికి ప్రతిపాదించడం జరిగిందని రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు, రహదారులు- భవనముల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారుం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా నీటి పారుదల సలహా కమిటీ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ ...

Read More »

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా 19న నిరసన

నిజామాబాద్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న పౌరసత్వ చట్టం సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని సిపిఎం నిజామాబాదు జిల్లా కార్యదర్శి కె రమేష్‌ బాబు డిమాండ్‌ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 19న నిరసన కార్యక్రమాన్ని వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సిపిఎం నాయకులు పెద్దివెంకట్‌ రాములు, ఎం.గంగాధర్‌ అప్ప పాల్గొన్నారు.

Read More »

రుణాలతోనే దేశాభివృద్ది

నిజామాబాద్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేదలు, రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తేనే దేశం, బ్యాంకులు అభివద్ధి చెందుతాయని రాష్ట్ర రహదారులు- భవనములు, శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం మంత్రి జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా లీడ్‌ బ్యాంకు ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ కొన్ని బ్యాంకులు వాటి శాఖలు రైతులకు, ...

Read More »

మీసేవ కేంద్రాలు పని చేస్తాయి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా డిబి మైగ్రేషన్‌ ప్రక్రియ వాయిదా పడిందని ఈడిఎం కార్తీక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అందువల్ల అన్ని మీసేవా, ఇసేవా సేవలు ఈనెల 14, 15 తేదీలలో శనివారం, ఆదివారం అన్ని కేంద్రాలలో ఎటువంటి అంతరాయం లేకుండా యథావిధిగా పనిచేస్తాయని తెలిపారు. విషయాన్ని గమనించి ప్రజలు అవకాశాన్ని వినియోగించుకోవాలని, మీసేవా నిర్వాహకులు తమ సేవలు అందించాలని సూచించారు.

Read More »

ఇచ్చిన మాట ప్రకారం సిసి రోడ్లు వేయిస్తున్నాం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో ప్రధాన రోడ్లను ఎటువంటి కూల్చివేతలు లేకుండా విస్తరణతో పాటు అభివద్ధి చేయడం జరుగుతుందని అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ గుప్త అన్నారు. నిజామాబాద్‌ నగరంలోని 43వ డివిజన్‌ అంబేడ్కర్‌ కాలనీలో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే గురువారం భూమిపూజ చేసి ప్రారంబించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గతంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేయడం జరిగిందన్నారు. దాదాపు అన్ని రోడ్లు పూర్తి చేయడం ...

Read More »

క్రీడల్లో గెలుపు ఓటములు సహజమే

నిజామాబాద్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పాలి టెక్నిక్‌ కాలేజీలో అంతర జిల్లా క్రీడా పోటీలను నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా గురువారం ప్రారంబించారు. క్రీడా పతాకాన్ని ఎగురవేసి ఆదిలాబాద్‌, నిర్మల్‌ నిజామాబాద్‌, పాలి టెక్నిక్‌ క్రీడా కారుల నుండి గౌరవ వందనం స్వీకరీంచారు. ఈ సందర్భంగా బిగాల మాట్లాడుతూ చదువులోనే కాకుండా ఆట పాటల్లో కూడా విద్యార్థులు ముందుండాలన్నారు. ఆటలు మానసిక ఉల్లాసంతో పాటు శరీరం ఫిట్‌గా ఉండటానికి ఉపయోగ పడతాయన్నారు. ఆటల్లో గెలుపు ...

Read More »

పల్లెల్లో పరిశుభ్రత పనులు జరగాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో అభివద్ధి కార్యక్రమాల పనులు కొనసాగిస్తూనే ఉండాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మండల స్థాయి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎంపీడీవోలు, డివిజనల్‌ పివోలు, ఏపీవోలతో పలు విషయాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో నిర్వహించిన పల్లె ప్రగతి పనులలో ప్రజలు, ప్రజాప్రతినిధులు భాగస్వాములై పల్లెలను అందంగా తీర్చిదిద్దారని, గ్రామాలు హరిత వనాలుగా అభివద్ధి చెందడానికి ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని తెలిపారు. అయితే ...

Read More »

ప్రభుత్వ ప్లీడర్‌గా ఈగ గంగారెడ్డి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లా కోర్టు ప్రభుత్వ ప్లీడర్‌గా సీనియర్‌ న్యాయవాది ఈగ గంగారెడ్డి నియమితులయ్యారు. గురువారం గంగారెడ్డి ప్రభుత్వ న్యాయవాదిగా బాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కోర్టులో నిజామాబాదు జడ్పిచైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు, ఈగ గంగారెడ్డిని సన్మానించారు. పిపి మధుసూదన్‌ రావు, నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఏ.రమేష్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More »

మూడు రోజులపాటు మీ సేవా కేంద్రాలు బంద్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మీ సేవా డేటాబేస్‌ కార్యకలాపాలను మెరుగుపరచడంలో భాగంగా మీసేవ సేవలు జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 13వ తేదీ రాత్రి 7 గంటల నుండి 16వ తేదీ ఉదయం 8 గంటల వరకు పనిచేయవని, అందుబాటులో ఉండవని జిల్లా ఇ- డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ కార్తీక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 16వ తేదీ ఉదయం 8 గంటల తర్వాత మీసేవా సేవలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశముందని ప్రజలందరూ సహకరించాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో హంగర్‌ రిలీఫ్‌ కార్యక్రమం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ నిజామాబాదు డైమండ్‌ ఆద్వర్యంలో బుదవారం జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో హంగర్‌ రిలీఫ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఉప్మా పలహారం పంపిణీ చేశారు. లయన్స్‌ జిల్లా గవర్నర్‌ వీరేశం తనయుడు సంతోష్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా అంతటా హంగర్‌ రిలీఫ్‌ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. క్లబ్‌ కార్యదర్శి శ్రీనివాస్‌, కోశాధికారి శ్రీధర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Read More »

ధాన్యం కొనుగోలు చేయాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిజామాబాద్‌ జిల్లా దర్పల్లి మండలం బరందండ తండాకు చెందిన రైతులు జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి తరలి వచ్చారు. ఈ మేరకు జాయింట్‌ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తాండ వాసులు మాట్లాడుతూ తమ గ్రామ పంచాయతీ పరిధిలోని సొసైటీలో ధాన్యం కొనుగోలు చేయక తమకు ఇబ్బంది కలిగిస్తున్నారని అన్నారు. నాలుగు రోజుల నుండి అధికారుల చుట్టూ తిరుగుతున్నా ధాన్యం కొనుగోలు చేయడం లేదని ...

Read More »

నిజామాబాద్‌కు లయన్స్‌ క్లబ్‌ స్వాగతం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లా కేంద్రంలో బుదవారం లయన్స్‌ క్లబ్‌ స్వాగత బోర్డు ఏర్పాటు చేసింది. నగరంలోని పూలాంగ్‌ వద్ద హైదరాబాద్‌ వైపు నుండి నిజామాబాదు వైపు వచ్చే వారికి స్వాగతం పలుకుతూ బోర్డు ఏర్పాటు చేశారు. లయన్స్‌ క్లబ్‌ రీజియన్‌ చైర్మెన్‌ గోపాల్‌ దాస్‌ అగర్వాల్‌, జోన్‌ చైర్మెన్‌ ద్వారకా దాస్‌ అగర్వాల్‌ స్వాగత బోర్డును ప్రారంబించారు. ఈ సందర్భంగా రీజియన్‌ చైర్మెన్‌ గోపాల్‌ దాస్‌ మాట్లాడుతూ నగరంలోకి ప్రవేశించే వారికి స్వాగతం పలుకడంతో ...

Read More »

ఘనంగా వి.జి.గౌడ్‌ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ హామీల కమిటీ చైర్మెన్‌, తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ వి.గంగాధర్‌ గౌడ్‌ జన్మదిన వేడుకలు బుదవారం నిజామాబాదు లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెరాస కార్యకర్తలు, నాయకుల సమక్షంలో ఎమ్మెల్సీ వి.జి.గౌడ్‌ కేక్‌ కట్‌ చేశారు. నిజామాబాదు రూరల్‌ ఎమ్మెల్యే జాజిరెడ్డి గోవర్దన్‌, డిచ్‌పల్లి మండల పరిషత్‌ అధ్యక్షుడు గద్దె భూమన్న, తెరాస నాయకుడు శ్రీనివాస్‌ రావు తదితరులు జన్మదిన వేడుకల్లో పాల్గొని విజి గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

14వ తేదీ నాటికి ధాన్యం వివరాలు అందజేయండి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 14 కల్లా ధాన్యం కొనుగోలుకు సంబంధించి అన్ని వివరాలను ట్యాబ్‌ ఎంట్రీ చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి ట్యాబ్‌ ఎంట్రీ చేస్తేనే దానికి సంబంధించిన బిల్లులు రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయని, ఈ విషయంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పని వెంటనే పూర్తి చేయడానికి ...

Read More »

13న నీటిపారుదల సలహా బోర్డు సమావేశం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 13న ఉదయం 11 గంటలకు నిజామాబాదు ప్రగతిభవన్‌లో నీటిపారుదల సలహా బోర్డు సమావేశం జరగనుంది. జిల్లాలోని శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌ భారీ ప్రాజెక్టులతో పాటు గుత్ప, అలీసాగర్‌ ఎత్తిపోతల పథకాలు, రామడుగు తదితర మద్యతరహా ప్రాజెక్టుల నుండి రభీ సాగుకు నీటి విడుదల గురించి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. జిల్లా కలెక్టర్‌ సూచన మేరకు సమావేశం నిర్వహిస్తున్నట్టు నీటి పారుదల విభాగం పర్యవేక్షక ఇంజనీర్‌ ఎ.మురళీదర్‌ తెలిపారు.

Read More »

స్త్రీ నిధి రుణాలు సక్రమంగా మంజూరయ్యేలా చూడాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళా సంఘాల బలోపేతానికి మహిళల ఆర్థిక అభివద్ధికి దోహదపడే స్త్రీనిధి రుణాలు లక్ష్యానికి అనుగుణంగా మంజూరు జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఆదేశించారు. మంగళవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో డీఆర్‌డిఎ మెప్మా అధికారులతో, సిబ్బందితో స్త్రీ నిధిపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్త్రీ నిధి కింద ఈ సంవత్సరం రూ.207 కోట్ల లక్ష్యం కాగా ఇప్పటివరకు రూ.135 కోట్లు మంజూరు చేయవలసి ఉండగా కేవలం 19 ...

Read More »

భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోండి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంకా పరిష్కరించవలసిన భూ సమస్యలపై ఆర్‌.డి.ఓ.లు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఆదేశించారు. మంగళవారం సాయంత్రం తన చాంబర్‌లో ఆర్డీవోలతో ఎల్‌ఆర్‌యుపిపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు అనుగుణంగా ఇంకా పెండింగ్‌లో ఉన్న పాస్‌ బుక్కులను వెంటనే జారీ చేయటానికి చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు కేసులు, అనర్హత కేసులు మినహా మిగతా కేసులన్నీ పరిష్కరించడానికి ప్రత్యేకంగా శ్రద్ధ కనబర్చి తహసిల్దార్లు గ్రామస్థాయి అధికారులకు తగు ఆదేశాలు ...

Read More »

పోలింగ్‌ స్టేషన్ల రేషనలైజేషన్‌కు అభిప్రాయాలు తెలపాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో పోలింగ్‌ కేంద్రాల రేషనలైజేషన్‌కు రాజకీయ పార్టీల ప్రతినిధులు అభిప్రాయాలు తెలియజేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు కోరారు. మంగళవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో ఉన్న పోలింగ్‌ స్టేషన్లలో లోకేషన్‌లో మార్పు, పోలింగ్‌ కేంద్రాల పేర్ల మార్పు, అదనపు పోలింగ్‌ కేంద్రాలపై ప్రతిపాదనలు పంపించడం, కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ ...

Read More »