Breaking News

Nizamabad

బంద్‌ కరో… బంద్‌ కరో…

నిజామాబాద్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్త బందులో భాగంగా నిజాంబాద్‌ నగరంలో బైకుల ద్వారా పెద్ద ఎత్తున నిజామాబాద్‌ నగరమంతా తిరుగుతూ దుకాణాలు, వ్యాపార సముదాయాలు బందు చేయించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓ మయ్య మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ వస్తుందని దాంట్లో భాగంగానే రైల్వే, బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎల్‌ఐసి, బ్యాంకింగ్‌, రక్షణ రంగాలను 100 ...

Read More »

త్రివిధ దళాల సేవలు మరువలేనివి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ రక్షణ కోసం తమ జీవితాలను త్యాగం చేస్తూ తమ భార్య పిల్లలను ఇంటి దగ్గరేవుంచి ఎక్కడో దేశ సరిహద్దులలో భారత దేశ రక్షణ కొరకు, భారత ప్రజల సుఖశాంతుల కొరకు పనిచేస్తున్న భారత త్రివిధ దళాల సేవలు మరవలేనివని, అందుకే వారి సంక్షేమానికి ప్రతి ఒక్క భారత పౌరుడు చేయూతనందిస్తూ వారికి సంఘీభావం తెలపడం అవసరమని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో సోమవారం సాయుద ...

Read More »

శిశు హత్య మహా పాపం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శిశు హత్య మహా పాపం అని అడిషనల్‌ కలెక్టర్‌ లత అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్కారీ వారి ఉయ్యాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ పిల్లల పెంపకం భారంగా ఉన్నవారు నాలలో గాని ముళ్లపొదల్లో గాని పారేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఉయ్యాలలో వేయాలని కోరారు. మానవత్వంతో ఆలోచించి పసి పాపలకు మరో ప్రపంచాన్ని చూపిద్దామన్నారు. మీకు ...

Read More »

ఇంకా విక్రయించకుంటే కొనుగోలు కేంద్రాలకు వెళ్ళండి…

నిజామాబాద్‌, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎవరైనా రైతుల వద్ద ఈ వాన కాలంలో పండించిన మక్కలు ఇంకా విక్రయించకుండా ఉంటే వాటిని కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవచ్చునని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో రైతులకు సూచించారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 3 వేల 340 మంది రైతుల నుండి తొమ్మిది వేల మెట్రిక్‌ టన్నుల మక్కలను జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ద్వారా సేకరించామని క్వింటాలుకు రూ.1850 మద్దతు ధర చెల్లిస్తున్నామని తెలిపారు. ఈ వాన కాలంలో ...

Read More »

మూడురోజుల పాటు ఇన్స్‌పెక్షన్‌ – రికార్డులు సిద్దం చేసుకోండి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో ఉపాధి హామీ పథకం బాగా జరుగుతున్నందున జాతీయ ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వ జాయింట్‌ సెక్రటరీ జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం ఉపాధి హామీ పథకం అధికారులు ఎంపీడీవోలతో సెల్‌ కాన్షరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 9 నుండి 11 వరకు ఆయన బందం జిల్లాలో పర్యటించనున్నందున క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను వారు ...

Read More »

దేవక్కపేట్‌లో అంబేడ్కర్‌ వర్ధంతి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ మండలంలోని దేవక్కపెట్‌ గ్రామంలో రైజింగ్‌ స్టార్‌ యూత్‌ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా బి. ఆర్‌.అంబేద్కర్‌ 64వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు ఆర్పించారు. కార్యక్రమంలో యూత్‌ అధ్యక్షులు అల్లంపట్ల ఆనంద్‌, సుధాకర్‌, రవి, నరేష్‌, సూర్యకిరణ్‌, ప్రవీణ్‌, శేఖర్‌, నర్సయ్య యూత్‌ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు. న్యాయవాది సుంకపాక ప్రకాష్‌ మాట్లాడుతూ ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి డా బి.ఆర్‌.అంబెడ్కర్‌ ఆలోచన ...

Read More »

ఎస్‌సి, ఎస్‌టి ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో అంబేడ్కర్‌కు నివాళి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ వర్ధంతి కార్యక్రమాన్ని పులాంగ్‌ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కషి చేయాలని జిల్లా అధ్యక్షులు రామ్‌ చందర్‌ గైక్వాడ్‌ రాష్ట్ర కోశాధికారి సుశీల్‌ కుమార్‌ కోరారు. కార్యక్రమంలో సాయన్న, భూమయ్య గంగయ్య, భోజన, సాయిలు, ...

Read More »

బంద్‌లో తెరాస శ్రేణులు పాల్గొనాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్‌ బంద్‌కు టిఆర్‌ఎస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌ రావు ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా టిఆర్‌ఎస్‌ శ్రేణులు రైతుల న్యాయపోరాటానికి మద్దతుగా భారత్‌ బంద్‌లో పాల్గొనాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి జిల్లా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ...

Read More »

అప్పగించిన పనులన్ని పూర్తి కావాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధికారులకు అప్పగించిన పనులన్నీ వెంటనే పూర్తి చేయటానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. శనివారం సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా సంబంధిత అధికారులతో పలు విషయాలపై పనుల పూర్తికై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతు వేదిక నిర్మాణాలు పూర్తికావస్తున్నందున ఇంకా చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే మూడు నాలుగు రోజుల్లో పూర్తిచేయాలని, ఎక్కడైనా పెండింగ్‌ ఉంటే సంబంధిత పంచాయతీ రాజ్‌ ఇంజనీర్లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కాంట్రాక్టర్లు ...

Read More »

రిమార్కు లేకుండా పదవీ విరమణ చేయడం గొప్ప విషయం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ శాఖలో నవంబర్‌ 30న ముగ్గురు సిబ్బంది పదవి విరమణ, అదేవిధంగా ఒకరు స్వచ్ఛంద పదవి విరమణ చేసినట్టు నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నవంబర్‌ నెలలో వదవి విరమణ చేసిన సిబ్బంది 1. ఎన్‌.నరేంధర్‌, ఎస్‌.ఐ, మహిళా పోలీస్‌ స్టేషన్‌, నిజామాబాద్‌. పోలీస్‌ శాఖలో (33) సంవత్సరాల సర్వీసు పూర్తి చేశారన్నారు. 2. ఎస్‌. కిషన్‌ సింగ్‌, ఎ.ఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ 39, హెడ్‌ క్వార్టర్స్‌ ...

Read More »

సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తాం…

నిజామాబాద్‌, డిసెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ కార్మికులందరికీ జి.హెచ్‌.ఎం.సిలో పెంచినట్లు వెంటనే వేతనాలు పెంచాలని, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, ఎన్‌.ఎం.ఆర్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యంలో నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో సుమారు 40 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని, వీరందరికీ వేతనాలు పెంచాల్సి వున్నా, కేవలం ...

Read More »

ఏజెన్సీల గుర్తింపు రద్దు చేయాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సురక్ష మిత్ర ఏజెన్సీల గుర్తింపు రద్దు చేయాలని ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. జిల్లాలోని మైనార్టీ గురుకులాల్లో 50 నాన్‌ టీచింగ్‌ పోస్టులను ఎలాంటి నోటిఫికేషన్‌లు ఇవ్వకుండా సురక్ష మిత్ర ఏజెన్సీల ద్వారా భర్తీ చేయడం జరిగిందని, ఈ విషయం జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని పేర్కొన్నారు. కలెక్టర్‌ సానుకూలంగా స్పందించి సమగ్ర విచారణ జరిపిన తర్వాత మైనార్టీ ...

Read More »

విజయ డైరీ పార్లర్‌ ప్రారంభం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విజయ డైరీ పార్లర్‌ను డైరీ డెవలప్మెంట్‌ ఎండి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి ప్రారంభించారు. శనివారం నిజామాబాద్‌ నగరంలో డాక్రా బజార్‌ మరియు సుభాష్‌ నగర్‌ రైతు బజార్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామాలలో 50 విజయ డైరీ పార్లర్లకు దరఖాస్తులు వచ్చాయన్నారు. విజయ డైరీ ఎం.డి. మాట్లాడుతూ విజయ డైరీ పార్లర్‌ పెట్టుకునే వారికి 50 శాతం సబ్సిడీ మీద కూలింగ్‌ ఫ్రిడ్జ్‌ ఇవ్వనున్నట్లు, ...

Read More »

ప్రత్యేక ఓటరు నమోదును పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శని, ఆదివారం రెండు రోజులపాటు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్‌ నమోదును జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి శనివారం పోలింగ్‌ కేంద్రాలలో పర్యటించి నమోదు ప్రక్రియను పరిశీలించారు. నగరంలోని ఖిల్లా రోడ్డులో గల సెంట్‌ మేరీ హై స్కూల్‌, హబీబ్నగర్‌లో కేంబ్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ లో పర్యటించి ఆయా కేంద్రాల్లో గల బూత్‌ లెవెల్‌ అధికారులను సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2021 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ...

Read More »

12న జాతీయ లోక్‌ అదాలత్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 12న రెండవ శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా మరియు ప్రిన్సిపల్‌ జడ్జి సాయి రమాదేవి తెలిపారు. శుక్రవారం జిల్లా న్యాయ సేవ సర్వీసెస్‌ భవనంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. సుప్రీం కోర్ట్‌, హైకోర్టు ఆదేశాలను అనుసరించి జాతీయ లోక్‌ అదాలత్‌ ఈ నెల 12న రెండవ శనివారం నిర్వహిస్తున్నామని, గుర్తించిన కేసులకు సంబంధించిన కక్షిదారులు హాజరై వారి కేసులను పరిష్కరించుకోవాలని ఆమె కోరారు. కరోనా వైరస్‌ ...

Read More »

ఇరిగేషన్‌ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇరిగేషన్‌ శాఖ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో ఇరిగేషన్‌ భూముల అన్యాక్రాంతంపై ఇరిగేషన్‌, రెవిన్యూ, పోలీస్‌ శాఖల అధికారులతో కోఆర్డినేషన్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎస్‌ఆర్‌ఎస్‌పి, లేదా ఇతర ఏ ప్రాజెక్టులు కానీ, ప్రభుత్వ భూములు కానీ చిన్న గుంట అయినా సరే ఎట్టి పరిస్థితిలో ఆక్రమించడానికి వీల్లేదన్నారు. ఎక్కడైనా, ఏవైనా ఆక్రమణలకు గురై ఉంటే తొలగించాలని ...

Read More »

పెండింగ్‌ దరఖాస్తులు పరిష్కరించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ కార్పొరేషన్‌ వార్షిక ప్రణాళిక 2018-19 క్రింద సబ్సిడీ రుణాల కొరకు ధరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని ఎస్సీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఇ.రాజేశ్వరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాంకు, మండల పరిషత్‌ అభివద్ధి అధికారులు మరియు మున్సిపల్‌ కమీషనర్‌ దగ్గర పెండింగ్‌లో ఉన్న వాటిని త్వరగా క్లియర్‌ చేయాలని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారాలను ఈ నెల 10 వరకు బ్యాంక్‌ సమ్మతితో ఎస్‌సి కార్పొరేషన్‌ నిజామాబాద్‌ కార్యాలయంలో అందించాలని పేర్కొన్నారు.

Read More »

వినికిడి సమస్యలున్న వారు హైదరాబాద్‌ వెళ్ళాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగుల వైకల్య పర్సంటేజ్‌ ధవీకరించడానికి ఏర్పాటు చేసే సదరం క్యాంపులకు దివ్యాంగులు ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని, వారిని మాత్రమే క్యాంపులకు అనుమతించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి తెలిపారు. జిల్లాలో సదరం క్యాంపుల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలు, అవసరమైన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని 3 డివిజన్‌ కేంద్రాలలో క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిజామాబాదులో ఈనెల 7న, బోధన్‌ లో ...

Read More »

కృత్రిమ అవయవాల ద్వారా వైకల్యాన్ని అధిగమించవచ్చు…

నిజామాబాద్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా కత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్‌ సౌజన్యంతో న్యాయ సేవా అధికార సంస్థ మీటింగ్‌ హాల్‌లో నిర్వహించారు. ఉచిత కత్రిమ అవయవాల ఏర్పాటు శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా స్పెషల్‌ జడ్జ్‌ జిల్లా లీగల్‌ సర్వీస్‌ అథారిటీ చైర్మన్‌ సాయి రమాదేవి పాల్గొని కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్జాతీయ వికలాంగుల ...

Read More »

త్యాగం శ్రీకాంతాచారిది… భోగాలు కేసీఆర్‌ కుటుంబానివి…

కామారెడ్డి, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉస్మానియా యూనివర్సిటీలో ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని శ్రీకాంతాచారి చేస్తే నేడు స్వరాష్ట్రంలో భోగాలు మాత్రం కెసిఆర్‌ కుటుంబానికి దక్కాయని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు ఆరోపించారు. శ్రీకాంతాచారి వర్ధంతి పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే రాష్ట్రంలోని వారికి లక్షలాది ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు అందరికీ అవకాశాలు లభిస్తాయని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి విద్యార్థుల చావులకు కారణమైన కెసిఆర్‌ మరి రాష్ట్రం వచ్చినా ఎందుకు ఉద్యోగ ...

Read More »