నిజామాబాద్, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ మండలం బొర్గం గ్రామం, డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంగళవారం కలెక్టర్ ముందుగా బొర్గం గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, అక్కడ ఏర్పాటు చేసిన వసతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సెంటర్లో ముందుగా వాటర్, షెడ్, తాడిపత్రి, వేయింగ్ మిషన్, రిజిస్టర్‌ను పరిశీలించారు. కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న వరి ...
Read More »పాము కాటేసింది.. పోలీసులు కాపాడారు…
నిజామాబాద్, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోరా గ్రామానికి చెందిన మహిళకు పాము కాటు వేసింది. పోలీసుల సహకారంతో సరైన సమయంలో చికిత్స పొందగలిగింది. వివరాల్లోకి వెళితే… గుత్తా మీద ద్రుపతి (36) తన గ్రామంలో ఆదివారం రాత్రి 11:50 గంటలకు పాము కరిచింది. ఆమెని బైక్ మీద ఆసుపత్రికి తరలిస్తుండగా కొంత దూరం ప్రయాణించిన తరువాత బైక్ ఆగిపోయింది. అక్బర్ నగర్ గ్రామంలో రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న రుద్రూర్ పోలీసు బృందం రఘు, ...
Read More »విజయదశమి నిర్ణయం
నిజామాబాద్, అక్టోబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ సంవత్సరము నిజ ఆశ్వీజ శుక్ల నవమి ఆదివారం అక్టోబర్ 25 వ తేదీ రోజున ఉదయం 7 గంటల 41 నిమిషాల వరకు నవమి తదుపరి దశమి, నిజ ఆశ్వీయుజ శుధ్ధ దశమి సోమవారము అక్టోబర్ 26వ తేదీ రోజున దశిమి ఉదయం 9 గంటల వరకు. కాలనిర్ణయ చంద్రిక, నిర్ణయసింధు, ధర్మసింధు, ధర్మప్రవత్తి, కాలనిర్ణయ చంద్రిక, వ్రత రత్నాకరాది ధర్మ గ్రంధాలలో ఇలా చెప్పబడింది… శ్లో. నవమీకలయాచైవ విధ్ధత్యాజ్యాభవేత్సదా! పరవేధాయుతాయాంతు ...
Read More »సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
నిజామాబాద్, అక్టోబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సంస్కతి, సాంప్రదాయలకు ప్రతీకగా నిలిచే చివరి రోజైన సద్దుల బతుకమ్మ పండుగను ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. సద్దుల బతుకమ్మ పండుగా సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే పూలను పూజించి, ప్రకతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని అలాంటి సంస్కతి మన తెలంగాణలో ఉందన్నారు. ...
Read More »ఇసుక అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ల పట్టివేత
నిజామాబాద్, అక్టోబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ఎంఎస్సి ఫారం పరిసర ప్రాంతాల నుండి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి 6 ఇసుక అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను పట్టుకున్నట్టు టాస్క్ఫోర్సు సిఐ వెల్లడించారు. వాటిని సంబంధిత పోలీసు స్టేషన్ అధికారికి అప్పగించడం జరిగిందన్నారు. టిప్పర్ల నెంబర్లు : ఏపి 25 డబ్ల్యు 4174 ...
Read More »ముగ్గురిపై పిడి యాక్టు
నిజామాబాద్, అక్టోబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ 5 వ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోలో గల రౌడీషీటర్లు ఆరిఫ్, ఉస్మాన్, ఇబ్రహీం చోచ్ అనే ముగ్గురిపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆదేశానుసారం పిడి యాక్ట్ చేసినట్టు నిజామాబాద్ నార్త్ రూరల్ సిఐ శ్రీనాథ్ రెడ్డి వెల్లడించారు. సదరు ముగ్గురు వ్యక్తులు గత సంవత్సర కాలం నుండి నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని 5 వ టౌన్, ఒకటవ టౌన్ మరియు ఆరవ టౌన్ పరిధిలో వివిధ కేసులలో రిమాండ్ ...
Read More »భారీగా నిషేదిత సిగరెట్లు, జర్దా స్వాధీనం
నిజామాబాద్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ టౌన్ 1 పోలీస్ స్టేషన్ పరిధిలోని గంజ్ ప్రాంతంలో ఓ కిరాణా దుకాణం మరియు గోదాములో నిషేధిత సిగరెట్లు మరియు జర్ధాను నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. వీటి విలువ సుమారు 8 లక్షల వరకు ఉంటుందన్నారు. గురువారం నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ షాకేర్ అలీ మరియు వారి సిబ్బంది నిజామాబాద్ ...
Read More »ఆన్లైన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం
నిజామాబాద్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలలో భాగంగా (ఫ్లాగ్ డే సందర్భంగా ) గురువారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ, ఐ.పీ.ఎస్. ఆదేశాల మేరకు 4వ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఆన్లైన్ ఓపెన్ హౌజ్ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్లైన్ ద్వారా ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని దాదాపు 735 మంది సద్వినియోగం చేసుకున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ పనితీరు, ...
Read More »భారీగా గుట్కా స్వాధీనం
నిజామాబాద్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీ మొత్తంలో గుట్కా, జర్ధా స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 11.50 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్కత్ పురా కాలనీ లో గల ఒక ఇల్లు, గోదాములో గుట్క, జర్ధా ఉన్నదన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ షాకేర్ అలీ తన సిబ్బందితో కలిసి ...
Read More »22న ఆన్లైన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం
నిజామాబాద్, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా 4వ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఆన్లైన్ ఓపెన్ హౌజ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నిజామాబాద్ కమీషనర్ ఆఫ్ పోలీసు కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 22న ఆసక్తిగల వారు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్ లైన్ ద్వారా ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓపెన్ హౌజ్ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ పనితీరు, రికార్డుల వాడటం, సిబ్బంది ...
Read More »రెండు తులాల గుండ్లు పోగొట్టుకుంది… తరువాత ఏమైంది….
నిజామాబాద్, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన 70 సంవత్సరాల వయసుగల చింతకుంట నర్సుబాయి అనే మహిళ సోమవారం మధ్యాహ్నం వీక్లీ మార్కెట్లో తన రెండు తులాల గుండ్లు గల సంచి పోగొట్టుకుంది. చివరకు పోలీసుల సహాయంతో పోగొట్టుకున్న బంగారం తన స్వంతమైంది. వివరాల్లోకి వెళితే… నర్సుబాయి అంగడి చేయడానికి నిజామాబాద్ వీక్లిమార్కెట్కు వచ్చి రొయ్యలు కొనుగోలుచేసి డబ్బు ఇవ్వబోయి సంచి అక్కడే మరిచిపోయింది. కొద్దిసేపటికి సంచి కనబడకపోయే సరికి 1వ ...
Read More »ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా
నిజామాబాద్, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ మూడవ సంవత్సరం ఓల్డ్ బ్యాచ్ పరీక్షలు ఈనెల 21 నుంచి 23 వరకు జరగాల్సినవి వాయిదా పడినట్లు అధ్యయన కేంద్రం రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్‌సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా ఈనెల 27 నుంచి జరగాల్సిన డిగ్రీ ద్వితీయ సంవత్సరం పరీక్షలు యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు. వాయిదా పడ్డ పరీక్షల తేదీలు నిర్ణయమైన తర్వాత తెలియపరుస్తామని, మరిన్ని వివరాలకు యూనివర్సిటీ ...
Read More »సర్పంచ్‌లకు ఆ అధికారం ఉంది…
నిజామాబాద్, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవంబర్ 9 వ తేదీ లోపు జిల్లాలోని అన్ని గ్రామాలలో వైకుంఠ ధామాలు పూర్తి కావాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి సంబంధిత అధికారులు మరియు సర్పంచులను ఆదేశించారు. మంగళవారం జిల్లాల్లోని ఎంపిడివోలు, ఎంపీవోలు, సర్పంచులు తదితరులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. 530 గ్రామ పంచాయితీలకు 15 రోజుల్లో మంజూరు ఉత్తర్వులు ఇచ్చామని, 97 ప్రాంతాల్లో అటవీశాఖ భూములు గుర్తించి ఇచ్చామని, సర్పంచులకు పని చేయటానికి ...
Read More »సబ్సిడీలు వెంటనే మంజూరు చేయాలి
నిజామాబాద్, అక్టోబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెండింగులో ఉన్న పెట్టుబడి సబ్సిడీలు వెంటనే మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని తన ఛాంబర్లో 41 వ టీఎస్-ఐపాస్ మరియు జిల్లా పరిశ్రమల అభివద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పెండింగులో ఉన్న పౌల్ట్రీ ఫామ్, నాలా కన్వర్షన్లతో సహా పెండింగులో ఉన్న అన్ని సబ్సిడీలు నిబంధనల ప్రకారం ఉన్నట్లయితే వెంటనే మంజూరు చేయాలని, టి ...
Read More »రైతులను లాభాల బాటలోకి తెప్పించాలి
నిజామాబాద్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉమ్మడి జిల్లా రైతులను లాభాల బాటలో తెప్పించేందుకు డిసిసిబి బ్యాంకు ద్వారా కషి చేయాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన డిసిసిబి బ్యాంకు అంతస్తులో చైర్మన్ చాంబర్‌ను స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకుకు రాష్ట్రంలోనే ఎంతో గొప్ప చరిత్ర ఉందని ఆ చరిత్రను నిలుపుకునే బాధ్యత ప్రతి ...
Read More »బాధిత కుటుంబానికి కార్పొరేటర్ సాయం
నిజామాబాద్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 49వ డివిజన్లో తులసి వెంకటస్వామి ఇల్లు శనివారం అర్ధరాత్రి విద్యుత్ షాట్సర్క్యూట్కు గురైంది. దీంతో మంటలు ఇల్లంతా వ్యాపించి ఇంటిలోని నిత్యవసర సామాగ్రి, ఫర్నీచర్, ఇతరత్రా వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయి. విషయం తెలుసుకున్న 49వ డివిజన్ కార్పొరేటర్ మెట్టు విజయ్ రూ. 20 వేలు తక్షణమే ఆర్థిక సహాయంగా అందజేశారు. అర్ధరాత్రి కుటుంబసభ్యులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో విద్యుత్ షాట్ సర్క్యూట్ కావడం, మంటలతో వస్తువులు కాలిపోవడం విచారకరమని విజయ్ ఆవేదన వ్యక్తం ...
Read More »వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం
నిజామాబాద్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్రంలోని మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి నష్టం కలిగించే మూడు వ్యవసాయ చట్టాలను ఆమోదించిందని రైతు లందరు వాటికి వ్యతిరేకంగా పోరాడాలని సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు బి.మల్లేష్ పిలుపు నిచ్చారు. ఆదివారం ఉదయం మోస్రా మండలం తిమ్మాపూర్ గ్రామంలో రైతులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా రైతులందరు వ్యతిరేకిస్తున్నా, మోడీ పట్టుబట్టి బడా కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ఆర్డినెన్సులను పార్లమెంట్లో బిల్లులుగా ఆమోదింప జేశారని, చట్టాలు ...
Read More »గతంలో లాగా కాకుండా కొత్తగా పనిచేయాలి
నిజామాబాద్, అక్టోబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి పోర్టల్ అవగాహనా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి. శనివారం జిల్లాలోని ఎంఆర్ఓలు మరియు ఆపరేటర్లకు ధరణి పోర్టల్‌పై ప్రెసెంటషన్ ఇచ్చిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడారు. గతంలో పని చేసిన తీరుగా కాకుండా కొత్తగా పనిచేయాలని, నెగెటివ్ ఆలోచనలు రానీయకుండా ప్రతి అధికారి పాజిటివ్గఆ వెళ్ళాలన్నారు. ప్రభుత్వం ఇప్పుడు అన్ని ఆప్షన్లు సిటిజెన్‌కు ఇస్తున్నదని, ఎంఆర్ఓలు ఆధార్, ఫోటో దరఖాస్తుదారుదా కాదా సరి చూసుకోవాలి తప్ప రిజిస్ట్రేషన్ ఆపే ...
Read More »దసరాకు ధరణి లాంచ్…
నిజామాబాద్, అక్టోబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి పోర్టల్ అవగాహణపై జిల్లా కలెక్టర్లు, ఆడిషనల్ కలెక్టర్లు, ఆర్డిఓలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్. శనివారం తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు మరియు ఆర్డీవోలకు ధరణి పోర్టల్ పై వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రెసెంటషన్ ఇచ్చిన అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడారు. దసరాకు ధరణి లాంచ్ అవుతున్నదని, ఇది చాలా పారదర్శకంగా, ఖచ్చితత్వంతో, సేఫ్ అండ్ సెక్యూర్డుగా ఉంటుందన్నారు. ...
Read More »గంటకు రూ.2500 లకు మించి వసూలు చేయరాదు
నిజామాబాద్, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో 2020 వానా కాలపు వరి పంటలకు అధిక వర్షాల వలన ట్రాక్టరు చేల్లోకి వెల్లే పరిస్తితి లేదని, ఇదే అదనుగా తీసుకొన్న హార్వెస్టర్ల యజమానులు తమ ఇష్టం వచ్చినట్లు రేట్లు వసూలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దష్టికి తేవడం జరిగింది. దీనివల్ల చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందులకు గురవుతారని కనుక ప్రస్తుత పరిస్తితుల్లో రైతు శ్రేయస్సు దష్ట్యా వరి కోతకు ఎకరానికి, గంటకు 2500 రూపాయలకు మించి వసూలు చేయరాదని, ...
Read More »