Breaking News

Nizamabad

ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్‌ ఉండకూడదు

నిజామాబాద్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల నుండి స్వీకరించిన ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించి పెండింగ్‌ లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సందర్భంగా సోమవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ పలు విషయాలపై అధికారులు స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఆస్తుల వివరాలను ఇప్పటికే శాఖలను కోరడం జరిగిందని, వెంటనే నివేదికలను అందించాలని ఆయన ...

Read More »

అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం

నిజామాబాద్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం ఆర్‌టిసి కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలపడానికి వెళ్ళిన ఏఐటియుసి జిల్లా ప్రదాన కార్యదర్శి వై.ఓమయ్యను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు నర్సింగ్‌రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పోలీసు రాజ్యాన్ని నడుపుతుందన్నారు. 43 రోజులుగా ఆర్‌టిసి కార్మికులు సమ్మె చేస్తుంటే పట్టించుకోక పోగా, కార్మిక సంఘాల నాయకులతో చర్చించక పోగా, శాంతి యుతంగా గాందేయ మార్గంలొ సమ్మె చేస్తూ కార్మిక సంఘాల నాయకులు ప్రధాన ...

Read More »

తహసీల్‌ కార్యాలయాల్లో సెక్యూరిటీ

నిజామాబాద్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తహసిల్దార్‌ కార్యాలయాలలో ఎటువంటి సంఘటనలకు తావు లేకుండా సెక్యూరిటీ చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కషిచేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తహసిల్దార్లకు పలు విషయాలపై సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇటీవల జరిగిన సంఘటన ప్రతి ఒక్కరు ఖండించడంతో పాటు ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపవలసిందేనన్నారు. ఈ విషయమై ...

Read More »

ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇసుకకు అనుమతులు

నిజామాబాద్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ప్రజల అవసరాలు ప్రభుత్వ కార్యక్రమాలను దష్టిలో పెట్టుకొని ఇసుకను మంజూరు చేయుటకు అనుమతులకు ఆమోదించడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. శనివారం తన ఛాంబర్లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బోధన్‌ మండలం మందర్న గ్రామంలో అసైన్డ్‌ భూముల్లో ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో ఇసుకను తీసుకోవడానికి నాలుగు దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. అందుకు అనుగుణంగా సంబంధిత శాఖలయిన ...

Read More »

జెండాగల్లి పాఠశాలలో బాలల దినోత్సవం

నిజామాబాద్‌, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలల దినోత్సవాన్ని గురువారం 300 క్వాటర్స్‌లోనీ జండా గల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలతో పాటు సాంస్క తిక కార్యక్రమాలు నిర్వహించారు. గెలుపొందిన బాలబాలికలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామచందర్‌ గైక్వాడ్‌ ఉపాధ్యాయులు మంజుల నరేష్‌, కవిత, శైలజ పాల్గొన్నారు.

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం

నిజామాబాద్‌, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇందూర్‌ ఆద్వర్యంలో గురువారం నిజామాబాదు నగరంలోని వి.ఎన్‌.ఆర్‌. పాఠశాలలో బాలల దినోత్సవ సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విచిత్ర వేషధారణ, ఏక్‌ మినట్‌, మ్యూజికల్‌ చైర్‌ తదితర పోటీలు నిర్వహించారు. విచిత్ర వేషధారణ పోటీలో పాల్గొన్న చిన్నారులు నెహ్రూ, సైనికుడు, డాక్టర్‌, స్పైడర్‌ మెన్‌ వేషాల్లో ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి లయన్స్‌ జిల్లా జీఎస్టీ కో ఆర్డినేటర్‌ గంధాని శ్రీనివాస్‌ ముఖ్యఅతిధిగా హాజరై విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ...

Read More »

నోటుపుస్తకాల పంపిణీ

నిజామాబాద్‌, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇందూర్‌ ఆద్వర్యంలో గురువారం నిజామాబాదు మండలం ధర్మారం తాండా ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవ సంబరాలు నిర్వహించారు. పాఠశాలకు చెందిన విద్యార్థులకు పండ్లు, నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు లక్ష్మినారాయణ భరద్వాజ్‌ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. పేద విద్యార్థులకు లయన్స్‌ క్లబ్‌ అండగా ఉంటుందని చెప్పారు. లయన్స్‌ క్లబ్‌ కార్యదర్శి చింతల గంగాదాస్‌, కోశాధికారి సిలివేరి గణేష్‌, ...

Read More »

షుగర్‌ వ్యాధి అవగాహన ర్యాలీ

నిజామాబాద్‌, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా నిజామాబాదు నగరంలో గురువారం ఉదయం లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో డయాబెటిక్‌ అవగాహన కారు ర్యాలీ నిర్వహించారు. పాలిటెక్నిక్‌ మైదానం వద్ద ర్యాలీని నిజామాబాద్‌ ఏసిపి జి.శ్రీనివాస్‌ కుమార్‌ జెండా ఊపి ప్రారంబించారు. ప్రజలకు షుగర్‌ వ్యాది పట్ల అవగాహన కోసం ర్యాలీ నిర్వహించడం అభినందనీయమని ఏసిపి అన్నారు. మధుమేహ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని పిలుపునిచ్చారు. మధుమేహం నివారణ కోసం యోగా వ్యాయామం, వాకింగ్‌ ...

Read More »

చెక్‌పోస్టుల వద్ద తహసిల్దార్‌ కార్యాలయాలలో బందోబస్తు

నిజామాబాద్‌, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా సరిహద్దులోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద, తహశీల్‌ కార్యాలయాల్లో బందోబస్తుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు పోలీస్‌ అధికారులకు తెలిపారు. గురువారం తన చాంబర్లో పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ, రెవెన్యూ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు జిల్లాలో పెద్ద ఎత్తున వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నందున, మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల కంటే కనీస మద్దతు ధర ...

Read More »

ఓటరు వెరిఫికేషన్‌ కార్యక్రమం విజయవంతం చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటర్‌ జాబితాలో తప్పులు లేకుండా స్పష్టంగా ఉండేందుకు ఓటర్‌ వెరిఫికేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతానికి కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ అన్నారు. ఓటర్‌ వెరిఫికేషన్‌ పోగ్రామ్‌ కార్యక్రమంలో భాగంగా బుధవారం హైదరాబాద్‌ నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ గత అసెంబ్లీ పార్లమెంట్‌ ఎన్నికలలో ఓటర్లు ఎంతో ఇబ్బంది పడిన నేపథ్యంలో ఓటర్‌ వెరిఫికేషన్‌లో ఓటర్‌ జాబితా స్పష్టంగా ...

Read More »

పన్నులు, రుసుముల వసూలుకు చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ శాఖల ద్వారా వసూలు చేయవలసిన పన్నులు, ఇతర రుసుములను రికవరీ చేయడానికి కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ మాత్యులు హరీష్‌ రావు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కే. జోషితో కలిసి జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 11 శాఖలకు సంబంధించి రూ. 1966 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వివిధ రకాల రుసుములు, ...

Read More »

పకడ్బందీగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ

నిజామాబాద్‌, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌ నుండి పౌరసరఫరాల శాఖామాత్యులు కమలాకర్‌, వ్యవసాయ శాఖ మాత్యులు నిరంజన్‌ రెడ్డిలు ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వివరిస్తూ వర్షాలు సమద్ధిగా పడినందున, రైతుబంధు, రైతు బీమా వల్ల జిల్లాలో 40 శాతం అదనంగా వరి సాగు జరిగిందని తెలిపారు. తద్వారా గతంలో కంటే అధికంగా ధాన్యం కొనుగోలు ...

Read More »

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు

నిజామాబాద్‌, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీయడానికి గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆర్మూర్‌ ఆర్‌డివో శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం ఆర్మూర్‌ జ్యోతిబాఫూలే తెలంగాణ బిసి బాలికల వసతి గృహ పాఠశాలలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మౌలానా అబుల్‌ కలాం జయంతి, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం బిసి వసతి గృహాలను ఏర్పాటుచేసి ప్రయివేటుకు ధీటుగా ...

Read More »

డిసెంబరు 1న బిసి యువజన రాష్ట్ర మహాసభ

నిజామాబాద్‌, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసెంబర్‌ ఒకటిన హైదరాబాద్‌ రవీంద్రభారతిలో బిసి యువజన సభ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారం మహాసభ కరపత్రాలను నిజామాబాద్‌ వంశీ ఇంటర్నేషనల్‌ హోటల్లో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనకాల శ్యామ్‌ నంద, బిసి సంక్షేమ సంఘం నిజామాబాద్‌ జిల్లా అధ్యక్ష నరాల సుధాకర్‌ విడుదల చేశారు. బీసీ యువత తమను ...

Read More »

లోక్‌ అదాలత్‌ ద్వారా సత్వర పరిష్కారం

నిజామాబాద్‌, నవంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లోక్‌ అదాలత్‌ ద్వారా న్యాయ సంబంధిత సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు, సీనియర్‌ న్యాయవాది రాజ్‌ కుమార్‌ సుబేదార్‌ అన్నారు. వైబ్రంట్స్‌ ఆఫ్‌ కలామ్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం ”న్యాయ సేవల దినోత్సవం” పురస్కరించుకొని నిజామాబాదు నగరంలోని సిఎస్‌ఐ డిగ్రీ కళాశాలలో న్యాయ సేవలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి రాజ్‌ కుమార్‌ సుభేదర్‌ వక్తగా హాజరై మాట్లాడారు. న్యాయ సేవల గురించి ప్రతి ...

Read More »

అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులను సస్పెండ్‌ చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీ సమ్మె సందర్బంగా నిజామాబాద్‌లో పోలీసులు శుక్రవారం అరెస్టు చేస్తున్న క్రమంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి సబ్బని లత, ఆర్టీసీ మహిళా ఉద్యోగి అరుందతిలను సిపిఎం, బిఎల్‌ఎఫ్‌ నేతలు పెద్ది వెంకట్రాములు, దండి వెంకట్‌ తదితరులు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్‌ నియంత పాలనకు చరమగీతం పాడేరోజులు దగ్గర పడ్డాయన్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో సమ్మె ...

Read More »

బీడీ కార్మిక నేతల అరెస్టు

నిజామాబాద్‌, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా శుక్రవారం తెలంగాణ బీడీ వర్కర్స్‌ యూనియన్‌ ఆద్వర్యంలో నిజామాబాదు నగరంలో బీడీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నినాదాలు చేశారు. ధర్నా చౌక్‌ వద్ద ఆర్టీసి దీక్షా శిబిరానికి రాకుండా బీడీ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. అనంతరం బీడీ కార్మిక నేత వి.కష్ణతో పాటు పిడిఎస్‌యు నేత సుధాకర్‌ తదితరులను అరెస్టు చేశారు.

Read More »

చెక్కుల అందజేత

నిజామాబాద్‌, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన 17 మంది లబ్దిదారులకు సంబందించిన మొత్తం ఆరు లక్షల నలబై రెండు వేల ఐదు వందల రూపాయల చెక్కులను నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త అందజేశారు. నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కార్యక్రమం నిర్వహించారు. తెరాస నాయకులు ఆకుల శ్రీశైలం, అంతరెడ్డి దేవేందర్‌ రెడ్డి, దండు శేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

సర్కారు మూల్యం చెల్లించక తప్పదు

నిజామాబాద్‌, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీ సమ్మెలో భాగంగా శనివారం నాటి చలో ట్యాంక్‌ బండ్‌ కార్యక్రమం దష్ట్యా పోలీసులు నిజామాబాదు ధర్నా చౌక్‌ దీక్ష శిబిరం వద్ద ప్రజా సంఘాలు, వివిద పార్టీల నేతలు, ఆర్టీసీ కార్మికులను అరెస్టు చేసి ఆయా పోలీస్‌ స్టేషన్‌లకు తరలించారు. అరెస్టుల సందర్భంగా సిపిఐఎం నేత సబ్బని లత, ఆర్టీసి కార్మికురాలు అరుందతిలు అపస్మారక స్థితికి చేరుకోవడంతో వారిని ఆసుపత్రి కి తరలించారు. సమ్మె శిబిరంపై పోలీసుల దాడికి కేసిఆర్‌ సర్కార్‌ ...

Read More »

రీస్టార్ట్‌ ఏ హార్ట్‌ అంశంపై అవగాహన

నిజామాబాద్‌, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు మనోరమ ఆసుపత్రిలో శుక్రవారం ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ అనెస్తియాలజిస్ట్స్‌ నిజామాబాద్‌ జిల్లా శాఖ ఆద్వర్యంలో ” రీస్టార్ట్‌ ఎ హార్ట్‌” అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రముఖ మత్తు వైద్యనిపుణులు ఎ.శ్రీధర్‌ వక్తగా హాజరై మాట్లాడుతూ గుండెపోటు వచ్చినప్పుడు, రోడ్డు ప్రమాదాలు తదితర సంఘటనలు జరిగినప్పుడు చాలా మంది అపస్మారక స్థితిలోకి వెళ్తారన్నారు. అలాంటి వారిని తిరిగి స్పహలోకి తెచ్చేందుకు కొన్ని పద్దతులు పాటించాలని సూచించారు. అపస్మారక స్థితిలోకి వెళ్ళినవారిని ముందుగా ...

Read More »