Breaking News

Nizamabad

ఏబీవిపి ఆధ్వర్యంలో గుడ్లు, బిస్కెట్లు పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిల‌ భారతీయ విద్యార్థి పరిషత్‌ కామారెడ్డి జిల్లా బిక్నూర్‌ శాఖ ఆధ్వర్యంలో వల‌స కార్మికుల‌కు గుడ్లు, బిస్కెట్లు అందజేశారు. బుధవారం బాటసారులు, వల‌స కార్మికులు ఉంటున్న రెసిడెన్షియల్‌ వసతి గృహంలో గుడ్లు బిస్కెట్‌ ప్యాకెట్‌లు అందజేశారు. అఖిల భారత విద్యార్థి పరిషత్‌లో పని చేసిన పూర్వ కార్యకర్త మల్లేశ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. మల్లేశ్‌ ఇందుకు సంబంధించిన విరాళం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జరి కృష్ణ, బిక్నూర్‌ ...

Read More »

నేను మీ జిల్లా కలెక్టర్‌ ను మాట్లాడుతున్నాను

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు కేంద్రాల‌కు ఇబ్బందులు పడకుండా ధాన్యం తెచ్చే విధానాన్ని వివరిస్తూ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి రైతు సోదరుల‌కు మెసేజ్‌ పంపారు. జిల్లా రైతు సోదరుల‌కు నమస్కారమని, తాను జిల్లా కలెక్టర్‌ను మాట్లాడుతున్నానని అంటూ కరోనా వైరస్‌ గురించి మీ అందరికీ తెలుసు అని లాక్‌ డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగించి వ్యాధిని ఎదుర్కొనే విధంగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని అప్పుడే ఇది ఇది ఎక్కడికక్కడ ఆగిపోతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల‌కు ఇబ్బందులు రాకుండా ...

Read More »

ధైర్యంగా పని చేయండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ నివారణలో వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్‌ శాఖ ఉద్యోగుల సేవ‌లు వెకట్టలేనివని, ధైర్యంగా పనిచేయాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన కంటేయిన్మెంట్‌ కొనసాగుతున్న అహ్మదిపుర కాల‌ని, మాపల్లి తదితర 55, 56 డివిజన్‌లో పర్యటించి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సర్వే పరిశీలించారు. సర్వే కొనసాగుతున్న విధానాన్ని ఆశా వర్కర్‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఎదురవువుతున్నాయా అని వారిని అడిగారు. సాఫీగా కొనసాగుతుందని ప్రజలు ...

Read More »

హైదరాబాద్‌ మినహా కరోనా కేసుల్లో నిజామాబాద్‌ జిల్లా తెలంగాణలో నెంబర్‌ వన్‌…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ప్రత్యేకం : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా రోజు రోజుకి కరోనా బారిన పడ్డ వారి సంఖ్య పెరిగిపోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం విషయానికొస్తే, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ జిల్లాను మినహాయిస్తే కరోనా కేసులు అత్యధికంగా ఉన్న జిల్లాగా నిజామాబాద్‌ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. కరోనా వ్యాధి బారిన పడిన వారి వివరాల‌ను తాజాగా ఏప్రిల్‌ 7వ తేదీ మంగళవారం రాత్రి 9 గంటల‌కు తెలంగాణ రాష్ట్ర ...

Read More »

మరికొద్ది రోజులు కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనాను అరికట్టడానికి ప్రభుత్వాలు నిర్దేశించిన లాక్‌ డౌన్‌కు ప్రజలు పూర్తిగా సహకరించారని, కేంద్ర ప్రభుత్వ సూచనల‌ మేరకు పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతాల్లో ప్రభుత్వం విధించే కంటేయిన్మెంట్‌కు కూడా కొద్ది రోజులు ప్రజలు ఇదే సహకారాన్ని అందించి మనమంతా క్షేమంగా ఉండడానికి తమ వంతుగా చేయూత అందించాల‌ని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల‌ శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి జిల్లా ప్రజల‌ను కోరారు. జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు, తదనంతరం యంత్రాంగం ...

Read More »

క్లస్టర్‌ కార్యాల‌యం ప్రారంభం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ లాక్‌ డౌన్‌ ఆంక్షలు కంటేయిన్మెంట్‌ చర్యల‌ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, సంబంధిత అధికారుల‌తో కలిసి మంగళవారం నగరంలో పర్యటించారు. పెద్ద బజార్‌ వాటర్‌ ట్యాంక్‌ వద్ద క్లస్టర్‌ కార్యాల‌యాన్ని ప్రారంభించారు. అనంతరం ఖిల్లా రోడ్డు చౌరస్తా వద్ద బందోబస్తు పరిశీలించారు. మొగ‌ల్‌పూరా కాల‌నీ, ఖిల్లా రోడ్డు రెండు వైపులా బారికేడిరగ్‌ పరిశీలించారు. ఆసుపత్రిలో మరణించిన వ్యక్తి నివాస ప్రాంతం పరిశీలించారు. అత్యవసర ...

Read More »

పిట్ట కథ…

కాదు ఇది కరోనా కబలించే కథ… ఒక గూడులో కోడి, కొన్ని పిల్లలు ఉండేవి. కోడి తన పిల్ల‌ల‌కు బయటకు రాకూడదు, బయటకు వస్తే ప్రమాదం అని హెచ్చరించేది. పిల్ల‌లు తల్లితో పాటు తిరిగేవి గూటిలో భద్రముగా ఉండేవి. ఒక రోజు తల్లి మాట వినకుండా ఒక పిల్ల‌ బయటకు వచ్చింది. అమాంతంగా గద్ద ఆ పిల్ల‌ను తన కాళ్లతో పట్టుకొని ఆకాశం వైపు పైకి లేచింది. కోడిపిల్ల‌ చాలా సంతోషంతో నేను బయటకు వస్తే ప్రమాదం లేదు! నేను అందరి కన్న హైట్‌లో ...

Read More »

కరోనా బాధితుల‌కు కంప్యూటర్‌ ఆపరేటర్ల ఒక్కరోజు వేతనం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని ఈ పంచాయత్‌ కంప్యూటర్‌ ఆపరేటర్లు అందరు కలిసి జిల్లా పంచాయతి అధికారి డా.జయసుధ ద్వారా జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డిని కలిసి కరోనా బాధితుల‌ సహాయార్థం తమ ఒక్కరోజు వేతనాన్ని, వంద మాస్కుల‌ను విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో పంచాయత్‌ కంప్యూటర్‌ ఆపరేటర్ల సంఘం నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి ప్రసాద్‌, ఉపాధ్యక్షుడు శివాజీ, ఆపరేటర్‌ రాజశేఖర్‌, అనిల్‌ తదితరులున్నారు.

Read More »

కరోనాపై పకడ్బందీ చర్యలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో మరో 10 కరోనా పాజిటివ్‌ నమోదు అయినందున దాని విస్తరణను కంట్రోల్‌ చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. సోమవారం ఆర్డీవో, మున్సిపల్‌ కమిషనర్‌, ఏసిపి హెల్త్‌ టీమ్స్‌తో జిల్లా కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కరోనా వైరస్‌ కేసులు పెరిగిన దృస్ట్యా పకడ్బందిగా చర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. మంగళవారం నుండి కంటేయిన్మెంట్‌ ఆదేశాల‌ను పటిష్టంగా అమలు ...

Read More »

జిల్లాలో మరో పది పాజిటివ్‌ కేసులు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో మరో 10 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం సిపి కార్తికేయతో కలిసి కొత్తగా నమోదైన కరోనా వైరస్‌ కేసులు, తదుపరి యంత్రాంగం తీసుకునే చర్యల‌పై ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధుల‌తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో 19 పాజిటివ్‌ కేసులు నమోదైన విషయం ప్రజల‌కు తెలుసని, మొన్న పంపిన నల‌భై ఒక్క శాంపుల్స్‌లో ...

Read More »

వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పూర్తిస్థాయిలో విధులు నిర్వహించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ కొనసాగుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పూర్తిస్థాయిలో పనిచేయాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. సోమవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్‌, పోలీసు, రెవెన్యూ సిబ్బంది మరియు అధికారుల‌తో కరోనా వైరస్‌కు తీసుకునే చర్యల‌పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కార్యాల‌యంలోనూ క్షేత్ర స్థాయిలోనూ పూర్తిస్థాయిలో విధులు నిర్వహించవసి ఉన్నదని, ఈ శాఖకు ...

Read More »

తాగునీటి సమస్య ఏర్పడితే ఫోన్‌ చేయండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవిలో తాగునీటి సమస్యు ఎదురైతే 9154220064 నెంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదులు అందించాల‌ని మిషన్‌ భగీరథ నిజామాబాద్‌ డివిజన్‌ కార్యనిర్వాహక ఇంజనీరు రాకేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »

కోవిడ్‌ -19 ఆసుపత్రిగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని కోవిడ్‌-19 ఆసుపత్రిగా మార్చటానికి చర్యలు అవసరమైన ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ సి . నారాయణ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. కలెక్టర్‌ తన క్యాంపు కార్యాల‌యంలో ఆదివారం డిఎం హెచ్‌ఓ, ఆసుపత్రి సూపరింటెండెంట్‌, మెడికల్‌ అధికారుల‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా కేసులు పెరుగనున్న దృష్ట్యా ఆసుపత్రిలో 500 బెడ్స్‌కు ప్లాన్‌ చేసుకొని సిబ్బందిని సిద్ధం చేసుకోవాల‌న్నారు. ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆసుపత్రిని పూర్తిగా ...

Read More »

కంటేయిన్మెంట్‌ ప్రాంతాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ కేసు వచ్చిన ప్రాంతాల‌లో కంటేయిన్మెంట్‌గా ప్రకటించే చోట అన్ని జాగ్రత్తలు తీసుకోవాల‌ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఆదివారం ఆయన హైదరాబాదు నుండి జిల్లా కలెక్టర్లతో కరోనా వైరస్‌ పట్ల తీసుకుంటున్న చర్యల‌పై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంతాల‌ను ప్రత్యేక జాగ్రత్తతో చర్యలు తీసుకోవాల‌ని, అక్కడి ప్రజల‌ నమూనా సేకరణ పూర్తిస్థాయిలో జరగాల‌ని, ఈ ప్రాంతాల‌లో ఎవరు ...

Read More »

మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌ రామ్‌ 113 వ జయంతి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌ రామ్‌ 113 వ జయంతిని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆదివారం బాబు జగ్జీవన్‌రామ్‌ 113వ జయంతి సందర్భంగా ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో కొద్దిమంది అధికారుల‌ సమక్షంలో జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో సభలు సమావేశాలు నిర్వహించకుండా అభిమానులు వారి నాయకుల‌ జయంతి వేడుకల‌ను ఇంట్లోనే ఉండి నివాళులు అర్పించాల‌ని ప్రభుత్వం ఆదేశించినందున కార్యక్రమాన్ని ప్రజల‌తో జరుపబడలేదు. ప్రగతి భవన్‌లో నిర్వహించిన ...

Read More »

21 వాహనాలు సీజ్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు ఉ్లంఘించి చట్టవిరుద్దంగా రోడ్లపై తిరుగుతున్న మొత్తం 21 వాహనాలు సీజ్‌ చేయడం జరిగిందని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. సీజ్‌ చేసిన వాటిలో 15 ద్విచక్ర వాహనాలు, ఆటోలు 6 ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ పరిశీలించేందుకు శనివారం కమీషనరేట్‌ పరిధిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలందరు స్వీయ నిర్బంధంలో ఉంటూ సహకరించాల‌ని పేర్కొన్నారు. రాత్రి 7 ...

Read More »

వైద్యు చిట్టి లేనిదే మందులు అమ్మకూడదు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైద్యులు చిట్టి ` ప్రిస్కిప్షన్‌ లేనిదే జలుబు, దగ్గు, జ్వరం, శ్వాసకోశ సంబంధ సమస్యల‌కు సంబంధించిన మందుల‌ను ఔషధ దుకాణాల‌లో విక్రయించరాదని నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల‌ ఔషద నియంత్రణ శాఖ సహాయ సంచాకులు డాక్టర్‌ రాజ్యల‌క్ష్మి అన్నారు. కరోనా నేపథ్యంలో ఔషద నియంత్రణ శాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ రాజ్యల‌క్ష్మి మాట్లాడుతూ ప్రస్తుత విపత్కర పరిస్తితి దృష్టిలో ఉంచుకొని ఎవరైనా రోగులు, బాధితులు, వారి సంబంధీకులు జలుబు, ...

Read More »

మహనీయుల‌ జయంతి ఉత్సవాలు ఇంట్లోనే జరుపుకోవాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌ ఈనెల‌ 14వ తేదీ వరకు కొనసాగుతుంది. కాగా ఇద్దరు మహానేతల‌ జయంతి వేడుకలు ఈనెల‌ 5న బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి, 14న డాక్టర్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకల‌ను రాష్ట్ర ప్రభుత్వం పరిమితం చేసిందని నిజామాబాద్‌ జిల్లా షెడ్యూల్డు కులాల‌ అభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఇరువురు మహానేతల‌ జయంతి ఉత్సవాల‌ను ఇంట్లోనే జరుపుకోవాల‌ని కోరారు.

Read More »

అధికారులు తీసుకునే చర్యల‌కు ప్రజలు సహకరించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో కరోనా వైరస్‌ పాజిటివ్‌గా 18 కేసులు నమోదు కావడం చిన్న విషయమేమీ కాదని, ప్రజలు జాగ్రత్తగా ఉండకుంటే అందరికీ ఇబ్బందేనని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో కరోనా వైరస్‌పై జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యల్ని సిపి కార్తికేయతో కలిసి వివరించడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఢల్లీి నుండి వచ్చిన వారిలో జిల్లాలో 18 కేసులు పాజిటివ్‌గా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందేనని, ...

Read More »

ఉమ్మడి జిల్లాలో 26 కరోనా కేసులు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కొత్తగా శుక్రవారం మరో 19 కరోన పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో నిజామాబాద్‌ జిల్లాలో 16, కామారెడ్డి జిల్లాలో 3 మొత్తం 19 కేసుల‌ను అధికారులు గుర్తించారు. వీటితో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కరోనా కేసులు 26 నమోదయ్యాయి. నిజామాబాద్‌ జిల్లాలో నమోదైన 16 కేసుల్లో 15 నిజామాబాద్‌ నగరంలో, 1 మాక్లూర్‌లో గుర్తించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడలో 3 కేసులు గుర్తించారు. గతంలో నిజామాబాద్‌ జిల్లాలో 2, ...

Read More »