Nizamabad

జిల్లా అధికారులతో కలెక్టర్‌ సమీక్ష

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కస్టమ్‌ మిల్డ్‌ రైస్‌, రైతు వేదికలు, పల్లె ప్రకతి వనాలు, స్ట్రీట్‌ వెండర్స్‌, నర్సరీలు, ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాలపై సమీక్షించిన జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి. బుధవారం ఆర్డిఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, మెప్మా, డిపిఓ, పిఆర్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎంఆర్‌ పర్‌ఫెక్టుగా ప్లాన్‌ చేయాలని, ప్రతి రైస్‌ మిల్‌ దగ్గర్నుండి రోజుకు రెండు ఏసికె (29 ఎంటిఎస్‌) ల రైస్‌ బయటికి వెళ్లాలని, అలా అయితేనే మనం ...

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల అందజేత

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న నిజామాబాద్‌ రూరల్‌ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు మంజూరు చేయించారు. మోపాల్‌ మండల కేంద్రానికి చెందిన సాయిలుకి 16 వేలు, మోపాల్‌ మండలానికి చెందిన సులోచనకి 60 వేలు, ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన రాజా గౌడ్‌కి 46 వేలు చెక్కులను అందజేశారు. ఈ సందర్బంగా ధర్పల్లి జడ్పిటిసి సభ్యులు బాజిరెడ్డి జగన్‌ మోహన్‌ ...

Read More »

రూ. 3 లక్షల విలువ చేసే గుట్కా, జర్దా స్వాధీనం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్తికేయ ఉత్తర్వుల మేరకు టాస్క్‌ ఫోర్స్‌ ఇన్స్పెక్టర్‌ షాకేర్‌ అలీ మరియు వారి సిబ్బంది పలువురి ఇళ్ళలో తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్‌ 4వ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో పులాంగ్‌ ఎక్స్‌ రోడ్‌ సమీపంలో కొందరు వ్యక్తులు అక్రమంగా ఇంట్లో గుట్కా మరియు జర్ధా వుంచారని నమ్మదగిన సమాచారం మేరకు ఇంటిని తనిఖీ చేశారు. కాగా సుమారు మూడు లక్షల రూపాయల విలువ చేసే గుట్కా మరియు ...

Read More »

నిజామాబాద్‌లో మరొకరు కారెక్కారు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌కు చెందిన బీజేపీ 6వ డివిజన్‌ కార్పొరేటర్‌ తెరాసలో చేరారు. బుధవారం హైదరాబాద్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సమక్షంలో అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్త ఆధ్వర్యంలో బీజేపీ పార్టీకి చెందిన 6వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఉమారాణి, తడ్కల్‌ శ్రీను తెరాస పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభివద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి పార్టీలో చేరినట్టు తెలిపారు.

Read More »

గంగమ్మ తల్లికి పూజలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్పల్లి మండల కేంద్రంలో బుధవారం ఊర చెరువు నిండు కుండలా నిండి అలుగు వస్తున్న సందర్భంగా గ్రామ అభివద్ధి కమిటీ ఆధ్వర్యంలో దర్పల్లి జడ్పిటిసి సభ్యులు బాజిరెడ్డి జగన్‌ మోహన్‌, డిసిఎంఎస్‌ చైర్మన్‌ సాంబారు మోహన్‌, స్థానిక ఎంపిపి నల్ల సారిక హనుమంత్‌ రెడ్డి చెరువు సమీపంలో ఉన్న గంగమ్మ గుడిని దర్శించుకొని అనంతరం చెరువులో పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి జగన్‌ మోహన్‌ మాట్లాడుతూ ధర్పల్లి ...

Read More »

ఫోన్‌ చేయండి… పని కల్పిస్తాం..

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పనుల కోసం కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామాలలో ఉపాధి హామీ పనుల కోసం మండల స్థాయిలో, గ్రామస్థాయిలో పని అవసరమైనట్లయితే జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ నెంబర్‌లో 08462 229797 కు ఫోన్‌ చేసినట్లయితే పని కల్పించే ఏర్పాటు చేస్తామన్నారు. కాల్‌ సెంటర్‌ బుధవారం నుండి వినియోగంలోకి వస్తుందని, ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 ...

Read More »

డిమాండ్‌ ఉన్న పంట పండిస్తే అందరికి లాభం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫైన్‌ రకం వరికి మద్దతు ధరకన్నా ఎక్కువకు కొనే ట్రేడర్స్‌కు జిల్లా యంత్రాంగం మద్దతు ఉంటుందని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో దాన్యం కొనుగోళ్లపై రైస్‌ మిల్లర్స్‌, ట్రేడర్స్‌, పిఎసిఎస్‌ చైర్మన్‌, డిసిబి డైరెక్టర్స్‌ సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులు సన్న రకాలు ఎక్కువ పండించారని, దొడ్డు రకాలు తక్కువ ...

Read More »

సొంతింటి (కల) గానే మిగిలిపోయింది…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల ఆశపెట్టి పేదలను దోపిడి చేయడమే కాకుండా ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో ప్రజలను దోచుకుంటుందని, టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా మంగళవారం భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య మాట్లాడుతూ నిరుపేదలకు సొంతింటి కల నెరవేరుస్తామని టీఆర్‌ఎస్‌ సర్కారు నాలుగేళ్ల క్రితం హామి ఇచ్చి కాగితాలకే పరిమితం చేసిందని ధ్వజమెత్తారు. పేదోళ్లకు సొంతిటి కల కల ...

Read More »

సిటీ బస్సులు నడపాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ప్రభుత్వ గిరిరాజ్‌ డిగ్రీ, పీజీ కాలేజీకి మరియు నూతన కలెక్టరేట్‌కి ఆర్టీసీ సిటీ బస్సులు నడిపేలా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్‌.యూ) ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యూ జిల్లా అధ్యక్షురాలు సిహెచ్‌ కల్పన మాట్లాడారు. ప్రభుత్వ గిరిరాజ్‌ డిగ్రీ, పీజీ కాలేజీలో చదివే విద్యార్థులు గ్రామీణ పేద, మధ్యతరగతి విద్యార్థులు. వీరు ...

Read More »

భారీగా గుట్కా స్వాధీనం, నిందితుల అరెస్టు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ 2వ టౌన్‌ పరిధిలో భారీ మొత్తంలో గుట్కా పట్టుకుని, నిందితులను అరెస్టు చేసినట్టు నిజామాబాద్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాటి విలువ సుమారు 6 లక్షల వరకు ఉంటుందన్నారు. మంగళవారం నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్తికేయ ఉత్తర్వుల మేరకు టాస్క్‌ ఫోర్స్‌ ఇన్స్పెక్టర్‌ షాకేర్‌ అలీ, వారి సిబ్బంది నిజామాబాద్‌ 2వ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో కొందరు వ్యక్తుల ఇంట్లో ప్రభుత్వ నిషేదిత గుట్కా ఉందని, ...

Read More »

హెడాఫీస్‌ ముందు ధర్నా

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టెలిపొన్‌ బీడీ కంపనీలో బీడీలు చేసే కార్మికులకు కంపనీ వారు ఇస్తున్న ఆకు పలుగుడు, ముక్కుడు, దొడ్డు, నల్లగా, కలర్‌, ఖరాబు వున్నందున వేయి బీడీల ఆకులో కేవలం ఐదు వందల బీడీలు మాత్రమే అవుతున్నాయని, తక్కువ పడిన బీడీల కోసం కార్మికులు వారి సొంత డబ్బులతో ఆకు కొని భర్తీ చేస్తున్నారని, దీని మూలంగా ఆర్థికంగా నష్ట పోతున్నారని, నెలకు 10,12 దినముల పని, రోజుకు 5,6 వందల బీడీలకు మాత్రమే ...

Read More »

అక్టోబర్‌ 5 నుండి మాత్రలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 10 వ రౌండ్‌ దివార్మింగ్‌ డే సందర్బంగా అక్టోబరు 5 నుండి 12 వరకు ప్రతి ఒక్క పిల్లవాడికి అల్బెన్దజోల్‌ మాత్రలు వేసే కార్యక్రమం చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. సోమవారం జిల్లాలోని వైద్య, విద్య తదితర శాఖల అధికారులతో నిర్వహించిన సెల్‌ కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ మరియు అంగన్‌వాడి, ఇంటర్మీడియట్‌ అధికారులు ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతున్నవి కాబట్టి పిల్లలకూ వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, ...

Read More »

అక్రమ రవాణా చేస్తున్న పిడిఎస్‌ బియ్యం పట్టివేత

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు టాస్కు ఫోర్సు ఇన్స్‌పెక్టర్‌ షాకిర్‌ అలీ తన సిబ్బందితో కలిసి మాక్లూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దాడులు నిర్వహించి మాణిక్‌ బండార్‌ చౌరస్తా వద్ద 250 క్వింటాళ్ళ పిడిఎస్‌ బియ్యం రవాణా చేస్తున్న 2 ఐచర్‌ వాహనాలను మరియు డ్రైవర్‌ని పట్టుకొని మాక్లూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు.

Read More »

మానవత్వం చాటుకున్న టౌన్‌ సిఐ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో టౌన్‌ 4 పిఎస్‌ పరిధిలోని రోటరీ నగర్‌ కాలనికి సంబంధించిన గంగోని బాలమణి (65) ని తన కుమారుడు గత కొన్నిరోజుల నుండి వద్ధుల ఆశ్రమంలో చేర్పించారు. కాగా కొద్దిరోజుల క్రితం కరోనా సోకడంతో వధాశ్రమము నుండి ప్రభుత్వ హాస్పిటల్‌లో చేర్పించారు. ఈ మధ్య నెగెటివ్‌ రిపోర్ట్‌ రావడం వలన తిరిగి వద్ధాశ్రమానికి పంపగా కరోనా నేపథ్యంలో వృద్ధాశ్రమము మూసివేశారు. కావున సాటివారు బాలమణిని వారి కుమారుని వద్దకు తీసుకుని ...

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల అందజేత

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భాన్ని తెలుసుకున్న నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయం చెక్కులు మంజూరు చేశారు. ఇందల్వాయి మండలం లోలం గ్రామానికి చెందిన పోసానికి 18 వేల చెక్కు, చల్లగరిగ గ్రామానికి చెందిన గజానంద్‌కి 57 వేల చెక్కు, సిరికొండ మండలానికి చెందిన అభిషేక్‌కి 60 వేల చెక్కు అందజేశారు. ఈ సందర్బంగా ధర్పల్లి జడ్పిటిసి సభ్యులు బాజిరెడ్డి ...

Read More »

శ్మశాన వాటిక స్థలాన్ని రక్షించండి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని 13 వ డివిజన్‌లో గల సాయిరాం సర్వ సంఘం స్మశాన వాటిక స్థలాన్ని డివిజన్‌ ఎంఐఎం కార్పొరేటర్‌, అతని అనుచరులు భూ కబ్జాకు పాల్పడటంపై బీజేపీ నగర మాజీ అధ్యక్షులు యెండల సుధాకర్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలిసి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుధాకర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో న్యాయ పరంగా ఈ భూమిని సర్వే చేసి హద్దులతో సహా కేటాయించి కాలనీ సభ్యులకు ...

Read More »

ప్రాధాన్యతా క్రమంలో ముందుకు పోతున్నాం…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవస్థలో కావచ్చు, గ్రామాలలో, పట్టణాలలో కావచ్చు, బడుగు బలహీన సమాజంలో కావచ్చు వర్గాల వారీగా, పనుల వారిగా విభజించుకొని ప్రాధాన్యతా క్రమంలో గత ఐదు సంవత్సరాల నుంచి ముందుకు పోతున్న సంగతి మనందరికీ తెలుసని, ఈ రోజు తెలంగాణ నంబర్‌ వన్‌ రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వము లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనేక సర్వేలతో తేల్చి బహిరంగంగా చెప్పడం జరిగిందని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాలు, గ హనిర్మాణ ...

Read More »

బిజెవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధానమంత్రి నరేంద్రమోడి 70వ జన్మదినం సందర్భంగా జాతీయ, రాష్ట్ర మరియు జిల్లా పార్టీ పిలుపుమేరకు సేవా సప్తాహ్‌ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఇందూరు జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో బస్వ గార్డెన్‌ మరియు శ్రీరామ గార్డెన్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బస్వ లక్ష్మీనర్సయ్య రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పట్టణ బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు.

Read More »

25 వరకు యాక్షన్‌ ప్లాన్‌ ఇవ్వాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కిచెన్‌ గార్డెన్‌కు ల్యాండ్‌ ఐడెంటిఫై చేసి, ఏరియా లెవలింగ్‌కు యాక్షన్‌ ప్లాన్‌ ఈనెల 25 తేదీ వరకు ఇవ్వాలని అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. శనివారం సంబంధిత అధికారులతో అడిషనల్‌ కలెక్టర్‌ సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. అంగన్‌వాడి సెంటర్లలో ప్రైమరీ స్కూల్స్‌, హైస్కూల్లో కిచెన్‌ గార్డెన్‌ స్థలం ఐడెంటిఫై చేసి ప్లాంటేషన్‌ తర్వాత వాటి మెయింటెనెన్స్‌ పిఈటి మరియు కుక్కర్‌ చూసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కిచెన్‌ గార్డెన్‌ ప్లాంటేషన్‌ సంబంధించి టెక్నికల్‌ ...

Read More »

ఆరోగ్య భారతం కావాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా బిజెపి జాతీయ, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సేవా సప్తాహ్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం నిజామాబాద్‌ నగరంలోని 8 డివిజన్‌ పరిధిలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య పాల్గొని మాట్లాడారు. దేశ ప్రజలందరూ ఆరోగ్యంగా సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో మోడీ ప్రధానమంత్రి కాగానే స్వఛ్ఛభారత్‌ పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, ...

Read More »