Breaking News

Nizamabad

ఏ కారణం చేత ఫ్యాక్టరీ మూతపడింది…

నిజామాబాద్‌, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సారంగాపూర్‌ నిజాం కో-ఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి మంగళవారం పరిశీలించారు. షుగర్‌ ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రాపర్టీ, రెవెన్యూ రికార్డులు ప్రాపర్‌గా ఇంప్లిమెంట్‌ చేయించాల‌ని ఆర్డీవోను ఆదేశించారు. ఫ్యాక్టరీ డైరెక్టర్లతో మాట్లాడారు. ఏ కారణం చేత ఫ్యాక్టరీ మూత పడిందో డైరెక్టర్లు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. రైతులు చెరుకు పంట నుండి వేరే పంటకు మారడం, రా మెటీరియల్ ల‌భించకపోవడం కారణం అన్నారు. చెరుకు పండించిన రైతుకు చెరుకు ...

Read More »

25న ఉజ్బెకిస్తాన్‌కు గుగులోత్‌ సౌమ్య

నిజామాబాద్‌, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫిఫా ర్యాంకింగ్‌ కొరకు నిర్వహించనున్న అంతర్జాతీయ మ్యాచ్‌లో పాల్గొనడానికి భారతదేశం తరఫున ఇందూరు ఎక్స్‌ప్రెస్‌ గూగులోత్‌ సౌమ్య ప్రాతినిధ్యం వహించనుందని, ఏప్రిల్‌ 5 నుండి ప్రారంభం కానున్న మ్యాచ్‌కు సౌమ్య ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందని కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమి అధ్యక్షులు నరాల‌ సుధాకర్‌, నిజామాబాద్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు ఖలీల్‌, షఖీల్ లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల‌ 5న ఉజ్బెకిస్తాన్‌ దేశం తో అలాగే ఏప్రిల్‌ ...

Read More »

ప్రతి వర్షపు చుక్క సంరక్షించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ జల‌ దినోత్సవం సందర్భంగా ఈనెల‌ 22 నుండి నవంబర్‌ 30 వరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల‌లో జల‌శక్తి అభియాన్‌ కింద నీటి సంరక్షణ చర్యలు చేపట్టాల‌ని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. జల‌శక్తి అభియాన్‌, సీజనల్‌ వ్యాధులు, ఆజాదీ కి అమృత మహోత్సవం, టీఎస్‌ ఐపాసు, ఫారెస్ట్‌, రెవిన్యూ ల్యాండ్‌ ...

Read More »

ప్రజల‌ సహకారంతో నీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలి – ప్రధాని మోదీ

నిజామాబాద్‌, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నీటి సంరక్షణ లేకుండా అభివృద్ధిని ఊహించలేమని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ జల‌ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జిల్లా కలెక్టర్‌, కేంద్ర ప్రభుత్వ అధికారులు కేంద్ర జల‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌, సహాయ మంత్రి రతన్‌లాల్‌ కటారియా, కొన్ని రాష్ట్రాల‌ ముఖ్యమంత్రులు, రాష్ట్ర స్థాయి అధికారుల‌తో సోమవారం ఎన్‌ఐసి వీడియో కాన్ఫరెన్సు ద్వారా నీటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యల‌పై మాట్లాడారు. కేంద్ర జల‌ శక్తి అభియాన్‌లో భాగంగా ప్రధాని ...

Read More »

క్లిష్ట పరిస్థితుల్లో రక్తదానం ప్రశంసనీయం

నిజామాబాద్‌, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో బ్లడ్‌ బ్యాంకుల్లో రక్త నిలువ‌లు తగ్గిపోయిన సంగతి తెలుసుకొని ఇందూరు బ్లడ్‌ డోనర్స్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ నగరంలో గల్‌ రెడ్‌ క్రాస్‌ భవనంలో ఏర్పాటుచేసిన రక్త దాన శిబిరానికి స్వచ్చందంగా రక్తదాతలు వచ్చి రక్త దానం చేయడం గొప్ప విషయమని ఇందూరు బ్లడ్‌ డోనర్స్‌ గ్రూప్‌ ప్రధాన అడ్మిన్‌ నరాల‌ సుధాకర్‌ అన్నారు. కేవలం సోషల్‌ మీడియాలో చూసి సోమవారం పది మంది రక్త దానం చేయడం గొప్ప ...

Read More »

క్షేత్ర స్థాయి పర్యటనతో విషయాలు తెలుస్తాయి

నిజామాబాద్‌, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే సమస్యలు తెలుస్తాయని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. వారం రోజుల‌ పాటు క్షేత్రస్థాయిలో పర్యటించిన సివిల్‌ సర్వీస్‌ శిక్షణ అధికారుల‌కు ఆదివారం స్థానిక వంశి హోటల్‌లో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, జిల్లా అటవీ అధికారి సునీల్‌తో పాటు ముఖ్యఅతిథిగా హాజరైన అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ, గ్రామస్థాయిలో ప్రజల‌తో మమేకమై మాట్లాడితే అనేక విషయాల్లో మంచి అవుట్‌పుట్‌ దొరుకుతుందని, మంచి అనుభవం ల‌భిస్తుందన్నారు. ...

Read More »

జిల్లా అడ్వకేట్‌ సొసైటీ ఎన్నికల‌ అధికారుల‌ నియామకం

నిజామాబాద్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా అడ్వకేట్‌ మ్యూచువల్లీ ఏడెడ్‌ కోపరేటివ్‌ సొసైటీ 2021-2022 సంవత్సరానికి నిర్వహించే బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ పదవుల‌ ఎన్నిక నిర్వహణ కోసం ఎన్నికల‌ అధికారులుగా న్యాయవాదులు బండారి కృష్ణానంద్‌, మల్లెపూల‌ జగన్‌ మోహన్‌ గౌడ్‌ను నియమిస్తున్నట్లు జిల్లా అడ్వకేట్‌ సొసైటీ అధ్యక్షుడు నీల‌కంఠ రావు ఒక ప్రకటనలో తెలిపారు. మూడు సంవత్సరాల‌ పదవీకాల‌ డైరెక్టర్‌ (4) పోస్టుల‌తో పాటు గత సంవత్సరం కరోనా కారణంగా వాయిదా పడిన (4) డైరెక్టర్‌ పోస్టుల‌కు ...

Read More »

వంద శాతం ఆస్తిపన్ను వసూలు కావాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 25లోగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో వంద శాతం ఆస్తిపన్ను వసూలు చేయాల‌ని, లేదంటే సంబంధిత అధికారుల‌పై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌ నుండి పంచాయతీ రాజ్‌ శాఖ అధికారుల‌తో ఆస్తి పన్ను వసూలు గ్రామాల్లో పారిశుధ్యం పై సెల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు కొంత ప్రోగ్రెస్‌ ఉన్నప్పటికీ ఆస్తిపన్ను వసూలులో ఈ నెల‌ 25 చివరి తేదీ నిర్ణయించడం జరిగిందని ...

Read More »

శనివారం విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మూడవ శనివారం 20వ తేదీ నిజామాబాదు పట్టణంలో అన్ని విద్యుత్‌ ఉపకేంద్రాల‌లో నెల‌వారీ మరమ్మతుల‌ కారణంగా విద్యుత్‌ సరఫరాలో ఉదయం 9 గంటల‌ నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అంతరాయం ఉంటుందని ఏడిఇలు అశోక్‌, తోట రాజశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కావున అంతరాయాన్ని విద్యుత్‌ వినియెగాదారులందరు గమనించి తమకు సహకరించాల‌ని విజ్ఞప్తి చేశారు.

Read More »

ఏప్రిల్‌ నుండి రెండు ల‌క్షల‌ కూలీలు రావాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏప్రిల్‌ 1 నుండి జిల్లా అంతటా ఉపాధి హామీ పనులు పెద్ద ఎత్తున జరగాల‌ని ప్రతిరోజు రెండు ల‌క్షల‌ మంది కూలీలు పనుల‌కు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ అధికారుల‌ను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ నుండి గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌, రెవెన్యూ అధికారుల‌తో పలు విషయాల‌పై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల‌ చెరువుల‌లో చేప పిల్ల‌లు వదిలినప్పుడు వాటి లెక్క పక్కాగా ...

Read More »

తెలంగాణలో విద్య కార్పొరేట్‌ పరం

నిజామాబాద్‌, మార్చ్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో విద్యను కార్పొరేట్‌ పరం చేయడంలో భాగంగానే బడ్జెట్‌లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించారని నిజామాబాద్‌ జిల్లా ఎన్‌.ఎస్‌.యు.ఐ అధ్యక్షుడు వరద బట్టు వేణు రాజ్‌ అన్నారు. శుక్రవారం నిజామాబాద్‌ నగరంలోని కాంగ్రెస్‌ భవన్‌లో నిర్వహించిన విలేకరుల‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్య కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కేవలం తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాల‌యాల‌ నిర్వహణకే సరిపోతుందని వాటి అభివృద్ధికి నిధులు కేటాయించడంలో ప్రభుత్వం మొండి చేయి చూపించిందన్నారు. ప్రైవేట్‌ విశ్వవిద్యాల‌యాల‌ను బలోపేతం ...

Read More »

బేటీ బచావో – బేటీ పడావోపై అవగాహన

నిజామాబాద్‌, మార్చ్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ, జిల్లా మహిళ, శిశు దివ్యాంగుల‌ మరియు వయోవృద్దుల‌ శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో – బేటీ పడావో అనే అంశంపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఆశ, నోడల్‌ ఆఫీసర్‌, ఏఎన్ఎంలు, ఆశాల‌కు ఆడపిల్ల‌ల‌ ప్రాముఖ్యత మరియు ఆడపిల్ల‌ల‌ సంఖ్య పెంచడానికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్కానింగ్‌ సెంటర్‌లో పుట్టబోయే బిడ్డ ఆడబిడ్డనా, మగబిడ్డనా అని అడిగిన వారికి, చెప్పిన వారికి, అందుకు ...

Read More »

శుక్రవారం ఉదయం 7.30 గంటల‌కు ఎఫ్‌.ఎం వినండి….

నిజామాబాద్‌, మార్చ్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనాపై అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ ఎం.సుదర్శనం గురువారం ఆకాశవాణి కేంద్రంలో రేడియో ప్రసంగం చేశారు. రేడియో మాధ్యమంగా ప్రజల‌కు సల‌హాలు, సూచనలు చేశారు. 19వ తేదీ శుక్రవారం ఉదయం 7.30 గంటల‌కు అవగాహన కార్యక్రమం ప్రసారం కానుంది. ప్రజలందరు శ్రద్దగా విని సద్వినియోగం చేసుకోవాల‌ని తెలిపారు.

Read More »

చేప పిల్ల‌ల‌ సీడ్‌ వదిలినప్పుడు సరిగా చూసుకోవాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెరువుల్లో ఉచిత చేప పిల్ల‌ల‌ సీడ్‌ వేసేటప్పుడు సరైన సంఖ్యలో ఉన్నవో లేవో మత్స్యకారులు చూసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి తెలిపారు. గురువారం మోస్రా మండల‌ కేంద్రంలోని మాసాని చెరువును ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మత్స్యకారుల‌తో మాట్లాడుతూ, చెరువుల్లో ఉచిత చేప పిల్ల‌ల‌ సీడ్‌ పంపిణీ ల‌క్ష్యం మేరకు జరుగుతున్నదో లేదో కమిటీ సభ్యులు సరిగా చూసుకోవాల‌ని చూసుకోకుంటే మీరే నష్టపోతారని తెలిపారు. కమిటీలో గ్రామ సర్పంచ్‌, ...

Read More »

మహిళల ‌అక్రమ రవాణాపై విడియో కాన్ఫరెన్సు

నిజామాబాద్‌, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం హైదరాబాద్‌ ఉమెన్‌ సేఫ్టీ విభాగం మరియు డి.జి.పి. ఆద్వర్యంలో ఉదయం 11 గంటల‌ నుండి 2:30 మధ్యాహ్నం వరకు రాష్ట్రంలోని వివిధ శాఖల‌ నుండి ‘‘మహిళల‌ అక్రమరవాణా’’ పైన వర్చువల్‌ సమావేశం జరిగిందని ఇన్స్‌పెక్టర్‌ ఆఫ్‌ పోలీసు సిసిఎస్‌ డి. నాగేశ్వర్‌రావు తెలిపారు. ఇందులో ఏ.హెచ్‌.టి.యు నిజామాబాద్‌, రెవేన్యూ లేబల్‌ డిపార్టుమెంట్స్‌, హేల్త్‌ డిపార్టుమెంట్స్‌, ఎన్‌.జి.ఒస్‌., నిజామాబాద్‌ సి.పి.ఒ ఆఫీస్‌ నుండి హాజరై వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఉమెన్‌ ట్రేసింగ్‌ అంశంపై ...

Read More »

ప్రకృతి వ్యవసాయం ఆరోగ్యకరం

నిజామాబాద్‌, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆహారంలో మార్పు కొరకు ఆర్గానిక్‌ వ్యవసాయం చాలా ముఖ్యమైనదని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం జక్రాన్‌పల్లి మండలం చింతలూరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సుకు కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వల‌న చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ సర్పంచ్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ మనం తినే ఆహారంలో మంచి పోషక విలువ‌లు ఉండాల‌ని, రానున్న రోజుల్లో ప్రపంచమంతా తప్పకుండా ఆర్గానిక్‌ పంటలు పండించే ...

Read More »

ప్రేమ జంటకు పెళ్లి

నిజామాబాద్‌, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం ఖాజాపూర్‌ గ్రామానికి చెందిన నరహరి పృథ్వీరాజ్‌, కొండపల్లి రాజమనిలు గత కొన్నేళ్ళుగా ఇష్టపడి, పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటే, వాళ్ల తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు. కాగా వారిద్దరు ఈనెల‌ 12న ఇంటి నుండి వెళ్ళిపోయి, సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా నాయకులు కామ్రేడ్‌ వి.ప్రభాకర్‌, బోధన్‌ సబ్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి బి. మల్లేష్‌ల‌‌ను సంప్రధించారు. వారు జిల్లా కేంద్రంలో గల‌ బుద్ద విహార్‌ ట్రస్ట్‌లో ...

Read More »

విద్యార్థుల‌ను పరీక్షల‌కు సిద్ధం చేయండి

నిజామాబాద్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి విద్యార్థుల‌ను బోర్డ్‌ పరీక్షల‌కు హాజరయ్యే విధంగా తయారుచేసి పంపిస్తే తప్పక వారి జీవితాల‌లో వెలుగులు నింపిన వారమవుతామని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. మంగళవారం 9, 10 తరగతి విద్యార్థుల‌ పరీక్షల‌ గురించి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్‌, వెల్ఫేర్‌, ఎంఈవోలు, హెచ్‌ఎంలు, వసతిగృహా సంక్షేమ అధికారుల‌తో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. కరోనా వ‌ల్ల‌ ఈ సంవత్సరంలో నాలుగు నుండి ఐదు నెల‌లు ...

Read More »

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న పోలీస్‌ కమీషనర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనరేటు పరిధిలోని టౌన్‌ 4 సమీపంలోని పోలీస్‌ లైన్‌ యందు గల‌ యూనిట్‌ ఆసుపత్రిలో నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కార్తీకేయా కోవిడ్‌ – 19 సంబంధించిన 2వ టీకా కోవాక్సీన్‌ తీసుకున్నారు. వాక్సిన్‌ వల్లే కరోనాను ఎదుర్కోగల‌మని ఆయన తెలిపారు. కరోనా నియంత్రణలో వైద్య సిబ్బంది పోలీసు ముందుండి పోరాడారని మరోసారి గుర్తు చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌ యూనిట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఎస్‌. సరళ స్పెషల్‌ బ్రాంచ్‌ ...

Read More »

వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌లో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ రెండవ డోస్‌ టీకా తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల‌ మేరకు 60 సంవత్సరాలు దాటిన, 45 సంవత్సరాల‌ నుండి 59 సంవత్సరాల‌ లోపు డయాబెటిక్‌, బిపి, క్యాన్సర్‌ ఉన్నవారు తప్పకుండా వ్యాక్సినేషన్‌ తీసుకోవాల‌న్నారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్‌లో ఇవ ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ టీకా ...

Read More »