Breaking News

Nizamabad

చాలా వరకు టెంపరరే

బోధన్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఐఎఫ్‌టీయూ జాతీయ కమిటీ పిలుపు మేరకు కరోనా కారణంగా సంక్షోభంలో కార్మిక కుటుంబాల‌ను ఆదుకోవాల‌ని, యాజమానుల‌కు అనుకూలంగా కార్మిక చట్టాల‌ను‌ మార్చోద్దని, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్‌ రంగానికి అప్పగించొద్దని, ఎన్‌.ఎం.ఆర్‌, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల‌ను పర్మినెంట్‌ చేయాలంటూ తదితర డిమాండ్లతో బోధన్‌ ఆర్డీవో కార్యాల‌యం ముందు ధర్నా చేసి, ఆర్డీవో రాజేశ్వర్‌కి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి బి.మల్లేష్‌ మాట్లాడుతూ లాక్‌డౌన్‌, కరోనా మహమ్మారి ...

Read More »

అందరం వారికి సహకరించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజి మంత్రి పి.సుదర్శన్‌ రెడ్డి సహాయ సహకారాల‌తో నిజామాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ అద్యక్షుడు మానాల‌ మోహన్‌ రెడ్డి గారి ఆదేశాల‌ మేరకు నిజామాబాద్‌ మహిళ పోలీస్‌ స్టేషన్‌లో పోలీసు సిబ్బందికి ఎన్‌ఎస్‌యుఐ అద్యక్షుడు వేణురాజ్‌ చేతుల‌ మీదుగా శానిటైజర్‌, మాస్కులు పోలీసు బృందానికి అందజేశారు. ఈ సందర్భంగా వేణురాజ్‌ మాట్లాడుతూ కరోన సమయంలో పోలీసులు చేసే సేవ‌లు మరువలేనివని ప్రజల‌ కోసం నిత్యం కష్టపడుతున్న పోలీసుశాఖకు హాండ్‌ సానిటైజర్స్‌, మాస్కులు అందించిన మాజీ ...

Read More »

145 రోజుల‌కు స్వదేశానికి చేరిన మృత దేహం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిసుదూర దేశంలో చనిపోయిన ఆప్తుని చివరి చూపుకోసం కుటుంబ సభ్యులు, బంధువులు దాదాపు అయిదు నెల‌లుగా ఎదిరిచూస్తుండగా చివరికి గల్ప్‌ మృతుడి శవపేటిక శనివారం సాయంత్రం హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకున్న సంఘటన జరిగింది. జగిత్యాల‌ జిల్లా వెల‌గటూరు మండలం కొండాపూర్‌ గ్రామానికిచెందిన సుంకె రాజయ్య (55) సౌదీ అరేబియా దేశంలోని రియాద్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్‌ 14న చనిపోయాడు. లాక్‌డౌన్‌ కారణంగా విమానాల‌ రాకపోకలు నిలిపివేసినందున శవపేటికను ఇండియాకు ...

Read More »

రేట్లు పెంచాల‌ని వినతి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం ఏఐటియుసి బీడీ కార్మిక సంఘం మరియు తెలంగాణ బీడీ కమిషనర్ల సంఘాల‌ ఆధ్వర్యంలో తెలంగాణ బీడీ మాన్యుఫ్యాక్చరర్స్‌ హ్యాండ్‌ టోబాకో మర్చంట్‌ అసోసియేషన్‌ వారికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బీడీ యూనియన్‌ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ బీడీ రోల‌ర్స్‌ గత ఒప్పందం 31.5.2020 నాటికి ముగిసిందని, బీడీ కమిషన్‌ దారుల‌ గత వేతన ఒప్పందం 2020 మార్చి 31తో ముగిసిందని వీరిరువురి ఒప్పందం చేయాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుత కరోనా ...

Read More »

అలా చేస్తే రూ. 5 వేల‌ జరిమానా

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిషన్‌ భగీరథ, క్రిమటోరియం, తడి పొడి చెత్త సేకరణ తదితర అంశాల‌పై వీడియో కాన్ఫరెన్సులో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి. శుక్రవారం ఎంఆర్వోలు, ఎండిఓలు, ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు, ఎంపీవోల‌తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రతి గ్రామంలో నాలుగు రకాల‌ పనులు తీసుకోవడమైనదని, గ్రామానికి సాంక్షన్‌ అయిన పైప్‌ లైన్‌, టాప్‌లు పాత వాటర్‌ ట్యాంక్‌లు, సిసి రోడ్లు లీకేజీల‌కు సంబంధించిన రిపైర్లు వెంటనే చేయాల‌ని, పూర్తికాని ...

Read More »

అతిక్రమిస్తే చర్యలు తప్పవు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌లోని ఎల్ల‌మ్మగుట్టలోగల‌ మెడికవర్‌ ఆసుపత్రి, సరస్వతి నగర్‌లోని ఇందూరు సూపర్‌ స్పెషాలిటి ఆసుపత్రిలో కోవిడ్‌ చికిత్సకు ప్రభుత్వ అనుమతి ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో అనుమతి పొందిన కోవిడ్‌ చికిత్స ఆసుపత్రి వారు తప్పకుండా జివో ఆర్‌టి నెంబర్‌ 248 తేది. 15.06.2020 ప్రకారం నిర్ణయించిన ధరలు మాత్రమే తీసుకోవాల‌ని పేర్కొన్నారు. ధరల‌ను రోగుల‌కు మరియు వారితో వచ్చిన వారికి కనిపించేలా ప్రదర్శించాల‌ని సూచించారు. ...

Read More »

16 ఏళ్ల తర్వాత మాతృభూమికి వల‌సజీవి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఒక తెలంగాణ వల‌స కార్మికుడు దుబాయి నుండి స్వగ్రామానికి చేరి కుటుంబాన్ని కలుసుకున్న అరుదైన సంఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. అతను దుబాయికి వెళ్ళేటప్పుడు అతని కూతురు పాలుతాగే పసిగుడ్డు. ఇప్పుడు ఆమెకుపెళ్లయి ఏడాది బాబు ఉన్నాడు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం చింతమానుపల్లె గ్రామానికి చెందిన నీల ఎల్ల‌య్య 2004 లో ఒక భవన నిర్మాణ కంపెనీలో కూలీగా పనిచేయడానికి యుఎఇ దేశానికి వెళ్ళాడు. ...

Read More »

ఎంతమంది క్లాసులు వింటున్నారు?

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ పల్లి మండలం, పడకల్‌, కలిగొట్‌, చింత‌లూరు, జక్రాన్‌పల్లి గ్రామాల‌లో జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి గురువారం ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల‌లో రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, హరితహారం, డంపింగ్‌ యార్డ్‌ పనుల‌ను పరిశీలించారు. సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు రైతు వేదికలు రూఫ్‌ లెవెల్‌ వరకు సెప్టెంబర్‌ 30 వరకు పూర్తి చేయాల‌ని కలెక్టర్‌ అధికారుల‌ను ఆదేశించారు. హరితహారంలో భాగంగా గ్రామాల‌లో పెద్ద ...

Read More »

ప్రశాంతంగా ముగిసింది

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్‌ కళాశాల‌లో మొదటి సంవత్సరం ప్రవేశాల‌ కోసం నిర్వహించిన పాలిసెట్‌- 2020 నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా ముగిసినట్టు జిల్లా కో ఆర్డినేటర్‌ శ్రీరాంకుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షల‌కు మొత్తం విద్యార్థులు 3552కు గాను 2779 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. జిల్లా వ్యాప్తంగా 78.24 శాతం విద్యార్థులు పరీక్ష రాసినట్టు తెలిపారు. పరీక్షల‌ను జిల్లా కో ఆర్డినేటర్‌, ప్రిన్సిపాల్‌ శ్రీరాంకుమార్‌, అసిస్టెంట్‌ కో ఆర్డినేటర్‌ పి.శ్రీకర్‌, జిల్లా ప్రత్యేక ...

Read More »

దరఖాస్తు గడువు పెంపు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఎలాంటి విద్యార్హత లేకున్నా 18 సంవత్సరాల‌ వయసు నిండిన వారు డిగ్రీలో ప్రవేశం పొందేందుకు విద్యార్థుల‌ కోరిక మేరకు ప్రవేశ అర్హత పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల‌ 7వ తేదీ వరకు గడువు పెంచినట్టు జిల్లా కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా 9 అధ్యయన కేంద్రాల్లో నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోదన్‌, కామారెడ్డి, మోర్తాడ్‌, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద, భీంగల్‌లో తమకు ...

Read More »

దీంతో గ్రామ పంచాయతీకి ఆదాయం వస్తుంది

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందల్వాయి మండలం, సిర్నాపల్లి గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి. మంగళవారం జిల్లా కలెక్టర్‌ పర్యటనలో భాగంగా సిర్నాపల్లి గ్రామం సందర్శించారు. గ్రామపంచాయతీ కార్యాల‌యం ఆవరణంలో మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలో హరిత హారం మొక్కలు పరిశీలించారు. పాఠశాల‌ ఆవరణంలో మియవాకి మినీ ఫారెస్ట్‌ పరిశీలించారు. గ్రామ పంచాయతీలో నగరాల‌లో లేనటువంటి పార్కు తయారు చేసుకోవాల‌న్నారు. డంపింగ్‌ యార్డ్‌ సందర్శించిన అనంతరం మాట్లాడుతూ మియావాకి ప్లాంటేషన్లో భాగంగా నాలుగు ...

Read More »

ఆందోళన అవసరంలేదు…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో యూరియా డిమాండ్‌ దృష్టిలో ఉంచుకొని అవసరమైన యూరియాను వెంటనే కేటాయించేలా చర్యలు తీసుకోవాల‌ని రాష్ట్ర రోడ్లు మరియు భవనాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డిని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్‌ విన్నవించడం మేరకు మంత్రి చొరవ తీసుకొని ప్రభుత్వం ద్వారా జిల్లాకి మూడు ర్యాక్ల‌‌ యూరియా పంపించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. క్రిబ్‌కో ద్వారా 548 ...

Read More »

ఉన్నతాధికారుల‌ ప్రశంసలు పొందారు

నిజామాబాద్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టరేట్‌ కార్యాల‌యంలో శాంతిభద్రతలు పరిరక్షించే ఎస్‌ఐ గాండ్ల విట్టల్‌కు పదవీ విరమణ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఘనంగా వీడ్కోలు పలికారు. సోమవారం కలెక్టర్‌ చాంబర్లో ఎస్‌ఐ విటల్‌ను ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందజేశారు. 36 సంవత్సరాలు ఎస్‌ఐగా ఎన్నో ఉత్తమ సేవా పతకాల‌ను అందుకున్నారన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కలెక్టరేట్‌లో అంకితభావంతో పనిచేసి ఉన్నతాధికారుల‌ ప్రశంసలు పొందారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ఎస్‌ఐ ...

Read More »

మంచి శాస్త్రవేత్తగా ఎదగాలి

నిజామాబాద్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం ఇన్నోవేషన్‌ కాల్‌ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటా ఎన్నో అను వైజ్ఞానిక ప్రదర్శన ఈ సంవత్సరం ఆన్‌లైన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నుండి 25 ప్రదర్శనలు నమోదు చేసుకోగా మహేందర్‌ ప్రదర్శన విద్యుత్‌ లేకుండా నీటిని ఎత్తిపోతల‌ యంత్రాన్ని తయారు చేశారు. ఈ ప్రదర్శన జిల్లా నుండి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. కాగా సోమవారం జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి చేతుల‌ మీదుగా విద్యార్థికి సర్టిఫికెట్‌ ...

Read More »

జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ వార్షిక ప్రణాళిక వివరాలు

నిజామాబాద్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ యానిమల్‌ యాక్షన్‌ ప్లాన్‌ 2020-21 పై జిల్లా కమిటీతో కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి తన ఛాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి ఈ సంవత్సరం మేషన్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ డెవల‌ప్‌మెంట్‌ హార్టిక‌ల్చ‌ర్‌ కింద వార్షిక ప్రణాళిక ఆమోదించింది. ఈ ప్రణాళికలో ముఖ్యంగా ఈ సంవత్సరం 79 హెక్టార్ల ఏరియాలో పండ్ల తోటలో పెట్టుబడిని 18 ల‌క్షల‌ 66 వేల‌ రూపాయల‌ ...

Read More »

టెస్టులందు కోవిడ్‌ టెస్టులు వేరయా….

నిజామాబాద్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తె‌లు‌గులో వేమన అనే కవి నాడు బుడ్డగోచీ పెట్టుకొని నీతి శతకాన్ని రాశాడు. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటాన్ని పెట్టాడు. అది నేటికి నీతివిద్యగా కొనసాగుతుంది. నీతి అయినా, నిజం అయినా ఎవరు చెప్పారనేది ముఖ్యం కాదు.. ఎవరినుంచైనా స్వీకరించాల్సిందే… సరే ఆ విషయం పక్కన పెడితే… గత ఐదారుమాసాలుగా కోవిడ్‌ అనే మహమ్మారి రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచంలోని చాలా దేశాల్ని అతలా కుతలం చేస్తోంది. కనీ వినీ ఎరుగని రీతిలో మానవ ...

Read More »

ఇక నుంచి మండలాల్లోనే రిజిస్ట్రేషన్లు

నిజామాబాద్‌, ఆగష్టు 29 ల్యాండ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్లుగా తహసీల్దార్లు రిజిస్ట్రేషన్‌ మ్యుటేషన్‌ అధికారాలు రెడీ అవుతున్నకొత్త రెవెన్యూ కోడ్‌ నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త రెవెన్యూ కోడ్‌తో భూ లావాదేవీల‌ స్వరూపమే మారబోతున్నది. డివిజన్‌ స్థాయిలో సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో జరిగే రిజిస్ట్రేషన్లు ఇక మండల‌ స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. భూముల‌ రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ అధికారాల‌ను తహసీల్దార్లకు అప్పగించాల‌ని ప్రభుత్వం భావిస్తోంది. తహసీల్దార్లను మండల్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్లు (ఎంఎల్‌ఏఓ)గా వ్యవహరించేలా చట్టంలో మార్పు చేయబోతున్నట్లు సమాచారం. ...

Read More »

ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌కు అన్ని వసతులు కల్పించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాలిటెక్నిక్‌ ఎంట్రన్స్‌ పరీక్షలు కోవిడ్‌ నిబంధనల‌కు అనుగుణంగా నిర్వహించాల‌ని అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. శనివారం తన ఛాంబర్లో పాలి సెట్‌ పరీక్ష నిర్వహణపై సంబంధిత శాఖల‌ అధికారుల‌తో సమీక్ష సమావేశంలో మాట్లాడారు. సెప్టెంబర్‌ 2 వ తేదీ ఉదయం 11.00 గంటల‌ నుండి 1.30 గంటల‌ వరకు నిర్వహించే పాలిటెక్నిక్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌కు అన్ని వసతులు కల్పించాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. విద్యార్థుల‌ను పరీక్ష సెంటర్‌కు 10 గంటల‌ నుండి అనుమతిస్తారని ...

Read More »

దివ్యాంగుడికి ఆపన్నహస్తం

నిజామాబాద్‌, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు ప్రమాదంలో గాయపడి నడవలేని స్థితిలో కోరుట్లకు చెందిన వినయ్‌ పరిస్థితి గురించి మాజీ ఎంపి కవిత తెలుసుకుని చలించిపోయారు. వినయ్‌తో మాట్లాడి భరోసా ఇచ్చారు. శనివారం మూడు చక్రాల‌ స్కూటీని అందజేశారు. కవిత వెంట కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు తదితరులున్నారు.

Read More »

బిల్స్‌ ఎప్పటికప్పుడు చెల్లించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి జిపిలో వీధి దీపాలు, బోర్‌ వెల్స్‌కు సంబంధించిన బిల్స్‌ ఎప్పటికప్పుడు చెల్లింపు చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు, ఎంపీవోల‌తో వీడియో కాన్ఫరెన్సులో సమీక్షించారు. కొన్నిచోట్ల మిషన్‌ భగీరథ వాటర్‌ రావడం లేదని, ప్రతి గ్రామంలో జనాభా లెక్క ప్రకారం ప్రతి ఒక్కరికి 100 లీటర్ల మిషన్‌ భగీరథ నీరు ఇవ్వాల‌ని నీరు రాని దగ్గర బోర్‌ వాడాల‌ని, ప్రతి గ్రామంలో ఆన్‌ ఆఫ్‌ బటన్‌ ఉండి ...

Read More »