Breaking News

Nizamabad

వేతన ఒప్పందాన్ని అమలు చేయాలి

నిజామాబాద్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం ఏఐటియుసి ఆధ్వర్యంలో సివిల్‌ సప్లై హమాలి యూనియన్‌ వేతన ఒప్పందం అమలు చేయాలని నిజామాబాద్‌ నగరంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ నుండి కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన నిర్వహించి కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య మాట్లాడుతూ సివిల్‌ సప్లై హమాలీల స్వీపర్ల గత వేతన ఒప్పందం 2019 డిసెంబర్‌ 31తో ముగిసినా 2020 జనవరి ఒకటో తేదీ నుంచి నూతన వేతన ఒప్పందం ...

Read More »

తడి, పొడి చెత్త వేరు చేయాలి

నిజామాబాద్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని న్యూ అంబేద్కర్‌ భవన్‌లో శనివారం తడిపొడి చెత్త వేరుచేయటం విషయమై మహిళ సంఘాల మహిళలకు, రిసోర్స్‌ పర్సన్స్‌కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌, మున్సిపల్‌ కమిషన్‌ జితేశ్‌.వి.పాటిల్‌, నగర కార్పొరేటర్లు కొర్వ లలిత, యమునా, అక్బర్‌ హుస్సేన్‌, ధర్మపురి, నారాయణ, కోమల్‌, కల్పన మల్లేష్‌, శ్రీనివాస్‌, రైసింగ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్క మహిళ తడిపొడి చెత్తపై సమరం చేయవలసిన ...

Read More »

హాస్టల్స్‌ వెంటనే ప్రారంభించాలి

నిజామాబాద్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం నిజామాబాద్‌ నగరంలో గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలోని వసతి గహాలను వెంటనే ప్రారంభించాలని ఎన్‌.ఎస్‌.యు.ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఎన్‌.ఎస్‌.యు.ఐ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు వరద భట్టు వేణు రాజు మాట్లాడుతూ గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో జనవరి 4 నుండి పరీక్షలు నిర్వహిస్తున్నందున కళాశాలకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బిసి వసతి గహాలను కోవిడ్‌ నిబంధనలు పాటించి ప్రారంభించాలని కోరుతున్నామన్నారు, ...

Read More »

విజయ డైరీ బ్రోచర్‌ ఆవిష్కరణ

నిజామాబాద్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విజయ డైరీ బ్రోచర్‌ను జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. పాడి రైతులకు పశుపోషణ, పాల నాణ్యతపై, విజయ డైరీ నుండి రైతులకు సమకూర్చే లాభాలపై అవగాహన కల్పించే విషయాలు కరపత్రంలో ఉన్నాయి. అనంతరం విజయ డైరీ జనరల్‌ మేనేజర్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ కె కామేష్‌, డిడికె నంద కుమారి, మేనేజర్‌ సిహెచ్‌ రమేష్‌, జిల్లా కలెక్టర్‌ను శాలువాతో సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

ఎరువుల సమస్య లేదు

నిజామాబాద్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఎరువుల నిల్వలు సరిపోయినంతగా ఉన్నాయని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. శనివారం తన చాంబర్‌లో యాసంగి పంట కాలానికి సంబంధించి ఎరువులు, విత్తనాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాకు రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చి కావలసిన ఎరువులను తెప్పిస్తున్నారనీ అన్నారు. జిల్లా యంత్రాంగం జనవరి నెలకు కావలసిన ఎరువులు ఇప్పటికె తెప్పించి ఉంచడం ...

Read More »

ఓమాన్‌ తెలంగాణ ఫ్రెండ్స్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ

హైదరాబాద్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం కొత్త సంవత్సరం సందర్భంగా ఒమాన్‌ తెలంగాణ ఫ్రెండ్స్‌ అధ్యక్షులు నరేంద్ర పన్నీరు సంస్థ ప్రతినిధులు మరియు కార్యకర్తల సమక్షంలో 2021 క్యాలెండర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గత సంవత్సరం అందరికి ఒక పీడకల వంటిది అని కరోనా మహమ్మారి వల్ల ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని కాని ఒక్క విషయంలో మాత్రం కరోనాకు కతజ్ఞతలు తెలపాలన్నారు. కరోనా మనకు ఆరోగ్యంగా ఎలా ఉండాలో, సాటివారి పట్ల దయ మరియు ...

Read More »

పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన జిల్లా జడ్జి, జిల్లా కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన సంవత్సరం సందర్బంగా జిల్లా జడ్జి కె కె సాయి రమాదేవి, జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి, కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ కార్తికేయ తదితరులు వేడుకల్లో పాల్గొని జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, పలువురు అధికారులు ప్రజా ప్రతినిధులు సిబ్బంది ప్రజలు స్వచ్చంద సేవా ...

Read More »

కోవిడ్‌ వ్యాక్సిన్‌ గురించి సిద్ధం కండి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వచ్చే నెలలో వ్యాక్సిన్‌ వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నందున సంబంధిత శాఖల అధికారులు అందుకు అవసరమైన ఏర్పాటు చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ లత కోరారు. గురువారం జిల్లా అధికారులతో ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో కరోనా వ్యాక్సిన్‌కు సిద్ధం కావడంపై జిల్లాస్థాయి టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కమిటీలో జిల్లా అధికారులను సభ్యులుగా నియమించినట్లు తెలిపారు. జనవరిలో వ్యాక్సిన్‌ రానున్నట్లు తెలుస్తున్నందున అందుకు సంబంధించి అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. ...

Read More »

నూతన సంవత్సర శుభాకాంక్షలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2021 నూతన సంవత్సరం పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సందేశం తెలిపారు. ”నిజామాబాద్‌, కామారెడ్డి ఉభయ జిల్లాల ప్రజలకు 2021 నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో సుఖ, సంతోషాలతో, సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివద్ధి పథంలో నడుస్తోందని, ...

Read More »

ఆపరేషన్‌ స్మైల్‌ ప్రారంభం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో అదనపు డి.సి.పి (అడ్మిన్‌) ఉషా విశ్వనాధ్‌ తిరునగరి ఆపరేషన్‌ స్మైల్‌ 7 ప్రారంభించారు. ఈ సందర్బంగా అదనపు డి.సి.పి (అడ్మిన్‌) ఉషా విశ్వనాధ్‌ తిరునగరి మాట్లాడుతూ అవరేషన్‌ స్మైల్‌ 2021 జనవరి 1 నుండి 31 జనవరి వరకు నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేటు పరిధిలోని నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్‌ పరిధిలో 18 సంవత్సరాల లోవు తప్పిపోయిన / ...

Read More »

రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత

నిజామాబాద్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని తహసిల్దార్లు సమస్యలు రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి ఆదేశించారు. బుధవారం ప్రగతి భవన్‌లో తహసీల్దార్లు, ఆర్‌అండ్‌బి ఏఇలతో డబుల్‌ బెడ్‌ రూమ్స్‌ ఇళ్లు, ధరణిపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళ నిర్మాణాలకు ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తున్నదని కావున తొందరగా పూర్తి కావాలని, గత సంవత్సరం కరోన వలన ...

Read More »

న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీసుశాఖ హెచ్చరికలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసెంబర్‌ 31న రాత్రి ప్రజలు వ్యవహరించాల్సిన తీరుపై నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కార్తికేయ పలు సూచనలు చేశారు. కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్‌ పరిధిలోని అన్ని ప్రాంతాలలో డిసెంబర్‌ 31న రాత్రి నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే సందర్భంగా కమీషనరేటు పరిధిలోని వైన్స్‌, కల్లు దుకాణాలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి పొందిన సమయం వరకే మధ్యం విక్రయించాలన్నారు. అలా కాకుండా ప్రభుత్వం నుండి అనుమతి పొందిన సమయం దాటిన ...

Read More »

సీనియర్‌ సిటిజన్స్‌ కొరకు హెల్ప్‌లైన్‌ 14567

నిజామాబాద్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీనియర్‌ సిటిజన్స్‌కు అవసరమైన సహాయం అందించడానికి హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ 14567 కు కాల్‌ చేయవచ్చని జిల్లా వెల్ఫేర్‌ అధికారి ఝాన్సీ లక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. సలహాలు, సూచనలు, పెన్షన్లు చట్టపరమైన సూచనలు, న్యాయపరమైన సలహాలు వద్ధాప్య గహాలు కౌన్సిలింగ్‌ మరెన్నో విషయాన్ని తెలియజేయడానికి కిట్‌, టోల్‌ ఫ్రీ నెంబర్‌ వయో వద్ధులు ఉపయోగించుకోవాలని ఆమె ప్రకటనలో కోరారు.

Read More »

వ్యవసాయంలో యంత్రాల ఉపయోగంపై అవగాహన కలిగి ఉండాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కూలీల కొరతతో పాటు ఖర్చులు తగ్గించుకోవడానికి యంత్రాలు ఉపయోగం వల్ల రైతులకు పలు రకాలుగా ప్రయోజనాలు కలిగి ఉన్నందున వ్యవసాయ పనులకు యంత్రాల వాడకంపై రైతులు అవగాహన ఏర్పర్చుకొని ఆ దిశగా ఆలోచించాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సూచించారు. కూలీల కొరత ఏర్పడటంతో పాటు కూలి ఖర్చులు కూడా పెరగడం తద్వారా వ్యవసాయానికి ఖర్చులు పెరగడం, రైతులకు ఇబ్బందులు ఎదురు కావడం ఇతర విషయాలను దష్టిలో పెట్టుకొని యంత్రాలు ఉపయోగంపై ...

Read More »

డబల్‌ బెడ్‌ రూమ్‌ల ఇండ్ల నిర్మాణం పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో కొత్తగా నిర్మాణం జరుపుకుంటున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ల పనులను జిల్లా కలెక్టర్‌ సి నారాయణరెడ్డి పరిశీలించారు. మంగళవారం కలెక్టర్‌ నాగారంలో కొత్తగా నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు, మైనారిటీ పాఠశాల, అదే విధంగా కొత్త కలెక్టరేట్‌ భవనం నిర్మాణం పనితీరు, అక్కడే నిర్మాణం జరుగుతున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పనులను పరిశీలించారు. పనులన్నీ మే చివరికల్లా పూర్తిస్థాయిలో నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా కొత్త కలెక్టరేట్‌ ...

Read More »

30న కిసాన్‌ మేళా

నిజామాబాద్‌, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 30వ తేదీ బుధవారం నాబార్డు వారి సౌజన్యంతో ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధన స్థానం రుద్రూరు నందు కిసాన్‌ మేళా నిర్వహించనున్నట్టు నాబార్డు డిడిఎం నగేశ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కిసాన్‌ మేళా నందు రైతులకు వరినాటు యంత్రాలు, నేరుగా వరి వెదజల్లే పద్దతి, (డమ్‌ సీడర్‌ ద్వారా వరి నాటు పద్దతి తదితర అంశాలపై ప్రదర్శన క్షేత్రాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కె.వి.కె మరియు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర ...

Read More »

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆడబిడ్డల పెళ్లి కానుక కళ్యాణలక్మి లక్ష 16 రూపాయల చెక్కులను 316 మంది లబ్దిదారులకు శాసన సభ్యులు బిగాల గణేష్‌ గుప్త మంగళవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఎంపిక చేసిన పోస్టాఫీసుల ద్వారా ఆధార్‌ రిజిస్ట్రేషన్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఎంపిక చేసిన 16 పోస్టాఫీసుల ద్వారా కొత్తగా ఆధార్‌ రిజిస్ట్రేషన్‌కు, మార్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా పోస్టల్‌ శాఖ సూపరింటెండెంట్‌ సుబ్రహ్మణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాదులోని హెడ్‌ పోస్ట్‌ ఆఫీస్‌, ఆర్‌ఎస్‌ పోస్ట్‌ ఆఫీస్‌, సుభాష్‌ నగర్‌లోని సబ్‌ పోస్ట్‌ ఆఫీస్‌, నవీపేట, శక్కర్‌ నగర్‌, బోధన్‌, మద్నూర్‌, ఎల్లారెడ్డి, భీమ్గల్‌, వేల్పూర్‌, కమ్మర్పల్లి, ఆర్మూర్‌, నందిపేట్‌ సబ్‌ పోస్ట్‌ ఆఫీస్‌లలో కొత్తగా ఆధార్‌ కార్డు పొందేవారు లేదా ఆధార్‌ ...

Read More »

వారం రోజుల్లో చెక్‌ డ్యాముల పనులు ప్రారంభం కావాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో మంజూరు చేసిన 30 చెక్‌ డ్యామ్‌ల నిర్మాణాలకు వారం రోజుల్లో పనులు ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి నీటిపారుదల శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. సోమవారం క్యాంప్‌ కార్యాలయం నుండి సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా చెక్‌ డ్యామ్‌ల నిర్మాణాలపై సంబంధిత ఇంజనీరింగ్‌, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మంజూరైన మొత్తం 30 చెక్‌ డ్యామ్‌ల నిర్మాణాలకు శనివారం కల్లా పనులు ప్రారంభం కావాలని, లేదంటే సంబంధిత ...

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్స్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ 320డి తేజస్వి రీజియన్‌ వారి ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ కేంద్రానికి కుట్టు మెషీన్‌లను నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ అందజేశారు. నగరంలోని 11వ డివిజన్‌ లోని 300 క్వార్టర్స్‌ మరియు 10వ డివిజన్లలో లయన్స్‌ క్లబ్స్‌ వారు మహిళల ఉపాధి కల్పన కోసం కుట్టు శిక్షణ కేంద్రానికి 6 కుట్టు మెషీన్లను పంపిణీ చేశారు. లయన్స్‌ డిస్ట్రిక్ట్‌ సూర్య రాజ్‌, సుజాత, మర్రి ప్రవీణ్‌, శ్రీధర్‌, ...

Read More »