Breaking News

Nizamabad

చిన్ని కృష్ణుడిని ఆదర్శంగా తీసుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు నేస్తం అవార్డును పొందిన చిన్ని కష్ణుడును జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి సన్మానించారు. జక్రాన్‌పల్లి మండలం చింతలూరు గ్రామానికి చెందిన నాగుల చిన్న గంగారం అలియాస్‌ చిన్ని కష్ణుడు సాంప్రదాయ పద్ధతులలో, సేంద్రియ ఎరువులతో మాత్రమే వ్యవసాయం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు, ప్రశంసలు పొందుతూ 2020-21 సంవత్సరానికి ఉత్తమ రైతుగా రైతు నేస్తం అవార్డుకు ఎంపికై భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈనెల 16న అవార్డును అందుకున్నాడు. ...

Read More »

ఆర్‌టిసిపై కేంద్ర ప్రభుత్వ వివక్ష తగదు…

నిజామాబాద్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా రవాణా రక్షించడానికి తెలంగాణలో ఆర్‌టిసి సంస్థపై వివక్షను తొలగించి రైల్వేలాగా డీజిల్‌పై 4 శాతం పన్ను విధించాలని ఎం.వి. యాక్టులో ఆర్‌టిసి రక్షణగా మార్పులు తేవాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకే దేశం ఒకే పన్ను అన్న కేంద్ర ప్రభుత్వం రైల్వేలకు డీజిల్‌పై 4 శాతం ...

Read More »

యువత స్వయం ఉపాధికి సబ్సిడీ రుణాలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : షెడ్యూల్‌ కులాల యువతీ, యువకులకు స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడి రుణాలు అందిస్తున్నట్టు జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సేవా సహకార అభివద్ధి సంస్థ ఈడి ఇ.రాజేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 2020-21 సంవత్సరానికి గాను 637 మంది లబ్దిదారులకు రూ. 2735.55 లక్షల బ్యాంకు రుణాలు అందించాలనే లక్ష్యం పెట్టుకున్నామని తెలిపారు. ఒక్కో అభ్యర్థికి రూ.1 లక్ష వరకు 80 శాతం సబ్సిడి, రూ.2 లక్షలకు 70 శాతం సబ్సిడి ఆపై ...

Read More »

ఉచిత ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మేయర్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం నగరంలోని నాగారంలోని 300 క్వార్టర్స్‌ ప్రభుత్వ పాఠశాలలో లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ డైమండ్‌ నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జితేశ్‌.వి.పాటిల్‌ హాజరయ్యారు. ఉచిత ఆరోగ్య కేంద్రాన్ని ఉద్దేశిస్తూ మేయర్‌ మాట్లాడుతూ లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ నిజామాబాద్‌ డైమండ్‌ వారు పేద ప్రజల ఆరోగ్యం విషయమై హెల్త్‌ క్యాంప్‌ ఏర్పాటు చేయటం ...

Read More »

అభివృద్ధి పనుల పరిశీలన

కామారెడ్డి, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి, బిక్కనూర్‌ మండలంలోని వివిధ గ్రామాల్లో చేపట్టిన అభివద్ధి పనులను శనివారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ పరిశీలించారు. భిక్కనూరు మండలం బస్వాపూర్‌లోని పల్లె ప్రకతి వనం, పాఠశాల అదనపు గదులు, గ్రంథాలయ భవనం, స్త్రీ శక్తి భవనం, స్మశాన వాటిక, రైతు వేదిక భవనాలను పరిశీలించారు. 33/11 కె.వి. విద్యుత్‌ ఉపకేంద్రంను సందర్శించారు. ఆవరణలో మొక్కలు నాటాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. బిక్కనూర్‌లో పల్లె ప్రకతి వనం, రైతు వేదిక భవనాలను ...

Read More »

కూలీలు పెరగాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్యను ప్రతి రోజు 10 శాతం తగ్గకుండా ఉండాలని, రికార్డుల నిర్వహణ ఎప్పటికప్పుడు జరగాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సంబంధిత అధికారులతో నర్సరీలు, హరిత హారం, క్రిమటోరియం, డ్రైయింగ్‌ ప్లాటుఫామ్స్‌, లేబర్‌ టర్నౌట్‌పై వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష చేశారు. ఎంపిడివో, ఎపిఓ, ఎంయస్‌ఓ, ఈసి, టిఏ, పంచాయతీ రాజ్‌ శాఖ ఏఈ, డిఈ, ఈఈలతో మాట్లాడుతూ ప్రతి గ్రామములో ...

Read More »

రూర్బన్‌ పనులు వేగవంతం చేయాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రూర్బన్‌ పథకం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం తన చాంబర్లో రూర్బన్‌ పథకం పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆమోదం పొందిన అన్ని పనులు మార్చ్‌ 2021లోపు పూర్త్తి చేయాలని, ఇంకా ప్రారంభం కాని పనులను వారం రోజుల్లోగా ప్రారంభించాలని మార్చ్‌ 21 లోపు పూర్తయిన పనులకు మాత్రమే నిధులు విడుదల చేయబడతాయని అన్నారు. ...

Read More »

పల్లె ప్రగతి పనులు పరిశీలించిన కలెక్టర్‌

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతిలో జరిగిన అభివద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఆకస్మికంగా పర్యటించి పరిశీలించారు. శనివారం డిచ్‌ పల్లి మండలం దేవ నగర్‌ క్యాంప్‌లో ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్‌ పల్లె ప్రగతిలో భాగమైన వైకుంఠధామం, హరితహారంలో కమ్యూనిటీ ప్లాంటేషన్‌, ఎవెన్యూ ప్లాంటేషన్‌, ఈజీఎస్‌ పనులు, ల్యాండ్‌ లెవెలింగ్‌ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వన సేవకులు మొక్కలు పెంచడం, మొక్కలకు నీళ్లు పోయడం, మొక్కల పాదులు సరి ...

Read More »

అభివృద్ధి పనులు ప్రారంభించిన మేయర్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని 49వ డివిజన్‌ కోటగల్లి బేతాలుడి గుడి వద్ద పట్టణ ప్రగతి 10 లక్షల రూపాయల నిధులతో చేపట్టే సీసీ డ్రైనేజీ, కల్వర్టు పనులను నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ ప్రారంబించారు. అలాగే 37వ డివిజన్‌ అంబేద్కర్‌ కాలనీలో పట్టణ ప్రగతి 10 లక్షల నిధులతో చేపట్టే సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభిచారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు కాంపల్లి ఉమ రాణి, మెట్టు విజయ్‌, నాయకులు ముత్యాలు, సంతోష్‌, ...

Read More »

బీడీ కార్మికులకు శుభవార్త

నిజామాబాద్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ రంగంలో కార్మికుల వేతనం పెంపుపై తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టి.యు) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్‌.టి.యు రాష్ట్ర అధ్యక్షులు వనమాల కష్ణ మాట్లాడుతూ బీడీ కార్మికుల కూలీ పెంపు చర్చలు 18వ తేదీ శుక్రవారం నిజామాబాదులో బీడీ యాజమాన్యానికి బీడీ కార్మిక సంఘాలకు మధ్య జరిగాయన్నారు. చర్చలలో బీడీ ప్యాకింగ్‌ కార్మికులకు 2 వేల 160 రూపాయలు, నెలసరి ఉద్యోగులకు 1 ...

Read More »

చర్చలు సఫలం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ కార్మికుల కూలీ రేట్ల పాత అగ్రిమెంట్‌ 2020, 31 మే నెలతో ముగిసినందున, 2020 జూన్‌ 1 నుంచి కార్మికుల వేతనాలు పెంచి కొత్త అగ్రిమెంట్‌ చేయాల్సిందిగా బీడీ యాజమానుల అసోసియేషన్‌ వారికి డిమాండ్‌ నోటీస్‌ ఇచ్చి చర్చలు జరుపాలని కోరారు. కరొనా మహమ్మారి మూలంగా చర్చలు జరుగ లేదు. మళ్లీ యజమానుల అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులకు డిమాండ్‌ నోటీస్‌ ఇచ్చారు. అయినా చర్చలకు రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీడీ కంపెనీ ...

Read More »

రైతుల ఖాతా వివరాలు అందించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుబంధు పెట్టుబడి సబ్సిడీకి సంబంధించి ఏ ఒక్క రైతు వివరాలు కూడా పెండింగ్‌ లేకుండా వారి బ్యాంకు ఖాతా నంబర్లు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా రైతుబంధు, ఇతర వివరాలకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 22 తర్వాత రైతుబంధుకు సంబంధించి బిల్లులు జనరేట్‌ చేసే అవకాశం ...

Read More »

పనులతోపాటు రికార్డులు పక్కాగా నిర్వహించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పథకంలో గ్రామాల్లో నిర్వహించే పనులు నాణ్యతగా జరగడంతో పాటు అందుకు సంబంధించిన అన్ని రికార్డులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఉపాధి హామీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా డిఆర్‌డిఎ అధికారులు ఎంపీడీవో లతో ఉపాధి హామీ పథకం అమలు నిర్వహించే పనులపై పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో పర్యటించిన ప్రత్యేక కమిషనర్‌ గమనించిన లోటుపాట్ల ప్రకారము ...

Read More »

వార్షిక తనిఖీ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వార్షిక తనిఖీలలో భాగంగా పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ను పోలీస్‌ కమీషనర్‌ కార్తికేయ తనిఖీలు నిర్వహించారు. నిజామాబాద్‌ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఆర్ముడ్‌ రిజర్వు విభాగంలో ”వార్షిక తనిఖీలలో” భాగంగా నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కార్తీకేయ క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ సందర్బంగా ఆర్ముడ్‌ రిజర్వు విభాగం, ఎమ్‌.టి సెక్షన్‌ విభాగం, హోమ్‌ గార్డ్పు విభాగాల రికార్డులను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. రికార్డుల పరిశీలన తర్వాత సంతప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అదనపు డి.సి.పి ...

Read More »

మంజూరైన చెక్‌డ్యాములు మే వరకు పూర్తిచేయాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాకు మంజూరైన చెక్‌ డ్యాములు మే చివరి నాటికి పూర్తి కావాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌ సమావేశం మందిరంలో ఇరిగేషన్‌ శాఖ అధికారులతో జిల్లాకు మంజూరైన 30 చెక్‌ డ్యాంల ప్రోగ్రెస్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రోగ్రెస్‌లో ఉన్నవి గ్రౌండ్‌ కావాలని మే 30 వరకు పూర్తి కావాలని అన్నారు. ల్యాండ్‌ ఇష్యూ ...

Read More »

క్రిస్మస్‌ అందరి కుటుంబాలలో వెలుగులు నింపాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం స్థానిక రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన క్రిస్మస్‌ పండుగ సందర్బంగా దుస్తుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డితో కలిసి క్రైస్తవులకు బట్టల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్రైస్తవ సమాజంలో ఉన్న పేదవారు సంతోషంగా క్రిస్మస్‌ పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిందన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా ఇవాళ బట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని తెలిపారు. బట్టలు పంచడం ...

Read More »

సాహిత్యం సమాజానికి దివ్య ఔషధం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాహిత్యం సమాజానికి దివ్యమైన ఔషధంగా పని చేస్తుందని, కరోనా సమయంలోనూ నిరూపణ అయిందని ప్రఖ్యాత వైద్యులు డాక్టర్‌ విశాల్‌ అన్నారు. బుధవారం హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్‌ కాసర్ల నరేశ్‌ రావు రచించిన కట్టడి పుస్తక ఆవిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మనిషిలోని మానవత్వం ప్రజల చైతన్యం కరోనా వంటి అనేక విపత్తులకు సమాధానం చెప్పగలవని ఆయన వివరించారు. కరోనా సమయంలో సాహిత్యం కూడా ఒక ఔషధంగా ...

Read More »

తెలంగాణ రైతు సోదరులకు సూచన

నిజామాబాద్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యాసంగి 2020 కు గాను మార్గదర్శకాలు విడుదల చేశారు. 1. తేది 10.12.2020 నాటికి ధరణిలో నమోదైన రైతుల వివరాలు సిసిఎఎల్‌ఎ ద్వారా రైతు బంధు పోర్టల్‌ లోకి రావడం జరిగింది. 2. కొత్తగా ఎవరైనా రైతు బంధు కొరకు అకౌంట్‌ ఇవ్వదల్సిన రైతులు 15.12.2020 నుండి 20.12.2020 లోపు మీ గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఇవో) కు అప్లికేషన్‌ ఫారం, పట్టాదారు పాస్‌ బుక్‌, ఆధార్‌ మరియు బ్యాంక్‌ అకౌంట్‌ ...

Read More »

ఉద్యోగులు ప్రభుత్వం వేరు కాదు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం వేరు కాదని రెండు కలిస్తేనే ప్రజలకు సేవ చేయగలుగుతామని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర టీఎన్జీవోస్‌ అధ్యక్షునిగా పనిచేసి పదవీ విరమణ చేసిన కారం రవీందర్‌ రెడ్డికి స్థానిక టీఎన్జీవోస్‌ భవన్‌లో సన్మాన కార్యక్రమాన్ని టీఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ పాజిటివ్‌ దక్పథంతో వెళ్లేవారికి అన్ని అనుకూలంగా ఉంటాయని ఎన్ని ఒత్తిడిలో ఉన్న ...

Read More »

కల్తీ విత్తనాలపై కఠిన చర్యలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాల్లో ఎక్కడ కూడా కల్తీ విత్తనాలు విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ముందస్తుగా తనిఖీలు నిర్వహించాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లా నీటి పారుదల సలహా బోర్డు సమావేశం అనంతరం వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడుతూ డీలర్లు లేదా దుకాణదారులు ఎక్కడ కూడా కల్తీ విత్తనాలు విక్రయించకుండా తనిఖీలు నిర్వహించి ...

Read More »