Breaking News

Nizamabad

నివాసపు గుడిసె దగ్ధం

  – రూ. లక్ష ఆస్తినష్టం కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం శాబ్దిపూర్‌ రైట్‌ తాండాలో మంగళవారం సాయంత్రం సంభవించిన అగ్ని ప్రమాదంలో బదావత్‌ విఠల్‌కు చెందిన నివాసపు గుడిసెదగ్దమైంది. దీంతో గుడిసెలో ఉన్న నగదు, వంట సామగ్రి, నిత్యవసర వస్తువులు, ఆధార్‌ కార్డు, పాసుపుస్తకాలు, ఇతర దృవీకరణ పత్రాలు, కాలి బూడిదయ్యాయి. అగ్ని ప్రమాదంతో విఠల్‌ కుటుంబం రోడ్డున పడింది. కూలీ పనిచేసుకొని బతికే తమ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ...

Read More »

తృటిలో తప్పిన అగ్ని ప్రమాదం

  నిజామాబాద్‌ అర్బన్‌, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని కంఠేశ్వర్‌ ప్రాంతంలో ఓ ఇంటికి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని స్వల్పంగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు మంటల్ని ఆర్పే ప్రయత్నం చేసి తరువాత అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకొని పూర్తిగా మంటలు ఆర్పేశారు. ఇందులో ఫైర్‌ సిబ్బంది ఎం.డి. మోసిమ్‌ఖాన్‌, ఎం.అనంతరావు, బి.శ్రీనివాస్‌ ఉన్నారు.

Read More »

ఐసిడిఎస్‌కు బాలుని అప్పగింత

  నిజామాబాద్‌ అర్బన్‌, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీహార్‌కు చెందిన దీపక్‌ అనే బాలుడు (14) అనుమానాస్పదంగా కామారెడ్డి రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫాంపై భిక్షాటన చేస్తుండగా గమనించిన పోలీసులు మంగళవారం వివరాలు అడిగారు. సరైన సమాధానం చెప్పకుండా తడబడడంతో నిజామాబాద్‌ జిఆర్‌పి రైల్వే పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అక్కడినుంచి దీపక్‌ తల్లిదండ్రులకు సమాచారం అందించినా ఇప్పటివరకు స్పందన లేకపోవడంతో ఐసిడిఎస్‌ హరికి అప్పగించారు. జిఆర్‌పిఎఫ్‌ ఎస్‌హెచ్‌వో అబీబ్‌ఖాన్‌, సిడబ్ల్యువో అనూరాధ, సిబ్బంది ఉన్నారు.

Read More »

ఇందూరులో వినోదాల వేదిక

  – పాలిటెక్నిక్‌ మైదానంలో ఎగ్జిబిషన్‌ – విద్యా, క్రీడారంగాలకు ప్రోత్సాహం – విపత్తుల సమయంలో విరాళాలు అందించడం – నిజామాబాద్‌ న్యూస్‌తో ఎగ్జిబిషన్‌ సొసైటీ కార్యదర్శి రాజేశ్వర్‌ నిజామాబాద్‌ అర్బన్‌, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ప్రజలకు వేసవి తాపాన్నుంచి ఉపశమనం కలిగించడంకోసం ఏర్పాటు చేయబడింది భారతీయ పారిశ్రామిక మరియు వ్యవసాయ ప్రదర్శన (ఎగ్జిబిషన్‌). ఇందులో అన్ని వర్గాల వారికి అవసరమగు దుస్తులు, అలంకరణ సామగ్రి, గృహోపకరణ వస్తువులు, తినుబండారాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వినోదాల ...

Read More »

పుష్కరాల పనుల పరిశీలన

  – లోపాలుంటే కఠిన చర్యలు తప్పవు – జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ రెంజల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూలై 14 నుంచి 25 వరకు జరగనున్న గోదావరి పుష్కరాల కోసం చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు, పుష్కర ఘాట్‌ నిర్మాణ పనులు, మరమ్మత్తు పనులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి వివిద శాఖల అధికారులతో రెంజల్‌ ...

Read More »

‘పిఎఫ్‌ సేవలు మీ ఇంటి ముంగిట్లో’ ప్రారంభం

  కామారెడ్డి, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ‘పిఎఫ్‌ సేవలు మీ ఇంటి ముంగిట్లో’ కార్యక్రమాన్ని ప్రాంతీయ భవిష్యనిధి కమీషనర్‌ ఎస్‌.గోవిందన్‌ మంగళవారం దేశాయిబీడీ కంపెనీ కామారెడ్డిలో ప్రారంభించారు. కార్యక్రమంలో పిఎఫ్‌ వెబ్‌సైట్‌లో లభించే సేవలు, యూనివర్సల్‌ ఎకౌంట్‌ నెంబరుతో మొబైల్‌ ఫోన్‌ నెంబరు అనుసంధానం చేస్తే ప్రతి పిఎఫ్‌ సభ్యుడు తమ ఖాతాలో జమ అయిన వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. అలాగే ఈ గుర్తింపు నెంబరుతో ఉన్న ఇతర లాభాల గురించి వివరించారు. కార్యక్రమానికి సంస్థ యజమానులు, పిఎఫ్‌ ...

Read More »

నిందితుని అరెస్టు

  భీమ్‌గల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌ మండలం కుర్కుల్‌ గ్రామానికి చెందిన బుక్య శంకర్‌ (55) నుహత్య చేసిన నిందితుడు వేముల అంజయ్య ను పోలీసులు అరెస్టు చేశారు. అంజయ్యను ఈనెల 16న అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్టు సిఐ రమణారెడ్డి, ఎస్‌ఐ విజయ్‌కుమార్‌లు తెలిపారు. అనంతరం నిందితున్ని నిజామాబాద్‌ జిల్లా జైలుకు తరలించామని పేర్కొన్నారు.

Read More »

హత్య కేసు నమోదు

  భీమ్‌గల్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూతగాదాలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన శంకర్‌ నాయక్‌ కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని ఆర్మూర్‌ డిఎస్‌పి ఆకుల రాంరెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం ఆయన మండలంలోని కుప్కల్‌ గ్రామంలో మృతుని ఇంటికెళ్ళి కుటుంబసభ్యులను పరామర్శించారు. సంఘటనకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు కేసు దర్యాప్తుపై పలు అనుమానాలు వెల్లడించారు. స్పందించిన డిఎస్‌పి మాట్లాడుతూ నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టమని హామీ ఇచ్చారు. కారకులపై హత్య ...

Read More »

ప్రశాంతంగా ముగిసిన లాసెట్‌ పరీక్ష

  డిచ్‌పల్లి, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌లో మంగళవారం జరిగిన లాసెట్‌-2015 ప్రశాంతంగా ముగిసినట్టు వర్సిటీ అధికారులు తెలిపారు. 3 సంవత్సరాల ఎల్‌ఎల్‌బి ఎంట్రెన్స్‌కు 451 మందికిగాను 379 మంది హాజరై 72 మంది గైర్హాజరయ్యారు. అలాగే 5 సంవత్సరాల కోర్సుకు 135 మందికిగాను 11 మంది గైర్హాజరైనట్టు తెలిపారు. మొత్తంగా మంగళవారం నాటి పరీక్షకు 586 మందికిగాను 83 మంది గైర్హాజరయ్యారని, 503 మంది హజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షల సమయంలో రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి ...

Read More »

అవతరణ వేడుకలకు అమరవీరుల స్థూపాలు సిద్దం చేయండి

  – జిల్లా కలెక్టర్‌ నిజామాబాద్‌ అర్బన్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని అమరవీరుల స్మారక స్థూపాలను ఈనెల 31 లోగా అన్ని హంగులతో అందంగా రూపొందించాలని పంచాయతీ రాజ్‌శాఖ మరియు మునిసిపల్‌ అదికారులకు, ఇంజనీర్లకు జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ ఆదేశాలిచ్చారు. సోమవారం నగరంలోని వినాయక్‌నగర్‌లో నిర్మిస్తున్న అమరవీరుల స్మారక స్థూపం, విద్యావనం పనులను కలెక్టర్‌ పరిశీలించారు. జూన్‌ 1 నుంచి వారంరోజుల పాటు జరగనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో భాగంగా జూన్‌ 2న అమరవీరుల ...

Read More »

లాసెట్‌ కోసం ప్రత్యేక బస్సులు

  డిచ్‌పల్లి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో మంగళవారం పరీక్ష రాసే అభ్యర్థుల కోసం నిజామాబాద్‌ ఆర్టీసి బస్టాండ్‌ నుంచి ప్రత్యేక బస్సులు నడపబడతాయని రిజిస్ట్రార్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ డిచ్‌పల్లి మెయిన్‌ క్యాంపస్‌లోని యూనివర్సిటీ కళాశాలలో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు లాసెట్‌ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మూడు సంవత్సరాల లా కోర్సు ప్రవేశ పరీక్షకు మొత్తం 451 మంది అభ్యర్థులు, అలాగే 5 సంవత్సరాల ...

Read More »

ఆర్మూర్‌లో ప్రజాదర్బార్‌

  ఆర్మూర్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ ఆదేశాల మేరకు సోమవారం ఆర్మూర్‌ పట్టణంలో ప్రజాదర్బార్‌ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతిసింగ్‌ బబ్లు ప్రసంగించారు. ఆర్మూర్‌ పట్టణంలోని వీధి దీపాలు, తాగునీరు, మురికి కాల్వలు, రోడ్లు తదితర ప్రజలకు అవసరమగు మౌలిక అవసరాలు తీర్చడానికి తమవంతు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పలువురు తమ తమ కాలనీ సమస్యలు వివరించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రజావాణికి10 ఫిర్యాదులు

  ఆర్మూర్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఆర్మూర్‌లో 10 ఫిర్యాదులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు వచ్చిన ఫిర్యాదులను, సమస్యలను త్వరలోనే పరిష్కరించడం జరుగుతుందని వారన్నారు. కాగా పలువురు మండల అధికారులు ప్రజావాణికి గైర్హాజరు అయ్యారు.

Read More »

ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

  రెంజల్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సోమవారం తహసీల్‌ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ సమస్యలను స్థానిక అధికారులు స్వీకరించారు. వారంరోజుల్లోగా పరిష్కరిస్తామని తహసీల్దార్‌ వెంకటయ్య తెలిపారు. ప్రజావాణి కార్యక్రమానికి మండలంలోని పలు శాఖల అధికారులు హాజరయ్యారు.

Read More »

బుధవారం నుంచి జీలుగ విత్తనాల పంపిణీ

  రెంజల్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల రైతాంగం జీలుగ విత్తనాల కోసం ఈనెల 20వ తేదీ నుంచి పంపిణీ జరుగుతుందని ఏవో సిద్దిరామేశ్వర్‌ అన్నారు. 30 కిలోల బస్తా రూ. 1177.50 కాగా 50 శాతం సబ్సిడీపై రైతులకు రూ. 588.75 పైసలకే అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

Read More »

పది ఫలితాల్లో గురు ఎడ్యుకేషనల్‌ అకాడమీ ప్రతిభ

  కామారెడ్డి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో గురు ఎడ్యుకేషనల్‌ అకాడమీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 20 మందికిపైగా విద్యార్థులు 9 ఆపై పాయింట్లు సాధించారు. 40 మంది విద్యార్థులు 8 ఆపై పాయింట్లు సాధించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు గురు ఎడ్యుకేషనల్‌ డైరెక్టర్‌ గురువేందర్‌రెడ్డి అభినందనలు తెలిపారు.

Read More »

లయోలా పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత

  కామారెడ్డి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్‌ఎస్‌సి మార్చి-2015 ఫలితాల్లో కామారెడ్డి లయోలా పాఠశాల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణతతో ప్రభంజనం సృష్టించారు. 75 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 75 మంది ఉత్తీర్ణులై వందశాతం ఉత్తీర్ణత సాదించారు. ఇందులో 9 ఆపై పాయింట్లు సాధించినవారు 20 మంది కాగా, 8 ఆపై పాయింట్లు సాధించినవారు 43 మంది, 7 ఆపై పాయింట్లు సాధించినవారు 12 మంది ఉన్నారు. అత్యధికంగా 9.7 పాయింట్లు సాధించిన భువనశ్రీరెడ్డిని ఉపాధ్యాయ బృందం ...

Read More »

పదిలో పడిపోయిన ఉత్తీర్ణత శాతం

  – గత ఏడాది కన్నా 8 శాతం తక్కువ కామారెడ్డి, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం ప్రకటించిన 2014-15 విద్యాసంవత్సర 10వ తరగతి ఫలితాల్లో కామారెడ్డి డివిజన్‌లో గత ఏడాది కన్నా ఉత్తీర్ణత శాతం 8 శాతానికి తగ్గి విద్యార్థులు నిరాశపరిచారు. గత ఏడాది 92.1 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈయేడు 84.2 శాతం ఉత్తీర్ణత సరిపెట్టుకున్నారు. అత్యధికంగా మాచారెడ్డి మండలంలో 92 శాతం ఉత్తీర్నత సాధించగా, అత్యల్పంగా తాడ్వాయి మండల విద్యార్థులు 60 శాతం ఉత్తీర్ణత ...

Read More »

ప్రజావాణి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి

  రెంజల్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సోమవారం తహసీల్‌ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తహసీల్దార్‌ వెంకటయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి నిర్వహించబడుతుందని అన్నారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్టయితే వారం రోజుల్లో సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

Read More »

పదిలో 93.45 శాతం మండల విద్యార్థుల ఉత్తీర్ణత

  రెంజల్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2014-15 విద్యాసంవత్సరంలో రెంజల్‌ 10వ తరగతి విద్యార్థులు 418 మంది పరీక్షలు రాయగా, 386 మంది ఉత్తీర్ణత స్థాధించారు. మండలంలోని ఉత్తీర్ణత శాతం 93.45 సాధించినట్టు ఎంఇవో సంజీవరెడ్డి తెలిపారు. మండల టాపర్‌గా స్నేహిత 9.8 శాతాన్ని సాధించింది. దీంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read More »