Breaking News

Nizamabad

చెడిన మైత్రి…. మైత్రి సంఘాల మాటే కరువు… ప్రేండ్లీ పోలీసులు ఏ మేరకు…?

బాన్సువాడ, డిసెంబర్‌20 పోలీసు ప్రవర్తన నియమావళి తిరోగమనం దిశగా సాగుతోంది. భాషాప్రయోగం కాఠిన్యమైంది. మైత్రి సంఘాలు మరుగున పడ్డాయి. కళాజాతలు కనుమరగయ్యాయి. సామాజిక కార్యక్రమాలు పూజ్యమయ్యాయి. బోధన్‌ డివిజన్‌లో దశాబ్ధం కింద పోలీసు శాఖ ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టి సామాన్యులకుచేరువైంది. గ్రామాల్లో మైత్రీ సంఘాలు విరివిగా ఏర్పాటుచేసి సమాచార వ్యవస్థను పెంచుకుంది. దీంతో చిన్నచిన్న నేరాలు జరిగినపుడు వాస్తవాలను ప్రజలనుంచి రాబట్టి బాధితులకు సత్వరంన్యాయం చేయగలిగారు. మైత్రీ సంఘాల ఆధ్వర్యంలో గ్రామసభలు పెట్టి సామాజిక సమస్యలను తెలుసుకుంది.ఆయా ప్రభుత్వ శాఖలకు నివేదించి సత్వర పరిష్కారానికి ...

Read More »

ఈనెల 24న 3వ ఇంటర్నేషనల్‌ ఫైడ్‌రేటింగ్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌

నిజామాబాద్‌ స్పోర్ట్స్‌, డిసెంబరు 20; నిజామాబాద్‌ నగరంలో ఈనెల 24 తేదీనుంచి రాఘవఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 3వ ఇంటర్నేషనల్‌ ఫైడ్‌ రేటింగ్‌ ఓపెన్‌ ఛెస్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నట్లు ఫౌండేషన్‌ ఆర్గనైజింగ సెక్రెటరీ వి.శ్యాంసుందర్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక విలేకరుల సమావేశంలో ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్‌ ఫైడ్‌ రేటింగ్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌ను తొలిసారిగా జాతీయ స్థాయిలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ టోర్నమెంట్‌కు మొదటిసారిగా దేశంలోని అన్ని రాష్ట్రాలనుంచి మేటి చెస్‌ క్రీడాకారులు పాల్గొంటారని ఆయన వెల్లడించారు. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే ఆసక్తిగలవారు తమ ఎంట్రీలను ...

Read More »

సదరం క్యాంప్‌లో వికలాంగులు అందోళనలు

నిజామాబాద్‌, డిసెంబర్‌19: సదరం క్యాంప్‌ వద్ద శుక్రవారం వికలాంగులు పెద్ద ఎత్తున్న తరలి అందోళనలు చేపట్టారు. ప్రభుత్వ అధికారులు 18,19 తేదిలలో వికలాంగులకు ఇవ్వల్సిన సదరంక్యాంప్‌ సర్టిఫికేట్ల ఇవ్వడం ఇబ్బందులకు గురి చేస్తున్నారని అరోపిస్తూ ఎంఎపి అధికారి మోహన్‌ నిలదీశారు. వికలాంగుల సమస్యలు బోర్డులకే పరిమితం తప్ప తమకు న్యాయం జరగడం లేదని అర్‌ఎంపి మోహన్‌ వికలాంగులు ప్రశ్నించారు. దీంతో అర్‌ఎంపి మోహన్‌ మాట్లాడుతూ మూగ,అందకారులు, చెవిటి వారికి సర్టిఫికేట్స్‌లను అందజేసిన తరువాత వికలాంగులందరికి సదర్యంకాంపు సర్టిపికేట్లు అందజేస్తారని అయన తెలిపారు. ప్రతి శుక్రవారం ...

Read More »

ఫీజు రియంబర్స్‌మెంట్‌కై ఆందోళన… వినూత్న నిరసనలు

నిజామాబాద్‌, డిసెంబర్‌19: ఫీజు రియంబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం దేవిరోడ్డులో ఎబివిపి విద్యార్ధి నాయకులు బిక్షటన చేపట్టారు. ఈసందర్భంగా ఎబివిపి కన్వనార్‌ రాకేష్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన అరుమాసలు అవుతున ప్రభుత్వంలో చలనం లేదని, విద్యార్ధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని అరోపించారు. విద్యార్ధులక అందే స్కాలర్‌షిప్‌లు విద్యార్ధులకు ఫీజురియంబర్స్‌ వివపక్షదోరణి అవలంభిస్తుందని విద్యార్ధులందరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని తెలంగాణ ఏర్పడిన తరువాత విద్యార్ధుల సమస్యలు పరిష్కరం దిశగా పని చేస్తామని చెప్పిన కేసిఅర్‌ ఇప్పుడు మాటమారుస్తున్నారని అయన విమర్శించారు. విద్యార్ధులకే ...

Read More »

నగర సమస్యలు పరిష్కరించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 20: నగరంలోని కార్పొరేషన్‌ పరిధిలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం కార్పొరేషన్‌ కార్యలయం ఎదటు సిపిఐ న్యూడెక్రసి ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా సిపిఐ న్యూడెక్రసి నగర కార్యదర్శి పరుచూరి శ్రీధర్‌ మాట్లాడుతూ నగరంలోని అండర్‌డ్రైనేజి పనులు అన్ని ధ్వంసం చెందయని,కాని పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నయని అయన అరోపించారు. డివిజన్‌లోని పలు రోడ్లు బాగాలేక నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటు న్నాయని, నీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడల్సి వస్తుందని పేర్కొన్నారు. నగరంలోని అసరా పెన్షున్లలను ...

Read More »

తాళం వేసిన ఇంట్లో చోరీ …. ఛైన్‌ స్నాచింగ్‌ – 2తులాల గొలుసుచోరీ

నిజామాబాద్‌ క్రైం, డిసెంబరు 18; నిజామాబాద్‌ నగరంలోని 3వ టౌన్‌ పరిధిలో బుధవారం రాత్రి నాందేవ్‌వాడలోని విటల్‌ భూమయ్య అనే వ్యక్తి ఇంటి తాళం పగులగొట్టి దొంగలు 4 తులాల బంగారం, నగదు ఎత్తుకెళ్లినట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. విఠల్‌ భూమయ్య బుధవారం ఇంటికి తాళంవేసి బంధువుల పెళ్లికి వెళ్లారు. గురువారం ఉదయం ఇంటికి రాగానే ఇంటి తాళం పగులగొట్టి దొంగలు పడిన విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. ఛైన్‌ ...

Read More »

సిఐడి వేట షురూ… కేసుల నమోదు…, అరెస్టులే తరువాయి ఏ1గా కృష్ణారెడ్డి

నిజామాబాద్‌ ప్రతినిధి, డిసెంబరు 18; జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కుంభకోణం ఇప్పుడు అక్రమార్కులకు వణుకు పుట్టిస్తుంది. విచారణ పూర్తి చేసిన సిబిసిఐడి వేట మొదలు పెట్టింది. అక్రమార్కులపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తుంది. ముందస్తుగా కాంట్రాక్టర్‌ కృష్టారెడ్డిని ఎ-1 నిందితుడి కేసు నమోదు చేసి ఇందులో ముగ్గురు ఉద్యోగులు పేర్లు పెట్టింది. ఇప్పటికే వీరిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల బాగోతం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది. ఇప్పటికే 3 మందిపై ...

Read More »

ఖతార్‌ ఉద్యోగాలకు ధరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌ అర్భన్‌, డిసెంబరు 18; తెలంగాణా ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఖతార్‌ దేశానికి ఫిట్టర్‌/ స్టీల్‌ ఫిట్టర్‌/ మార్కర్‌కు సంబందించిన 28ఖాళీలను భర్తీచేయుటకు స్క్రీనింగ్‌ పరీక్ష ఈనెల 23న హైదరాబాద్‌లో టామ్‌కాం ఆఫీసు ఐటిఐ మల్లెపల్లి క్యాంపస్‌లో ఉదయం 11 గంటలకు నిర్వహించబడుతుందని జనరల్‌ మేనేజర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి కనీస విద్యార్హత పదవ తరగతి పాసైన అభ్యర్తులు, 0 -2 సంవత్సరాల అనుభవం కలిగినవారు అర్హులని తెలిపారు. స్క్రీనింగ్‌పరీక్షకు అభ్యర్థులు ఒక సంవత్సరం వ్యాలిడిటీ ఉన్న ...

Read More »

చట్టాల రక్షణకు ప్రమాణం చేయాలి… కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 19, వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని సమాజంలోని ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అదనపు సంయుక్త కలెక్టర్‌ శేషాద్రి తెలిపారు. గురువారం స్థానిక నూతన అంబేద్కర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన జాతీయ వినియోగదారుల వారోత్సవాలు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, వ్యాపారస్తుల నుండి నాణ్యత లేని వస్తువుల, నకిలీ వస్తువులు పొందినపుడు చట్టపరంగా తన హక్కులను సాధించుకునేందుకు వినియోగదారుల పరిరక్షణ చట్టం ఎంతగానో ఉపయోగకరిస్తుందని ఆయన అన్నారు. విద్యార్థులు, యువత ఈ చట్టాల గురించిపూర్తిగా అవగాహన కల్పించుకోని సమాజంలో ప్రతి ఒక్కరిని ...

Read More »

వైద్య కళాశాలకు మరో 50 సీట్లు… ప్రతిపాదనలు కోరిన డీఎంఈ

ఎంసీఐకీ నివేదిక నిజామాబాద్‌ ప్రతినిధి, డిసెంబరు 18; ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు అదనంగా మరో 50 ఎంబీబీఎస్‌ సీట్లు రానున్నాయి. దీనికి సంబందించి డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అధికారులకు నివేదికలను స్థానిక అధికారులు పంపించారు. ఈ నివేదికలపై ఎంసిఐ అధికారులు సానుకూలంగా స్పందించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అదనంగా 50 ఎంబీబీఎస్‌ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వ మెడికల్‌ కళాశాల అధికారులు డీఎంఈకి ప్రతిపాదనలు పంపించారు. ఇటీవలే మెడికల్‌ కళాశాలలో ఎంసీఐ బృందం మూడవ సంవత్సరం అనుమతి కోసం ...

Read More »

28న పీవోడబ్ల్యూ జిల్లా మహాసభ

నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబరు 18; ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా 6వ మహాసభలను ఈ నెల 28వ తేదీన నిర్వహిస్తున్నరమని, వాటిని విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షురాలు గోదావరి పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని గ్రామ చావిడి వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళల పరిస్థితిపై సమావేశంలో చర్చించానున్నామని తెలిపారు.సినిమాలు,టీవీల్లో మహిళలను స్వార్దపరులుగా ,ద్వేషించే వ్యక్తులుగా చూపుతున్నారని,మాతృత్వానికి చిహ్నంగా ఉన్న మహిళలను విలన్లుగా మార్చడం శోచనీయమన్నారు. నిర్బయలాంటి ఎన్ని చట్టాలు చేసిన సమాజంలో నిత్యం మహిళలపై ఆకృత్యాలు జరు ...

Read More »

ఇంటెలిజెన్స్‌ డిఎస్పీగా మనోహార్‌

నిజామాబాద్‌, డిసెంబరు 18; నిజామాబాద్‌ ఇంటెలిజెన్సి విభాగం డిఎస్పీగా కొత్తపల్లి మనోహార్‌ నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని బేగంపేట లో పని చేస్తున్న ఈయనను బదిలీపై నిజామాబాద్‌కు బదిలీ చేసారు. గతంలో కామారెడ్డి డీఎస్పీగా కూడా పని చేసారు. ఇది వరకే జిల్లాలో పని చేసిన అనుభవం ఉంది.

Read More »

డీపీసీ ఎన్నికలు పూర్తి… అంతా టిఆర్‌ఎస్‌ కైవసం

నిజామాబాద్‌, డిసెంబరు 18, జిల్లా ప్రణాళిక సంఘం(డీపీసీ) సభ్యుల ఎన్నిక ప్రశాతంగా ముగిసాయి. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ఎన్నికల్లో తనసత్తాను చాటుకుంది. 24 స్థానాలకు ఎన్నికల జరుగగా 21 స్థానాల్లో టిఆర్‌ఎస్‌ విజయం సాధించింది. అధికార పార్టీ డీపీసీలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడంతో తిరుగు లేకుండా అయింది. 19 గ్రామీణ స్థానాలకు గానూ 18 స్థానాలకు టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవంగా ఎన్నిక అయింది. 19 గ్రామీణ స్థానాలకు గానూ 22 మంది సభ్యులు నామినేషన్లు వేసారు. ముగ్గురు కాంగ్రెస్‌ సభ్యులు నామినేషన్ల ఉపసహరించుకున్నారు. దీంతో ...

Read More »

21న క్రైస్తవ మైనారిటీలకు కలెక్టర్‌చే హైటీ

నిజామాబాద్‌, డిసెంబరు 17, నిజామాబాద్‌ జిల్లాలోని క్రైస్తవ మైనారిటీలకు,ఇతర ప్రజలకు ఈనెల 21న సాయంత్రం 4 గంటలకు నగరంలోనిరాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో తెలంగాణా రాష్ట్ర క్రైస్తవ మైనారిటీల ఆర్థిక సంస్థ సూచనల మేరకు జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ‘హై టీ ‘ కార్యక్రమం నిర్వహించబడునని , ఈ కార్య జిల్లాలోని సమస్త క్రైస్తవ మైనారిటీలు,ఇతర ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరై విజయవంతంచేయాలని కలెక్టర్‌ కోరారు.

Read More »

ప్రభుత్వ సామాగ్రిపై దృష్టి పెట్టండి…. ఎఎస్పీ పాండునాయక్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 17 జిల్లాలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలనుండి దొంగిలించబడిన కంప్యూటర్లు, ఇతర సామాగ్రి విషయంలో తగు చర్యలు తీసుకుని నివేదిక అందజేయాలని అడిషనల్‌ ఎస్పీ పాండునాయక్‌కు బుధవారం ప్రగతిభవన్‌లో జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్‌ డి.రోనాల్డ్‌ రోస్‌ తెలియచేశారు. వివిధ అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు సమర్ధవంతంగా అలమలు జరగాలంటే ఆయా శాఖల అధికారుల మధ్య సమన్వయ పరస్పర తోడ్పాటు ఎంతైనా అవసరమని, అందువల్ల అంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈత సమావేశంలో జిల్లా రోడ్ల నిర్మాణాలు, నీటి సరఫరా ...

Read More »

డివిజన్‌, మండల స్థాయిలో ప్రజావాణి… కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 17 ప్రతిసోమవారం డివిజన్‌ స్థాయిలో ఆర్డీఓలు, మండల స్థాయిలో తహశీల్దార్లు ప్రజావాణి కార్యక్రమాన్ని తప్పకుండానిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డి.రోనాల్డ్‌రోస్‌ ఆదేశించారు. బుధవారం స్థానిక ప్రగతిభవన్‌లో ప్రజల నుండి వివిధసమస్యలు, ఇతర అంశాలపై వచ్చే ఆర్జీలను స్కానింగ్‌ చేసి ఎప్పటికపుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసి చర్యలుతీసుకుని పరిష్కరించడానికి జిల్లా అధికారులు, ఆయాశాఖల పర్యవేక్షకులు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, టైపిస్టులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్జీల సత్వరపరిష్కారం చేసిన అనంతరం సంబందిత ఆర్జీదారునికి సెల్‌ఫోన్‌ ద్వారా సమాచారాన్ని అందించాలని కలెక్టర్‌ సూచించారు. అన్ని శాఖల అధికారుల ...

Read More »

సోనియా సేవలను మరవకూడదు… ఎఐసిసి నేత రామచంద్ర కుంతియా

ిజామాబాద్‌, డిసెంబరు 16 ; సోనియా గాంధీ సేవలను ప్రతి కార్యకర్త మరవకూడదని, ఆమె కారణంగానే మనకు తెలంగాణ రాష్ట్ర వచ్చిందని ఎఐసిసి నేత రామచంద్ర కుంతియా అన్నారు. సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్‌కు వచ్చిన ఆయన డీసీసీ భవన్‌లో కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ చేపడుతున్న సభ్యత్వం విజయవంతం అవుతుందని, ప్రతి కార్యకర్త మరింత దృడ దీక్షతో పని చేయాలని సూచించారు. స్వాతంత్య్రం వచ్చిన నుంచి కాంగ్రెస్‌ పార్టీ దేశానికి ...

Read More »

పునాదుల్లో అంత అవినీతే… హౌసింగ్‌లో అక్రమాల చిట్టా… ముగ్గురు అధికారులతో కదులుతున్న డొంక

నిజామాబాద్‌ ప్రతినిధి, డిసెంబరు 16 ; ‘చేసిన పాపం ఎన్నటికి విడువదు’ అన్నట్లు గృహా నిర్మాణ సంస్థలో పని చేసిన ఉద్యోగుల పాపం ఇప్పుడు పండుతుంది. అప్పట్లో పునాదుల్లో కప్పెసిన అవినీతిని సిఐడి అధికారులు తవ్వి తీసి కారకులను అరెస్టు చేస్తుండటం ఇప్పుడు హట్‌ టాపిక్‌గా మారింది. అక్రమాలకు పునాది వేసిన నేతలంతా ఇప్పుడు అధికారం లేక ఇళ్లలో ఉంటే విధుల్లో ఉన్న ఉద్యోగులకు చెరసాల తప్పడం లేదు. అవును మరి ‘తిల పాపం తల పిడికెడు’ అన్నట్లు పాపం పంచుకునేది ఎవరనే అధికారులు ...

Read More »

క్రీడాకారులకు ఇబ్బందులు తలేత్తోద్దు… ఎజెసి శేషాద్రి

నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబరు 16; జల్లా కేంద్రంలో నిర్వహించే రాజీవ్‌గాంధీ ఖెల్‌ అభ్యాస్‌ రూరల్‌ గ్రామీణ క్రడలు అండర్‌-16లకు హాజరయ్యే బాల బాలికల క్రీడాకారులకు ఏలాంటి ఇబ్బందులు తలేత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎజెసీ శేషాద్రి అన్నారు. మంగళవారం తన చాంబరు పీడీ, పీఈటీలతో ప్రత్యేకంగా సమావేశం అయి రాష్ట్ర స్థాయి క్రీడలపై సమీక్షించారు. ఈనెల 18, 19, 20 తేదిలలో పోటీలు జరుగుతాయని, అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు. ఫూట్‌బాల్‌ క్రీడలను పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌, సిఎస్‌ఐ గ్రౌడ్‌లో నిర్వహించాలని, అలాగే వెయిట్‌ ...

Read More »

జర్నలిస్టులందరికి అక్రిడేషన్‌ కార్డులు – టియుడబ్య్లుజే

నిజామాబాద్‌, డిసెంబర్‌ 16; జనవరి నెలలొ అర్హులైన జర్నలిస్టులందరికి అక్రిడేషన్‌ కార్డులు ఇప్పిస్తామని జిల్లా గౌరవ అధ్యక్షులు జమాల్‌పూర్‌ గణేష్‌ అన్నారు. మంగళవారం ఆర్‌ అండ్‌ బి అతిది గ్రుహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేషంలో ఆయన మాట్లాడుతూ టియుడబ్య్లుజే ఆద్వర్యంలో అర్హులైన జర్నలిస్టులందరికి అక్రిడేషన్‌ కార్డులు ఇప్పిస్తామని, ఇళ్ల స్తలాలు, ప్రభుత్వంతో మాట్లాడి ఇంటి నిర్మాణానికి ౠణాలు కూడా ఇప్పిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలార్జున్‌ గౌడ్‌, శ్రీనివాస్‌, ధనుంజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »