Breaking News

Nizamabad

ఆర్మూర్‌ లయన్స్‌ క్లబ్‌కు అవార్డుల పంట

  ఆర్మూర్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌లోని చంద్రగార్డెన్‌లో ఆదివారం జరిగిన అవార్డు నైట్‌ కార్యక్రమంలో ఆర్మూర్‌ లయన్స్‌ క్లబ్‌కు అవార్డుల పంట పండింది. ఈ సంవత్సరం జరిగిన సేవా కార్యక్రమాలకు 8 అవార్డులను, ఎక్సలెంట్‌ ప్రెసిడెంట్‌ లయన్‌ కరణ రాధాకృష్ణ, ఔట్‌స్టాండింగ్‌ ట్రెజరర్‌గా జ్ఞానీ చావ్లా, బెస్టు ఔట్‌స్టాండింగ్‌ క్లబ్‌గా ఆర్మూర్‌ లయన్స్‌ను అవార్డుల ప్రదానం లయన్‌ డిస్ట్రిక్‌ గవర్నర్‌ సునీత ఆనంద్‌ చేతుల మీదుగా చేశారని లయన్‌ ఆర్మూర్‌ చిన్నారెడ్డి తెలిపారు.

Read More »

ఎంఇవోకు వినతి

  ఆర్మూర్‌ రూరల్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం మామిడిపల్లిగ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియంగా మార్చాలని సోమవారం గ్రామ ఎంపిటిసి గంగారాం, గ్రామాభివృద్ది కమిటీ సభ్యులు ఎంఇవో రాజగంగారాంకు వినతి పత్రం అందజేశారు.

Read More »

ప్రజలకు ఆరోగ్యాన్ని ప్రసాదించడానికే ఆరోగ్యలక్ష్మి

  – వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య లక్ష్మి పథకం సరిగా అమలయ్యేలా చూసే బాధ్యత గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులు, అధికారులదేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. స్థానిక మీనా గార్డెన్‌లో ఆరోగ్యలక్ష్మి, మహిళల / బాలల సంరక్షణపై నియోజకవర్గ స్థాయి సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, జడ్పిటిసిలకు ఒకరోజు శిక్షణ, అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ...

Read More »

ఉపాధి చట్ట రక్షణకై ఉద్యమిద్దాం

  – అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఆర్మూర్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందని దీన్ని రక్షించుకోవడానికి మేట్లు, కూలీలు అందరు కలిసికట్టుగా ఉద్యమించాల్సిన అవసరమెంతైనా ఉందని ఆర్మూర్‌ డివిజన్‌ కార్యదర్శి సిద్దాల నర్సింలు అన్నారు. జూన్‌ 25న ఆర్మూర్‌ మార్కెట్‌ యార్డులో పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, మేట్లు, కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. అనంతరం మార్కెట్‌ కమిటీ ...

Read More »

వానా… వానా… వెల్లువాయె

  నిజామాబాద్‌ కల్చరల్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ చల్లబడింది…శనివారం సాయంత్రం వరకు కాస్తపాటి వేడిగా ఉన్నప్పటికి ఆదివారం తెల్లవారే సరికి ఒక్కసారిగా వర్షంతో తడిసి ముద్దయింది. అంతే ఎడతెరిపి లేకుండా వాన కురుస్తూనే ఉంది. దీంతో గత మూడు నెలలుగా భానుడి ప్రతాపానికి విలవిలలాడిపోయిన నిజామాబాద్‌ ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఇదిలా ఉండగా నగరంలోని కొన్నిచోట్ల మురికి కాల్వలపై నుంచి నీరు ప్రవహించడం అప్పుడే మొదలైంది. చిన్నపాటి వర్షానికే రోడ్లపైకి మురికి నీరు వచ్చేస్తుంది. అంతేగాకుండా లోతట్టు ...

Read More »

భారతీయ యోగాకు అంతర్జాతీయ గుర్తింపు గర్వకారణం

  – తెవివి రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి డిచ్‌పల్లి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఐక్యరాజ్య సమితి జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం, యోగాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడం భారతీయులందరికి గర్వకారణమని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి అన్నారు. ఆదివారం ఉదయం యోగా డేను పురస్కరించుకొని తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో యోగా సాదన ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రిజిస్ట్రార్‌ ...

Read More »

చుక్కల నంటిన కూరగాయల ధరలు

  నవీపేట, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత వారం పదిరోజుల నుంచి జిల్లాలో పలు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. టమాటో, బెండకాయ, బీరకాయ, వంకాయల ధరలు 40 రూపాయలకు కిలో ధర పలుకుతున్నాయి. దీంతో సామాన్యులు మార్కెట్‌కు వెళ్లి దరలు చూసి ఆశ్చర్యపోతున్నారు. ధరలపై అధికారుల నియంత్రణ లేకపోవడంతో దళారులు రైతుల నుంచి తక్కువకు కొనుగోలు చేసి మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మార్కెట్‌ కమిటీ స్పందించి కూరగాయల ధరలు నియంత్రణలో ఉంచేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Read More »

చిరుజల్లులతో ప్రబలనున్న అంటువ్యాధులు

  నవీపేట, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో గత రెండ్రోజుల నుంచి కురుస్తున్న చిరుజల్లులకు అంటువ్యాదులు ప్రబలే అవకాశముంది. పలు మురికి వాడల్లో ఇప్పటికే రోడ్లు బురదమయమై పందులకు ఆవాసంగా మారాయి. ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమై గ్రామాల్లో వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముంది. అంటువ్యాధులకు సంబంధించిన మందులు స్థానిక ఆరోగ్యకేంద్రాల్లో అందుబాటులో ఉండేలా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Read More »

ఘనంగా యోగా దినోత్సవం

  నిజామాబాద్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యోగా వల్ల మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం ఏర్పడుతుందని, అందరూ ప్రతిరోజు యోగా కార్యక్రమాల్లో పాల్గొనాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా ఆదివారం స్థానిక శ్రీరామ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో స్వయంగా పాల్గొని యోగా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత సంవత్సరం సెప్టెంబర్‌ 27న ఐక్యరాజ్య సమితిలో భారత ప్రధాని పిలుపు మేరకు ప్రపంచ వ్యాప్తంగా 177 దేశాలు ఈరోజు ...

Read More »

ఘ‌నంగ బోనాలు

ఆర్మూర్, జూన్ 19 : ఆర్మూర్ ప‌ట్టణంలోని రాజారాంన‌గ‌ర్ లోగ‌ల విజ‌య‌ల‌క్ష్మి స్ల‌మ్ స‌మ‌ఖ్య వారి ఆద్వ‌ర్యంలో శుక్వారం బోనాల కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఆర్మూర్ మున్సిప‌ల్ చైర్మ‌న్ స్వాతి సింగ్ బ‌బ్లు, స్థానిక కౌన్సిల‌ర్ వ‌న్నెల్ దాస్ ల‌త శ్రీనివాస్ (జో) ముఖ్య అతిథులుగా హాజ‌రై బోన‌లు ఎత్తుకున్నారు. బోనాల‌ను కాలొనీ ప్ర‌దాన దారి గుండ తీసుకెళ్లి మ‌హాల‌క్ష్మి అమ్మ‌వారికి స‌మ‌ర్పించ‌రు. బోనాల‌ను డ‌ప్పు వాయిద్యాలు, పోతురాజులు, అమ్మ‌వారు పూనిన మ‌హిళ‌ల నృత్యాల మ‌ద్య ముందుకు సాగింది. అనంత‌రం మ‌హాల‌క్ష్మి ...

Read More »

ప్ర‌పంచ యోగా దినోత్స‌వాన్ని విజ‌య‌వంతం చేయండి

  ఆర్మూర్, జూన్ 19 : ప‌్ర‌పంచ యోగ దినోత్స‌వాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని ప్ర‌ముఖ యోగ గురువు యోగి భీమ‌య్య పిలుపునిచ్చారు. శుక్ర‌వారం ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని రోడ్లు భ‌వ‌నాల అతిథీ గృహంలొ ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ప్ర‌పంచ వ్యాప్తంగ 200 కోట్ల మంది యోగను నిత్యం చేస్తున్నార‌ని గుర్తు చేశారు. యోగ ఆస‌నాల వ‌ల్ల వ్య‌క్తి యొక్క మాన‌సిక, శారీర‌క బాద‌లు ద‌ర‌మై, ఆరోగ్యంగ ఉంటార‌న్నారు. భార‌త దేశంలో పుట్టిన యోగ ప్ర‌పంచ వ్యాప్తంగ ప్ర‌సిద్ది చెందినందు వ‌ల్ల భార‌తీయులు ...

Read More »

ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కార్మికుల ధర్నా

  కామారెడ్డి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జీవో 68 ప్రకారం వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏఐటియుసి ఆధ్వర్యంలో శుక్రవారం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర నాయకులు నర్సింహారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు బాల్‌రాజులు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం వైద్యశాఖలో పారిశుద్య కార్మికులపై చిన్నచూపు చూస్తుందని విమర్శించారు. కాంట్రాక్టు పద్దతిలో కొనసాగుతున్న వారిని వెంటనే పర్మనెంట్‌ చేయాలని జీవో68 ప్రకారం వేతనాలు చెల్లించాలని, ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, పారిశుద్య కార్మికుల ...

Read More »

పుష్కర ఘాట్‌ పనులను పరిశీలించిన జడ్పి సిఇవో

  నవీపేట, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట మండలంలోని కోస్లి గ్రామ సమీపంలోగల గోదావరి పుష్కర ఘాట్‌ను శుక్రవారం జడ్పి సిఇవో మోహన్‌లాల్‌ సందర్శించారు. పుష్కర ఘాట్‌ పనులను త్వరిత గతిన పూర్తిచేయాలని సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు. పనులు నాణ్యతతో త్వరలో పూర్తి చేయాలని చెప్పారు.

Read More »

ప్రభుత్వ విద్యాసంస్థలను పటిష్టం చేయాలి

  ఆర్మూర్‌, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యావ్యాపారాన్ని నియంత్రించి ప్రభుత్వ విద్యాసంస్థల పటిష్టతకు కృషి చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆద్వర్యంలో ఆర్మూర్‌ పట్టణంలోగల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం పిడిఎస్‌యు ఆర్మూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు ఎం.సుమన్‌ అధ్యక్షతన జరిగింది. దీనికి ఏఐకెఎంఎస్‌ జిల్లా నాయకులు, పిఆర్‌టియు నాయకులు జలందర్‌లు హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం రాగానే కెజి నుంచి పిజి వరకు ...

Read More »

ఎమ్మెల్సీ ఆకుల లలితకు ఘన స్వాగతం

  డిచ్‌పల్లి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలం ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద ఎమ్మెల్సీ గా ఎన్నికై తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన ఎమ్మెల్సీ ఆకుల లలితకు డిచ్‌పల్లి, ధర్పల్లి, జక్రాన్‌పల్లి మండలాల కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఆమెను ర్యాలీగా జిల్లా కేంద్రానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బైక్‌ ర్యాలీ, బాణాసంచా కాల్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, డిసిసి అధ్యక్షుడు తాహెర్‌బిన్‌ హందాన్‌, డిచ్‌పల్లి మండల జడ్పిటిసి కూరపాటి అరుణ ...

Read More »

పట్టణ సమస్యలపై కమీషనర్‌కు వినతి

  కామారెడ్డి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని అంతర్గత రోడ్లు, గుంతలు పడి అద్వాన్నంగా తయారయ్యాయని వాటికి మరమ్మతులు చేయించాలని కోరుతూ తెరాస పట్టణ మైనార్టీ సెల్‌ నాయకులు గురువారం మునిసిపల్‌ కమీషనర్‌ విక్రమసింహారెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని 33 వార్డుల్లో అంతర్గత రోడ్లు దారుణంగా తయారయ్యాయన్నారు. వీటికి తోడు నల్లాల కోసం రోడ్లు తవ్వడంతో రోడ్లపై నడవలేని పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ల మరమ్మతులకు నిదులుకేటాయించి ...

Read More »

ప్రారంభమైన డిగ్రీ అడ్వాన్సు సప్లమెంటరీ పరీక్షలు

  డిచ్‌పల్లి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ అడ్వాన్సు సప్లమెంటరీ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 27 వేల మంది విద్యార్తులు మొత్తం 27 కేంద్రాల్లో పరీక్షలకు హాజరవుతున్నట్టు వర్సిటీ అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు డిగ్రీ తృతీయ సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 ...

Read More »

జూన్‌ 29 బిఇడి వార్షిక ఫీజుచెల్లింపు చివరితేది

  డిచ్‌పల్లి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ బిఇడి రెగ్యులర్‌ 2014-15 వార్షిక పరీక్షలు అలాగే 2013-14, 2012-13 బ్యాచ్‌ల బ్యాక్‌లాగ్‌ పరీక్షలు ఫీజు చెల్లింపు జూన్‌ 29 వరకు చివరి తేది అని వర్సిటీ పరీక్షల నియంత్రణ అదనపు అధికారి డాక్టర్‌ పాతనాగరాజు తెలిపారు. 200 రూపాయల అదనపు రుసుముతో జూలై 6వ తేదీ వరకు చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

Read More »

మహిళలు కుటీర పరిశ్రమల ద్వారా ఆర్థికంగా ఎదగాలి

  కామారెడ్డి, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పరుచుకొని తద్వారా ఆర్థికంగా ఎదగాలని మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఐకెపి అర్బన్‌, మెప్మాలోని బిస్మిల్లా సమాఖ్య సంఘాన్ని ఏర్పాటు చేసి బుధవారం నాటికి ఐదేళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా సమఖ్య ప్రతినిధులు మహాజనసభ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఛైర్‌పర్సన్‌ ప్రసంగించారు. ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అనేక పథకాలు ప్రవేశపెడుతుందని, వాటిని సద్వినియోగం చేసుకొని ...

Read More »

ఘనంగా శ్రీశ్రీ వర్ధంతి వేడుకలు

  ఆర్మూర్‌, జూన్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని టీచర్స్‌ కాలనీలో అరునోదయ కళాకారుల ఆధ్వర్యంలో శ్రీశ్రీ 32వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రీశ్రీ రాసిన పలు రచనల గురించి వారు ప్రస్తావించారు. అనంతరం ఆయన ఔన్నత్యాన్ని, సాహిత్య సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా అరుణోదయ కళాకారులు ఆలపించిన గీతాలు పలువురిని ఆకట్టుకున్నాయి.

Read More »