Breaking News

Nizamabad

రైల్వే ఫ్లాట్‌ఫాం పై గుర్తుతెలియని శవం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాంపై మంగళవారం గుర్తు తెలియని వృద్దుడు (80) మృతిచెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఇతను బ్లాక్‌ప్యాంటు, తల్ల షర్టు వేసుకున్నట్లు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంబందిత వ్యక్తులు వివరాలకోసం రైల్వే స్టేషన్‌ పోలీసుల 08462 221652 నవంబర్‌కు ఫోన్‌ చేసి తెలుసుకోవాలని జిఆర్‌పి హడ్‌కానిస్టేబుల్‌ హబిబ్‌ఖాన్‌ తెలిపారు..

Read More »

భారీగా ఎస్‌ఐల బదిలీలు 

    -35 మందికి స్థానచలనం -ఎస్‌హెచ్‌ఓలుగా ముగ్గురి నియామకం నిజామాబాద్‌, డిసెంబర్‌ 23; జిల్లాలో మరోమారు భారీ సంఖ్యలో ఎస్‌ఐల బదిలీలు జరిగాయి. నవంబరు మూడున మొదట విడతలో 33 మంది ఎస్‌ఐలు బదిలీ కాగా, అదే నెల పదిన ఆరుగురికి స్థానచలనం కలిగించారు. తాజాగా సోమవారం 35 మంది ఎస్‌ఐలను బదిలీచేస్తూ ఇన్‌చార్జి డీఐజీ వై గంగాధర్‌ సామవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టింగ్‌ల కోసం ఎదురు చూస్తున్న 14 మందిని వివిధ ఠాణాలలో నియమించారు. ఇటీవల హైదరాబాద్‌ నుంచి వచ్చిన ...

Read More »

ఈనెల 25న మైనారిటీలకు షాదీ ముబారక్‌ ఆర్థిక సహాయం

  నిజామాబాద్‌, డిసెంబర్‌ 23 జిల్లాలోని మైనారిటీలకు , ఇతర ప్రజలకు ఈనెల 25న ఉదయం 11 గంటలకు షాదీ ముబారక్‌ పథకం కింద పేద మహిళల వివాహానికి ఆర్థిక సహాయంగా ప్రభుత్వం అందించే 51వేల రూపాయలు మంజూరు ఉత్వర్వులను లబ్ధిదారులకు వ్యవసాయశాఖ మంత్రి పి.శ్రీనివాస్‌రెడ్డి అందించనున్నట్లు జిల్లా అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని మైనారిటీ ప్రజలు , ప్రజాప్రతినిధులు హాజరై విజయవంతంచేయాలని ఆయన కోరారు.

Read More »

ప్రభుత్వం హామీలను అమలుచేయకపోతే ఉద్యమాలు తప్పవు – సి.పి.ఎం.

నిజామాబాద్‌, డిసెంబర్‌ 23; తెలంగాణారాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టక తప్పదని సిపిఎం రాష్ట్ర నాయకులు టి.సాగర్‌ అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎన్నికల సమయంలో ప్రజలకు ముఖ్యంగా పేదల సంక్షేమానికి అనేక పథ కాలు అమలుచేస్తామని ప్రకటించారని ఆయన పేర్కొన్నారు. తాను అధికారంలోకి వచ్చాక అన్నివర్గాల ప్రజలకు పథకాలు అమలుచేస్తామని మభ్యపెట్టన కేసిఆర్‌ ప్రస్తుతం వాటిని అమలుచేయడంలో విఫలమవుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలు ...

Read More »

జనవరి మొదటివారంలో టీచర్ల భర్తీకి నోటిఫికేషన్!

వేగంగా చర్యలు చేపడుతున్న టీఎస్‌పీఎస్సీ రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) శ్రీకారం చుట్టింది. ఇటీవలే బాధ్యతలు చేపట్టిన టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యులు, ఉద్యోగ నోటిఫికేషన్లపై వెనువెంటనే దృష్టిసారించారు. నిరుద్యోగుల్లోని ఆతృతను దగ్గనుంచి ఎరిగినవారు కావటంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పనిలోపడ్డారు. భారీ సంఖ్యలో టీచర్ల భర్తీకినోటిఫికేషన్ విడుదల చేయడానికి వారు కసరత్తు మొదలుపెట్టినట్లు తెలిసింది. టీఎస్‌పీఎస్సీ ద్వారానే టీచర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీఅయ్యే అవకాశాలున్నాయని విశ్వసనీయ సమాచారం. టీచర్ ...

Read More »

జిల్లాలో ముమ్మరంగా పెరుగుతున్న సాగు విస్తీర్ణం – వాణిజ్య పంటల వైపు అడుగులు

ముమ్మరంగా పెరుగుతున్న సాగు విస్తీర్ణం -వాణిజ్య పంటల వైపు అడుగులు నిజామాబాద్ న్యూస్ ప్రత్యేకం ఎస్. శర్మ కామారెడ్డి : నిజామాబాద్‌ జిల్లా వ్యవసాయరంగంలో అభివృద్ధి పథంలో కొనసాగేందుకు వనరులు వున్నా అనుకున్నంత మేరకు పురోగతి సాధించ లేకపోతుంది. జిల్లాలో ఎక్కువ శాతం వ్యవసాయ భూమి నిజాంసాగర్‌, అలీసాగర్‌ ప్రాజక్టులతో పాటు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుల కింద ఆయకట్టు కొంత వరకు వుంది. అయితే గత దశాబ్దాలుగా నిజాంసాగర్‌, అలీసాగర్‌ జలాశయాల్లో ఆశించిన స్థాయిలో నీటి నిలువ లేక జిల్లా సాగునీటి అవసరాలు తీర్చడంలో విఫలమయ్యాయి. ...

Read More »

27న టియుడబ్ల్యూజే జిల్లా మహాసభ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 23: ఈ నెల 27న జరిగే టియుడబ్ల్యూజే జిల్లా ప్రథమ మహాసభను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు అంగిరెకుల సాయిలు అన్నారు. మంగళవారం ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు శేఖర్‌, ప్రధాన కార్యదర్శి విరాత్‌ అలీ పాల్గొన్నారు. విరాత్‌ అలీ మాట్లాడుతూ గత 60 సంవత్సరాలుగా జర్నలిస్టుల కొరకు అహర్నిషలు పాటుపడుతున్న యూనియన్‌ మనదేనని, పాత్రికేయులందరూ సహకరించి ఈ నెల 27న జరిగే జిల్లా మహాసభను విజయవంతం చేయాలని కోరారు. మాదే అసలైన యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు ...

Read More »

క్రియాశీల సభ్యత్వంతో జిల్లాలో టిడిపి బలోపేతం

  నిజామాబాద్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ జిల్లాలో టిడిపి క్రియాశీల సభ్యత్వానికి మంచి స్పందన లభించిందని ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి అన్నారు. మంగళవారం టిడిపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత తెలంగాణాలో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు వెన్నంటి ఉంటూ పార్టీకి అండగా ఉన్నారని అన్నారు. తెలంగాణా పది జిల్లాల్లో క్రీయాశీల కార్యకర్తలు పార్టీని విడిచి వెళ్లలేదని, అన్నివేళలా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారని అన్నారు. జిల్లాలో కార్యకర్తల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా బీమా పథకాన్ని ...

Read More »

రామనుజ అడుగు జాడల్లో నడవాలి… కెర్‌ కళాశాల డైరెక్టర్‌ నరాల సుధాకర్‌

నిజామాబాద్‌ అర్భన్‌, డిసెంబరు 22; ప్రతి విద్యార్థి గణిత శాస్త్ర పితమహుడు శ్రీనివాస రామనుజ అడుగు జాడల్లో నడవాలని కేర్‌ కళాశాల డైరెక్టర్‌ నరాల సుధాకర్‌ అన్నారు. సోమవారం కళాశాలలో రామనజ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్‌ మాట్లాడుతూ భారత దేశాన్ని గణిత శాస్త్రంలో ప్రపంచానికి పరియం చేసిన ఘనత రామనుజనుదేనని అన్నారు. ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని నడుపుతుంది గణితమేనని, అందుకు శ్రీనివాస రామనుజ జన్మదినాన్ని గణిత శాస్త్రం దినోత్సవంగా నిర్వహించి, అంతటి ...

Read More »

చారిత్రక ఘనత వహించిన నాటి ఇంద్రపురి వైభవం

నిజామాబాద్ న్యూస్ ప్రత్యేకం ఎస్. శర్మ   కామారెడ్డి: బోధన్‌ ఒకప్పటి భారత గాథలో బకాసుర వధ వృత్తాంతాన్ని తెలియజేసే ఏకచక్రపురంగా ద్వాపార యుగం నుంచి వీటి ఆనవాళ్లు కలిగి వుంది. చోళులు, బాదామి చాళుక్యులు పాలనల ద్వారా శ్రావణ బెళగోలలో నెలకొల్పిన బాహుబలిని పోలిన విగ్రహం బోధన్‌లో వెలుగులోకి వచ్చి ఈ చారిత్రక నేపథ్యాన్ని జైన తీర్థాంకరుల స్థావరంగా పేర్కొనదగినది. నవనాథ గురువుల ఆనవాళ్లతో ఆర్మూర్‌ ప్రాంతం సైతం జైన మత వ్యాప్తిలో పేరుగాంచినది. పైఠానపురం బోధన్‌గా మార్పు చెంది వేల ఏళ్ల ...

Read More »

భీమా అవకాశాన్ని సద్వినియోగించుకోవాలి

నిజామాబాద్‌ అర్భన్‌, డిసెంబరు 22; పంటల బీమా పథకంలో రుణం పొందిన రైతులు రబీ 2014- 15 సీజన్‌లో ప్రపొజల్స్‌తో సహాప్రీమియం చెల్లింపునకు తుది గడువు ఈనెల 31లోగా చెల్లించాలని సంయుక్త వ్యవసాయ సంచాలకులు నర్సింహా తెలిపారు. జిల్లా రైతులందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ఆయన సూచించారు. బ్యాంకు నుండి రుణం పొందు రైతులు ప్రీమియంను బ్యాంకులోనే చెల్లించాలని, రుణం పొందని రైతులు ఐశ్చికంగా వారివారి పరిధిలోని ఏదేని బాంకులో అకౌంట్‌ తెరిచి ప్రపోజల్‌ ఫారంతో సహ సాగు చేయబడిన పంటలు, వాటి ...

Read More »

పుష్కరాల ఏర్పాట్లు ఘనంగా ఉండాలి… సీఎస్‌ రాజీవ్‌శర్మ

నిజామాబాద్‌, డిసెంబరు 22; రాబోయే గోదావరి పుష్కరాలలో పాల్గొనే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జిల్లాయంత్రాంగం తరఫున అవసరమయ్యే ఏర్పాట్లన్నీ సత్వరం పూర్తిచేయించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జిల్లాకలెక్టర్‌కు సూచించారు. సోమవారం సచివాలయం నుంచి నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ ,ఖమ్మం జిల్లాలలోని కలెక్టర్లతో అధికారులతోవీడియో కాన్ఫరెన్సు ద్వార ఆయా జిల్లాల్లో గోదావరి పుష్కరాల కోసం అధికారులు రూపొందిస్తున్న కార్యాచరణ ప్రణాళికను కలెక్టర్లతోసమీక్షించారు. పుష్కరాల సందర్భంగా అతి ముఖ్యమైన వ్యక్తులు హాజరవుతారని, వారికి ఇబ్బంది కలగకుండా విడిది కోసం అవసరమైన రోడ్లు, ...

Read More »

గ్రామ స్వశక్తీకరణ పురస్కార్‌

నిజామాబాద్‌, డిసెంబరు 22; కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలను మరింత బలోపేతం చేసేందుకు గ్రామ స్వశక్తీకరణ పురస్కార్‌ అవార్డును ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ది, అభివృద్ది పనుల కోసం నిధులను కేటాయించనుంది. పంచాయతీలను అన్ని విధాలా అభివృద్ది చేయాలనే ఉద్దేశంతో పంచాయతీ స్వశక్తికరణ పురస్కార్‌ (పీఎస్‌పీ)ను ఇవ్వనుంది. దీనికి గాను ఉత్తమ పంచాయతీలను ఎన్నిక చేసిందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రతిపాదనలు సిద్దం… నిజామాబాద్‌ జిల్లాలో 718 పంచాయతీలు ఉన్నాయి. వీటీలో మెజారిటీ గ్రామాలు అభివృద్దికి దూరంగా ...

Read More »

నిందితుడిని కఠినంగా శిక్షించాలని రాస్తారోకో రోడ్డె ఎక్కిన విద్యార్థినిలు

నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబర్‌ 22; నిజామాబాద్‌ నగరంలో మూడు రోజుల వినాయక్‌నగర్‌కు చెందిన వివాహిత సరిత హత్యకు కారకులైన ఆమె భర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ మహిళా కళాశాలకు చెందిన ఉమెన్స్‌ ఎంపవర్‌మెంట్‌ విద్యార్థినులు పెద్ద సంఖ్యలో సోమవారం నగరంలో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌ వద్ద రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మహిళల పట్ల రోజురోజుకు పెరిగిపోతున్న అత్యాచారాలు, హత్యలు ఆందోళనకలిగిస్తున్నాయని, అంతేగాక పట్టణాలు, నగరాలనే తేడాలేకుండా ఈవ్‌ టీజింగ్‌ పెరిగిపోయిందని, ముఖ్యంగా మహిళలు, విద్యార్థినీలు,బాలికలకు సైతం భద్రత లేకుండాపోయిందని ...

Read More »

23 నుంచి రాష్ట్రస్థాయి థంగ్‌సుడో కరాటే చాంపియన్‌షిప్‌ పోటీలు

నిజామాబాద్‌ స్పోర్ట్స్‌, డిసెంబరు 22; స్కూల్‌గేమ్‌ ఫెడరేషన్‌ అండర్‌-14,17,19 విభాగంలో రాష్ట్రస్థాయి తంగ్‌సుడో క్రీడాలు నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో జరగనున్నాయి. డీఎస్‌ఏ స్టేడియంలోని నిర్వహిస్తామన్నారు. జూనియర్‌ కళాశాలల నిర్వహణ కార్యదర్శి డి.సాయిలు,పాఠశాలల నిర్వహణ కార్యదర్శి జీవీ భూమారెడ్డి పర్యవేక్షణలో రెండు రోజుల పాటు పోటీలు నిర్వహిస్తారు. ఈ మేరకు అ క్రీడ సంఘ అధ్యక్ష,కార్యదర్శులు డాక్టర్‌ సావన్‌ఆలా, పంపరి ప్రవీణ్‌కుమార్‌లు తెలిపారు. 23న జిల్లాస్థాయి బాలబికలకు పోటీలు…. 23న మొదటి రోజు జిల్లాస్థాయి బాలబాలికలకు పోటీలు, 24న రాష్ట్రస్థాయి జూనియర్‌ కళాశాలలు, పాఠశాలల విధ్యార్థులకు ...

Read More »

అంగన్‌’వాడీ’… మెరిట్‌ ‘పరీక్ష’… గ్రేడింగ్‌ విధానం అమలు పనితీరుకు పరీక్ష…

నిజామాబాద్‌, డిసెంబరు 22; పసిపాపల అలన పాలన చూసే అంగన్‌వాడిలకు ఇక నుంచి మెరిట్‌ పరీక్షలు అమలు జరగనున్నాయి. జిల్లా కలెక్టర్‌ రాస్‌ నిర్ణయం మేరకు అంగన్‌వాడిల పని తీరును మెరుగు పరచేందుకు గ్రెడింగ్‌ విదనాన్ని అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ విదానం జిల్లాలో ప్రదమంగా మొదలు కావడం విశేషం. దీనిపై అంగన్‌వాడి వర్కర్ల సంఘం ప్రతినిషధులు వ్యతిరేకరిస్తున్నాయి. ఇచ్చే ఆరాకోరా వేతనాలను అడ్డం పెట్టుకొని అధికారులు అంగన్‌వాడి టీచర్లను, అయాలను మరింత వేధింపులకు గురి చేస్తారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పర్యవేక్షణ అధికారుల ...

Read More »

డీఎంహెచ్‌వో బదిలీ…? అధికారిక ఆదేశాలు తరువాయి… మింగుపడని అధికారి తీరు

నిజామాబాద్‌, డిసెంబరు 22; అది జిల్లాలో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ. దీని వారథి గోవింద్‌ వాగ్మారే. ఏడాది క్రితం బాధ్యతలు స్వీకరించారు. అది నుంచి ఈయన అ శాఖలో వివాదస్పదంగా వ్యవహారిస్తుండటం. ఈ తరహాలోనే పని చేసిన నగర పాలక కమిషనర్‌ మంగతయారును సరెండర్‌ చేయడం, అదే కోవలో వాగ్మారే బదిలీ ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. కాని ఈయన బదిలీ ఇప్పుడు తప్పనిసరి అని అటు అధికారవర్గాల్లో ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కారణాలు ఏంటీ.? రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ...

Read More »

గాడిలో పడేనా..? నగర పాలనపై మల్లాగుల్లాలు… ఆర్డీవోకు కార్పొరేషన్‌ కమిషనర్‌ బాధ్యతలు

నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబరు 22; నిజామాబాద్‌ నగర పాలన వ్యవస్థ ఇకనైనా గాడిలో పడుతుందా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిన్నటి వరకు ఇంచార్జి కమిషనర్‌గా వ్యవహారించిన మంగతాయరు అధికారిక, సంక్షేమ పథకాల అమలులో ఇష్ట రాజ్యంగా వ్యవహారించడం చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు అధికారిక చర్యలకు దిగడంతో ఆమె సెలవుపై వెళ్లిపోయారు. దీంతో నిజామాబాద్‌ అర్‌ డివో యాదిరెడ్డికి ఇంచార్జి కమిషనర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈయన బాధ్యతలు స్వీకరించడంతో ఇకనైనా నగర పాలక వ్యవస్థ గాడిలో పడుతుందా అనే ఆశలు వ్యక్తం అవుతున్నాయి. నగర ...

Read More »

తెలంగాణా ప్రాంత ఉపాధ్యాయ సంఘ నూతన జిల్లా కార్యవర్గం

నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబర్‌ 21; తెలంగాణా ప్రాంత ఉపాధ్యాయ సంఘ (టిపియుఎస్‌) ఇందూరు జిల్లా నూతన కార్యవర్గ సమావేశం ఆదివారం స్థానిక ప్రగతినగ్‌లోని టిపియుఎస్‌ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కీర్తిసుదర్శన్‌ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలేటి వెంకటరావు , రాష్ట్ర బాధ్యులు కర్నే శంకర్‌, గిరిజాగాయత్రి, యామ సత్యనారాయణ, రమేశ్‌గౌడ్‌ హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఉపాధ్యాయులు తెలంగాణా పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని అందుకు తగినవిధంగా తమవంతు సహాయసహకారాలందించాలన్నారు. విద్యార్థులకు విద్యాబోధనలో ఉపాధ్యాయులు ...

Read More »

చెడిన మైత్రి…. మైత్రి సంఘాల మాటే కరువు… ప్రేండ్లీ పోలీసులు ఏ మేరకు…?

బాన్సువాడ, డిసెంబర్‌20 పోలీసు ప్రవర్తన నియమావళి తిరోగమనం దిశగా సాగుతోంది. భాషాప్రయోగం కాఠిన్యమైంది. మైత్రి సంఘాలు మరుగున పడ్డాయి. కళాజాతలు కనుమరగయ్యాయి. సామాజిక కార్యక్రమాలు పూజ్యమయ్యాయి. బోధన్‌ డివిజన్‌లో దశాబ్ధం కింద పోలీసు శాఖ ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టి సామాన్యులకుచేరువైంది. గ్రామాల్లో మైత్రీ సంఘాలు విరివిగా ఏర్పాటుచేసి సమాచార వ్యవస్థను పెంచుకుంది. దీంతో చిన్నచిన్న నేరాలు జరిగినపుడు వాస్తవాలను ప్రజలనుంచి రాబట్టి బాధితులకు సత్వరంన్యాయం చేయగలిగారు. మైత్రీ సంఘాల ఆధ్వర్యంలో గ్రామసభలు పెట్టి సామాజిక సమస్యలను తెలుసుకుంది.ఆయా ప్రభుత్వ శాఖలకు నివేదించి సత్వర పరిష్కారానికి ...

Read More »