Nizamabad

అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి

  ఆర్మూర్‌, జనవరి 30: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: ఆర్మూర్‌ పట్టణంలోని విద్యార్థుల ఫీజు రీ-అంబర్స్‌మెంట్‌ బకాయిల గురించి రాస్తారోకో చేస్తున్న పిడిఎస్‌యు విద్యార్థి నాయకుడు నిమ్మల నిఖిల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయడం సరి కాదని, సిపిఐఎమ్‌ఎల్‌ సబ్‌ డివిజన్‌ కార్యదర్శి సుధాకర్‌ తెలిపారు. అరెస్టు చేసిన నిఖిల్‌ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేయవలసిన ఫీజు రీ-అంబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయ పోవడం వల్ల ఫాస్ట్‌ పథకం అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ...

Read More »

బిసి విద్యార్థి సంఘం క్యాలెండర్‌ ఆవిష్కరణ

  ఆర్మూర్‌, జనవరి 30: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: పట్టణంలోని బిసి విద్యార్థి సంఘం ఆర్మూర్‌ సి.ఐ. రవికుమార్‌ చేతుల మీదుగ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బి.సి విద్యార్థి సంఘం డివిజన్‌ అధ్యక్షుడు ప్రశాంత్‌ యాదవ్‌ మాట్లాడుతూ కెసిఆర్‌ ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఇంతవరకు విద్యార్థులకు రావలసిన బకాయిలు విడుదల చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ఫీజు రీ-అంబర్స్‌మెంట్‌ విడుదల అవుతుందో లేదో అని కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుండి ముక్కుపిండి ఫాజులను వసూలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం ...

Read More »

ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఒక కిలో బియ్యం పంపిణీ చేసిన సర్పంచ్‌

  డిచ్‌పల్లి, జనవరి 29: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆహార భద్రత పథకాన్ని డిచ్‌పల్లి మండలం గాంధీనగర్‌ కాలనీలో సర్పంచ్‌ అంజయ్య ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అర్హులైన లబ్దిదారులెవరికైనా ఆహార భద్రత పథకం అందని యెడల గ్రామ పంచాయితీలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఎమ్‌పిపి దాసరి ఇంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆహార భద్రత పధకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నడిపెల్ల ఎమ్‌పిటిసి సాయన్న, ఎమ్‌పిటిసి రవికుమార్‌, ...

Read More »

ఐక్య ఉద్మయాలే శరణ్యం

  -జె.బి.రాజు, దళిత సేన జాతీయ అధ్యక్షులు -నిజామాబాద్‌, జనవరి 29: ఎస్సీలు అంతర్గత కుమ్ములాటలతోనే ఉంటే దళితుల సమస్యలు మరింత జఠిలం అవుతాయని, విబేథాలను విడి కలిసి కట్టుగా ఐక్య ఉద్యమాల కోసం కలిసి రావాల్సిన అవసరం ఉందని దళిత సేన జాతీయ అధ్యక్షుడు జె.జి.రాజు అన్నారు. గురువారం హరితా హోటల్‌లో దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ”దళితుల సమస్యలు, సవాళ్లు – ఐక్య ఉద్యమాలు” అనే ఆంశంపై సదసుస్స జరిగింది. సావెల్‌ గంగాధర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ముఖ్య ...

Read More »

అంబేద్కర్‌ విగ్రహ ధ్వంసం దోషులను కఠినంగా శిక్షిించాలి

-దళిత సంఘాల ర్యాలీ నిజామాబాద్‌, జనవరి 29: మోర్తాడ్‌ మండలం ఏర్గట్ల గ్రామంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షిించాలని, నందిపేట మండలం వెల్మల్‌లో జాతీయ జండాను ఎగరవేయకుండా దళిత సర్పంచ్‌ను అడ్డుకున్న గ్రామ కమిటీ వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ జిల్లాలోని 13 దళిత సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌కు, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డిలకు వినతిపత్రం అందజేశారు. దళిత సంఘాల ప్రతినిధిగా గైని గంగారం ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కలెక్టర్‌ చాంబర్‌ ఎదుట బైఠాయించారు. అంతకుముందు హోటల్‌ ...

Read More »

అవమానం భరించలేక వ్యక్తి ఆత్మహత్య

  రెంజల్‌ (బోధన్‌), జనవరి 29: రెంజల్‌ మండలంలోని తాడ్‌బిలోలి గ్రామానికి చెందిన మమ్మాయి రమేష్‌(38) అనే వ్యక్తి అవమానం భరించలేక తన పంట పొలంలో ఉన్న వేప చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాట్టు ఎస్సై టాటా బాబు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మమ్మాయి రమేష్‌ దొంగతనం చేశాడనే ఆరోపణతో కేసు నమోదు చేయగా, ఆయన చేయలేదని మనస్తాపం చెంది ఇంటి పక్కన పంట పొలంలో ఉదయం 9:30 ప్రాంతంలో వేప చెట్టు కు ఉరి వేసుకొని మృతి చెందాడని, ...

Read More »

తెయూ భూములను పరిశీలించిన ఇంచార్జి వీసీ పార్తసారది.

  డిచ్‌పల్లి, జనవరి 28: తెలంగాణ యూనివర్సిటికి చెందిన భూములు ఆక్రమణకు గురవుతున్నాయన్న వార్తల నేపద్యంలో ఇంచార్జీ వీసీ పార్తసారది బుధవారం రిజిస్ట్రార్‌ లింబాద్రితో కలసి భూములను పరిశీలించారు. యూనివర్సిటికి సంబందించిన ఒక అంగుళం భూమి కూడా ఆక్రమణదారుల పరం కానిచ్చే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. కలెక్టర్‌, ఇతర రెవెన్యూ అధికారులతో మాట్లాడి తక్షణం అవసరమైతే రీ సర్వే చేయించి ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. వెంటనే భుముల చుట్టూ కంచే గాని లేదా ప్రహారి నిర్మాణం గాని చేపడతామని ...

Read More »

పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపన

  ఆర్మూర్‌, జనవరి 28: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: అర్మూర్‌ పట్టణంలోని 8,10వ వార్డులో బుధవారం 2 లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్డు నిర్మణ పనులకు అర్మూర్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ స్వాతి సింగ్‌ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భ:గా వారు మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన అతికొద్ది రోజుల్లో జిల్లా ఎమ్‌పి కవిత, ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సహకారంతో అనేక అభివృద్ధి పనులను ప్రారంభించామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ ఛైర్నన్‌ లింగాగౌడ్‌, స్థానిక ...

Read More »

ఫీజు రీ-అంబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలి

  ఆర్మూర్‌, జనవరి 28: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: ప్రభుత్వం నుంచి రావలసిన రీ-అంబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయకపోవడంతో బుధవారం ఆర్మూర్‌ పట్టణంలోని నరేంద్ర కాలేజి విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ ప్రభుత్వం ఫీజు రీ-అంబర్స్‌మెంట్‌ను చెల్లించనందువల్ల కాలేజీ యాజమాన్యం విద్యార్థులను ఫీజు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పీజు రీ-అంబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని వారు కోరారు లేని యెడల మరిన్ని ఉద్యమాలు ...

Read More »

అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత

  నిజామాబాద్‌, జనవరి 28: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: రేషన్‌ దుకాణాలకు వెల్లవలసిన బియ్యం పక్కదారి పడుతున్నాయి. కరీంనగర్‌ జిల్లా జగిత్యాల నుంచి అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీని పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది మాటు వేసి పట్టుకున్నారు. పేదలకు పంచాల్పిన బియ్యం జగిత్యాల నుంచి లారీలో తరలిస్తున్నారని విశ్వసనీయంగా సమాచారం అందింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిప్యూటీ తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌, కారణ్‌, సుభాష్‌ చందర్‌, బాల్‌ రాజ్‌, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ కాంత్‌లు మూడు బృందాలుగా విడిపోయి కంఠేశ్వర్‌ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం మాటు ...

Read More »

నిర్ధారణ పరీక్షలు జరగట్లేదు

  నిజామాబాద్‌, జనవరి 28: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: రాష్ట్రంలో స్వైన్‌ ఫ్లూ కేసులు పెరగడం, ప్రభుత్వం చకచకా స్పందించడం అంతా హడావిడిగా జరిగిపోయింది. ఐతే జిల్లాలో మాత్రం ఒక ప్రత్యేక వార్డుని జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసి అధికారులు నిమ్మకున్నారు. స్వైన ఫూ ్ల అనుమానాలును వార్డులో ఉంచి ఎలాంటి నిర్ధారణ పరీక్షలు చేయట్లేదు. కారణం..?.. ఇందుకు అవసరమైన పరికరాలు కేవలం హైదరాబాదులో మాత్రమే ఉన్నాయి. మరి నమూనాలు సేకరించి పంపటానికి అవసరమైన ‘ఇన్స్‌ పోరర్టు మీడియా’ కూడా ఇంతవరకు జిల్లాకు ...

Read More »

తెలంగాణ హైకోర్టు ఏర్పడే వరకు ఖాళీలు ఆపండవి

  -బార్‌ అసోసియేషన్‌ ఏకగ్రీవ తీర్మాణం నిజామాబాద్‌, జనవరి 28: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: తెలంగాణ హైకోర్టు ఏర్పడే వరకు ఎలాంటి పదవులు, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయవద్దని కోరుతూ మూడు రోజులు విధుల బహిష్కరణకు నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రావ తీర్మాణం చేసింది. మంగళవారం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షకార్యదర్శులు ఎన్‌ ఎల్‌ శాస్త్రి, నారాయణరెడ్డి ఏర్పాటు చేసిన సరవసభ్య సమావేశంలో పలువురు న్యాయవాదులు మాట్లాడారు. సుప్రీం కోర్టు ఖాళీలను భర్తీ చేయాలని ఇచ్చిన తీర్పును వెంటనే ఆపివేయాలని, ముందు ...

Read More »

రాజ్యాంగ నిర్మాతను అవమానించడం సిగ్గుచేటు

  నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ఇన్‌: అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను తక్షణమే పట్టుకుని శిక్షించాలని నగరంలోని పలు దళితసంఘాలు సోమవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించాయి. మోర్తాడ్‌ మండలంలోని ఎర్గట్లలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ద్వంసం చేయడం శోచనీయమన్నారు. ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావౄతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ప్రకటన విడుదల చేసినవారిలో బీఎస్పీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, సంజయ్‌గౌడ్‌, గౌని గంగాధర్‌, దళిత మహాసభ జిల్లా అధ్యక్షుడు నీరడి లక్ష్మణ్‌, దళిత్‌ కల్యాణ్‌ సమితి నగర ...

Read More »

కులం పేరుతో దూషించిన డిప్యూటీ మేయర్‌ను అరెస్టు చేయాలి

  నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ఇన్‌: విధి నిర్వహణలో ఉన్న మున్సిపల్‌ కార్మికులను, అదికారులను కులం పేరుతో దూషించిన డిప్యూటీ మేయర్‌ను అరెస్టు చేయాలని బిజెపి, కాంగ్రెస్‌, సిఐటీయూ ఆద్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహి,చారు. ఈ సంద్బంగా వెంకట్‌ గౌడ్‌ మాట్లాడుతూ డిప్యూటి మేయర్‌ కార్మికులను కులం పేరుతో దూశించారని, మున్సిపల్‌ అధికారులను చంపేయండి అని బెదిరించారన్నారు. విది నిర్వహనలో బాగంగా మున్సిపల్‌ అధికారి ఎస్‌ఐ మరియూ సిబ్బంది అక్రమంగా మాంసం విక్రయిస్తున్న వారిపై దాడులు నిర్వహించి పట్టుకోగా మున్సిపల్‌ అధికారులను ...

Read More »

పోలీసు యంత్రాంగం సమర్ధవంతంగా పనిచేయాలి.

నిజామాబాద్‌, జనవరి 27: నిజామాబాద్‌, న్యూస్‌ డాట్‌ ఇన్‌: పోలీసు యంత్రాంగం సమర్ధవంతంగా పనిచేసినప్పుడే సమాజంలో శాంతిభద్రతలు నెలకొంటాయని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అందుకోసం పోలీసు వ్యవస్థను పటిష్టపరచడానికి ప్రభుత్వం గత జూలై 16న జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు వారికి వాహనాలు, సి.సి కెమెరాలు ఇతర ఆధునీకరణ సదుపాయాల కోసం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ప్రత్యేకంగా 312 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణ పది జిల్లాలకు ద్యిచక్ర వాహనాలు 1500, నాలుగు చక్రాల ...

Read More »

కలెక్టర్‌ కూతురుకు పోస్టల్‌ ఖాతా

-ప్రారంభించిన తపాల శాఖ నిజామాబాద్‌, జనవరి 24: ప్రధానమంత్రి నరేంద్రమోడి ‘బేటి బచావో, బేటి పడావో’ నినాదంతో చేపట్టిన సుకన్య సమృద్ది పథకం తపాల ఖాతాను జిల్లాలో మొట్ట మొదటి జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ కూతురు అతిరాయ్‌, ఐయిషా పేర్లతో ప్రారంభించారు. ఈ మేరకు జిల్లా తపాల శాఖ సీనియర్‌ సూపరింటెండెంట్‌ అభిజిత్‌ బన్సాడే ఖాతాలను కలెక్టర్‌లకు శనివారం అందజేసారు. ఈ పథకం ద్వారా ఆడ పిల్లలకు ఎంతో ప్రయోజనకరం అని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ అన్నారు. కాబట్టి ఆడ పిల్లల తల్లిదండ్రులు తప్పకుండా ...

Read More »

జేసిగా రవిందర్‌రెడ్డి

నిజామాబాద్‌, జనవరి 24: నిజామాబాద్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా ఎ.రవిందర్‌రెడ్డి శనివారం కలెక్టర్‌ నుంచి బాధ్యతలను స్వీకరించారు. గత కొంత కాలంగా ఖాళీగా ఉన్న పోస్టును ఇటీవలే ప్రభుత్వం భర్తీ చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జేసి రవిందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు డిఆర్‌వో తదితరులు పాల్గొన్నారు.

Read More »

మా సోమ్ము మాకు కావాలి… బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య

నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 24: ఎవరి ఆస్తులు అడగడం లేదు, ఎవరి హక్కులను హరించడం లేదు. మా సోమ్ము మాకు కావాలి అంటున్నాం, కాని ఈ ప్రభుత్వాలు బిసి విద్యార్థులకు రావాల్సిన ఉపకార వేతనాలు ఫీజు రియింబర్సిమెంట్‌ ఇవ్వకుండా కాలయాపన చేయడంపై ఇలా ఆవేదనలో రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. శనివారం బిసి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థి శంఖారావం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణయ్య హాజరై ప్రసంగించారు. రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ...

Read More »

భృతి కార్మికుల హక్కు… ఐఎఫ్‌టియు జాతీయ అధ్యక్షెడె డివి.కృష్ణ

నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 24: బీడీ కార్మికుల కారణంగా ప్రభుత్వానికి లక్షల రూపాయాల అదాయం వస్తుందని, బీడీ కంపెనీలు కోట్ల రూపాయాలు దండుకుంటున్నాయని, కాని కార్మికుల మాత్రం జీవన భృతిని కల్పించేందుకు ప్రభుత్వాలు వెనకడుతున్నాయని ఐఎఫ్‌టియూ జాతీయ అధ్యక్షుడు డివి.కృష్ణ అన్నారు. శనివారం బీడీ కార్మికులకు జీవన భృతి కల్పించాలని, పరిశ్రమను కాపాడాలని డిమాండ్‌ చేస్తు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సదస్సును నిర్వహించారు. అంతకు ముందే నగరంలోని భారీర్యాలీని నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద జరిగిన బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా ...

Read More »

జిల్లా అగ్నిమాపక శాఖాధికారిగా సులేమాన్‌ షరీఫ్‌

  నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 22: నిజామాబాద్‌ జిల్లా ఫైర్‌ స్టేషన్‌ ఫైర్‌ అఫీసర్‌గా సులేమాన్‌ షరీఫ్‌ బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1980లో ఈ శాఖలో చేరి, మొన్నటి వరకు హైదరాబాద్‌లోని శిక్షణ కేంద్రంలో శిక్షకుడిగా విధులు నిర్వహించారు. లీడింగ్‌ ఫైర్‌మెన్‌గా పని చేసిన ఆయన పదోన్నతిపై నిజామాబాద్‌కు వచ్చారు. ఈ సందర్బంగా సులేమాన్‌ షరీఫ్‌ మాట్లాడుతూ కేంద్ర శిక్షణ కేంద్రంలో శిక్షకునిగా విధులు నిర్వహించనని, కాబట్టి సిబ్బంది అప్రమత్తంగా ఉంచడం జరుగుతుందన్నారు. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు సంఘటన స్థలంలో తీసుకోవాలసిన జాగ్రత్తల గురించి ఎప్పటికప్పుడు ...

Read More »