Breaking News

Nizamabad

లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో ప్రముఖులకు సన్మానం

  ఆర్మూర్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని లయన్స్‌ క్లబ్‌ భవనంలో 69వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా మండలంలోని ప్రముఖులకు లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు సుందర్‌ శనివారం ఘనంగా సన్మానించారు. ఆర్మూర్‌కు చెందిన వీరజవాన్‌ బాదాం శ్రీనివాస్‌ తల్లి బాదాం చంద్రకళ, స్వాతంత్య్ర సమరయోదుడు ఏలేటి శ్యాంసుందర్‌రెడ్డి, తల్లి నేత్రాలను దానం చేసిన కొత్తూరు మురళీధర్‌, పెద్దలకు సేవచేయడంతోపాటు మృతదేహాలను ఉచితంగా స్వర్గధామ రథంలో తీసుకెళ్లడానికి వాహనాన్ని ఏర్పాటు చేసిన సమాజ సేవకుడు హజారి అంతాజి, మదన్‌ ...

Read More »

వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

  ఆర్మూర్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. 69వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆర్మూర్‌ పట్టనం, మండల వాసులు ఘనంగా జరుపుకున్నారు. ఆర్మూర్‌ పోలీస్‌ స్టేషన్లోసిఐ రవికుమార్‌, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి పోతు నర్సయ్య, తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ శ్రీధర్‌, పంచాయతీ రాజ్‌ కార్యాలయంలో బాపురావు, ఆర్‌డబ్ల్యుఎస్‌ కార్యాలయంలో వెంకటేశ్వర్లు, మండల విద్యావనరుల కేంద్రంలో ఎంఇవో రాజగంగారాం, హౌజింగ్‌ కార్యాలయంలో ఎఇ గోపాల్‌, మునిసిపల్‌ ...

Read More »

బంగారు తెలంగాణ సాధన దిశగా…

  ప్రజా సంక్షేమమే ధ్యేయంగా…ప్రభుత్వం పనిచేస్తుంది – స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. 69వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్బంగా స్థానిక పోలీసు పరేడు గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పేద ప్రజల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను, రాష్ట్ర, జిల్లా అభివృద్దికి ...

Read More »

సమ్మె విరమించిన పంచాయతీ కార్మికులు

  మాక్లూర్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 44 రోజులుగా నిరవధిక సమ్మెలో ఉన్న పంచాయతీ కార్మికులు ఎట్టకేలకు విదుల్లో చేరారు. రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి హామీ మేరకు శుక్రవారం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో కార్మికులు విధులు నిర్వహించారు. చెత్తను తొలగించి మురికి కాల్వలను శుభ్రం చేశారు.

Read More »

నోడల్‌ అధికారులు గ్రామాలకు వెళ్ళాలి

  ఆర్మూర్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలో గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందస్తుగా నోడల్‌ అధికారులు వెళ్ళి వివరాలు తెలుసుకోవాలని ఎంపిడివో ప్రవీణ్‌కుమార్‌ సూచించారు. గ్రామ జ్యోతి విజయవంతానికి నోడల్‌ అధికారులదే ప్రధాన బాద్యత అని ఆయన అన్నారు. నోడల్‌ అధికారులు గ్రామ స్థాయి అధికారులను సమన్వయం చేసుకొని ముందస్తుగా గ్రామాలకు వెళ్లి పరిస్థితులను అవగాహన చేసుకోవాలన్నారు.

Read More »

సామాజిక అభివృద్ది సాధించేందుకు గ్రామజ్యోతి

  – జిల్లా కలెక్టర్‌ యోగితారాణా నిజామాబాద్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలలో సామాజిక దృక్పథాన్ని పెంపొందించి గ్రామ పంచాయతీ విధులలో వారిని భాగస్వాములను చేయడమే గ్రామ జ్యోతి ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్‌ యోగితా రాణి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ ప్రగతిభవన్‌లో జిల్లా అధికారులు, ఎంపిడివోలు, తహసీల్దార్లు, గ్రామ జ్యోతి మార్పు ప్రతినిధులతో జరిపిన సమావేశంలో ఈనెల 17 నుంచి 23 వరకు నిర్వహించనున్న గ్రామ జ్యోతి కార్యక్రమంపై జిల్లా కలెక్టర్‌ చర్చించారు. మిగతా కార్యక్రమాలకు గ్రామ ...

Read More »

ప్రజలకు తోడుగా… అండగా…

  – కొత్త జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలతో మాట్లాడి, సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి కృషి చేస్తానని, విద్య, సంక్షేమంపై ప్రత్యేకంగా దృస్టి కేంద్రీకరిస్తానని కొత్తగా విదులలో చేరిన జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా తెలిపారు. శుక్రవారం ఉదయం 10.50 గంటలకు ఆమె నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా ఇంతవరకు జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన డి.రోనాల్డ్‌రోస్‌ నుంచి చార్జి తీసుకున్నారు. ఈ సందర్బంగా మీడియా ప్రతినిదులతో మాట్లాడుతూ, నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా ...

Read More »

శనివారం జ్ఞాన, వైద్య, యోగ శిక్షణ పరిచయ కార్యక్రమం

కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీసత్యసాయి ధ్యాన మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధ్యాన, వైద్య, యోగ శిక్షణ పరిచయ కార్యక్రమాన్ని కామారెడ్డిలోని పార్శి రాములు కళ్యాణ మండపంలో శనివారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఎంఎంవై ద్వారా మానసిక ప్రశాంతత, వృత్తి సమస్యలు, కుటుంబ సమస్యల పరిష్కారం, దీర్ఘకాలిక రుగ్మతలైన బిపి, షుగర్‌, గ్యాస్‌ ట్రబుల్‌, అల్సర్‌, తదితర రోగాలకు ఉపశమనం పొందవచ్చన్నారు. దీర్ఘకాలిక వ్యాధులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈనెల 17 ...

Read More »

రాజీవ్‌ సద్భావన యాత్రకు ఘనస్వాగతం

  కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతియేటా కాంగ్రెస్‌ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న రాజీవ్‌ సద్భావన యాత్ర శుక్రవారం కామారెడ్డికి చేరుకుంది. కామారెడ్డిలో కాంగ్రెస్‌ నాయకులు యాత్రకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్బంగా సద్భావన యాత్ర ప్రతినిధి అయ్యర్‌ మాట్లాడుతూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రాజీవ్‌ సద్భావన యాత్ర పేరుతో పెరంబదూర్‌ నుంచి ఢిల్లీ వరకు ప్రతియేటా యాత్ర చేపడతామన్నారు. ఈయేడు సైతం యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. రాజీవ్‌ ఆశయాల అమలు దిశగా కృషి చేయాలని, ఉగ్రవాదాన్ని దేశం నుంచి ...

Read More »

అలరించిన విద్యార్థుల వేషధారణ

  కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని కామారెడ్డి పట్టణంలోని లిటిల్‌ స్కాలర్స్‌ ప్లే స్కూల్లో శుక్రవారం విద్యార్థులు వివిధ వేషధారణలతో అలరించారు. స్వాతంత్య్ర వేడుకల్లో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా రిహార్సల్స్‌ చేశారు. చిన్నారి విద్యార్థులు భారతమాత, సుభాష్‌ చంద్రబోస్‌, గాంధీజి వివిధ దేశభక్తులు, మిలిటరీ సైనికుల్లాగా వేషధారణలతో ప్రదర్శనలిచ్చి ఆకట్టుకున్నారు. భారతమాతకు జై అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు పాల్గొన్నారు.

Read More »

జిల్లా కలెక్టర్‌గా రోనాల్డ్‌రోస్‌ సేవలు భేష్‌

  నిజామాబాద్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో సంవత్సరం పైగా జిల్లా కలెక్టర్‌గా సేవలందించి మెదక్‌ జిల్లా కలెక్టర్‌గా బదిలీపై వెళుతున్న రోనాల్డ్‌ రోస్‌కు క్యాంపు కార్యాలయంలో అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్‌సిఎల్‌పి పిడి సుధాకర్‌రావు, టిఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు గైని గంగారాం, జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు, రెవెన్యూ సంఘంప్రతినిధులు, తదితరులు కలెక్టర్‌ సేవలను గుర్తు చేసుకొని ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఎంతో ప్రశాంతంగా ...

Read More »

సిఎం రిలీఫ్‌ఫండ్‌ అందజేత

  ఆర్మూర్‌, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గ అభివృద్దికి, నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పేందుకు ఇది ఒక నిదర్శనం. నియోజకవర్గానికి చెందిన పుప్పాల మోహన్‌కు ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగింది. కాగా వైద్య చికిత్స నిమిత్తం సిఎం రిలీఫ్‌ ఫండ కింద రూ. లక్ష అందజేశారు. లక్ష రూపాయలు మంజూరు కావడానికి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సిఎంతో మాట్లాడి ఫండ్‌ విడుదలయ్యేలా చూశారు. ఈ మేరకు గురువారం పుప్పాల ...

Read More »

ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు

  ఆర్మూర్‌, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని మార్కెట్‌ యార్డులో బుధవారం ఆర్మూర్‌ సిఐ రవికుమార్‌ పర్యవేక్షణలో పట్టణ, మండల గ్రామాలకు చెందిన ఆటో డ్రైవర్లకు ట్రాపిక్‌పై అవగాహన కల్పించారు. సదస్సుకు ఆర్మూర్‌ ఎంవిఐ అశ్వంత్‌కుమార్‌తో పాటు ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌, ట్రాపిక్‌ ఎస్‌ఐ రహీమ్‌, నవనాథ్‌ ఆటో యూనియన్‌ అధ్యక్షుడు సుమీత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సదస్సులో సిఐ రవికుమార్‌ మట్లాడుతూ ఆటోలన్నింటికి విధిగా నెంబరు కలిగి ఉండాలని, పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించకూడదని, అలాగే ఆటో డ్రైవర్లు ...

Read More »

మునిసిపల్‌ కార్మికులను అరెస్టు చేయడం గర్హణీయం

  కామారెడ్డి, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మునిసిపల్‌ కార్మికులు గత 35 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో కలెక్టర్‌కు విన్నవించేందుకు ధర్నాకు వెళుతున్న మునిసిపల్‌ కార్మికులను అరెస్టు చేయడం ప్రభుత్వ దిగజారుడు తనానికి నిదర్శనమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్‌ అన్నారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంట్రాక్టు కార్మికులను క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అలా చేయకపోగా తమ డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్న కార్మికులను అణగదొక్కాలని ప్రయత్నించడం గర్హణీయమన్నారు. ధర్నాకు వెళ్ళిన సిఐటియు ...

Read More »

డెంగ్యూ వ్యాధికి కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స

  – ప్రభుత్వ ఆసుపత్రిలో మరిన్ని సేవలు కామారెడ్డి, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇకనుంచి డెంగ్యూ వ్యాధికి చికిత్స జరపనున్నట్టు ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ తెలిపారు. మంగళవారం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ప్లేట్‌లెస్‌ తయారుచేసే యంత్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధికి గురైన రోగికి ప్లేట్‌లెస్‌ తగ్గిపోవడం వల్ల చనిపోయే ప్రమాదముంటుందని డెంగ్యూ వ్యాధి కోసం లక్షలు వెచ్చించి హైదరాబాద్‌ వెళ్లాల్సి వస్తున్న ...

Read More »

జ్ఞాన సముపార్జన కోసమే ‘ఇన్‌స్పైర్‌’

  – జడ్పి ఛైర్మన్‌ దఫేదార్‌ రాజు నిజామాబాద్‌, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇన్‌స్పైర్‌ లాంటి కార్యక్రమాలు విద్యార్థులకు మరింత జ్ఞానసముపార్జనకు ఉపకరిస్తాయని జిల్లా పరిషత్‌ ఛైర్‌ పర్సన్‌ దఫేదార్‌ రాజు తెలిపారు. నిజామాబాద్‌ మండలం ముబారక్‌నగర్‌లోని ఆర్‌బివిఆర్‌ఆర్‌ ఉన్నత పాఠశాలలో ఈనెల 11 నుంచి 13 వరకు నిర్వహించే జిల్లా స్థాయి ఇన్‌స్పైర్‌ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జ్ఞాన సముపార్జనకు, శాస్త్రంపై ప్రయోగాలకు, విద్యార్థుల్లో పోటీ తత్వానికి ఈ కార్యక్రమాలు మంచి స్ఫూర్తిని ...

Read More »

మద్యంపై ఉన్న శ్రద్ద రైతులపై ఉందా..?

  – రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించాలి – బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి ఆర్మూర్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజలు ఏ ఇబ్బందులు పడకుండా ఆనందంగా జీవనం కొనసాగిస్తారనుకుంటే తొలి తెలంగాణ రాష్ట్రంలో ఇటు ప్రజలు, అటు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని బిజెపి జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి ఆరోపించారు. శనివారం ఆర్మూర్‌ పట్టణంలోని రోడ్లు భవనాల అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. వర్షాలు లేక నాటిన విత్తనాలు ...

Read More »

తల్లిపాలు బిడ్డకు అమృతం

  కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 7వ వార్డు గాంధీనగర్‌ అంగన్‌వాడి కేంద్రంలో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వార్డు కౌన్సిలర్‌ బట్టు మోహన్‌, సూపర్‌వైజర్‌ రాజమణి మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు అమృతం లాంటిదని, పుట్టిన నుంచి ఆరునెలల వరకు తప్పకుండా తల్లిపాలే పట్టించాలన్నారు. బిడ్డ పుట్టిన అరగంటలోపు పట్టే పాలను ముర్రుపాలంటారని, అవి బిడ్డకు పోషక గుణాలు, ఔషధంగా పనిచేస్తుందన్నారు. తప్పకుండా ఆరునెలల వరకు పిల్లలకు తల్లిపాలే ఇవ్వాలని ...

Read More »

సిసి కల్వర్టు నిర్మాణం పనులు ప్రారంభం

  కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టనంలోని 21వ వార్డు పెద్దబజార్‌ ప్రాంతంలో సిసి కల్వర్టు నిర్మాణం పనులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. మునిసిపల్‌ సాధారణ నిదులు రూ. 75 వేలతో కల్వర్టు పనులు చేపట్టినట్టు తెలిపారు. నాణ్యత లోపించకుండా నిర్మాణ పనులు చేపట్టాలని ఆమె కాంట్ట్రారును ఆదేశించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు జొన్నల నర్సింలు, బట్టు మోహన్‌, రామ్మోహన్‌, జమీల్‌, నాయకులు గోనె శ్రీనివాస్‌, ఏ.ఇ గంగాధర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఐసిడిఎస్‌ ఉద్యోగుల నిరసన ప్రదర్శన

  కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులను 77 మందిని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించినందుకు నిరసనగా శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఐసిడిఎస్‌ ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులను 77 మందిని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించడం సమంజసం కాదన్నారు. దానివల్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆ ఉద్యోగులను తిప్పి పంపాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై మహిళాభివృద్ది, శిశు ...

Read More »