Breaking News

Nizamabad

చెక్‌ పవర్‌ మంజూరు

నిజామాబాద్‌, మార్చి 03   నిజామాబాద్‌ న్యూస్‌ : రెంజల్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ చందూరు సవిత డిసెంబరు 24న గ్రామ పంచాయతీకి సంబంధించిన 13వ ఆర్థిక సంఘం జిపి నిదుల నుంచి 87 వేల 800 రూపాయలను దుర్వినియోగం చేసినందున డిపివో ఆదేశాల మేరకు చెక్‌పవర్‌ రద్దుచేశారు. పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంతో 13వ ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలకు వినియోగించరాదని తెలిసినా కూడా పంచాయతీ కార్యదర్శి చెప్పకపోవడంతో సర్పంచ్‌ ఈ నిదుల నుంచి గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు ...

Read More »

ఉపాధి కూలీలకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలి

  – జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ నిజామాబాద్‌ న్యూస్‌ : జిల్లాలోని ఉపాధి హామీ కూలీలకు సరైన పనులు కల్పించి తద్వారా వారికి ఆర్థిక వెసులుబాటు కలిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డి.రోనాల్డ్‌రోస్‌ ఎంపిడివోలను ఆదేశించారు. మంగళవారం స్థానిక ప్రగతిభవన్‌ సమావేశ మందిరంలో ఉపాధి హామీ పథకంపై ఎంపిడివోలు, డ్వామా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 10.72 లక్షల మంది జాబ్‌కార్డులు కలిగిన కూలీలకు గాను 3.88 లక్షల మందికి మాత్రమే 43.16 తో ఇప్పటికి పనులు కల్పించారని తెలిపారు. ...

Read More »

నిబంధనలకనుగుణంగా విధులు నిర్వర్తించాలి

  నిజామాబాద్‌, మార్చి 03   నిజామాబాద్‌ న్యూస్‌ : విదులలో క్రమశిక్షణతో పాటు నిబంధనలకనుగుణంగా పనిచేస్తూ గౌరవంగా మెలగాలని జిల్లా రెవెన్యూ అధికారి మనోహర్‌ గ్రామ స్థాయి రెవెన్యూ అధికారులకు సూచించారు. మంగళవారం స్తానిక రిటైర్డ్‌ ఉద్యోగుల భవనంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిజామాబాద్‌ డివిజన్‌ పరిధిలోని గ్రామ స్థాయి విఆర్వోలకు మూడవ విడత ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విధులలో ఖచ్చితత్వం, నిబంధనలకనుగుణంగా విధులు నిర్వహిస్తే సర్వీసులో ఎటువంటి రిమార్కులు లేకుండా ...

Read More »

నేరస్థులను పట్టుకుంటాం

  నిజామాబాద్‌, ఫిబ్రవరి 03: నిజామాబాద్‌ న్యూస్‌: నిజామాబాద్‌ నగరంలోని బైపాస్‌ రోడ్డు వద్ద గల ఇందిరా ప్రియదర్శిని కాలనీలో నివసించే దేవ్‌ కట్టె బాబురావు అనే వ్యక్తి ఇంట్లో సోమవారం చోరీ జరిగింది. ఈ విషయమై సి.ఐ. నర్సింగ్‌ యాదయ్య కథనం ప్రకారం దేవ్‌ కట్టె బాబురావు అనే వ్యక్తి మహారాష్ట్రాలో గల తన నాలుగున్నర ఎకరాల భూమిని అమ్మగా వచ్చిన నగదు 26 లక్షల 6 వేల 250 రూపాయలను పది రోజుల క్రితం ఇంట్లో ఉంచారు. హఠాత్తుగా సోమవారం సాయంత్రం ...

Read More »

మార్చి 10 నుంచి బి.ఇడి పరీక్షలు

నిజామాబాద్‌, మార్చి 03   నిజామాబాద్‌ న్యూస్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిదిలోని బిఇడి బ్యాక్‌లాగ్‌, ఇంప్రూమెంట్‌ పరీక్షలు మార్చి 10వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని, వీటికి సంబంధించిన టైంటేబుల్‌ సంబందిత కళాశాలలకు పంపించడం జరిగిందని పరీక్షల నిర్ణయిత అధికారి ప్రొఫెసర్‌ నసీమ తెలిపారు. బిఎస్సీ రెండవ సంవత్సర పరీక్ష తేదీలు మార్పు : తెవివి పరిధిలోని బిఎస్సీ రెండవ సంవత్సరం రెగ్యులర్‌ వార్షిక పరీక్షలు, బ్యాక్‌లాగ్‌ పరీక్షలకు సంబంధించిన టైంటేబుల్‌ సవరించబడిందని ప్రొఫెసర్‌ నసీమ అన్నారు. సవరించిన టైంటేబుల్‌ ప్రకారం పరీక్షలు మార్చి ...

Read More »

మహాసభలను విజయవంతం చేయండి

నిజామాబాద్‌, మార్చి 03   నిజామాబాద్‌ న్యూస్‌ : సిపిఐ (ఎం) తెలంగాణ రాష్ట్ర తొలి మహాసభల ముగింపు నేడు హైదరాబాద్‌లోని నిజాంకాలేజ్‌ గ్రౌండ్‌లో నిర్వహించడం జరుగుతుందని, సభలకు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి ఏశాల గంగాధర్‌ పిలుపునిచ్చారు. ఈ మహాసభల ముగింపు సందర్భంగా మద్యాహ్నం 2 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఎర్రజెండా రెపరెపలతో ఎర్రసేన కవాతు జరుగుతుందని, ఇందిరా పార్కు నుంచి ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు నిజాం కాలేజ్‌ మైదానంలో బహిరంగ సభ ఉంటుందని అన్నారు. ...

Read More »

10 రోజుల్లో అర్హులైన బీడీ కార్మికులందరికి జీవనభృతి

నిజామాబాద్‌, మార్చి 02   – జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ నిజామాబాద్‌ న్యూస్‌ : ఇపిఎఫ్‌ కలిగిఉన్న బీడీ కార్మికులు ఆధార్‌ నెంబరు, ఇపిఎఫ్‌ నెంబరుతో దరఖాస్తు చేసుకుంటే వివరాలు పరిశీలించి అర్హులైన వారికి నెలవారి జీవనభృతి రూ.1000 అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ బీడీ కార్మికులకు తెలిపారు. సోమవారం కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో ఇపిఎఫ్‌ కలిగిన బీడీ కార్మికులకు జీవనభృతి మంజూరు చేసిన పిదప మిగతా వారి ఆర్జీలను పరిశీలిస్తామన్నారు. బీడీలు తయారుచేస్తున్న మహిళల ఇంట్లోకి వెళ్లి వారి సమస్యలు ...

Read More »

వచ్చే ఏడాది నుంచి అన్ని పాఠశాలల్లో ఒకే పాఠ్య ప్రణాళిక

  – జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ నిజామాబాద్‌, మార్చి 02 నిజామాబాద్‌ న్యూస్‌ : జిల్లాలోని అన్నిపాఠశాలల్లో ఒకేవిధంగా బోధించేలా పాఠ్య ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ డి.రోనాల్డ్‌ రోస్‌ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ఎంఎస్‌ఆర్‌ పాఠశాలలో ఐదు రోజుల వర్క్‌షాప్‌ను కలెక్టర్‌ ప్రారంభించారు. 2015-16 విద్యాసంవత్సరానికి గాను జిల్లాలో మొదటి తరగతి నుండి 10వ తరగతి వరకు పాఠ్య ప్రణాళిక రూపొందించడానికి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా రిసోర్సు పర్సన్లకు ఈ వర్క్‌షాప్‌ ఏర్పాటు చేశారు. జిల్లాలో ...

Read More »

బిసి స్టడీసర్కిల్‌ ఆధ్వర్యంలో గ్రూప్‌-2 ఉచిత కోచింగ్‌

నిజామాబాద్‌, మార్చి 02   నిజామాబాద్‌ న్యూస్‌ : నిజామాబాద్‌ బిసి స్టడీ సర్కిల్‌ ఆద్వర్యంలో టిపిఎస్‌సి గ్రూప్‌-2 పోటీ పరీక్ష అవగాహన కోసం ఉచిత తరగతులు నిర్వహిస్తున్నట్టు బిసి స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ సి.హెచ్‌.విమలా దేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు తరగతులు ఈనెల 3 వతేదీ మంగళవారం నుంచి ప్రారంభమవుతాయని అన్నారు. నగర శివారులోని రాజారాం స్టేడియం నాగారంలోని బిసి స్టడీసర్కిల్‌లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తరగతులు నిర్వహింపబడతాయని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ ...

Read More »

సమాచార హక్కు చట్టం విషయసూచికలను ఏర్పాటు చేయాలి

  డిచ్‌పల్లి, మార్చి2, నిజామాబాద్‌ న్యూస్‌ : డిచ్‌పల్లి మండల కేంద్రంలోని ప్రధాన కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం 2005కి సంబంధించిన విషయ సూచికలు లేకపోవడం విడ్డూరంగా ఉంది. దీంతో చట్టంపై ప్రజలకు అవగాహన లేకుండా పోతోంది. ప్రజల చేతుల్లో పాశుపాతాస్త్రంగా పనిచేయాల్సిన చట్టం అవగాహన రాహిత్యం వల్ల నీరుగారిపోతుంది. ఎలాంటి సమాచారమైన ఏ విషయానికైనా సామాన్యులకు అందుబాటులో ఉంచాల్సిన అధికారులు గోప్యంగా ఉంచేందుకే ఇష్టపడుతున్నట్లు స్పష్టమవుతోంది. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం విషయసూచిక మెనూలు గాని బోర్డులుగాని పొందుపర్చకపోవడం గమనార్హం. ...

Read More »

అక్రమార్కులకు అధికారుల అండదండలు

  నిజామాబాద్‌, మార్చి 02: నిజామాబాద్‌ న్యూస్‌: రాజకీయ నాయకుల కను సైగల్లో యధేచ్చగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. నిజామాబాద్‌ నగర శివారుల్లో అక్రమ ఇసుక రాత్రివేళల్లో చేరుతూ డంపింగ్‌ చేస్తున్నారు. అయితే కొంత మంది అధికార పార్టీ నాయకులు ఈ దందాకు ముఖ్య పాత్ర వహిస్తున్నారు. జిల్లా ప్రభుత్వ యంత్రాంగం పిరిస్థితి ఇంతే, అన్ని తెలిసిన అధికారులు వీటి వంక కన్నెత్తి కూడా చూడడం లేదు. ఈ విషయం వారి దృష్టికి వచ్చినా జరిమానాలు విధించి సరి పెడుతున్నారని ...

Read More »

రాష్ట్రం మారినా రీతి మారలేదు

  నిజామాబాద్‌, మార్చి 2 నిజామాబాద్‌, న్యూస్‌: తరం మారినా తత్వం మారలేదు అని ఒక సినిమాలో విన్నాం కదా అదే విధంగా ”రాష్ట్రం” మారినా మన పద్ధతులు అలవాట్లు మాత్రం మారలేదు. దీనికి ఒకచక్కటి ఉదాహరణ మన కలెక్టరేట్‌ కార్యాలయం పరిస్థితి. ఒక వైపు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చినా, ఇంకా మన కలెక్టరేట్‌ కార్యాలయంలో ”ఇక్కడ వాహనాలు నిలుపరాదు” అనే బోర్డు పెట్టినా కూడా అక్కడే వాహనాలు నిలుపుతున్నారు. ఫలితంగా అక్కడికి నిత్యం తమ సమస్యలు విన్నవించుకోవడానికి, పరిష్కారాలు పొందడానికి వచ్చే ...

Read More »

పోస్టర్ల ఆవిష్కరణ

  రెంజల్‌, ఫిబ్రవరి 27: నిజామాబాద్‌ న్యూస్‌: మాదిగ అమరవీరుల సంస్మరణ సభను మార్చి 1వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్‌ ఆడిటోరియంలో మాదిగ అమరవీరుల సంస్మరణ సభన నిర్వహిస్తున్నట్లు, ఈ సభను మాదిగ విద్యార్థినీ, విద్యార్థులందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మి గారి భూమయ్య తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని మాదిగ అమర వీరుల సంస్మరణ సభ పోస్టరును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పూలేందర్‌, సురేష్‌, పోశెట్టి, సుమన్‌, రవి తదితరులు పాల్గొన్నారు.

Read More »

విద్యావ్యవస్థలో సమూల మార్పులు వచ్చే అవకాశం ఉంది.

  -వి.సి. పార్థ సారధి డిచ్‌పల్లి, ఫిబ్రవరి 27: నిజామాబాద్‌ న్యూస్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టనున్న కెజి నుంచి పిజి వరకు ఉచిత ఆంగ్ల విద్య వ్యవస్థ ద్వారా విద్యారంగంలో సమూల మార్పులు వచ్చే అవకాశం ఉందని తెలంగాణ ఇంఛార్జి వైస్‌ ఛాన్స్‌లర్‌ పి.పార్థ సారధి తెలిపారు. ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత విద్యా రంగంలో భారీ సంస్కరణలకు ఆస్కారం ఏర్పడుతుందని అన్నారు. శుక్రవారం తెయూలో కళలకు రూపమిద్దాం కార్యక్రమంలో భాగంగా ఆంగ్ల భాషా నైపుణ్యాలు అన్న అంశంపై ప్రముఖ ఆంగ్ల ...

Read More »

బిసిలకు కూడా కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేయాలి

  డిచ్‌పల్లి, ఫిబ్రవరి 27: నిజామాబాద్‌, న్యూస్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీల కొరకు ప్రవేశ పెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారఖ పథకం బిసిలకు కూడా వర్తింపచేయాలని తెయూ విద్యార్థి సంఘాల అధ్యక్షుడు ఎస్‌.నవీన్‌ కుమార్‌ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అధ్యక్షుడు నవీన్‌ కుమార్‌ మాటాడుతూ ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనరిటీలకు ఈ పథకం అమలు చేస్తున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిసిలు 50% నికి పైగా ఉన్నారని వారిలో చాలా ...

Read More »

న్యాయ కళాశాలపై వచ్చిన ఫిర్యాదులను ఖండించిన ‘లా’ విద్యార్థులు

  డిచ్‌పల్లి, ఫిబ్రవరి 26: నిజామాబాద్‌ న్యూస్‌: తెలంగాణ యూనివర్సిటీ న్యాయ కళాశాలపై అసత్య ఆరోపణలను ఖండిస్తూ లా విద్యార్థులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గత మూడు సంవత్సరాల క్రితం చదివిన విద్యార్థులు మాట్లాడుతూ న్యాయ కళాశాలపై ఒక పత్రికలో వచ్చిన అసత్యపు ప్రకటనలపై మాట్లాడుతూ అవన్నీ అసత్యపు ప్రచారాలని పేర్కొన్నారు. న్యాయ కళాశాలలో రెగ్యులర్‌ గా తరగతులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రొఫెసర్‌లు క్రమం తప్పకుండా హాజరవుతూ చక్కగా బోధన చేస్తున్నారని, న్యాయకళాశాలో సమస్యలు ఉన్నాయన్నది వాస్తవమని దానిపై మాత్రమే విద్యార్థులు ...

Read More »

తెలంగాణ యూనివర్సిటీ న్యాయ కళాశాల భవనంలో పూలే, అంబేద్కర్‌ చిత్రపటాల ఆవిష్కరణ

  డిచ్‌పల్లి, ఫివ్రబరి 26: నిజామాబాద్‌, న్యూస్‌: భారత దేశంలో మొట్ట మొదటి సారిగా పాఠశాలలను ప్రారంభించిన మహాత్మా జ్యోతి రావు పూలే, విశ్వరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటాలను తె.యూ. న్యాయ కళాశాల భవనంలో న్యాయ కళాశాల అధిపతి జెట్లింగ్‌ ఎల్లోసా ఆవిష్కరించారు. ఈ సంబర్భంగా న్యాయ కళాశాల అధిపతి మాట్లాడుతూ భారత దేశంలో మొదటి సారిగా బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం పాఠశాలలను స్థాపించి, విద్యను అందించిన మహనీయుడు పూలే అని, సమాజంలో ఉన్న ...

Read More »

ఆహార భద్రత కార్డు కొరకు బారులు తీరిన జనం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26: నిజామాబాద్‌ న్యూస్‌: ఆహార భద్రత కార్డు కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించడానికి తహసీల్దార్‌ కార్యాలయంలో రెండు కౌంటర్లను ఏర్పాటు చేశారు. అధికారుల తప్పిదాల ద్వారా అర్హులైన వారికి ఆహార భద్రత కార్డులు అందక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారని దరఖాస్తు దారులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అర్హులందరికి ఆహార భద్రత కార్డులు అందచేస్తామని రాని వారు ఉంటే తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తులు అందచేయాలని మండల తహసీల్దార్‌ రాజేందర్‌ సూచించారు.

Read More »

ప్రజలకు ఆయుర్వేద చికిత్స అవసరం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26: నిజామాబాద్‌ న్యూస్‌: ప్రజలకు ఆయుర్వేద చికిత్స ఎంతగానో ఉపయోగపడుతుందని దీని వలన వ్యాధులను అనతి కాలంలోనే నిర్మూలించవచ్చని డిఎమ్‌హెచ్‌వో బసవేశ్వరి అన్నారు. తెలంగాణ అను వంశిక ఆయుర్వేద గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2015 డైరీ ఆవిష్కరణకు ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఇందులో భాగంగా పతంజలి ఆయుర్వేదం ఆధ్వర్యంలో రోగులకు ఉచిత మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు వహీద్‌ అహ్మద్‌ డా.రఘు బిడిఎస్‌, డా.మిశ్రా, డా.గణశ్‌, పతంజలి ఆయుర్వేద మేనేజర్‌ నాగరాజు పాల్గొన్నారు.

Read More »

సబ్‌ ప్లాన్‌ అమలుకు మార్చి 10న ఛలో అసేంబ్లీ

  -పిలుపునిచ్చిన దళిత సంఘాలు నిజామాబాద్‌, ఫిబ్రవరి 24: దళిత గిరిజనుల జీవితాలను మార్చే ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అవుతుందని, సబ్‌ ప్లాన్‌ అమలు చేయాలని, తగిన నిధులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తు మార్చి 10న ఛలో అసేంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ అమలు పర్యవేక్షణ కమిటీ రాష్ట్ర సమన్వయ కర్త పి.శంకర్‌ తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి వచ్చిన అయన ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌస్‌లో విలేకరుల సమావేశంలో ...

Read More »