Breaking News

Nizamabad

నగర పాలికా… ఇదేమి ఏలికా కార్యక్రమాలు ఫుల్‌… అభివృద్ది నిల్‌ అభివృద్దికి నిధుల కొరత

ఎంపి కవితపైనే ఆశలు నిజామాబాద్‌, నవంబరు 17, అధికార పార్టీ నేతలు కార్యక్రమాలతో బిజీ బీజీ.. నగర పాలక అధికారులు సర్వేలతో బిజీ బిజీ.. కాని నగర అభివృద్ది మాత్రం ఎక్కడ వేసిన గోంగళి అక్కడే అన్న చందంగా మారింది. నగర ప్రజలు భారీగానే అధికార పార్టీకి పట్టం కట్టారు. కాని ఇప్పటి వరకు నయా పైసా నిధులు రాకపోవడంతో అభివృద్ది మాటే కరువు అయింది. ఈనెల 18న నిజామాబాద్‌ ఎంపి కవిత నగరంపై సమీక్ష నిర్వహిస్తుండటంతో అందరి చూపు కవితపైనే ఉంది. బైపాసు ...

Read More »

డిఆర్వోగా బాధ్యతలు స్వీకరించిన మనోహర్.

నిజామాబాద్‌, నవంబరు 17, నిజామాబాద్‌ జిల్లా రెవెన్యూ అధికారి(డిఆర్వో)గా మనోహర్‌ సోమవారం బాద్యతలు స్వీకరించారు. ఈనెల పదకొండున అయనను నిజామాబాద్‌ డిఆర్వోగా బదిలీ చేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని హౌసింగ్‌ బోర్డు కార్యాలయంలో ముఖ్య అధికారిగా పని చేస్తున్న అయన బదిలీపై సోమవారం నిజామాబాద్‌ ఇంచార్జి డిఆర్వో యాదిరెడ్డి నుంచి బాద్యతలను స్వీకరించారు. గత అయిదు మాసాలుగా ఖాళీగా ఉన్న ఈ పోస్టును ప్రభుత్వం అలస్యంగానైన భర్తీ చేయడం గమర్హం.

Read More »

బలిదానాలను రాజకీయం చేయొద్దు – ఇంద్రసేనా రెడ్డి.

నిజామాబాద్‌ నవంబర్‌16: తెలంగాణా ఉద్యమంలొ బలిదానాలు చేసిన వారి చావులను రాజకీయం చేయొద్దని అన్నారు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్‌ . ఇంద్రసేనా రెడ్డి. ఆదివారం స్తానిక బిజెపి జిల్లా కార్యాలయంలొ జరిగిన వర్క్‌షాప్‌లొ పాల్గొన్న ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణా ఉద్యమంలొ చనిపోయిన వారి కుటుంబాలకు సాహయం చేస్తానని చెప్పిన కెసిఅర్‌ ఇప్పుడు వారి చావులను రాజకీయం చేస్తున్నారని, చనిపొయిన వ్యక్తి ఏ పార్టీకి చెందిన వాడని ఆరా తీస్తున్నారని ద్వజమెత్తారు. వారు ఏ పార్తీ వారైనా తెలంగాణా కోసమె ...

Read More »

మానవత్వం మరచిపోయిన కసాయి(కన్న)తల్లి చెత్త కుండిలొ మగ శిశువు.

నిజామాబాద్‌ నవంబర్‌ 16; మానవత్వం మరచిపోయిన కసాయి(కన్న)తల్లి పేగుబంధాన్ని తెంచుకొని పుట్టిన శిశువును అనాధను చేసిన సంఘటన అందరిని కలచి వేసింది. నగరంలొని అంబేద్కర్‌ కాలనీలొ గల ఆటోస్టాండ్‌ దగ్గరి చెత్తకుండిలొ ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలొ ఎవరొ అప్పుడే పుట్టిన మగ శిశువును పారవెసి పోయారు. స్తానికులు పోలీసులకు ఫోన్‌ చేయడంతొ వారు వచ్చి ఆ శిశువును వైద్య పరీక్షలనిమిత్తం ఆసుపత్రికి తీసుకెల్లారు.

Read More »

సభ్యత్వ నమోదుకు సభ్యులు కావలెను.

  జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమాలు. హైకమాండ్‌ టార్గెట్‌లను చేరుకొలేకపొతున్న నాయకులు. నాయకుల్లొ గులాబి పార్టీ గుబులు. ఆసక్తి చూపని ప్రజానీకం. నిజామాబాద్‌ నవంబర్‌ 16 : జిల్లాలొ వివిద రాజకీయ పార్టీల సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ప్రారంభమైనాయి. మునుపెన్నడు లేని విదంగా రాజకీయ పార్టీలు భారీ సంఖ్యలొ సభ్యత్వ నమోదు చేయాలని కసరత్తు చేస్తున్నాయి తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సందర్బంగా జిల్లాలొ రాజకీయాలు భారీ మార్పులను సంతరించుకున్నాయి. తెలంగాణా ఉధ్యమం దీనిలొ ప్రధాన భూమికను పోశించింది. టిఆర్‌ఎస్‌ పార్టీ ...

Read More »

నక్సల్స్‌ బ్యానర్‌ రగడ…. పోలీసుల ఆరా…. జనశక్తి నక్సల్స్‌ ఉన్నట్టా… లేనట్టా

వివాదం అవుతున్న ఎర్గట్లలో నక్సల్స్‌ బ్యానర్‌ నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 15. జిల్లాలో నక్సల్స్‌ ప్రభావంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎర్గట్లలో బ్యానర్ల వెలువడంతో పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈనెల 30న చండ్రపుల్లారెడ్డి సంస్మరణ సభను విజయవంతం చేయాలని సిపిఐ(ఎం.ఎల్‌) జనశక్తి పార్టీ బ్యానర్లు మోర్తాడ్‌ మండలం ఎర్గట్లలో రెండు రోజుల క్రితం వెలిసాయి. దీంతో ఈ వ్యవహారం జిల్లా అంతంట చర్చనీయాశంగా మారింది. నెల రోజుల క్రితం దోమకొండ ప్రాంతంలోనూ పోస్టర్లు వెలిసాయి. కానీ వీటిని ఎవరు బయటకు తెచ్చారు అనేది ప్రశ్నార్థకంగా ...

Read More »

ఆంధ్రాబ్యాంకులో పిల్లలకు కొత్త ఖాతాలు

నిజామాబాద్‌, నవంబరు 15, బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పిల్లల కోసం మాత్రమే కొత్తగా బ్యాంకు ఖాతాలను తెరచేందుకు కొత్త పథకం అమలులోకి తీసుకువచ్చింది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పథకాన్ని అమలు చేస్తున్నట్లు బ్యాంకు జోనల్‌ మేనేజర్‌ మల్లిఖార్జున్‌ తెలిపారు. ఆంధ్రాబ్యాంకు లిటిల్‌ స్టార్స్‌, ఆంధ్రాబ్యాంకు టిన్స్‌లనే రెండు పద్దతుల ద్వారా ఖాతాలను తెరుస్తామని, పిల్లల తల్లిదండ్రులు సంబందిత ఏరియా బ్యాంకులో సంప్రదించాలని సూచించారు. ఈ పథకాలను ఉపయోగించుకోవాలని కోరారు.

Read More »

ఆశ్లీల చిత్రాలు నిషేధించాలని ధర్నా

నిజామాబాద్‌, నవంబరు 15, ఈ మధ్య విడుదలవుతున్న చిత్రాలలోని అశ్లీల దృశ్యాలను తొలగించాలని జాతీయ హిందూ ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యుడు చైతన్య మాట్లాడుతూ నేటి సమాజంలో విడుదలవుతున్న చిత్రాలలో అశ్లీలత బాగా పెరిగి పోయుందని, కొన్ని సినిమాలలోని సన్నివేశాలు దేవాలయాలను, హిందూ సంస్కృతిని కించపరిచే విధంగా ఉన్నాయని ఆరోపించారు. ఈ విధమైన చిత్రాలకు సెంట్రల్‌ బోర్డు ఆమోదం తెలపడం శోచనీయం అని అన్నారు. ఇకనైనా మోదీ ప్రభుత్వం తగుచర్యలు తీసుకోవాలని ఇలాంటి సినిమాలను ...

Read More »

17న శ్రీ లలితా సహస్రనామ ప్రవచన జ్ఞాన యజ్ఞ సప్తాహం

నిజామాబాద్‌, నవంబర్‌ 15: పరమ పవిత్రమైన కార్మిక మాసంలో ఈనెల 15న శ్రీ లలితా సహస్రనామ ప్రంచన జ్ఞాన యజ్ఞ సప్తాహం కార్యక్రమానికి నగరంలోని మేరుభవన్‌లో నిర్వహించడం జరుగుతుందని వాస్తు శిల్పి,న్యూమరాలజిస్టు కె.దాశరథి తెలిపారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జగదుర్గ శ్రీలలితాంబికా సుపీఠం,హైదరాబాద్‌ శ్రీశ్రీశ్రీ సంపూర్ణనందగిరి స్వామలువారు విచ్చేస్తారని వీరిచే విద్యావారిది, వేదాంతాచార్య ప్రవచనలు ఉంటాయని అన్నారు.వీరితో పాటు ఇందూర్‌ యాజ్ఞ సమితిమూడ నాగభూషణం గుప్త, విశ్వహిందు పరిషత్‌ ...

Read More »

మోడి ప్రభుత్వం చేస్తున్న కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకించాలి… ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి చంద్రయ్య

నిజామాబాద్‌, నవంబర్‌ 15, మోడి ప్రభుత్వం చేస్తున్న కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకించాలని డిమాండ్‌ చేస్తూ ఎఐటియుసి రాష్ట్రకార్యదర్శి చంద్రయ్య డిమాండ్‌ చేశారు.శనివారం న్యూఅంబేద్కర్‌ భవన్‌లో కార్మిక సంఘాల జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం యజమానులకు అనుకూలంగా కార్మిక చట్టాల సవరణకు పూనుకున్నదని ఇలాంటి చర్యలను యావత్‌ భారత కార్మిక వర్గం నిరసిస్తున్నదని అయన అరోపించారు.సెప్టెంబర్‌ 15న న్యూఢిల్లో కేంద్ర కార్మిక సంఘాలన్నీ ఏకమై దేశవ్యాప్తంగా సదస్సులను నిర్వహంచామని, ...

Read More »

అంగన్‌వాడి పోస్టులకు ఫైరవీలు షూర్‌…. 493 పోస్టులు ఖాళీలు

ఎమ్మేల్యేల చేతికి పగ్గాలు కుప్పలు తెప్పలుగా ధరఖాస్తులు నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 15, జిల్లాలో అంగన్‌వాడిల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ కావడంతో ఫైరవీలకు జోరుగా తెర లేసింది. ఈ నియమాకాలలో ప్రథానంగా స్థానిక ఎమ్మేల్యేల చేతిలో ఉండటంతో స్థానిక అదికారి పార్టీ నాయకులు ఇప్పటి నుంచి ముమ్మరంగా ఫైరవీలకు సిద్దం అవుతున్నారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఈనెల 13న జిల్లాలో అంగన్‌వాడిలలో ఖాళీగా ఉన్న 493 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. 36 అంగన్‌వాడి ...

Read More »

20న వైద్య ఉద్యోగుల చలో హైదరాబాద్‌

నిజామాబాద్‌, నవంబరు 14, వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న శాశ్వత ఉద్యోగుల అపరిష్కత సమస్యలతో పాటు, ఒప్పంద, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికుల సమస్యలను పరిష్కారించాలని కోరుతూ ఈ నెల 20న చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలంగాణ యూనైటెడ్‌ మెడికల్‌ హెల్త్‌, ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జార్జు తెలిపారు.

Read More »

15న అండర్‌ 20 కబడ్డి జట్ల ఎంపిక

నిజామాబాద్‌, నవంబరు 14, జిల్లా కబడ్డి సంఘం ఆధ్వర్యంలో ఈనెల 15న జూనియర్‌ (అండర్‌ 20) బాల బాలికల కబడ్డి జట్లను ఎంపిక చేయనున్నట్లు అసోసియేషన్‌ కార్యదర్శి లింగయ్య తెలిపారు. డి.ఎస్‌.ఎ మిని స్టేడియంలో ఉదయం 11 గంటలకు ఎంపిక జరుగుతందున్నారు,

Read More »

16న దళిత మహాసభ సమావేశం

నిజామాబాద్‌, నవంబరు 14, ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంద ఆసుపత్రికి అంబేద్కర్‌ పేరు పెట్టాలని కోరుతూ ఈనెల 16న దళిత మహాసభ ఆధ్వర్యంలో న్యూ అంబేద్కర్‌ భవన్‌లో నిర్వహించనున్నట్లు కార్యదర్శి గంగాధర్‌గౌడ్‌ తెలిపారు.

Read More »

15న నిశిత కళాశాలలో క్యాంపస్‌ ఇంటార్వుస్‌…. అన్ని డిగ్రీ కళాశాలల విద్యార్థులకు అవకాశం

నిజామాబాద్‌, నవంబరు 14 జిల్లాలోని అన్ని డిగ్రీ కళాశాలలకు ఈనెల 15న నిజామాబాద్‌లోని నిశిత డిగ్రీ కళాశాలలో క్యాంపస్‌ ఇంటార్వులను నిర్వహించనున్నట్లు కళాశాల నిర్వహకులు తెలిపారు. ఉదయం పది గంటలకు క్యాంపస్‌ ఇంటార్వుకు హాజరు కవాలని, విప్రో, విస్టా కంపనీల ప్రతినిధులు ఇంటార్వులు నిర్వహిస్తారన్నారు. అర్హత కలిగిన ప్రతి విద్యార్థి ఈ ఇంటార్వులకు హాజరు కావచ్చని తెలిపారు.

Read More »

16న సివిల్స్‌ ఉచిత శిక్షణకు అన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌

నిజామాబాద్‌, నవంబరు 14, యుపిఎస్సీ సివిల్‌ సర్విసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష -2014కు ఉచిత శిక్షణకు హాజరు అయ్యే వారు ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్టును ఈనెల 16న నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు తెలిపారు. ధరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బిసి అభ్యర్థులు www.tsbcstudycircles.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు.స్క్రీనింగ్‌ టెస్టును ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని వివరాల కోసం 08462 245055, 8985883830లకు సంప్రదించాలని సూచించారు.

Read More »

ప్రభుత్వం ప్రతిపక్షాల నోరు నొక్కెస్తోంది…తమ్మినేని వీరభద్రం

నిజామాబాద్‌, నవంబరు 14, ప్రభుత్వం ప్రతిపక్షాల నోరు నొక్కేస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. నగరంలోని ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌజ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ బడ్జెట్‌ సమావేశాలలో అధికార పక్షం ప్రతిపక్షాల గోంతు నొక్కుతోందని ధ్వజమెత్తారు. ప్రజాసమస్యలపై మాట్లాడటానికి అవకాశం ఇవ్వడం లేదని. సభ్యులు మాట్లాడుతుంటే మధ్యలోనే మైక్‌ కట్‌ చేస్తున్నారని అన్నారు. సభలో మాట్లాడే అవకాశం అందరికి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా దాట ...

Read More »

సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో ధర్నా

నిజామాబాద్‌, నవంబరు 14, మున్సిపల్‌ కార్మికులను వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలని సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో నగర మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. చాలా సంవత్సరాలుగా విధులు నివ్వహిస్తున్న మున్సిపల్‌ కార్మికులను వెంటనే రెగ్యులరైజ్‌ చేయిలపి మరియు వారికి ఆరోగ్య భద్రత కల్పించాలని వేతనాలను పెంచి సకాలంలో చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి, రాత్రింబవళ్ళు ప్రజా సేవ కొరకు పాటు పడుతున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించకపోవడం చాలా శోచనీయం అని అన్నారు. వెంటనే వారి న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని డిమాండ్‌ ...

Read More »

రేవంత్‌ రెడ్డి దిష్టి బొమ్మ దహనం.

నిజామాబాద్‌, నవంబరు 14, టీ-టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి దిష్లిబొమ్మను శుక్రవారం నగర టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో దహనం చేశారు. ఏ.పీ. సీఎం. మెప్పు పొందేందుకు రేవంత్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ ఎం.పి. కవితపై సమగ్ర సర్వే లో రెండు చోట్ల పేరు నమోదు చేనుకున్నట్లు తప్పుడు ఆరోపణలు చేశాడని విద్యార్థులు విమర్శించారు. రేవంత్‌ రెడ్డి ఇకనైనా తన వైఖరిని మార్చుకోవాలని అన్నారు. నగరంలోని పూలాంగ్‌ చైరస్తాలో రాస్తారోకో నిర్యహించి, దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో నగర టీఆర్‌ఎస్‌ నాయకులు చింత మహేష్‌ మరియు ...

Read More »

టిడీపీ కార్యకర్తల రాస్తారోకో

నిజామాబాద్‌, నవంబరు 14, నగరంలోని బస్టాండ్‌ ఎదుట టిడీపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణా రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్యేలు రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలకు దిగడంతో వారిని వారం రోజుల పాటు సస్పెండ్‌ చేసిన విషయం విదితమే. ప్రజాస్వామ్యంలో అందరికి నిరసన తెలిపే హక్కు ఉందని, దానికి విరుద్ధంగా అప్రజాస్వామ్యంగా టిడీపీ ఎమ్మెల్యేలను శాసన సభనుండి సస్పెండ్‌ చేశారని, దానికి నిరసనగా టిడీపీ నాయకులు, కార్యకర్తలు బస్టాండ్‌ ఎదుట రాస్తారోకో చేశారు. ఈకార్యక్రమంలో ...

Read More »