Breaking News

Nizamabad

అప్పుల బాధతో మహిళ ఆత్మహత్య

  రెంజల్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రానికి చెందిన ఫర్వీన్‌ సుల్తానా (32) అప్పుల బాధ భరించలేక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిందని రెంజల్‌ ఎస్‌ఐ చామంతుల టాటాబాబు తెలిపారు. మృతురాలు అన్నయ్య ఇస్మాయిల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు. శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం బోధన్‌ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. Woman Suicide In Renjal

Read More »

బిజెపి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్‌

  కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో మంగళవారం భారతీయ జనతాపార్టీ ఆద్వర్యంలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో పిచ్చిమొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్రమోడి పిలుపుమేరకు స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. అంబేడ్కర్‌ సైతం దేశం స్వచ్చంగా ఉండాలని కోరుకున్నారని, అంబేడ్కర్‌ఆశయాల మేరకు అందరం ముందుకు సాగాలని ...

Read More »

ఘనంగా అంబేడ్కర్‌ జయంతి వేడుకలు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో మంగళవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 125వ జయంతి వేడుకలను ఆయా పార్టీలు, కులసంఘాలు, కార్మిక సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాలులు అర్పించారు. దళిత వర్గంలో పుట్టిన అంబేడ్కర్‌ అనగారిన వర్గాల అభివృద్ధికి రిజర్వేషన్లు అమలు కావాలనే ఉద్దేశంతో రాజ్యాంగ నిబంధనల్లో రిజర్వేషన్లు పొందుపరిచిన మహనీయుడని కొనియాడారు. సమసమాజ నిర్మాణ ధ్యేయంతో రిజర్వేషన్లు రూపొందించానన్నారు. పాలక ప్రభుత్వాలు ప్రయివేటు రంగంలో ...

Read More »

ప్రగతి స్టార్‌ యూత్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ జయంతి

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలంలోని ప్రగతి స్టార్‌ యూత్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ జయంతి వేడుకలు సోమవారం నాడు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ కుమారుడు జగన్‌ హాజరై మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్‌ అంబేద్కర్‌ అని, ఈ సందర్భంగా దళితులకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ అడుగుజాడల్లో యువత నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి లక్ష్మీనర్సయ్య, టీఆర్‌ఎస్‌ ...

Read More »

మురికి కాలువలు శుభ్రపరిచిన పది రోజులకు..

  చెత్తఎత్తడానికి వస్తారు ..కాలనీవాసుల ఆరోపణ డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో డ్రైనేజీలను శుభ్రపరిచిన పదిరోజులకు చెత్తకుప్పలను ఎత్తివేస్తున్నారని గ్రామస్థులు, కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. మురికికాలువలను తీసిన చెత్తను, వెనువెంటనే ఎత్తివేయకుండా పదిరోజుల తర్వాత చెత్తకుప్పలను ఎత్తివేస్తున్నారు. మళ్ళీ ఎదావిధిగానే మురికికాలువలోనే అవి కలిసిపోతున్నాయి. చేసిన పనికి ఫలితం లేకుండా పోతోందని అన్నారు. గ్రామస్థాయి అధికారులు చేసే పనిని శ్రద్ధంగా చేయిస్తే ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయని కాలనీవాసులు కోరుతున్నారు. గ్రామంలో సుభాష్‌చందబ్రోస్‌ విగ్రహం ఎదుట ...

Read More »

బీడీ కార్మికులకు జీవన భృతి వెంటనే కల్పించాలి

  నిజామాబాద్‌, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ పరిశ్రమల్లో పనిచేస్తున్న బీడీ కార్మికులకు ప్యాకర్స్‌, చాటన్‌, బట్టి, హమాలీ, కమీషన్‌ఏజెంట్లందరికి వెయ్యి రూపాయల జీవనభృతిని ఇవ్వాలని కోరుతూ లేబర్‌ రైట్స్‌ వెల్పేర్‌ సొసైటీ అధ్యక్షులు రాపెల్లి శ్రీనివాస్‌ జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. సోమవారం ఆయన బీడీ కార్మికులతో కలిసి వెయ్యి రూపాయల భృతిని వెంటనే అమలు చేయాలని కోరుతూ అధికారులను కలిశారు. 01.03.2015 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రూపాయల భృతిని ఇస్తున్నప్పటికి ...

Read More »

మహనీయుల జయంతిరోజున మద్యపాన విక్రయాలు నిలిపివేయాలి

  నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం మద్యపాన విక్రయాలను నిలిపివేసి మహనీయుడు డాక్టర్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకలు అన్ని వర్గాలవారు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకోవాలని దళిత కళ్యాణసమితి జిల్లా కార్యదర్శి చక్రదౌలత్‌ అన్నారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఆయన వెంట నవీన్‌ గాంద్రే, సలేంక్‌ దయానంద్‌, అశోక్‌, గణపతి, తదితరులున్నారు. Alcohol should be Banned on Legends Birthdays stated by Dalith kalyan Samithi President ...

Read More »

ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే ప్రజావాణి

  రెంజల్‌, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరించేందుకే ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిందని రెంజల్‌ తహసీల్దార్‌ వెంకటయ్య అన్నారు. సోమవారం తహసీల్‌ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ఆయన నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలు త్వరలోనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పలుశాఖల అధికారులు, ఫిర్యాదుదారులు, డిప్యూటి తహసీల్దార్‌ డేవిడ్‌, ఏవో సిద్దిరామేశ్వర్‌, పశువైద్యాధికారి తదితరులు పాల్గొన్నారు. Prajavani is to Solve Public Problems Renjal  

Read More »

కందకుర్తి పుష్కరఘాట్‌లను సందర్శించిన రెంజల్‌ డిఐజి

  రెంజల్‌, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కందకుర్తి పుష్కర ఘాట్‌ను సోమవారం నిజామాబాద్‌ రేంజ్‌ డిఐజి గంగాధర్‌, జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి సందర్శించారు. జూలైలో వచ్చే పుష్కరాలను పురస్కరించుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తామని, అలాగే ట్రాఫిక్‌కు అనువైన స్థలాన్ని ఏర్పాటుచేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్‌సిసి క్యాడెట్లు, ప్రైవేటు విద్యాసంస్థల నుంచి విద్యార్థులు, స్వచ్చంద సంస్థల కార్యకర్తలును కూడా భద్రత కోసం ఏర్పాట్లు చేస్తామన్నారు. అలాగే పుష్కరాలకు వచ్చే ...

Read More »

ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల అవసరాన్ని ప్రభుత్వం గుర్తించాలి …

  – సిపిఎం జిల్లా కార్యదర్శి దండి వెంకట్‌ కామారెడ్డి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు 20 శాతానికి తగ్గిపోయాయని, ప్రైవేటు రంగం ప్రభుత్వ పాలకుల విధానాల వల్ల 80 శాతానికి విస్తరించిందని, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల అవసరం ఎంతో ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి దండి వెంకట్‌ అన్నారు. కామారెడ్డిలో సోమవారం నిర్వహించిన పార్టీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల అమలు ...

Read More »

అకాల వర్షం… రోడ్లన్ని అస్తవ్యస్తం..

నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో శనివారం రాత్రికురిసిన గాలులతో కూడిన వర్షానికి భారీ వృక్షాలు విరిగిపోవడంతో పాటు విద్యుత్‌ స్థంభాలు పడిపోయాయి. ఈదురు గాలుల కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లకు అడ్డంగా చెట్లు విరిగి పడ్డాయి. జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌ సమీపంలో వేపచెట్టు నేలకూలింది. దీంతో ఈప్రాంతంలో విద్యుత్‌ స్థంభాలు సైతం కూలిపోయాయి. కాంగ్రెస్‌ భవన్‌ వద్ద విద్యుత్‌ స్థంభం విరిగిపడడంతో విద్యుత్‌ తీగలు రోడ్డుపై పడ్డాయి. స్థానికులు స్పందించి ఆవైపు వాహనాలు వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. ...

Read More »

మేదరి మహాసభ గోడప్రతుల ఆవిష్కరణ

కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఈనెల 19న తలపెట్టిన మేదరి మహాసభ గోడప్రతులను ఆదివారం కామారెడ్డిలో మేదరికుల సభ్యులు ఆవిష్కరించారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ మేదరి కులస్తుల సమస్యలు, వాటి పరిష్కారం కోసం హైదరాబాద్‌లో మహాసభ నిర్వహించనున్నట్టు తెలిపారు. మేదరి కులస్తులు సభకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పోశాద్రి, కిషన్‌, ధర్మపురి, ప్రకాశ్‌, తదితరులు పాల్గొన్నారు. Medhari Community Wall Posters Inauguration, Medhari Community ...

Read More »

వాన కురిసింది… మోము మురిసింది…

కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శనివారం, ఆదివారం రెండ్రోజులపాటు కురిసిన వర్షం పట్టణ ప్రజలకు కాసింత ఊరట నిచ్చింది. వేసవి కాలంలో వేడిగాలులు, వేసవి తాపంతో బాదపడుతున్న పట్టణ వాసులకు రెండ్రోజుల వర్షం చల్లార్చింది. వేడినుంచి ఉపశమనం కలిగించింది. వర్షం కారణంగా లోతట్టుప్రాంతాలైన బతుకమ్మ కుంట, ఆర్‌బి నగర్‌, సాయిబాబా గుడి చౌరస్తా, ఎరుకల వాడా, సైలానిబాబా కాలనీ, తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. అంతర్గత రోడ్లు సరిగా లేకపోవడంతో అవి చిత్తడిగా మారాయి. శివారు కాలనీల్లో ...

Read More »

ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములు కండి …

– ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస నాయకులు, కార్యకర్తలు ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములు కావాలని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ పిలుపునిచ్చారు. కామారెడ్డి పట్టణంలో ఆదివారం డివిజన్‌లోని నాలుగు మండలాల్లో పట్టణ టీఆర్‌ఎస్‌ కమిటీలను ఎన్నుకున్నారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజలు తమపై నమ్మకముంచి కౌన్సిలర్లుగా, వార్డుసభ్యులుగా, జడ్పిటిసిలుగా, ఎమ్మెల్యేగా గెలిపించారని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాద్యతతమపై ఉందన్నారు. ప్రజల కస్టాల్లో పాలుపంచుకొని సమస్యల పరిష్కారానికి కృషి ...

Read More »

ఘనంగా మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ జన్మదిన వేడుకలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఆమె స్వగృహంలో కేక్‌ కట్‌చేసి వేడుకలు నిర్వహించారు. మునిసిపల్‌ కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు, మునిసిపల్‌ కార్మికులు, బంధుమిత్రులు ఛైర్మన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి కోసం పాటుపడతానని, తనకు ఛైర్‌పర్సన్‌గా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానన్నారు. Kamareddy Municipal Chairman Pippiri Sushma Birthday ...

Read More »

జిల్లా జర్నలిస్టుల ఛలో హైదరాబాద్‌

నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల సమయంలో కేసీఆర్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 19వ తేదీన జర్నలిస్టులు ఛలో హైదరాబాద్‌ చేపట్టినట్టు జిల్లా అధ్యక్షులు అంగిరేకుల సాయిలు తెలిపారు. శనివారం ఛలో హైదరాబాద్‌ గోడప్రతులను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. జర్నలిస్టులకు ఆరోగ్య కార్డులు లేక సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నారని, డెస్క్‌ జర్నలిస్టులకు అక్రిడియేషన్‌ కార్డులు ఇవ్వాలని జర్నలిస్టులకు, నాన్‌ జర్నలిస్టులకు కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ...

Read More »

ఏఐసిసి ప్రతినిధి రాక

నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల అఖిలభారత కాంగ్రెస్‌ కమిటీ అధికార ప్రతినిధిగా నియమితులైన జిల్లా మాజీ ఎంపి మధుయాష్కీ గౌడ్‌ సోమవారం జిల్లాకు రానున్నారని డిసిసి అధ్యక్షులు తాహెర్‌బిన్‌ హందాన్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన్ను డిసిసి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించనున్నట్టు చెప్పారు. కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని సూచించారు.   AICC President Madhu Yaski Goud Visit to Nizamabad

Read More »

పశువులను మింగుతున్న పాలిథిన్‌ భూతం…

– అధికారుల నియంత్రణ కరువు   – ప్రజా చైతన్యంతోనే ప్రకృతికి రక్షణ నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పశువులు ప్లాస్టిక్‌ వ్యర్థాలను తింటూ అక్కడే విశ్రమిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పశువులు సుమారు 2 వేలకు పైగానే ఉన్నాయని అంచనా. రోడ్లపై పారేసిన వ్యర్థాలలో ప్లాస్టిక్‌ సంచులు ఉండడంతో పశువులు వాటిని తింటున్నాయి. సంచుల్లో తినుపదార్థాలు దొరుకుతున్నాయని భావించి ప్లాస్టిక్‌ కూడా ఆరగిస్తున్నాయి. దీంతో కడుపులో జీర్ణం కాక మృత్యువాత పడుతున్న విషయం అందరికి తెలిసిందే. ...

Read More »

మే 10న తెలంగాణ గురుకుల జూనియర్‌ కాలేజీ ప్రవేశ పరీక్ష

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ గురుకుల జూనియర్‌ కాలేజీల ప్రవేశానికి టిఎస్‌ఆర్‌జేసి సెట్‌ 2015 మే 10న నిర్వహించనున్నారు. ఈపరీక్షకు దరఖాస్తు ఈనెల 18 వరకు గడువు విధించారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించాలని అధికారులు పేర్కొన్నారు. వరంగల్‌ జిల్లాలోని హసన్‌పర్తి (బాలికలు), నల్గొండలోని సర్వేల్‌, నిజామాబాద్‌లోని నగర (మైనార్టీ), హైదరాబాద్‌లోని ఎల్‌.బి.నగర్‌ (మైనార్టీ) జూనియర్‌ కాలేజీలో ప్రవేశాలు కల్పిస్తారు. Telangana Gurukal Jr College Entrance Test on 10th May .

Read More »

జిల్లాలోని ఆడపిల్లలు నూరుశాతం విద్యావంతులు కావాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక న్యూ అంబేడ్కర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన మహాత్మాజ్యోతి బాఫూలే 189వ జయంతి ఉత్సవాలను జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వి.జి.గౌడ్‌, జడ్పి ఛైర్మన్‌ దఫేదార్‌ రాజు, నగర మేయర్‌ ఆకుల సుజాత, ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, జేసి ఏ.రవిందర్‌రెడ్డి తదితరులు ఫూలే చిత్రపటానికి పూలమాలలువేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ సమాజం ముందుకు వెళ్లి ...

Read More »