Breaking News

Nizamabad

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆసుపత్రి, మెడికల్‌ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం ప్రభుత్వాసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెండింగ్‌లో ఉండడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పెండింగ్‌ వేతనాలివ్వడంతో పాటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Read More »

ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం

కామారెడ్డి, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఎంఆర్‌సి బిల్లు, క్యాబ్‌ బిల్లు రద్దు చేయాలని, దేశ సమగ్రతకు సెక్యులరిజంకి భంగం వాటిల్లే బిల్లు వల్ల అన్నదమ్ములుగా కలిసి ఉంటున్న హిందూ ముస్లింల మధ్య విభేదాలు తలెత్తే ప్రమాదముందని, అందుకోసం బిల్లును తక్షణం రద్దు చేయాలని కోరుతూ ఎంసిపిఐయు పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం ముందు మెయిన్‌ రోడ్డుపై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ...

Read More »

కలెక్టర్‌ను కలిసిన ఆసరా పెన్షన్‌ సంచాలకులు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఆసరా పెన్షన్‌ సంచాలకులు నవీన్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావును కలిశారు. బుధవారం జిల్లాకు వచ్చిన ఆయన కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల డిఆర్‌డిఎ సిబ్బంది, అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన కలెక్టర్‌ చాంబర్‌లో కలెక్టర్‌ను కలిసి డిఆర్‌డిఎ అందిస్తున్న పెన్షన్‌, సదరన్‌ క్యాంపు నిర్వహణ, ధవ పత్రాల జారీ తదితర విషయాలపై చర్చించారు. వారి వెంట డిఆర్‌డిఓ రమేష్‌ రాథోడ్‌ ...

Read More »

ఛలో హైదరాబాద్‌ గోడప్రతుల ఆవిష్కరణ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జర్నలిస్టుల అపరిష్క త సమస్యలు పరిష్కరించే దిశగా ఆల్‌ ఇండియా వర్కింగ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ (ఏడబ్ల్యుజెఎ) రెండవ జాతీయ మహాసభలు హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో జనవరి 3న నిర్వహించనున్నారు. ఏడబ్ల్యూజేఏ జాతీయ అధ్యక్షులు కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగే జాతీయ మహాసభలకు సంబంధించిన గోడ ప్రతులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు కోటేశ్వరరావు, జాతీయ మహాసభలకు కిషన్‌ రెడ్డిని ఆహ్వానించారు. కార్యక్రమంలో ఏడబ్ల్యూజేఏ ...

Read More »

వివాహ నమోదు వల్ల చట్టబద్ధత

నిజామాబాద్‌, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివాహం చేసుకున్నవారు రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే ఆ పెళ్ళికి చట్టబద్ధత లభిస్తుందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. బుధవారం తన ఛాంబర్‌లో వివాహ చట్టం 2002 కు సంబంధించి అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వివాహం చేసుకునేవారు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని తద్వారా దానికి చట్టబద్ధత లభిస్తుందని తెలిపారు. చట్టాన్ని 2002 లో తీసుకువచ్చారని దానికి 2006 లో గవర్నర్‌ ఆమోదం లభించి చట్టబద్ధత ఏర్పడిందన్నారు. చట్టం ...

Read More »

విశ్రాంత ఉద్యోగుల సేవలు సమాజానికి అవసరం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విశ్రాంత ఉద్యోగుల అపార అనుభవం సమాజానికి ఉపయోగించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు కోరారు. ఈ నెల 17న పెన్షనర్స్‌ డే పురస్కరించుకుని 13 నుండి 17 వ తేదీ వరకు నిర్వహించిన విశ్రాంత ఉద్యోగుల క్రీడా పోటీల ముగింపు కార్యక్రమాలకు కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రిటైర్మెంట్‌ వయసుకే కానీ శరీరానికి కాదని, 80 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కూడా ఎందరో విశ్రాంత ఉద్యోగులు ఎన్నో సంఘ ...

Read More »

దేశంలో నివసించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది

నిజామాబాద్‌, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు 2019 విద్యార్థిలోకం వ్యతిరేకించాలని పిడిఎస్‌యు నిజామాబాద్‌ డివిజన్‌ కమిటీ డిచిపల్లి మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్భంగా పివైఎల్‌, పిడిఎస్‌యు అధ్యక్షులు సాయినాథ్‌, అరుణ్‌ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం రాజ్యాంగంపై దాడి చేస్తుందని, ముస్లింలను దేశంలోకి రానీయకుండా ఈ చట్టం తీసుకువచ్చిందని, దేశంలో నివసించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు. నేడు దేశంలో పుట్టిన ...

Read More »

కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా మంగళవారం కల్యాణ లక్ష్మీ చెక్కులను తన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత తెరాస ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో అభివద్ధి సంక్షేమంలో మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. తనను గెలిపించిన నగర ప్రజల రుణం తీర్చుకోవడానికి చెక్కుతో పాటుగా పెళ్లి కూతురుకి చీర, పెళ్లి కొడుక్కి ఒక జత ...

Read More »

గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుదాం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే మున్సిపల్‌ ఎన్నికలలో ఐక్యంగా కష్టపడి పనిచేసి కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించేందుకు కషి చేయాలని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మానాల మోహన్‌ రెడ్డి కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. మంగళవారం డిసిసి కార్యాలయంలో కాంగ్రెస్‌ ముఖ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ విబేధాలు మరిచిపోయి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు. కార్యక్రమంలో నగర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షులు చంద్రకళ, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షులు భోజన్న, ...

Read More »

జ్ఞాన చైతన్య యాత్రకు అపూర్వ స్వాగతం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బడుగు, బలహిన వర్గాల విద్యార్థులకు ప్రేరణ ఇవ్వడానికి చేపట్టిన చైతన్య యాత్ర జనవరి 20 న అలంపూర్‌ నియోజకవర్గం నుండి ప్రారంభమైన ఏపూరి సోమన్న జ్ఞాన చైతన్య యాత్ర నిజామాబాద్‌ జిల్లాకు సోమవారం చేరుకుంది. నియోజకవర్గంలోని సిహెచ్‌ కొండూరు గ్రామ యువకులు, విద్యార్థులు మంగళవారం అపూర్వ స్వాగతం పలికారు. పల్లె పల్లెకు స్వేరోస్‌ని పరిచయం చేద్దాం, పల్లె పల్లె పాట చైతన్యానికి బాట, బాల కార్మికులు లేని సమాజాన్ని తయారు చేద్దాం అనే ...

Read More »

మాక్లూర్‌ మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లా మాక్లూర్‌ మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం మంగళవారం మండల కార్యాలయంలో జరిగింది. సమావేశానికి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మాక్లూర్‌ మండలంలో జరిగే అభివద్ధి పనులపై వివిధ శాఖల పనితీరుపై విఠల్‌ రావు చర్చించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మాక్లూర్‌ ఎంపీపీ ప్రభాకర్‌తో పాటు వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read More »

ధాన్యం కొనుగోలు నమోదు ప్రక్రియ మరింత వేగవంతం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల నుండి కొనుగోలు చేస్తున్న ధాన్యం వివరాలను మరింత వేగంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్‌లో ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక కొనుగోలు కేంద్రంలో ఒకటే ట్యాబ్‌ ఉపయోగించడానికి అవకాశమున్నందున, పగటిపూట సాంకేతిక సమస్యతో సర్వర్‌ ఇబ్బందితో అనుకున్నంత వేగంగా వివరాలు నమోదు కావడం లేనందున, ...

Read More »

పౌరసత్వ సవరణ బిల్లు వెనక్కి తీసుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పౌరసత్వ సవరణ బిల్లు 2019 ను వ్యతిరేకిస్తూ పి.డి.ఎస్‌.యు, ఎస్‌.ఐ.ఓ, ఎన్‌.ఎస్‌.యు.ఐ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చౌరస్తాలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షురాలు కల్పన, ఎస్‌ఐఓ నగర అధ్యక్షులు మహమ్మద్‌ ఖలీల్‌, ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర కార్యదర్శి విపుల్‌ గౌడ్‌ మాట్లాడుతూ మతం ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వడం అనేది లౌకిక ప్రజాస్వామ్య భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైనదన్నారు. మోడీ, షాలు ప్రజల్ని విభజించి పాలించాలని కుట్రలు పన్నుతున్నారన్నారు. దేశంలో ...

Read More »

8న జాతీయ సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2020 జనవరి 8 న జరిగే జాతీయ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటియూసి నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఓమయ్య పిలుపునిచ్చారు. మంగళవారం నిజామాబాద్‌లో నిర్వహించిన మెడికల్‌ కాంట్రాక్టు కార్మికుల జనరల్‌ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు సుధాకర్‌, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Read More »

పల్లె ప్రగతి కార్యక్రమానికి ఏర్పాటు చేసుకోండి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనవరి 2 నుండి ప్రారంభమయ్యే పల్లె ప్రగతి పనులకై ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో పల్లె ప్రగతి కార్యక్రమాల నిర్వహణపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏయే పనులు నిర్వహించాలో గ్రామ సభ ద్వారా తీర్మానం చేయాలని తెలిపారు. అదేవిధంగా గడచిన 30 రోజుల పల్లె ప్రగతి కార్యక్రమంలో నిర్వహించే పనులు చేసిన ఖర్చులపై కూడా గ్రామ ...

Read More »

ఉమ్మడి జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్యాకేజ్‌ 20, 21, 22 ద్వారా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో సుమారు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి నిర్దేశించుకున్నామని, పనులు కొనసాగుతున్నాయని రాష్ట్ర రహదారులు- భవనములు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్‌తో కలిసి బినోల, సారంగాపూర్‌, మంచిప్ప, మెంట్రాజ్‌పల్లి, సుద్ధపల్లి తదితర ప్రాంతాల్లో ప్యాకేజీ 20, 21ఏ లలో పర్యటించి కొనసాగుతున్న పైపులైను, సైట్‌ ఇన్స్‌పెక్షన్‌, పంప్‌ ...

Read More »

ఉచిత కంటి వైద్య శిబిరం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ బాల్కొండ ఆద్వర్యంలో సోమవారం బాల్కొండ మండల కేంద్రంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 56 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో పదకొండు మందికి మోతిబిందు ఉన్నట్లు గుర్తించి, వారిని శస్త్రచికిత్స నిమిత్తం నిజామాబాదు లయన్స్‌ కంటి ఆసుపత్రికి తరలించారు. బాల్కొండ లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు పెండ్యాల జీవన్‌, క్లబ్‌ ప్రతినిధులు వెంకటేశ్వర్లు, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

విఎన్‌ఆర్‌ పాఠశాలలో తల్లిదండ్రులకు పాదపూజ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లా కేంద్రంలోని సాయినగర్‌ విఎన్‌ఆర్‌ పాఠశాలలో సోమవారం తల్లితండ్రుల పాదపూజ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ జానపద గాయకులు ఆష్ట గంగాధర్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పిల్లల కోసం తల్లిదండ్రులు చేస్తున్న త్యాగాలతో పాటు బాధ్యతల గురించి తన మాట, పాటల ద్వారా ఈ సందర్భంగా గంగాధర్‌ వివరించారు. అమ్మ త్యాగాన్ని, పిల్లల ఉన్నతి కోసం నాన్న పడే తపనను అమ్మానాన్నల పాటల ద్వారా వివరించి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రుల ...

Read More »

ఆక్స్‌ఫర్డ్‌ పాఠశాలలో ఆధార్‌ నమోదు కేంద్రం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్ట ఆక్స్‌ఫర్డ్‌ పాఠశాలలో ఆధార్‌ నమోదు కేంద్రం ఏర్పాటు చేశారు. విద్యార్థులు వారి కుటుంబ సభ్యులకు ఆధార్‌ కార్డు తప్పుల సవరణ, నూతన కార్డుల నమోదు కోసం పోస్టల్‌ శాఖ ఆధ్వర్యంలో ఆధార్‌ నమోదు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో పోస్టల్‌ శాఖ అధికారి సాయిరెడ్డి, పాఠశాల కరస్పాండెంట్‌ మామిడాల మోహన్‌, ఇన్‌చార్జి గంగాధర్‌, ప్రధానోపాధ్యాయులు శ్రీశైలం, పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read More »

సహజ వనరులు పొదుపుగా వాడుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సహజ వనరుల పొదుపే రేపటి భవిష్యత్తని లేకపోతే భావితరాల మనుగడ కష్టసాధ్యమని మాక్లూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కదం శివాజీ అన్నారు. శనివారం వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలామ్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జాతీయ శక్తి పరిరక్షణ దినోత్సవాన్ని మాక్లూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ నిత్యజీవితంలో చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా బొగ్గు, నీరు, పెట్రోల్‌, సహజ వాయువు, తదితర వనరులను పొదుపు చేసి ...

Read More »