Breaking News

Nizamabad

కళ్యాణ కమనీయం

  ఆర్మూర్‌, మార్చి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని పట్టణంలోని రామాలయాలన్ని శ్రీరామనామ కీర్తనలతో మారుమోగాయి. పట్టణంలోని సిద్దులగుట్టపైగల రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. శనివారం అభిజిత్‌ లగ్నంలో రఘునాథుని కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కళ్యాణ కమనీయ దృశ్యాలను చూడడానికి పట్టణంతోపాటు నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సీతారామస్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రాల నడుమ పండితులతో ముక్కోటి ...

Read More »

యమపాశంగా మారుతున్న మినరల్‌ వాటర్‌

  నిజామాబాద్‌, మార్చి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోజురోజుకు యమపాశంగా ప్రజల పాలిట మినరల్‌వాటర్‌ పలు కంపెనీల పేర్లతో ప్రజలకు హాని కలిగిస్తుందన్న విషయం ప్రభుత్వ అధికారులకు తెలిసినా పట్టించుకున్న పాపానపోవడం లేదు. ఈ వాటర్‌ప్లాంట్లపై అధికారుల నియంత్రణ సరిగ్గా లేకపోవడంతో పలు రాజకీయ అండదండలతో వారి ఇష్టారాజ్యంగా నీటి వ్యాపారులు ప్రజల ఆరోగ్యంతో చదరంగం ఆడుతున్నారు. మినరల్‌వాటర్‌ పేరిట ఉప్పునీటిని కాస్త జల్లడపట్టి శుభ్రం చేస్తు వినియోగదారులకు లేనిరోగాలను అంటగడుతున్న విషయంపై ప్రజలు విమర్శలు కురిపిస్తున్నారు. భారత ప్రమాణ ...

Read More »

అభివృద్ది పనులు ప్రారంభం

  కామారెడ్డి, మార్చి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 21వ వార్డులో పలు అభివృద్ధి పనులకు మునిసిపల్‌ ఛైర్మన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. మునిసిపల్‌ నిధులు రూ. 2 లక్షలతో చేపట్టిన సిసి డ్రైన్‌ నిర్మాణాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణాన్ని అభివృద్ధి పరచే దిశగా కౌన్సిలర్లతో కలిసి ముందుకుసాగుతున్నట్టు తెలిపారు. పట్టణాభివృద్ధికి కావాల్సిన నిధులు, చేయబోయే పనుల గురించి ప్రభుత్వానికి ఈ మేరకే ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు జొన్నల నర్సింలు, ...

Read More »

కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు కామారెడ్డి

  కామారెడ్డి, మార్చి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శనివారం ప్రజలు శ్రీరామనవమి వేడుకలను బక్తిశ్రద్దలతో జరుపుకున్నారు. పండగ నేపథ్యంలో పట్టణంలోని రామాలయాలన్ని కళకళలాడాయి. పట్టణంలోని వివిధ ఆలయాల్లో సీతారాముల విగ్రహాలను ముస్తాబు చేశారు. ఆలయాలను అలంకరించి సీతారాముల కళ్యానాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. పట్టణంలోని వివిధ ఆలయాల్లో భక్తులు సామూహిక కుంకుమార్చనలు, పూజల్లో పాల్గొన్నారు. పట్టణంలోని ఎన్జీవోస్‌ కాలనీలోగల సీతారామ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయాల్లో సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా జరిపారు. వేలసంఖ్యలో భక్తులు పూజల్లో పాల్గొని స్వామివారికి మొక్కుకున్నారు. ...

Read More »

అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

  నిజామాబాద్‌, మార్చి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగదానంద కారకుడు, జానకి ప్రాణ నాయకుడు రామయ్య పెళ్ళి శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. చైత్రశుద్ద నవమిని పురస్కరించుకొని నగరంలోని రఘునాథాలయం, శ్రీరామాలయం, రైల్వే స్టేషన్‌, పలు ఆలయాల్లో సీతారాముల కళ్యాణాన్ని అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలు కల్యానశోభతో వెలిగిపోయాయి. ఈ వేడుకలను వీక్షించేందుకు ఊరువాడల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం సీతారామచంద్రస్వామివారి ఎదుర్కోలు ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. వరుడు బంధువులతో వచ్చే సమయంలో పొలిమేరనుంచి కన్యాదాత ...

Read More »

యమపాశంగా మారుతున్న మినరల్‌ వాటర్‌

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోజురోజుకు యమపాశంగా ప్రజల పాలిట మినరల్‌వాటర్‌ పలు కంపెనీల పేర్లతో ప్రజలకు హాని కలిగిస్తుందన్న విషయం ప్రభుత్వ అధికారులకు తెలిసినా పట్టించుకున్న పాపానపోవడం లేదు. ఈ వాటర్‌ప్లాంట్లపై అధికారుల నియంత్రణ సరిగ్గా లేకపోవడంతో పలు రాజకీయ అండదండలతో వారి ఇష్టారాజ్యంగా నీటి వ్యాపారులు ప్రజల ఆరోగ్యంతో చదరంగం ఆడుతున్నారు. మినరల్‌వాటర్‌ పేరిట ఉప్పునీటిని కాస్త జల్లడపట్టి శుభ్రం చేస్తు వినియోగదారులకు లేనిరోగాలను అంటగడుతున్న విషయంపై ప్రజలు విమర్శలు కురిపిస్తున్నారు. భారత ప్రమాణ సంస్థ (బిఎస్‌ఐ) నిబంధనలు పూర్తిగా ...

Read More »

తాగుబోతుల తాటతీయుండ్రి సార్లూ…!

  నిజామాబాద్‌, మార్చి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో ఓ మందు దుకాణం ముందుగా మేము మందుతాగిన మత్తులో ఏం చేసినా ఏ ఒక్కరు మమ్మల్ని ఎవరేం చేయరు. ఎందుకో ఎరికేనా గా మందు దుకాణంకు పర్మిట్‌రూం లేదు. మేం రోడ్లమీదనే మందు తాగుతం, ఇగ రోడ్డుమీదపోయే ఆడోళ్లను, పోరగాళ్లను ఇష్టమొచ్చినట్టు చిడాయిస్తం. అయినా మమ్మల్ని ఎవరేం చేయరు. ఎందుకో ఎరుకన గా మందు దుకాణం యజమాని మందు దుకాణానికి మేం పోకపోతే గిరాకేగాదు. ఇగ ఆయన గిరాకీ ...

Read More »

మూడేళ్ళ చిన్నారిపై అత్యాచారయత్నం

  – నిందితునిపై నిర్బయ కేసు నిజామాబాద్‌, మార్చి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అభం శుభం తెలియని మూడేళ్ళ చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. నగరంలోని 1వ టౌన్‌ పరిధిలో బాధితులు శుక్రవారం నిర్బయ సెంటర్లో ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగు చూసింది. నగరంలోని ముదిరాజ్‌ వీధికి చెందిన ఓ కుటుంబం మేడ్చల్‌కు వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలిసింది. సదరు కుటుంబం నిజామాబాద్‌ వచ్చిన తర్వాత బాలిక అస్వస్థతకు గురైంది. దీంతో అనుమానం వచ్చిన కుటుంబీకులు నిర్బయ ...

Read More »

కన్నుల పండువగా సీతారాముల కళ్యాణం

  రెంజల్‌, మార్చి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగరంగ వైభవంగా కన్నుల పండువగా, కమనీయంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా మండలంలోని తాడ్‌బిలోలి, నీలా క్యాంపు, కందకుర్తి, రెంజల్‌, దూపల్లి. కూనేపల్లి, కళ్యాపూర్‌ గ్రామాల్లో శ్రీరామనవమిని పురస్కరించుకొని నిర్వహించారు. కొన్ని ఆలయాల్లో భక్తులకు అన్నదానం నిర్వహించి మధ్యాహ్నం 12.15 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వేదపండితుల సమక్షంలో జరిపించారు. ఈ సందర్భంగా కందకుర్తి గ్రామంలో ప్రతి ఏటా శ్రీరామనవమి పురస్కరించుకొని కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నట్టు గ్రామ సర్పంచ్‌ కలీంబేగ్‌ ...

Read More »

ద్విచక్రవాహనం దగ్దం

  కామారెడ్డి, మార్చి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్రవాహనం దగ్దం చేశారు. పట్టణంలోని భవానినగర్‌కు చెందిన ఏ.కె.ఇంద్రకు చెందిన జుపిటర్‌ ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. దీంతో వాహనం దగ్దమైంది. బాధితుడు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ సంతోష్‌ తెలిపారు.

Read More »

సంఘాల పేరిట ప్రజలను మభ్యపెడితే కఠిన చర్యలు తప్పవు

  – జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి నిజామాబాద్‌, మార్చి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత కొన్నేళ్ళుగా ఇందూరు రైతాంగ సమాఖ్య, విద్యుత్‌ పోరాట కమిటీ, స్త్రీశక్తి బీడీ వర్కర్స్‌ యూనియన్‌ అనే పిడిఎస్‌యు విజృంభనకవరు సంఘాల పరుతో రైతులను, మహిళలను, విద్యార్థులను, యువతీ యువకులను తమ వైపునకు తిప్పుకుంటూ సానుభూతి లేకుండా వారిచేత చట్టవ్యతిరేక పనులు చేయిస్తు వారి చేతులకు మట్టి అంటుకోకుండా కొందరు నాయకులు వారిచేత ఆయుధాలను సరఫరా చేయిస్తున్న విషయం జిల్లా ఎస్పీ దృష్టికి వచ్చింది. ఈ ...

Read More »

ఈనెల 31న గ్రామ రెవెన్యూ అధికారుల జిల్లా మహాసభ విజయవంతం చేయండి

  నిజామాబాద్‌, మార్చి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 31వ తేదీన గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా మహాసభను నిర్వహిస్తున్నట్టు, దీన్ని విజయవంతం చేయాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు భూపతి ప్రభు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈనెల 31న ప్రారంభించే గ్రామ రెవెన్యూ అధికారుల జిల్లా కమిటీ కార్యాలయానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ విచ్చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం రాజీవ్‌గాంధీ ...

Read More »

”స్నేహ సొసైటీ” ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్‌

  నిజామాబాద్‌, మార్చి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని మారుతినగర్‌లోగల స్నేహ సొసైటీ ఫర్‌ రూరల్‌ రీ కన్‌స్ట్రక్షన్స్‌ మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాలలో శుక్రవారం దేశ ప్రధాని నరేంద్రమోడి పిలుపు మేరకు స్వచ్ఛభారత కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు చిన్నయ్య పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్నేహ సొసైటీలోని వికలాంగ బాలబాలికలు స్వచ్ఛభారత్‌ నిర్వహించడం ఎంతో గర్వకారణమని, వీరు వికలాంగులై ఉండి పరిసరాల పరిశుభ్రతపై ...

Read More »

తెవివి ఆధ్వర్యంలో జాతీయ సేవా కార్యక్రమం

  నిజామాబాద్‌, మార్చి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం యూనిట్‌-1 మిట్టాపల్ల గ్రామంలో రెండోరోజు స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహించినట్టు ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కొండ రవిందర్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా గ్రామ చెరువుల నుంచి ప్రాథమిక పాఠశాల వరకు 400 మీటర్ల పొడవునా రోడ్డుకు ఇరువైపులా ముళ్లపొదలను, చెట్లను తొలగించి చెత్తా, చెదారం, ప్రధానంగా ప్లాస్టిక్‌ను తొలగించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ గాంధారి రాజు పర్యవేక్షించారు. దానిలో భాగంగా అప్లైడ్‌ ఎకనామిక్స్‌, ఎం.ఎ ...

Read More »

మనిషి మనుగడకు మానవ హక్కులే కీలకం

  – జస్టిస్‌ సి.వి. రాములు డిచ్‌పల్లి, మార్చి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మానవ జీవన ప్రయాణంలో గౌరవంతో కూడిన జీవనానికి మానవహక్కులు ఎంతగానో తోడ్పడతాయని మనిషిని మనిషిగా గుర్తించిన మనిషికి గౌరవాన్ని ఇవ్వడానికి మానవహక్కులు అత్యంత ఆవశ్యకమని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సి.వి.రాములు అన్నారు. న్యాయకళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం మానవహక్కుల జాతీయ సదస్సు నిర్వహించారు. ఇందులో ప్రధానవక్తగా విచ్చేసిన ఆయన మాట్లాడారు. పుట్టుకతో అందరు సామాన్యులేనని, కానీ ప్రతిచోట వివక్షత. కొన్నిచోట్ల కొన్ని వర్గాల వారు మానవహక్కులు ...

Read More »

ఎంతటివారికైనా శిక్షతప్పదు

  -మమ్మల్ని నమ్మండి, మీకు న్యాయం చేకూరుస్తాం నిజామాబాద్‌, మార్చి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మా పోలీసులను నమ్మండి, తప్పుచేసినవారు ఎంతటివారైనా శిక్షతప్పదని 3వ టౌన్‌ ఎస్‌హెచ్‌వో శ్రీహరి బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. వివరాల్లోకి వెళితే… నగరంలోని స్థానిక హమాల్‌వాడికి చెందిన బల్ల వినయ్‌ (26) అనే వ్యక్తి మార్చి 21వ తేదీ శనివారం రాత్రి 10 గంటల సమయంలో స్తానిక మైసమ్మ మందిరంలో నిద్రిస్తుండగా తనను నిద్రనుంచి లేపి అదేవీధికి చెందిన చక్రధర్‌ అనే వ్యక్తి తనను ...

Read More »

ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలి

  ఆర్మూర్‌, మార్చి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాలని ఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తెడ్డు రవికిరణ్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని తహసీల్‌ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి వారి గళాన్ని వినిపించి దళితుల అభ్యున్నతికి పాటుపడాలని అన్నారు. ...

Read More »

అర్హులందరికి జీవనభృతి

  ఆర్మూర్‌, మార్చి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీకార్మికులకు వెయ్యి రూపాయల జీవన భృతి కల్పించిన ఘనత సిఎం కేసీఆర్‌దేనని ఆర్మూర్‌ మునిసిపల్‌ ఛైర్మన్‌ స్వాతిసింగ్‌ బబ్లు అన్నారు. శుక్రవారం పట్టణంలోని మునిసిపల్‌ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా జీవనభృతిని ప్రకటించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రిదేనని ఆమె అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సుఖ సంతోషాలను కోరే ప్రభుత్వమని ఆమె స్పష్టం చేశారు. అలాగే ప్రతి ఒక్క బీడీ కార్మికురాలికి వెయ్యి రూపాయల జీవన ...

Read More »

ఆలయాలకు శ్రీరామనవమి శోభ

  ఆర్మూర్‌, మార్చి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని రామాలయాలన్ని శ్రీరామ నవమి శోభను సంతరించుకున్నాయి. పట్టణంలోగల రామాలయాలను ఆయా కమిటీల సభ్యులు రంగులు వేసి రకరకాల పూలతో అలంకరించారు. విద్యుత్‌ దీపాలతో శ్రీరామనవమి వేడుకలకు సిద్దం చేశారు. దీంతో ఆలయాలన్ని శ్రీరామ నవమి శోభను సంతరించుకున్నాయి. పట్టణంలోని జంబి హనుమాన్‌, సిద్దులగుట్ట రామాలయం, కాశి హనుమాన్‌ వీధిలోని రామాలయం శ్రీరామనవమి సందర్భంగా ముస్తాబయ్యాయి. అందులో భాగంగానే శుక్రవారం ఆయా ఆలయాల్లో బక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీరామున్ని భక్తి ...

Read More »