Breaking News

Nizamabad

కొత్త పరిశ్రమల అనుమతులపై కలెక్టర్‌ సమీక్ష

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో కొత్త పరిశ్రమలకు సంబందించి వివిధ శాఖలు తీసుకోవాల్సిన చర్యలు, ఇవ్వాల్సిన అనుమతులకు సంబంధించి పరిశ్రమలు తదితర అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ సోమవారం కార్యాలయ చాంబర్‌లో ప్రగతిని సమీక్షించారు. కేటాయించిన కాలపరిమితిలోపు చర్యలు తీసుకొని సంబంధిత శాఖ అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీకి ఆదేశాలిచ్చారు. ముఖ్యంగా సమావేశంలో ఆరు యూనిట్లకు సంబందించి జిల్లా ట్రాన్స్‌కో జిల్లా పరిశ్రమలు, ఫ్యాక్టరీ ఇన్స్‌పెక్టర్‌, డిపివో, తదితర శాఖల అధికారులతో పెండింగ్‌ పనులపై ...

Read More »

ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవం

కామారెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో సోమవారం భారతీయ జనతాపార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణ బిజెపి కార్యాలయం వద్ద బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్‌ సిద్దిరాములు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ బిజెపిని స్థాపించి నేటికి 35 సంవత్సరాలు అవుతోందని తెలిపారు. ఈకాలంలో కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాడి మూడుసార్లు అధికారంలోకి వచ్చామని పేర్కొన్నారు. పీడిత పాలననుంచి ప్రజలను విముక్తులను ...

Read More »

పెద్దాసుపత్రిలో అరకొర సదుపాయాలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజల ఆరోగ్య సౌకర్యాల నిమిత్తం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏడంతస్తుల మేడ కట్టించింది. కానీ దీనిలో మాత్రం అరకొర సదుపాయాలతో అక్కడికి వచ్చే రోగులు అనేక ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూపర్‌ స్పెషాలిటీలో ఉండే ప్రతి ఒక్క సదుపాయం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంటుందని తెలిపిన విషయం మనకు తెలిసిందే. కానీ ఒక్కసారిగా అక్కడికి వెళ్లిన రోగులు మాత్రం ...

Read More »

నేడు పబ్లిక్‌ రిలేషన్‌ సెమినార్‌

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగ ఆధ్వర్యంలో ‘ఆధునిక డిజిటల్‌ యుగంలో ప్రజాసంబంధా’లు అన్న అంశంపై మంగళవారం ఉదయం 10 గంటలకు జాతీయ సెమినార్‌ నిర్వమిస్తున్నట్లు సెమినర్‌ కన్వీనర్‌ డాక్టర్‌ కె. రాజారాం తెలిపారు. ఈ సెమినార్‌కు వక్తలుగా తెలంగాణ రాష్ట్ర ప్రెస్‌ అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ, పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న గటిక విజయ్‌కుమార్‌ పాల్గొంటారని అన్నారు. గతంలో ఉస్మానియా యూనివర్సిటీతో పాటు సెంట్రల్‌ యూనివర్సిటీ మౌలానా ఆజాద్‌, ఉర్దూ ...

Read More »

డిస్టెంట్స్‌ పద్దతిలో పీజీ విద్యను అందించాలి

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సులను డిస్టెంట్స్‌ పద్దతిలో ఏర్పాటు చేయాలని నిజామాబాద్‌, ఇతర జిల్లాల విద్యార్థులు టీయూ రిజిస్ట్రార్‌ లింబాద్రికి విన్నపం చేశారు. ఎమ్మెస్సీ మ్యాస్‌, ఫిజిక్స్‌, కెమెస్ట్రీ, ఎంఏ ఇంగ్లీష్‌, ఎంకాం తదితర కోర్సులను ఏర్పాటు చేయాలని పీజీ విద్యను చదవలేక ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల విద్యార్థులు చదవలేకపోతున్నారని డిస్టెంట్స్‌ పద్దతిలో వీటిని విద్యార్థులకు అందజేయాలని వారు కోరారు. ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న వారికి డిస్టెంట్స్‌ పద్దతిలో పీజీ విద్యను ...

Read More »

మనుషుల అక్రమ రవాణాపై అవగాహన కల్పించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షలమందిని లైంగిక వ్యాపారానికి అక్రమంగా తరలిస్తున్నారని, ఇందులో ఆడవారు, మగవారు, చిన్న పిల్లలు ఉన్నారని ”ప్రజ్వల” మనుషుల అక్రమ రవాణా వ్యతిరేక ఉద్యమం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సుమారుగా 10 లక్షల మంది చిన్న పిల్లలను వ్యభిచార కూపంలోకి దింపుతున్నారని వారు పేర్కొన్నారు. ఈ అక్రమ రవాణా గత 30 సంవత్సరాల ...

Read More »

ప్రజావాణి ఫిర్యాదులకు బారులు తీరిన ప్రజలు

ఇందూరు, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో వారి ఫిర్యాదులు విన్నవించేందుకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు బారులు తీరారు. ఈ మేరకు వారి సమస్యల పరిష్కారానికై కలెక్టర్‌కు వినతి పత్రం అందించేందుకు ఎదురుచూశారు. అంతేకాక ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన పింఛన్ల కౌంటర్ల వద్ద వృద్దులు, వికలాంగులు, అర్హులు ఎండలో బారులు తీరారు. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇకనైనా సంబంధిత అధికారులు వారి వారి గ్రామాల్లోని ప్రజలకు అక్కడే పింఛన్లు, ఆహారభద్రత ...

Read More »

ప్రజావాణి ఫిర్యాదుదారులకు నీటి వసతి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా నలుమూలల నుంచి మండుతున్న ఎండల్లో వారి సమస్యలను, గోడులను విన్నవించేందుకువ వస్తున్న ప్రజలకు సోమవారం జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కనీస సదుపాయం మేరకు మంచినీటి సౌకర్యాన్ని వారికి ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రజవాణికి వచ్చిన ఫిర్యాదుదారులు ఈ మంచినీటి ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌ ప్రజల సమస్యలను గ్రామ గ్రామాన, అడుగడుగునా తిరుగుతూ తెలుసుకోవడం ఎంతో అభినందనీయమని ప్రజలు అంటున్నారు. ...

Read More »

చీకటి దందాలో విచ్చలవిడిగా డోమెస్టిక్‌ సిలిండర్లు

– చూసిచూడనట్టు వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు ఇందూరు, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుపేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఉచితంగా సిలిండర్లను అందించే దీపం పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు గతంలో ఎన్నడూ లేనివిధంగా నియోజకవర్గానికి 5 వేల చొప్పున సిలిండర్లను మంజూరు చేసిన విషయం కూడా తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా మొత్తం మీదుగా 9 నియోజకవర్గాలకు కలిపి 45 వేల దీపం సిలిండర్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ...

Read More »

ఘనంగా జగ్జీవన్‌రాం జయంతి – మహనీయుల అడుగుజాడల్లో నడవాలి : కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేటి సమాజం మహనీయుల జీవితాల గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరముందని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ తెలిపారు. భారతదేశ మాజీ ప్రధాని బాబు జగ్జీవన్‌రాం 108వ జయంతి సందర్భంగా స్థానిక రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా అద్యక్షత వహించిన కలెక్టర్‌ మాట్లాడారు. దళితులకు ఏ సదుపాయాలు, గౌరవ, మర్యాదలు లేని కాలంలో ఎంతో కష్టపడి జగ్జీవన్‌రాం ఉన్నత శిఖరాలకు ఎదిగారన్నారు. స్వాతంత్య్ర ...

Read More »

నగరంలో 30 యాక్టు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో హనుమన్‌ జయంతిని పురస్కరించుకొని శనివారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు 30 యాక్టు అమల్లో ఉంటుందని నిజామాబాద్‌ డిఎస్పీ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. నగరంలో వివిధ యువజన సంఘాలు, ఆధ్యాత్మిక సంస్థలు ర్యాలీలు, శోభాయాత్రలు, ధ్వజ యాత్రలు నిర్వహిస్తున్నందున భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే పండగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయసంఘటనలు, అల్లర్లకు తావులేకుండా సహకరించాలని పేర్కొన్నారు. అలాగే పోలీసువారి అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని ...

Read More »

గులాబీ కండువా వేసుకున్న పట్వారీ డిసిసిబి ఛైర్మన్‌ కారెక్కారు

నిజామాబాద్‌ ప్రతినిధి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా డిసిసిబి ఛైర్మన్‌ గంగాధర్‌ పట్వారీ ఎట్టకేలకు కారెక్కారు. సిఎం ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి కెటిఆర్‌, విప్‌ గంపగోవర్థన్‌, బోధన్‌ ఎమ్మెల్యే షకిల్‌ సమక్షంలో పార్టీలో చేరారు. తెర వెనక కెటిఆర్‌, గంప గోవర్థన్‌లు కీలకంగా వ్యవహారించినట్లు తెలస్తుంది. డిసిసిబి ఛైర్మన్‌ పదవి కోసం ఎన్నో ఏళ్లుగా వేచి చూసిన పట్వారీకి ఈసారి అవకాశం దక్కింది. అయితే టిఆర్‌ఎస్‌ హవాతో కాంగ్రెస్‌ ...

Read More »

జిల్లాలో 276 వరి కొనుగోలు కేంద్రాలు జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ రబీలో వరి ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 276 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు సంయుక్త కలెక్టర్‌ ఎ.రవిందర్‌రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక ప్రగతిభవన్‌లో రైస్‌మిల్లర్లు, పౌర సరఫరా లశాఖ అధికారులతో రబీ ధాన్యం కొనుగోలుపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 230, ఐకెపి ద్వారా 44, మెప్మా ఆధ్వర్యంల రెండు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతుల డిమాండ్‌మేరకు అవసరాన్ని బట్టి ...

Read More »

కామారెడ్డిలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

– పట్టణంలో భారీ బైక్‌ ర్యాలీ కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శనివారం హనుమాన్‌ జయంతి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో పట్టణంలో వందలాది ద్విచక్ర వాహనాలతో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. యువకులు విహెచ్‌పి, భజరంగ్‌దళ్‌ నాయకులు వందల సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీని విహెచ్‌పి రాష్ట్ర కార్యదర్శి జగదీశ్వర్‌ ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు ...

Read More »

3వ వార్డులో జీవనభృతి పంపిణీ

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని స్థానిక 3వ వార్డు హౌజింగ్‌ బోర్డు కాలనీలో శనివారం తెరాస నియోజకవర్గ ఇన్‌చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి, స్థానిక కౌన్సిలర్‌, మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మోత్కురి లింగాగౌడ్‌లు బీడీ కార్మికులకు ప్రభుత్వం అందజేస్తున్న రూ. వెయ్యి జీవనభృతిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాన రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వారు అన్నారు. ప్రభుత్వం ఎలాంటి అక్రమాలకు పోకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ...

Read More »

హనుమాన్‌ జయంతికి ముస్తాబు

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత 41 రోజులుగా అత్యంత నిష్టతో భక్తి శ్రద్దలతో హనుమాన్‌ మాలధారులు, హనుమాన్‌ స్వామికి పూజలను నిర్వహించారు. ఈ పూజలకు శనివారం హనుమాన్‌ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మాలధారులు విరమించనున్నారు. ఈ పాటికే ఆలయాలన్ని రంగులువేసి విద్యుత్‌దీపాలతో సుందరంగా ముస్తాబు చేశారు. హనుమాన్‌ జయంతి సందర్బంగా పట్టణంలోని హనుమాన్‌ ఆలయాలన్ని భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని భావించి కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ...

Read More »

వైభవంగా గణపతి ఆలయంలో హోమం

కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని హౌజింగ్‌ బోర్డులోగల సంకష్ట హర మహాగణపతి ఆలయంలో శుక్రవారం పౌర్ణమిని పురస్కరించుకొని గణపతి హోమాన్ని వైభవంగా జరిపారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య యాగాన్ని జరిపించారు. అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, విఘ్నాలు తొలగిపోయి సుభిష్టంగా వర్దిల్లాలని హోమం నిర్వహించినట్టు తెలిపారు. ప్రతి పౌర్ణమినాడు హోమం చేస్తున్నట్టు అన్నారు. పట్టణప్రజలు వందల సంఖ్యలో తరలివచ్చి యజ్ఞ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

Read More »

తెరాస పట్టణ వార్డు కమిటీల ఎన్నిక

కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని వివిధ వార్డుల తెరాస నూతన కమిటీలను శుక్రవారం ఎన్నుకున్నారు. 29వ వార్డు అధ్యక్షునిగా కొమ్యాడం శ్రీనివాస్‌, కార్యదర్శిగా కొడిశ్యామ గంగాధర్‌, 30వ వార్డు అధ్యక్షునిగా పిట్ల శంకర్‌, కార్యదర్శిగా పి.శ్రీహరి, 31వ వార్డు అధ్యక్షునిగా బోజ వినోద్‌, కార్యదర్శిగా బట్టు సంతోష్‌, తదితరులను ఎన్నుకున్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో నూతన కమిటీలను ఎన్నుకొని పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తామని తెరాస నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ ప్రతినిదులు రామారావు,తిరుమల్‌రెడ్డి, ...

Read More »

యువతీ యువకులు, రాజకీయనాయకుల అండదండలు నిలిపివేయాలి

– చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు – రాజకీయ నాయకుల అండదండలతో యువత త్రిబుల్‌ రైడింగ్‌ – దానివల్ల ప్రమాదం అధికం – ఈ ప్రమాదాలను అరికట్టాలంటే ట్రాఫిక్‌ పోలీసులు విధి నిర్వహణకు అడ్డుపడుతున్న పలువురు నేతలు నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులు, స్థానిక పోలీసు స్టేషన్‌ అధికారులు త్రిబుల్‌ రైడింగ్‌, లైసెన్సు, ఆర్సీలు, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పట్టుకొని జరిమానా విధిస్తామనే సరికి నాకు ఆ కార్పొరేటర్‌, ఈ ...

Read More »

శుక్రవారం ”సదరం క్యాంపు” నిలిపివేత

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గుడ్‌ప్రైడే ను పురస్కరించుకొని శుక్రవారం వికలాంగుల దృవీకరణ పత్రాలు జారీచేసే సదరం క్యాంపును నిలిపివేసినట్టు జిల్లా జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రమాదేవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీనివల్ల వికలాంగులు చింతించవద్దని వారు కోరారు. తిరిగి వచ్చేవారం 10వ తారీఖున యధావిధిగా సదరం క్యాంపులో వికలాంగులకు పరీక్షలు చస్తామని పేర్కొన్నారు. అర్హులైన వికలాంగులు విషయాన్ని గమనించాలని కోరారు. అనంతరం సదరం క్యాంపు ద్వారా అర్హులైన ప్రతి ఒక్క వికలాంగునికి పింఛన్లు అందజేస్తామని ఆమె అన్నారు.

Read More »