నిజామాబాద్, మార్చి 10 – కలెక్టర్ రోనాల్డ్ రోస్ నిజామాబాద్ న్యూస్ : 2015-16 సంవత్సరంలో చదువుకున్న నిరుద్యోగ యువతీ, యువకులకు 2 వేల మందికి స్టేట్ బ్యాంక్ హైధరాబాద్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి స్వయం ఉపాధి పనుల కోసం వివిధ ట్రేడులలో శిక్షణ ఇప్పించేందుకు కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ తెలియజేశారు. డిచ్పల్లిలోని గ్రామీణ ఉపాధి స్వయం శిక్షణ కేంద్రం డైరెక్టర్ విష్ణుకుమార్‌కు సూచించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో 2015-15 సంవత్సరంలో గ్రామీణ ఉపాధి శిక్షణ కేంద్రం ...
Read More »ఐఎఫ్టియు 8వ సభలనువిజయవంతం చేయాలి
నిజామాబాద్, మార్చి 10 నిజామాబాద్ న్యూస్ : ఈనెల 13న హైదరాబాద్‌లో జరగనున్న ఐఎఫ్టియు 8వ మహాసభలను కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి జె.గంగాధర్ తెలిపారు. ఈ మేరకు డిచ్పల్లి మండల కేంద్రంలో మంగళవారం సభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. సభల సందర్భంగా హైదరాబాద్‌లోని సుందరయ్య పార్కునుంచి ర్యాలీగా బయల్దేరి మధ్యాహ్నం 2 గంటలకు ఇందిరా పార్కుకు చేరుకుంటుందన్నారు. అనంతరం అక్కడ బహిరంగ సభ ఉంటుందని పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ...
Read More »ఇంటర్నెట్ ద్వారా డబ్బులు సంపాదించడం – సెమినార్
నిజామాబాద్, మార్చి 10 నిజామాబాద్ న్యూస్ : తెలంగాణ విశ్వవిద్యాలయం సైన్స్ విభాగం సెమినార్ హాల్లో ఇంటర్నెట్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా అన్ని అంశంపై సమావేశం ఏర్పాటు చేశారు. మానవాళి చరిత్రలో ఇంటర్నెట్ ఒక సమాచార విప్లవాన్ని సృష్టించిందని వ్యవసాయ విప్లవం, పారిశ్రామిక విప్లవం తర్వాత మానవజాతి అభివృద్ధిలో అత్యంత కీలకమైనదని ఇంటర్నెట్ద్వారా సాధ్యమైన సమాచారం విప్లవమే అని తెలంగాణ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ పార్థసారధి వివరించారు. ఈ సందర్భంగా విసి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. మనం చూస్తున్నది ఇంటర్నెట్లోని మొదటి దశ ...
Read More »10 రోజుల్లోగా వ్యక్తిగత మరుగుదొడ్లు
నిజామాబాద్, మార్చి 09 నిజామాబాద్ న్యూస్ : అన్నిగ్రామాల్లో నిర్దేశించిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను 10 రోజుల్లోగా పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ ఎంపిడివోలకు, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఉపాధి హామీ పథకం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, తెలంగాణ హరితహారం, బీడీ కార్మికుల జీవనభృతికి సంబంధించి ఎంపిడివోలతో, సంబంధిత అధికారులతో సమీక్షించారు. మరుగుదొడ్ల నిర్మాణం ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లో మార్చి 31లోపు పూర్తి కావాలని, తదుపరి బిల్లుల చెల్లింపునకు ఇబ్బందులు ఉంటాయని కలెక్టర్ ...
Read More »మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
నిజామాబాద్, మార్చి 09 ఆర్మూర్ న్యూస్ : మహిళలు అన్ని రంగాల్లో ముందుండి రాణించాలని ఆర్మూర్ మునిసిపల్ ఛైర్మన్ స్వాతిసింగ్ అన్నారు. సోమవారం పట్టణంలోని సైదాబాద్లోగల షాదిఖానాలో సిడిపివో ఇందిర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని ఆమెఆకాంక్షించారు. ఇందుకు తెరాస ప్రభుత్వం సైతం కృషి చేస్తుందని ఆమె గుర్తుచేశారు. అందులో భాగంగానే మహిళా రక్షణకై సిఎం కేసీఆర్ ప్రత్యేక దృస్టి సారిస్తున్నారన్నారు. అనంతరం ...
Read More »ప్రశాంతంగా ఇంటర్ మొదటి పరీక్ష
నిజామాబాద్, మార్చి 09 ఆర్మూర్ న్యూస్ : ఆర్మూర్ పట్టణంలో ఇంటర్మీడియట్ మొదటి పరీక్ష సోమవారం ప్రశాంతంగా ముగిసినట్టు ఆర్ఐవో విజయ్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని క్షత్రియ జూనియర్ కళాశాల, విజయ్ జూనియర్ కళాశాల, పెర్కిట్‌లోని మోడల్ స్కూల్, బాలుర, బాలికల పాఠశాల, రెసిడెన్షియల్ పాఠశాలల పరీక్షా కేంద్రాలను నిర్వహించినట్టు ఆయన చెప్పారు. ఈ పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు మొదటి పరీక్షను ప్రశాంతంగా రాసినట్టు ఆయన చెప్పారు. ఈ కేంద్రాలను డివిఇఓ ఒడ్డెన్న అబ్జర్వర్లతో కలిసి తనికీ చేసినట్టు ఆయన ...
Read More »ఉపకార వేతనాల పంపిణీ
నిజామాబాద్, మార్చి 09 ఆర్మూర్ న్యూస్: ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలోగల ప్రాథమిక పాఠశాలలో ఎంఇవో రాజగంగారాం చేతుల మీదుగా సోమవారం వికలాంగ విద్యార్థులకు ఉపకార వేతనాలను పంపిణీ చేశారు. పాఠశాలలోని వికలాంగ విద్యార్థులైన గణేశ్, గోపి, మీనాక్షిలకు నెలకు 70 రూపాయల చొప్పున 700 రూపాయలను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాద్యాయుడు గోపాల్, ఎస్ఎంసి ఛైర్మన్ పోశెట్టి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Read More »దొంగ అరెస్టు- బైక్స్వాధీనం
నిజామాబాద్, మార్చి 09 ఆర్మూర్ న్యూస్ : లింగంపేట్ మండలం బోనాల గ్రామానికి చెందిన లీలాస్వామి అనే యువకుణ్ణి సోమవారం అరెస్టు చేసినట్టు ఆర్మూర్ సిఐ రవికుమార్ తెలిపారు. సిఐ కథనం ప్రకారం… బోనాల గ్రామానికి చెందిన లీలాస్వామిని పట్టణంలోని కెనాల్ కట్ట ప్రాంతంలో అరెస్టు చేసి ఆయన వద్దనుంచి ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్టు సిఐ వెల్లడించారు.
Read More »ట్రాఫిక్ సారూ… జరఇటు సూడూ…
నిజామాబాద్, మార్చి 08 నిజామాబాద్ న్యూస్ : మన ఊర్ల మొగోళ్ళు ముగ్గురు ముగ్గురు తిరుగుతే దొరకవట్టి ఫైన్లేస్తరు. మరిగట్లనే ఆడోళ్ళు కూడా ముగ్గురు ముగ్గురు తిరుగుతుండ్రు. వోలో పెద్దలన్నట్టు ఆడోళ్ళు మొగోళ్ళకు తీసిపోరన్నట్టు గీ ఫోట్వ సూత్తనే సమజైతుంది కదా. కానీ ఈ దినంలల్ల మనపోరగాండ్ల కంటే ఆడోళ్ళే అల బండ్లను ఇయ్యర్…మయ్యర్… రోడ్లమీద నడుపుతుండ్రు. మరి గిదిమీకు కనవడతలేదా..? ఇస్కూలు పిల్లలు, లైసెన్సులు లేనోళ్లు, ఓటుహక్కు లేనోళ్ళు కూడా రోడ్లమీద బండ్లను ధూం… ధాం… నడుపుతుండ్రు. గిట్ల నడుపుతే దెబ్బలు తాకినోళ్ల ...
Read More »వేతనాలు సక్రమంగా చెల్లించండి
– నిజామాబాద్ దక్కన్ షుగర్స్ కార్మికులు నిజామాబాద్, మార్చి 08 నిజామాబాద్ న్యూస్ : జిల్లా కేంద్రంలోని బోధన్ లోగల చక్కర కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులకు గత రెండు సంవత్సరాల నుంచి రావాల్సిన వేతనాలు సరైన సమయంలో ఇవ్వడం లేదని నిజాం దక్కన్షుగర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ఎస్.కుమారస్వామి, కార్మికులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం వారు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 20 మంది కాంటాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని గత ప్రభుత్వాన్ని ...
Read More »నాఇంట్లో నాకు చావడానికి అవకాశమివ్వండి
నిజామాబాద్, మార్చి 08 నిజామాబాద్ న్యూస్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్మూర్లోగల టీచర్స్‌కాలనీలో నివాసముండే నా ఇంటిని నాకు ఇప్పించాలంటూ రిటైర్డ్ ఎంఇవో చంద్రశేఖర్ నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం… టీచర్స్కాలనీలోగల తన ఇంటిని ఎక్సైజ్ శాఖకు అద్దెకిచ్చామని అన్నారు. 2011లో మూడు సంవత్సరాల అగ్రిమెంట్ చేసుకున్నట్టు ఆయన అన్నారు. కానీ ఇపుడు వెళ్లి ఖాళీచేయమని అడిగితే ఎక్సైజ్ సూపరింటెండెంట్ తన శాఖకు చెందిన సిఐని అడగమని చెప్పారన్నారు. సిఐ వద్దకెళితే సూపరింటెండెంట్‌ను అడగాలని ...
Read More »రెంజల్ తహసీల్దార్‌గా కె.వెంకటయ్య
నిజామాబాద్, మార్చి 08 నిజామాబాద్ న్యూస్ : రెంజల్ మండల తహసీల్దార్ నంది గణేశ్ గత నెల ఏసిబి వలలో చిక్కగా అప్పటినుంచి ఇన్చార్జి తహసీల్దార్‌గా డేవిడ్ కొనసాగుతున్నారు. కాగా తాజాగా సోమవారం మాక్లూర్ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న కె.వెంకటయ్య రెంజల్ తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ ఆదేశానుసారం రెంజల్ తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించినట్టు ఆయన తెలిపారు. ప్రజావాణిలో ఫిర్యాదులు : రెంజల్ మండల తహసీల్ కార్యాలయంలో నూతన తహసీల్దార్ వెంకటయ్య ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి వినతులు స్వీకరించారు. ప్రజావాణికి ...
Read More »నా కొడుకు మృతదేహాన్ని నాకు ఇప్పించండి
నిజామాబాద్, మార్చి 08 – రోదిస్తున్న తల్లిదండ్రులు నిజామాబాద్ న్యూస్ : బతుకు దెరువు కోసం యువత పరదేశం బాట పడుతున్నారు… అనేక కారణాల వల్ల అక్కడ మృత్యువాతపడుతున్నారు… అటు కన్నవారికి, ఇటు కుటుంబీకులకు చివరకు కన్నీళ్లే మిగులుతున్న దురదృష్ట సంఘటనలు నిరుద్యోగ యువకుల పాలిట శాపంగా మారుతున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలోని బాడ్సి గ్రామానికి చెందిన చిన్న గంగారాం (25) గత రెండు సంవత్సరాల క్రితం బతుకు దెరువు కోసం సౌదీవెళ్లాడు. అకస్మాత్తుగా గంగారాం 4 ఫిబ్రవరి 2015 నాడు మృతి చెందినట్టు ...
Read More »ఐదుగురు పేకాట రాయుళ్ల అరెస్టు
నిజామాబాద్, మార్చి 08 ఆర్మూర్ న్యూస్ : ఆర్మూర్ పట్టణంలోని కమలానెహ్రూ కాలనీకి చెందిన ఐదుగురు పేకాటరాయుళ్లను ఆదివారం అరెస్టు చేసినట్టు ఆర్మూర్ సిఐ రవికుమార్ తెలిపారు. వివరాల్లోకి వెళితే ఆర్మూర్ పట్టణ శివారులో దోబీఘాట్ ఖాళీస్థలంలో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు దాడిచేయగా ఐదుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్దనుంచి 3210 నగదు, 7 సెల్ఫోన్లు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన చెప్పారు.
Read More »మాటలు మానెడు… చేతలు మూరెడు
నిజామాబాద్, మార్చి 08 – తెరాస ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలి : మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ ఆర్మూర్ న్యూస్ : ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయని, కానీ పనులు గడపదాటడం లేదని మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని రోడ్లు, భవనాల అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెరాస ప్రభుత్వం తెదేపా ఎమ్మెల్యేలపై భౌతిక దాఢులకు పాల్పడుతున్నారని, తమ పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించి తెరాసలో చేర్చుకుంటున్నారని మాట వినని ...
Read More »మహిళా చట్టాలపై అవగాహన పెంచుకోవాలిo
నిజామాబాద్, మార్చి 08 నిజామాబాద్ న్యూస్ : అవినీతి రహిత సమాజం కోసం మహిళలు ఎక్కువగా కృషి చేస్తున్నారని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎ.రవిందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా మహిళ శిశుసంక్షేమశాఖ, వివిద స్వచ్చంద సంస్థలు, మహిళా సంస్థలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ర్యాలీని సంయుక్త కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఇప్పటికే ఎంతో చైతన్యవంతులై అన్ని రంగాల్లో ముందుకెళుతున్నారని ఆయన అన్నారు. ...
Read More »విద్యార్థులు న్యాక్ గుర్తింపునకు సహకరించాలి
– విసి పార్థసారధి నిజామాబాద్, మార్చి 07 నిజామాబాద్ న్యూస్ : తెలంగాణ యూనివర్సిటీకి న్యాక్ గుర్తింపు బృందం ఏప్రిల్ 12 నుంచి 15వ తేదీ వరకు రానున్న నేపథ్యంలో విద్యార్థులు కూడా సహకరించాలని తెవివి ఉపకులపతి పార్థసారధి కోరారు. విద్యార్థి సంఘాల నాయకులతో రిజిస్ట్రార్ లింబాద్రితో కలిసి ఈ మేరకు చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాక్ గుర్తింపు అనేది విద్యార్థులకు, విశ్వవిద్యాలయ ప్రతిష్టాత్మకంగా ఉండే అంశమని ఇందుకోసం అందరం కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. న్యాక్ గుర్తింపు ఉన్న యూనివర్సిటీల్లో ...
Read More »హైకోర్టు వెంటనే విభజించాలి
నిజామాబాద్, మార్చి 07 నిజామాబాద్ న్యూస్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 నెలలు కావస్తున్నా ఇప్పటివరకు ఉమ్మడిగా ఉన్న హైకోర్టును విభజించకపోవడం తెలంగాణకు ప్రత్యేక బార్‌కౌన్సిల్‌ను ఏర్పాటు చేయకపోవడం విచారకరమని కెయు బిసి విద్యార్థి సంఘాల నాయకులు హెచ్.నవీన్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన 9 నెలలు గడుస్తున్నా ఇ ంతవరకు హైకోర్టు ఏర్పాటు చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. బార్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులు గత నెల రోజుల ...
Read More »ఎముకల నిపుణులలో జిల్లావాసికి బంగారుపతకం
నిజామాబాద్, మార్చి 07 నిజామాబాద్ న్యూస్ : నగరంలోని శ్రీరక్ష ఆసుపత్రి వైద్యులు రాందాస్ ఎం.ఎస్ ఆర్థోపెడిషన్కు ప్లేస్మెంట్ ఆఫ్ ధోరాసిక్ పాలిక్లి స్క్రూస్ యూసింగ్ ఫ్రీ హ్యాండ్ టెక్నిక్ వితౌట్ ఇమేజ్ గైడెన్సు అనే కొత్త స్పైన్ ఆపరేషన్ టెక్నిక్‌లో 100 శాతం మంచి ఫలితాలు సాధించారు. ఈమేరకు ఆయన శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. తాను చేసిన కృషికి గాను బంగారు పతకం లభించిందన్నారు. నడుమునొప్పి, కాళ్ళు, కీళ్ళ నొప్పులతో బాధపడేవారికి ఉత్తమ చికిత్సలు తమ ఆసుపత్రిలో అందించడం జరుగుతుందన్నారు. తన ...
Read More »పెండింగ్ వేతనాలు చెల్లించండి
నిజామాబాద్, మార్చి 07 నిజామాబాద్ న్యూస్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ అర్బన్ హెల్త్ సెంటర్స్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిటీ గౌరవాధ్యక్షులు మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ అర్బన్ హెల్త్ సెంటర్లోని మెడికల్ ఆఫీసర్, కమ్యూనిటీ ఆర్గనైజర్, ఏఎన్ఎం, మెడికల్ అసిస్టెంట్, వాచ్మెన్, స్వీపర్లను యుపిహెచ్‌సిలలో యథావిధిగా కొనసాగించాలని కోరారు. యుపిహెచ్సిలను రాష్ట్ర ...
Read More »