Breaking News

Nizamabad

టిడీపీ కార్యకర్తల రాస్తారోకో

నిజామాబాద్‌, నవంబరు 14, నగరంలోని బస్టాండ్‌ ఎదుట టిడీపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణా రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్యేలు రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలకు దిగడంతో వారిని వారం రోజుల పాటు సస్పెండ్‌ చేసిన విషయం విదితమే. ప్రజాస్వామ్యంలో అందరికి నిరసన తెలిపే హక్కు ఉందని, దానికి విరుద్ధంగా అప్రజాస్వామ్యంగా టిడీపీ ఎమ్మెల్యేలను శాసన సభనుండి సస్పెండ్‌ చేశారని, దానికి నిరసనగా టిడీపీ నాయకులు, కార్యకర్తలు బస్టాండ్‌ ఎదుట రాస్తారోకో చేశారు. ఈకార్యక్రమంలో ...

Read More »

ర్యాలీని ప్రారంభించిన ఎస్‌.పి.

నిజామాబాద్‌, నవంబరు 14, బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక కలెక్టర్‌ గ్రౌండ్‌ ఆవరణలో ఐ.సీ.డీ.ఎస్‌ మరియు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ఎస్‌.పి. జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జవహర్‌ లాల్‌ నెహ్రూ 125 వ జన్మదినం సందర్భంగా ఈ రోజు జరుపుకుంటున్న బాలల దినోత్సవంలో పిల్లలు పెద్దలు అందరూ పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సమాజంలో ఉన్న బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలని మరియు బాల్య వివాహాలను అరికట్టాలని ఆయన సూచించారు. తదనంతరం పిల్లలు ...

Read More »

అన్ని రోగాలకు కూడలి డయాబేటిస్‌….. జేసి శేషాద్రి

నిజామామాబాద్‌, నవంబరు 14, మనిషికి వచ్చే అన్ని రోగాలకు కూడలి డయాబెటిస్‌ అని, దీని పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ శేషాద్రి అన్నారు. శుక్రవారం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఎస్‌బిహెచ్‌, ఐఎంఎ ఆధ్వర్యంలో సంయుక్తంగా ప్రపంచ మధుమోహ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిఆగా హాజరైన జేసి శేషాద్రి కార్యక్రమ జ్యోతిని వెలిగించి, ప్రసంగించారు. ప్రపంచంలో ఈ వ్యాధి దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థలు ఏన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయని అన్నారు. వీటిని ప్రతి ఒక్కరు సద్వినియోగించుకోవాలని సూచించారు. ...

Read More »

18 నుంచి జిల్లాలో ఎంపి కవిత పర్యటన

నిజామాబాద్‌, నవంబరు 14, నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఈనె 18 నుంచి మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఇటీవల లండన్‌లో పర్యటించి గురువారం రాష్ట్రనికి చెరుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మేరకు ఆమె జిల్లలో మూడు రోజుల పాటు పర్యటించేందుకు సన్నహాలె చేసుకున్నారు. మూడు రోజుల పాటు జిల్లాలోని వివిధ నియోజకవర్గాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆసరా పెన్కషన్‌ పథకం స్థానికుల అభిప్రాయలను తెలుసుకుంటారు. బోధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌, ఆర్మూర్‌, బాల్కోండ, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాలలో ...

Read More »

రైల్వే స్టేషన్లో ప్రైవేట్‌ బహుళ సముదాయాలు….నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఎంపిక

కసరత్తు ప్రారంభించిన ఆర్‌ఎల్‌డిఎ నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 14, నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌కు మహార్థశ రానుందా…. మోడల్‌ రేల్వే స్టేషన్లగా మారుస్తామన్న యుపిఏ ప్రభుత్వం ఇంటి ముఖం పట్టింది. మోడల్‌ సంగతి ఏలా ఉన్న స్టేషన్‌ మాత్రం ఎప్పటిలాగే అవస్థలతో డల్‌గా ఉంది. ఇప్పుడు ఎన్‌డిఎ ప్రభుత్వంలో రైల్వే శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే స్థలాల్లో బహుళ సముదాయాలను నిర్మించేందుకు పైవ్రేట్‌ భాగస్వామ్యన్ని కోరుతంది. ఇందుకు మోడల్‌గా నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌ను ఎంపిక చేసింది. నిజామాబాద్‌ నగరానికి నడి బోడ్డున ఉన్న రైల్వే ...

Read More »

ప్రభుత్వానికి జ్ఞానోదయం కలగాలి -టిఎన్‌ఎస్‌ఎఫ్‌ యజ్ఞం

డిచ్‌పల్లి, నవంబర్‌ 12 : తెలంగాణ యూనివర్సిటీకి తెలంగాణ ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు కేటాయించాలని, నిధుల మంజూరిలో ప్రభుత్వానికి జ్ఞానోదయం కలగాలని కోరుతూ టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో బుధవారం యజ్ఞం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో విశ్వవిద్యాలయానికి ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించకపోవడం విడ్డూరమన్నారు. వర్సిటీ అభివృద్ధి కోసం స్థానిక శాసనసభ్యుడు, జిల్లా మంత్రి, పార్మలెంటు సభ్యురాలు ప్రత్యేకంగా చొరవ చూపి తక్షణమే 200 కోట్ల రూపాయలు కేటాయించాలని టిఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పుప్పాల రవి డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ...

Read More »

15న కార్మిక సంఘం జిల్లా సదస్సు

డిచ్‌పల్లి, నవంబర్‌ 12 : మోడీ ప్రభుత్వం చేస్తున్న కార్మిక చట్టాల సవరణలపై ఈనెల 15న జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్‌ భవన్‌లో సదస్సు నిర్వహించనున్నట్లు సిఐటియు డివిజన్‌ అధ్యక్షుడు సయ్యద్‌ తెలిపారు. బుధవారం ఆయన డిచ్‌పల్లిలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కార్మిక సంఘాలన్ని ఐక్యంగా వుండి కార్మిక వ్యతిరేక చట్టాలను ప్రతిఘటించాలని, ఈ సదస్సును విజయవంతం చేయాలని కార్మికులను కోరారు.

Read More »

ఎంఆర్‌పిఎస్‌ సదస్సుకు తరలిరావాలి

డిచ్‌పల్లి, 12 : ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేసర్తున్న ఎంఆర్‌పిఎస్‌ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద క్రిష్ణమాదిగ ఈనెల 16న నిజామాబాద్‌ రానున్నారని ఆ సంస్థ డిచ్‌పల్లి మండల అధ్యక్షుడు గురిజాల అనిల్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఎంఆర్‌పిఎస్‌ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనిల్‌కుమార్‌ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా ఆమోదం తెలపాలని డిమాండ్‌ చేశారు. కాగా నిజామాబాద్‌లో నిర్వహించే సదస్సుకు ఎంఆర్‌పిఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ...

Read More »

ఆశా వర్కర్ల ధర్నా, ముఖం చాటెసిన డియంహెచ్‌ఒ.

నిజామాబాద్‌, నవరబర్‌ 11; తమ సమస్యలను వెంటనె పరిష్కరించాలని జిల్లాలొని ఆశా వర్కర్లందరు మంగళవారం ఉదయం సిఐటియు ఆధ్వర్యంలొ డియంహెచ్‌ఒ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సిఐటియు నాయకుడు సిద్దిరాములు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఆశా వర్కర్లని వెంటనే రెగ్యులరైజ్‌ చేయాలని, గత 27 నెలలుగా ఇవ్వని జీతాలను వెంటనే చెల్లించాలని, టిఎ, డిఎ లను కూడా వెంటనె చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసారు. మరియు రాష్ట్ర బడ్జెట్‌లొ కూడా వీరికి సముచితస్తానం కల్పించి ప్రత్యేక నిధులను కేటాయించాలని వారు ...

Read More »

కలకలం రెపిన నకిలీ కరెన్సి

నిజామాబాద్‌, నవరబర్‌ 11; నగరంలోని నాగారం కెనాల్‌లొ నకిలీ కరెన్సి కలకలం రేపింది. వివరాలలోకి వెలితె నగర శివారులోని నాగారం దగ్గర గల నిజాంసాగర్‌ కెనాల్‌లొ ఈరోజు ఉదయం 11 గంటల సమయంలొ ఎవరొ గుర్తు తెలియని వ్యక్తి నకిలీ కరెన్సి నోట్లని ఒక సంచిలొ తీసుకువచ్చి కెనాల్‌ నీటిలొ పారవెసి పారిపోయాడు. అది చూసిన స్తానికులు అవి నిజమైన నోట్లని భావించి వాటికొసం ఎగబడ్డారు. దీనితొ అక్కడ ట్రాఫిక్‌ జామ్‌ ఆయి బ్రిడ్జిపైన రాకపోకలకు అంతరాయం ఎర్పడింది. వెంటనె 5 టౌన్‌ పొలీసులు ...

Read More »

సర్వేల్లో ప్రథమ స్థానంలో నిజామాబాద్‌….. కలెక్టర్‌కు అభినందనలు

కలెక్టర్‌కు అభినందనలు నిజామాబాద్‌, నవంబరు 11, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సర్వేలు నిర్వహించడంలో నిజామాబాద్‌ జిల్లాకు మొదటి స్థానం దక్కింది. సామాజిక సర్వే నుంచి మొదలుకొని ఆసరా పించన్ల పంపిణి వరకు అన్ని సర్వేలను కలెక్టర్‌ రోనాల్డ్‌ రాసు ఆధ్వర్యంలో సకాలంలో పూర్తి చేసి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలబెట్టారు. ఈ మేరకు జిల్లా ప్రత్యేక అధికారి అయిన ప్రభుత్వ సలదారు స్మితసబర్వాల్‌ కలెక్టర్‌ రోనాల్డ్‌రాసును అభింనందిచారు.సామాజిక సమగ్ర సర్వే, ఇంటింటి సర్వే, ఆధార్‌ సిండింగ్‌ సర్వేల్లో జిల్లాలోని ప్రతి అధికారి కీలక ...

Read More »

సతీష్‌పవార్‌కు శాసన సభ నివాళి

నిజామాబాద్‌, నవంబరు 10, నిజామాబాద్‌ నగరానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సతీష్‌పవార్‌కు తెలంగాణ శాసన సభ సోమవారం నివాళులు అర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఇటీవల సతిష్‌పవార్‌ ఆనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. 1994లో నిజామాబాద్‌ శాసన సభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడిపిలో అప్పుడు కీలక పాత్ర పోషించారు. అనంతరం 2009లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మార్చి 24న టీడిపి నేత చెరుకు సుధాకర్‌తో కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ...

Read More »

మళ్లీ ఆవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు …. ఎన్నికల హమికి తూట్లు

నియమాకాలకు రంగం సిద్దం ఎన్నికల హమికి తూట్లు నిజామాబాద్ నవంబరు 9, ఎన్నికల్లో  నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామికి తూట్లు పొడుస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తే ఆవుట్‌ సోర్సింగ్‌ నియమాకాలు ఉండవని, ప్రభుత్వమే అన్ని రకాల నియమాకాలను చేపడుతుందని హామి ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాడిన ఆరు మాసాలు కావస్తున్న ఉద్యోగాల సంగతి ఏలా ఉన్న జిల్లాల వారిగా మళ్లీ ఆవుట్‌ పోర్పింగ్‌ నియమాకాలకు పచ్చ జండా ఊపారు. ఏకంగా ఒక నిజామాబాద్‌ జిల్లాలోనే 850కి పైగా పోస్టులు ఆవుట్‌ సోర్సింగ్‌ ...

Read More »

అర్హులందరికి పెన్షన్లు… కలెక్టర్‌

నిజామామాద్‌, నవంబరు 8, అర్హులైన పేదలందరికి పెన్షన్లను అందిస్తామని, అర్హత కలిగిన వారికి పెన్షన్లు మంజూరి కాకపోతే ధరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ రోనాల్డ్‌ రాసు సూచించారు. శనివారం కలెక్టర్‌కు పెన్షన్లపై ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో పత్రిక ప్రకటనను విడుదల చేసారు. సంబంధిత వ్యక్తులు తమ తమ తహాశీల్ధార్‌ కార్యాలయాల్లో ధరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. నిజామాబాద్‌ నగరంలో యుద్ద ప్రతిపాదికన సర్వే పూర్తి చేసి ఈనెల 15 నుంచి పెన్షన్లను పంపణి చేసేందుకు చర్యలు తీసుకోవాలని మున్పిపల్‌ కమిషనర్‌కు సూచించారు.

Read More »

ఏడాదిన్నరలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు పూర్తి నగర ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త

నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 8, నిజామాబాద్‌ నగరంలోని అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ(యు.జి.డి) పనులను ఏడాదిన్నరలోపు పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని, ఇందుకు సీఎం కెసిఆర్‌ పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త అన్నారు. శనివారం ఆర్‌డివో కార్యాలయంలో యుజిడిలో ఇళ్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెక్కులను ముఖ్య అతిథిగా హాజరై అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 15 మందికి రూ.7.20 కోట్లు పరిహారం అందించడం జరిగిందన్నారు. మిగిలిన వారికి రూ.29.34 కోట్లను ...

Read More »

పత్రికలు నామాటను వక్రీకరిచాయి మంత్రి పోచారం

మాట తప్పిన మంత్రి నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 8, తన వ్యాఖ్యలను పత్రికలు వక్రీకరిచాయని, నేను ఎప్పుడు రైతులకు వ్యతిరేకంగా మాట్లాడలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం ఆసరా పెన్షన్ల పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై నేనేప్పుడు తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని, కొందరు నా వ్యాఖ్యలను తప్పుడుగా ప్రచారం చేసారన్నారు. తప్పుడు చేసినోడి కాదు తప్పు.. అది చూసినోడిదే తప్పు అన్నట్లుగా పోచారం చేసిన వ్యాఖ్యలు మిడియా వక్రికరించిందని తప్పించుకున్నారు. ఇదేలా ...

Read More »

బిసిలను నిర్లక్ష్యం చేస్తే తడఖా చూపుతాం బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల

నిజామాబాద్‌, నవంబరు 8, బిసిలు అంటే ఆశించే వాళ్లం కాదని, శాసించే వాళ్లమని ప్రభుత్వం పెద్దలు గుర్తు ఉంచుకొవాలని, బిసిలను తెలింగాణ ప్రభుత్వం బడెజట్‌లో నిర్లక్ష్యం చేసిందని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శనివారం అంబేద్కర్‌ భవన్‌లో సంఘంలో పదవులు పొందిన బిసి నేతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ బిసిల కోసం నిజామాబాద్‌ జిల్లా నుంచి విద్యార్థి నాయకుడుగా శ్రీనివాస్‌గౌడ్‌, ఉద్యోగ సంఘం నాయకుడు రేవంత్‌లు రాష్ట్ర ...

Read More »

అర్హులకు మాత్రమే పెన్షన్లు మంత్రి పోచారం

నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 8, ప్రభుత్వం అర్హులైన వారికి ఆసరా పెన్షన్లను అందిస్తుందని, వికలాంగులకు రూ.1500ల చోప్పున, వృద్దులకు, వింతతువులకు, చేనేత, గీత కార్మికులకు రూ.1000ల చోప్పున అందిస్తున్నమని రాస్త్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం కలెక్టర్‌ గ్రౌడ్‌లో ఆసరా పెన్షన్‌ పథకాన్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 3.29 లక్షలు, నగరంలో 49 వేల ధరఖాస్తులు స్వీకరించగా గ్రామాల్లో 1.73 లక్షలు, నగరంలో 30 వేల మందికి పెన్షన్లు ...

Read More »

టీయూ వీసీగా కె.వీరారెడ్డి

నిజామాబాద్‌, నవంబరు 8, తెలంగాణ యూనివర్శిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌గా కె.వీరారెడ్డి ఉన్నత విద్య మండలి నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉన్నత విద్య మండలి కార్యదర్శి వికాస్‌రాజ్‌ ఆదేశాలు జారీ చేసారు. ప్రస్తుతం ఈయన కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్శిటీ వైస్‌ చాన్స్‌లర్‌గా కొనసాగుతున్నారు. ఈ యేడు జూన్‌ 14న ఇక్కడ వీసీగా పని చేసిన అక్భర్‌ అలీఖాన్‌ పదవి విరమణ పొందారు. దీంతో ఇంటర్‌మిడియేట్‌ విద్య మండలి కమిషనర్‌ శైలాజరామయ్యార్‌ను ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించారు. అయితే ఆమే పదవి బాధ్యతలు చేపట్టిన నాటి ...

Read More »

కెబుల్‌ ఆఫరేటర్లసంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కుల్‌దీప్‌

నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 8, తెలంగాణ రాష్ట్ర కేబుల్‌ ఆఫరేటర్ల సంఘం రాస్త్ర అధ్యక్షుడిగా నిజామాబాద్‌కు చెందిన కుల్‌దీప్‌ సహానీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో రాస్త్ర కార్యవర్గం సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాస్త్రంలో 48 వేల మంది కేబుల్‌ ఆఫరేటర్లు ఉన్నారని, ప్రతి ఒక్కరు తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారన్నారు. ప్రభుత్వం కేబుల్‌ ఆపరేటర్ల నుంచి వసూలు చేస్తున్న పోల్‌ పన్నును వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నట్లు చెస్పారు. రాష్ట్రంలోని కేబుల్‌ ఆపరేటర్ల సమస్యలను పరిష్కారించేందుకు ముందుడి పోరాడుతానని అన్నారు. ...

Read More »