Breaking News

nizamsagar

కాలువలో రాత్రిపూట దళారుల చేపలవేట

  నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని జలవిద్యుత్‌ కేంద్రానికి అనుసంధానంగా ఉన్న ప్రధాన కాలువ రాత్రిపూట మధ్య దళారులు ఇష్టారాజ్యంగా చేపల వేట కొనసాగిస్తున్నారు. జలవిద్యుత్‌ కేంద్రంలో రెండు టర్బయిన్‌ల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని, పాత కాలువకు నీరు నిలిపివేయడంతో దళారులు రాత్రిపూట చేపల వేట కొనసాగిస్తున్నారు. ట్రాక్టర్‌, టాటా మేజిక్‌ తదితర వాహనాల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మత్స్య కార్మికుల కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి వారిని ఆదుకునేందుకు …

Read More »

వంతెన కూలి ఒకరి మృతి

  నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో ప్రమాదకరంగా ఉన్న వంతెన అకస్మాత్తుగా కూలడంతో ఒకరు మృతి చెందారు. మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో పిల్ల కాలువ కోసం చిన్నపాటి వంతెనను నీటిపారుదల శాఖ అదికారులు నిర్మించి సుమారు 50 సంవత్సరాలు గడుస్తుంది. అప్పటినుంచి పట్టించుకోకపోవడంతో, కనీస మరమ్మతులు కూడా చేయకపోవడంతో అకస్మాత్తుగా వంతెన కూలడంతో చాకలి పెద్ద సాయిలు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు. …

Read More »

ఇష్టారాజ్యంగా చేపల వేట

  నిజాంసాగర్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నిజాంసాగర్‌కు అనుసంధానంగా జలవిద్యుత్‌ కేంద్రం నిజాంసాగర్‌ ప్రాజెక్టు డ్యాంలో ఇష్టారాజ్యంగా మత్స్యకార్మికులు చేపల వేట కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మత్స్య కార్మికుల కోసం సబ్సిడీ కింద చేపలను విడుదల చేయడం జరిగింది. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం జూలై, ఆగష్టు మాసాల్లో చేప పిల్లలను విక్రయించవద్దని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కానీ ప్రభుత్వ ఆదేశాలకు విరుద్దంగా మత్స్యకార్మికులు చేప పిల్లలను విక్రయిస్తున్నారు. హసన్‌పల్లి, కళ్యాణి, నిజాంసాగర్‌, తదితర గ్రామాల్లో మత్స్యకార్మికులు …

Read More »

ఘనంగా స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు

  నిజాంసాగర్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్‌ నాగరాజు, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఎఇవో రవిందర్‌, ఎంపిడివో కార్యాలయంలో ఎంపిపి సునంద గంగారెడ్డి, వెటర్నరి కార్యాలయంలో యూనుస్‌, పోలీసు స్టేషన్‌ ఆవరణలో ఎస్‌ఐ అంతిరెడ్డి, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాద్యాయులు వెంకటేశ్వర్లు, ఎంఇవో కార్యాలయంలో ఎంఇవో బలిరాంరాథోడ్‌ జెండా ఎగురవేసి వందనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు …

Read More »

డెంగ్యూ వ్యాధితో మృతి చెందలేదు

  నిజాంసాగర్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మహ్మద్‌నగర్‌ గ్రామానికి చెందిన మహ్మద్‌ సలీం అనే వ్యక్తి డెంగ్యూ వ్యాధితోమృతిచెందలేదని మండల వైద్యాధికారి నాగయ్య అన్నారు. మహ్మద్‌నగర్‌ గ్రామంలో సలీం ఇంటికి వెళ్లి వైద్యులు వైద్యుల రిపోర్టును పరిశీలించారు. రిపోర్టు ఆధారంగా సలీంకు డెంగ్యువ్యాధి సోకలేదన్నారు. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఆసుపత్రిలో డెంగ్యూ పరీక్షలు నిర్వహించారని వైద్యులు తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. సలీంకు సరిగా రక్తప్రసరణ కాకపోవడంతో మృతి చెందాడన్నారు. Email this page

Read More »

సాగర్‌పైనే రైతుల ఆశలు

  వర్షాల కోసం నింగికి ఎదురుచూపులు నిజాంసాగర్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో కురిసిన వర్షాలకు రబీ సాగు గట్టెక్కించిన రైతులకు ఈసారి ఖరీఫ్‌ మళ్లీ కంటనీరు పెట్టిస్తుంది. వర్షాకాలంలో మురిపించిన వర్షాలు ఇపుడు ముఖం చాటేస్తున్నాయి. అప్పులు చేసి వరినాట్లు వేసుకున్న రైతులు నింగికేసి ఆశతో చూస్తూ నిరాశకు గురికాక తప్పడం లేదు. అప్పుడప్పుడు ఆకాశంలో నల్లని కారుమబ్బులు కమ్ముకొని ఇక భారీవర్షం వస్తుందనుకుంటున్న తరుణంలో మబ్బులు ముఖం చాటేయడంతో రైతులు దిక్కుతోచని …

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం

  నిజాంసాగర్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండల కేంద్రంలో మంగళవారం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో లయన్స్‌ క్లబ్‌ పిట్లం శాఖవారు కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో కంటి వైద్య నిపుణులు మల్లేశం 40 మంది వృద్దులకు కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 14 మందికి దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించి ప్రత్యేక వాహనంలో బోధన్‌ కంటి వైద్యశాలకు తరలించారు. కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్షుడు సంతోష్‌, జోన్‌ ఛైర్మన్‌ వేణుగోపాల్‌, గంగాప్రవీణ్‌, శ్రీధర్‌, తదితరులున్నారు. Email this page

Read More »

నీటి పన్ను వసూలు ముమ్మరం

  నిజాంసాగర్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో పంచాయతీ కార్యదర్శులు నీటి పన్నులను ముమ్మరంగా వసూలు చేస్తున్నారని తహసీల్దార్‌ నాగరాజుగౌడ్‌ తెలిపారు. శుక్రవారం కార్యదర్శి పండరి నీటి పన్ను వసూలు చేస్తుండగా తహసీల్దార్‌ గ్రామాన్ని సందర్శించారు. ముందుగా రికార్డులను పరిశీలించి, మండలంలో ప్రస్తుతం ప్రతి గ్రామంలో నీటి పన్ను వసూలు ముమ్మరం చేస్తున్నారని, మరో 40 శాతం వసూలు చేయాల్సి ఉందన్నారు. ఆయన వెంట ఆర్‌ఐ సయ్యద్‌ హుస్సేన్‌ ఉన్నారు. Email this page

Read More »

హసన్‌పల్లిలో సంచరిస్తున్న చిరుతపులి

  నిజాంసాగర్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని హసన్‌పల్లి గ్రామ శివారులో గల హెర్సులూస్‌ జలవిద్యుత్‌ కేంద్రం పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచరించడంతో పశువుల కాపరులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు మేకలు, గొర్రెల కాపరులు పశువులను అటవీప్రాంత పరిసరాల్లో మేసేందుకు తీసుకెళుతుంటారు. దీంతో చిరుతపులి పశువులపై దాడిచేసి గాయపరుస్తుందని పశువుల కాపరులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే హసన్‌పల్లి గ్రామానికి చెందిన పలువురు మేకల మందలపై దాడిచేసి గాయపరిచిన సంఘటనలు ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ …

Read More »

ఆరేపల్లి సర్పంచ్‌కు ప్రశంసాపత్రం

  నిజాంసాగర్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఎంపిడివో కార్యాలయంలో ఆరేపల్లి గ్రామ సర్పంచ్‌ స్వప్న రవిందర్‌గౌడ్‌కు ఎంపిపి సునంద గంగారెడ్డి, ఎంపిడివో రాములు నాయక్‌ ప్రశంసా పత్రం అందజేశారు. ఆరేపల్లి గ్రామపంచాయతీలో 40 వేల మొక్కలు హరితహారం పథకం కింద నాటడంతో కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పంపించిన ప్రశంసా పత్రాన్ని సర్పంచ్‌కు అందజేశారు. గ్రామంలో నిర్దిష్ట గడువులో మొక్కలు నాటేందుకు అధికారులకు సహకరించినందుకు ఎంపిడివో, సర్పంచ్‌లకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధి హామీ ఎపివో సుదర్శన్‌, …

Read More »