Breaking News

NRI

‘సౌదీ చెర నుంచి మమ్మల్ని విడిపించండి’

సౌదీ: ‘పొట్టకూటి కోసం, అప్పులు తీర్చడం కోసం తండ్రీకొడుకులం సౌదీకి వలస వచ్చాం. నిబంధనల ప్రకారం బాండ్ రాశాం. తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్నాం. జీతాలకు సంబంధించిన బాకీలు ఇంకా ఇవ్వడం లేదు. తిండి లేక చస్తున్నాం. దయచేసి మమ్మల్ని కాపాడండి’.. అంటూ ఓ భారతీయుడు ట్విటర్ వేదికగా భారత ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. 45 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న ఓ సిక్కు.. సౌదీ అరేబియాలో తమ పరిస్థితి గురించి భారత విదేశాంగ శాఖకు ట్విటర్లో వీడియో పంపాడు. పేరు, కంపెనీ వివరాలను వెల్లడించిన ఆ …

Read More »

అమెరికా వీసా బాంబు?

ఉద్యోగులు, విద్యార్థులే ట్రంప్‌ టార్గెట్‌ – ‘చట్టబద్ధ వీసా’ల పైనా – అమెరికా అధ్యక్షుడి గురి – వీసా నిబంధనల సమీక్ష, – అమలు తీరుపై తనిఖీలు – కొత్త నిబంధనలతో – ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ సిద్ధం ఉన్నత చదువులు, మంచి ఉద్యోగం, మంచి జీవితం.. కారణమేదైనా తొలి చూపు అమెరికావైపే.. ఎన్నో ఆశలతో అమెరికా వైపు చూసే వారందరి కలలపై ఆ దేశ కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బాంబు వేయనున్నారు. రాబోయే వారిపైనే కాదు.. ఇప్పటికే చట్టబద్ధంగా హెచ్‌1బీ, ఎల్‌1, ఎఫ్‌1 …

Read More »

ట్రంప్‌పై తిరుగుబాటు.. ప్రత్యేక దేశంగా కాలిఫోర్నియా..!

కాలిఫోర్నియా:మొదటి నుంచి ట్రంప్‌ విధానాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిర్వహిస్తున్న కాలిఫోర్నియా.. అమెరికా నుంచి విడిపోయి ప్రత్యేక దేశంగా అవతరించే దిశగా కీలక అడుగులు వేస్తోంది. వలసదారులు ఎక్కువగా ఉండే కాలిఫోర్నియాలో.. ట్రంప్ విధానాలు నచ్చని వారంతా ఏకమవుతున్నారు. అమెరికా నుంచి విడిపోయేందుకు కాలిఫోర్నియా వాసులు ప్రచారం మొదలెట్టారు. ఈయూ నుంచి బ్రిటన్.. ‘బ్రెగ్జిట్’ పేరుతో విడిపోయిన విధంగా.. అమెరికా నుంచి విడిపోయేందుకు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన దేశంగా అవతరించేందుకు ‘కలెగ్జిట్’ పేరుతో సంతకాల సేకరణ మొదలుపెట్టారు. గురువారం నుంచే ఈ పిటిషన్‌పై సంతకాల సేకరణ …

Read More »

ఏసుక్రిస్తుతో ట్రంప్‌ను పోల్చారు

వాషింగ్టన్: అభిమానం హద్దుమీరితే ఎలా ఉంటుందో అమెరికాలో ఆదివారం స్పష్టంగా తెలిసివచ్చింది. ఒక్క వాఖ్యం.. అమెరికాలో హాట్‌టాపిక్‌గా మారింది. క్రిస్టమస్ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ నేత, రిపబ్లికన్ నేషనల్ కమిటీ చైర్మన్, ట్రంప్ చీఫ్ అయిన ప్రీబస్.. ఇచ్చిన ప్రసంగం వివాదాస్పదంగా మారింది. అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన డోనాల్డ్ ట్రంప్‌ను, ఏసుక్రీస్తును పోల్చుతూ ఆయన చేసిన ప్రసంగంపై సొంతపార్టీ నేతలే మండిపడుతున్నారు. ‘‘రెండు వేల ఏళ్ల క్రితం.. ప్రపంచాన్ని కాపాడటానికి ఒక రక్షకుడు భూమిపై పుట్టాడు. భయాందోలనల్లో, కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ ఒక …

Read More »

మెగా ఫ్యామిలీపై రీమేక్స్ కామెంట్స్‌.. చరణ్ స్ట్రాంగ్ కౌంటర్

మెగా ఫ్యామిలీ రీమేక్స్‌పై సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్‌కు రామ్ చరణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. రీమేక్స్ అయినా అవి కూడా సినిమాలేనని గుర్తుంచుకోవాలన్నాడు. ధృవ సినిమా కోసం అమెరికాలో పర్యటిస్తున్న చరణ్.. డల్లాస్‌లోని ఎన్నారైలతో ప్రత్యేకంగా మీట్ అయ్యాడు. మెగా అభిమానుల మధ్య ‘మెగా ఫ్యామిలీ రీమేక్స్’పై వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చేశాడు. వేరే భాషల్లో హిట్ అయిన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించడం కోసమే రీమేక్స్ చేస్తున్నామన్నాడు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు.. అని కాకుండా ముందు మనందరం భారతీయులమనీ, అదే విధంగా …

Read More »

రీకౌంటింగ్‌లో ట్రంప్‌దే గెలుపు

వాషింగ్టన్: అమెరికాలో ఇప్పుడంతా ట్రంప్ హవా నడుస్తోంది. ప్రపంచమంతా ట్రంప్ వైఖరిని సైలెంట్‌గా గమనిస్తోంది. ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాల పట్ల కాబోయే అధ్యక్షుడి వైఖరి ఏంటో ప్రజలకు స్పష్టమవుతోంది. విజయం అసాధ్యం అని ట్రంప్‌పై దుమ్మెత్తి పోసిన వాళ్లే.. ఇప్పుడు చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ట్రంప్ గెలుపును జీర్ణించుకోలేకో.. నమ్మకం లేకనో.. గ్రీన్ పార్టీ తరపున ప్రెసిడెంట్‌గా పోటీ చేసిన జెల్ల్ స్టెయిన్.. ఫలితాల రీకౌంటింగ్‌కు పిటిషన్ వేశారు. దీంతో పెనస్లేవియా, విస్కన్సిన్, మిచిగాన్ రాష్ట్రాల్లో రీకౌంటింగ్ జరిగింది. ఈ రీకౌంటింగ్‌లో అద్భుతం …

Read More »

గల్ప్‌ కుటుంబాల గోస

  నందిపేట, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కుటుంబ సభ్యులను పోషించడానికి పొట్ట చేతపట్టుకొని ఉపాధి కోసం గల్ప్‌ దేశాలైన సౌదీ, దుబాయ్‌, ఖతర్‌, కువైట్‌, ఒమన్‌, బెహ్రెయిన్‌ దేశాలకు వలసవెళ్లిన కుటుంబ సభ్యుల గోస వర్ణనాతీతంగా ఉంది. నవంబరు 8న ప్రధానమంత్రి నరేంద్రమోడి 500, 1000 నోట్ల రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయంతో వచ్చిన సమస్యలలో ముఖ్యంగా బ్యాంకుల్లో ప్రతిరోజు విత్‌డ్రా పరిమితి విధించడంతో గల్ప్‌ నుండి కుటుంబ పోషణ కొరకు పంపిస్తున్న డబ్బు ఇక్కడ తీసుకోలేకపోతున్నారు. భారతదేశం నుంచి …

Read More »

అమెరికాకు పోటెత్తిన భారత విద్యార్థులు

విదేశీ విద్యార్థుల్లో రెండో స్థానం అమెరికా చట్టసభల్లోనే కాదూ… అక్కడి విద్యాసంస్థల్లోనూ భారత ప్రాతినిధ్యం పెరుగుతోంది. ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. 2015-16 కాలానికి మొత్తం 1,65,918 మంది భారత విద్యార్థులున్నారు. క్రితం ఏడాదితో పోల్చితే ఇది 25శాతం ఎక్కువ! ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ ఎక్స్చేంజ్‌పై 2016 సంవత్సరానికి ‘ఓపెన్‌ డోర్స్‌’ నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ నివేదిక ప్రకారం… 2015-16 కాలంలో అమెరికాలో మొత్తం 10,44,000 మంది కాలేజీ, యూనివర్సిటీ స్థాయి విదేశీ విద్యార్థులు …

Read More »

అమెరికన్లు అందుకే హిల్లరీని వద్దనుకున్నారా?

న్యూయార్క్: నువ్వా నేనా అన్నట్టు సాగిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయంపై తుదికంటా ఆశలు నిలబెట్టుకున్న హిల్లరీ క్లింటన్ అనూహ్యంగా డీలాపడ్డారు. హిల్లరీ క్లింటన్ విజయం నల్లేరుమీద నడకేననీ… ప్రజలు ముఖ్యంగా మహిళలు ఆమె వైపే ఉన్నారని సర్వేలు హోరెత్తాయి. అయితే ట్రంప్ చేతిలో ఓటమి చవిచూడడం వెనుక కారణాలేమిటన్న దానిపై చర్చోపచర్చలు జరగుతున్నాయి. ఈ మెయిల్ కుంభకోణమే ప్రధాన కారణమంటూ చెబుతున్నప్పటికీ… ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా విజయావకాశాలను దెబ్బతీసినట్టు చెబుతున్నారు.  నామినేషన్‌కు ముందు పార్టీ ప్రత్యర్థి బెర్నీ శాండర్స్‌ ఆరోగ్యంపై …

Read More »

డొనాల్డ్ ట్రంప్‌పై ఆరోపణలు.. నమ్ముతున్న అమెరికా జనం.. గెలుస్తారా?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై వస్తున్న ఆరోపణలను జనం నమ్ముతున్నారని తాజా సర్వేలో తేలింది. మహిళలతో అనుచితంగా ప్రవర్తించారని వస్తున్న ఆరోపణలను ట్రంప్‌తో పాటు ఆయన ఫ్యామిలీ సభ్యులు ఖండిస్తున్న వేళ.. జనం మాత్రం ఆ ఆరోపణలను నిజమని నమ్ముతున్నారు. డొనాల్డ్ ట్రంప్‌పై వచ్చిన ఆరోపణలను అమెరికన్లు నమ్ముతున్నారని తాజా సర్వేలో వెల్లడైంది. డొనాల్డ్ ట్రంప్ పై మహిళలు చేసిన ఆరోపణలను విశ్వసిస్తున్నామని ఏపీ-జీఎఫ్‌ కే సర్వేలో 70 శాతం మందిపైగా అమెరికన్లు వెల్లడించారు. ట్రంప్ మద్దతుదారుల్లో 35 …

Read More »