Breaking News

Political

ఆ డైలాగ్‌కు రాజకీయాలకు సంబంధం లేదు: బాలకృష్ణ

విజయవాడ: నగరంలోని ట్రెండ్‌సెట్‌ థియేటర్‌లో గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని హీరో బాలకృష్ణ, నటి శ్రియ, దర్శకుడు క్రిష్‌ తిలకించారు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఊహించిన దానికంటే భారీ విజయం దక్కిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని, దేశ విదేశాల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. దేశం మీసం మెలేయాలన్న డైలాగ్‌కు… రాజకీయాలతో సంబంధం లేదని బాలయ్య స్పష్టం చేశారు. వినోద పన్ను రాయితీ ఇచ్చిన ఇరు రాష్ట్రాల సీఎంలకు కృతజ్ఞతలు తెలిపారు. బాలకృష్ణతో ఫోటో కోసం అభిమానులు ఎగబడ్డారు. ...

Read More »

చిన్నమ్మకే ఓటు

► సీఎం పగ్గాలు  చేపట్టాల్సిందే ►పెరుగుతున్న ఒత్తిడి ► తంబిదురై ప్రకటనతో ఒకే వేదికగా నేతలు ►సీనియర్ల సమాలోచన ►ఆండి పట్టినా…నన్నిలమా… ►అన్నాడీఎంకేలో చర్చ  చిన్నమ్మ శశికళ సీఎం పగ్గాలు చేపట్టాల్సిందేనన్న నినాదం అన్నాడీఎంకేలో మిన్నంటుతోంది. నేతలందరూ తమ ఓటు చిన్నమ్మకే అంటూ నినాదించే పనిలో పడ్డారు. తంబిదురై ప్రకటనతో నేతలు ఒకే వేదికగా చేరి ముక్తకంఠంతో సీఎం పగ్గాలు చేపట్టాల్సిందేనని చిన్నమ్మ మీద ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే సీనియర్లు సమాలోచనలో పడ్డారు. చినమ్మ ఆండిపట్టి నుంచి ...

Read More »

ఆ పకోడిగాడి వల్ల నష్టమేం లేదు: వంగవీటి రాధా

  విజయవాడ: సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై వంగవీటి రాధకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డబ్బు కోసమే వంగవీటి రంగా జీవితచరిత్రను కించపర్చేలా చిత్రీకరించి గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. సోమవారం రంగా వర్థంతి సందర్భంగా విజయవాడలోని వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసి రాధ నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘వంగవీటి అనేది బ్రాండ్. ఎవడో పకోడి గాడు తీసిన సినిమా వల్ల ఆ బ్రాండ్‌ వ్యాల్యూ తగ్గదు. రంగా పేరును ఒక్కొక్కరు ఒక్కోవిధంగా ఉపయోగించుకుంటున్నారు. రామ్‌గోపాల్ వర్మ కూడా డబ్బు కోసం ఈ సినిమా ...

Read More »

మాపై నిందలు వేయొద్దు: కేసీఆర్

హైదరాబాద్: కాంగ్రెస్ పదేళ్ల కాలంలోనే నయీం దందాలు జరిగాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నయీం ఎన్‌కౌంటర్‌పై చర్చ సందర్భంగా టీడీపీ హయాం నుంచే నయీం దందాలు మొదలయ్యాయని, టీడీపీ హయాంలో ఉన్న సగంమంది మంత్రులు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చేసిన విమర్శలపై కేసీఆర్ మాట్లాడుతూ నయీం నేర చర్యలకు పాల్పడుతున్న సమయంలో జీవన్‌రెడ్డి సైతం కేబినెట్ మంత్రే అని…అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఒకరిపై ఒకరు నిందలు మానుకోవాలని…అర్థవంతమైన చర్చ జరగాలన్నారు. తమపై నిందలు వేయాలని చూడొద్దని సీఎం కేసీఆర్ తెలిపారు. ...

Read More »

నోట్ల రద్దు.. ఆఖరు చర్య కాదు!

అవినీతిపై మరిన్ని కఠిన చర్యలు  నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు పనగడియా  రూ.500, 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం అవినీతిపై తీసుకుంటున్న ఆఖరు చర్య కాదని.. మరిన్ని కఠిన చర్యలుంటాయని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగడియా అన్నారు. ఈ నిర్ణయాన్ని నల్లధనంపై ముఖాముఖి దాడిగా అభివర్ణించారాయన. గురువారం భువనేశ్వర్‌లో ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన స్థానిక న్యూస్‌చానల్‌తో మాట్లాడారు. పన్ను రేట్లను తగ్గించడం.. సరళీకరించడం.. ఇలా మున్ముందు నల్లధనం పోగేసుకోకుండా నిరుత్సాహపరిచేలా పలు విధానాలు ఉంటాయని ...

Read More »

ట్వీట్‌ చేసిన పవన్ కళ్యాణ్

గోవధ, రోహిత్‌ ఆత్మహత్య, దేశభక్తి, నోట్లరద్దు, ఏపీకి ప్రత్యేకహోదాపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు. ఈ 5అంశాలపై అన్నివర్గాల విజ్ఞుల అభిప్రాయలు సేకరించానన్నారు. గోరక్షణ కోసం బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆవులను ఎందుకు దత్తత తీసుకోవడం లేదని ట్వీట్‌లో ప్రశ్నించారు. తోలుబెల్టులు, చెప్పులను బీజేపీ నేతలు, కార్యకర్తలు ధరించకుండా ఎందుకు నిషేధించలేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉన్న గోవాలో గోవు మాంసాన్ని ఎందుకు నిషేధించలేదని ట్వీట్‌లో ఆయన అడిగారు. రేపురోహిత్‌ వేముల ఆత్మహత్య అంశంపై ట్వీట్‌ చేస్తానన్నారు. Email this page

Read More »

జయలలిత మృతికి విషమే కారణమా?

సుప్రీంకోర్టులో దాఖలైన పిల్‌లో అనుమానాలు శ్వేతపత్రం విడుదల చేయాలని స్టాలిన్‌ డిమాండ్‌ చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై రాష్ట్ర భుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే నేత ఎంకే స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు. జయలలితకు అందించిన చికిత్సపై సమగ్ర నివేదికను కేంద్రప్రభుత్వం కోరాలని స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారు. అనారోగ్యం కారణంగా సెప్టెంబర్‌ 22న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత.. 75రోజులపాటు చికిత్స పొంది.. డిసెంబర్‌ 5న కన్నుమూసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టులో పిల్‌.. విషమే కారణమా! తమిళనాడు ...

Read More »

ఏటీఎం క్యూ లైన్.. వరుసలో పీఎం, మాజీ పీఎం, అద్వానీ

  నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు అన్నది అందరికి తెలిసిన సత్యమే. కానీ ఇలా లైన్లో నిల్చున్న వారిని ఎవరూ ఫొటోలు తీయరు. వారి గురించి ఎవరూ గొప్పగా చెప్పుకోరు. అదే ఎవరైనా ప్రముఖులు క్యూలో నిల్చుంటే మాత్రం ఫొటోలు తీసేసి సోషల్ సైట్లలో పోస్ట్ చేస్తారు. అలాంటి ఒక ఫొటోనే ఇప్పుడు వైరల్ మారింది. అదేంటంటే ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఎల్‌కే అద్వానీ ఒకరి వెంట ఒకరు వరుసగా నిలబడిన ఫొటో. ఈ ఫొటో ఎక్కడ ...

Read More »

ప్రధానిని క్షమించలేం: ఆంటోనీ

 పెద్ద కరెన్సీ నోట్ల రద్దు నేపథ్యంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ నేతలు మరోసారి విరుచుకుపడ్డారు. ‘ఈ నిర్ణయం వల్ల జాతీయ విపత్తు దిశగా దేశం పయనిస్తుంది. నల్లధనం ఉన్న వారు దాన్ని తెల్లధనంగా మార్చుకునే అవకాశాన్ని మోదీ ఇచ్చారు. మోదీని క్షమించలేం’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఏకే ఆంటోనీ విమర్శించారు. పెద్ద నోట్లు రద్దు చేశాక సహకార బ్యాంకుల పట్ల ప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద కేరళ కాంగ్రెస్‌ చేపట్టిన నిరసనను ఉద్దేశించి ఆంటోనీ బుధవారం మాట్లాడారు. కేరళలో ...

Read More »

జయలలిత మరణంపై శశికళ పుష్ప సంచలన వ్యాఖ్యలు…

దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితమే ఓ రహస్యం. ఇప్పుడు ఆమె మరణం కూడా పెద్ద రహస్యంగానే మారింది. ఇప్పటికే జయలలిత మృతిపై పలువురు పలు అనుమానాలు  వ్యక్తం చేశారు. సినీ నటి గౌతమి అయితే ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ కూడా రాసింది. ఇంకా మరో లాయర్ జయలలిత మృతికి శశికళే అని.. దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని అన్నారు. ఇంకా జయ మేనకోడలు దీప కూడా శశికళ పైనే ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆ జాబితాలో ఎంపీ శశికళ పుష్ప కూడా చేరిపోయారు. ...

Read More »