Breaking News

Political

90 టీడీపీ…బీజేపీ 60?

90 టీడీపీ…బీజేపీ 60? హైదరాబాద్: బీజేపీ- టీడీపీ కూటమిలో గ్రేటర్ ఎన్నికల పొత్తు ఖరారైంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ, బీజేపీ మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. మొత్తం 150 డివిజన్లకు గాను 60 సీట్లు బీజేపీ, 90 చోట్ల టీడీపీ పోటీ చేయటానికి అంగీకారానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ మేరకు రెండు పార్టీల నేతలు సంతకాలు చేసినట్లు తెలుస్తోంది.నామినేషన్లు వేయటానికి ఆదివారం తుది గడువు కావటంతో ఈ రోజు రాత్రికే అభ్యర్థుల జాబితా పూర్తిస్థాయిలో వెలువడే అవకాశం ఉంది. పొత్తుపై ఇరు పార్టీలు ...

Read More »

ఒక్క మహిళ బిందెతో బయట కనిపించినా ఎమ్మెల్యే రాజీనామా

గోదావరి నీటితో మీ పాదాలను అభిషేకిస్తా రూ.62 వేల కోట్ల ప్రణాళిక పద్దుతో రాష్ట్ర బడ్జెట్‌ దుబ్బాక పర్యటనలో కేసీఆర్‌ ఆంధ్రప్రభ దినపత్రిక తెలంగాణ ఎడిషన్‌  రాష్ట్రం ఏర్పాటైతే నిధులకు కొరత ఉండబోదని తాను ఆనాడే చెప్పానని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు తెలిపారు. సమైక్య రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్‌లో కేవలం రూ.48 కోట్లే ప్లానింగ్‌ ఫండ్‌గా పెట్టారని కేసీఆర్‌ గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో ఇప్పుడు రాబోయే బడ్జెట్‌లో రూ. 62 వేల కోట్లు ప్రణాళిక పద్దు ...

Read More »

ప్రజా సమస్యలపై ఇంటింటికి సిపిఎం

  కామారెడ్డి, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రజా సమస్యలపై ఇంటింటికి వెళ్లనున్నట్టు సిపిఎం గౌరవ సలహాదారుడు తిరుపతి తెలిపారు. బుధవారం పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను ప్రతి పేద కార్మికునికి వర్తించేలా చూడాలన్నారు. కళ్యాణలక్ష్మి, బంగారుతల్లి పథకాలను అందరికి వర్తింపచేయాలని డిమాండ్‌ చేశారు. ఇంటింటికి వెళ్ళి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు ...

Read More »

నాలుగు టీఆర్ఎస్ – రెండు కాంగ్రెస్

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. మొత్తం 12 స్థానాలకు 10 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. ఇప్పటికే 6 స్థానాలు ఏకగ్రీవం కాగా.. ఈ నెల 27న జరిగిన పోలింగ్  రిజల్ట్స్ రిలీజయ్యాయి. ఫలితాల్లో ఖమ్మం, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో తెరాస అభ్యర్థులు విజయం సాధించారు. నల్లగొండ, మహబూబ్ నగర్ లో ఓ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది.   ఖమ్మంలో.. TRS WINNER BALASANI ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది. 38 ఓట్లతో టీఆర్ఎస్ ...

Read More »

ఎమ్మెల్యేకు సన్మానం

  ఆర్మూర్‌, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి నూతన కో ఆప్షన్‌గా ఎన్నికైన 6వ వార్డు తెరాస అభ్యర్థి భర్త మహ్మద్‌ అజిమ్‌ ఎమ్మెల్యేను కలిసి శాలువాతో సన్మానించారు. తనను కో ఆప్షన్‌ గా ఎన్నికయ్యేందుకు కృసి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్‌ వ్యవహారాల ఇన్‌చార్జి యామాద్రి భాస్కర్‌, తదితరులున్నారు.

Read More »

ధూం…. ధాం….

  ఆర్మూర్‌, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం ఆర్మూర్‌ మునిసిపాలిటీకి చెందిన కో ఆప్షన్‌ ఎన్నికల్లో తెరాసకు చెందిన ముగ్గురు అభ్యర్తులు ఘన విజయం సాధించారు. దీంతో గెలుపొందిన అభ్యర్థులు తెరాస కార్యకర్తలతో కలిసి మునిసిపల్‌ కార్యాలయం నుంచి డిజె శబ్దాలతో ఆటలు ఆడుతూ కేరింతలు కొడుతూ టపాకాయలు కాలుస్తూ సంబరాలు జరిపారు. అనంతరం ఎన్నికైన అభ్యర్థులు మాట్లాడుతూ సిఎం కెసిఆర్‌, ఎంపి కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. సామాన్య కార్యకర్తలను గుర్తించి వారిని ఎమ్మెల్యే ప్రోత్సహించి ...

Read More »

రాజీనామాలు ఉపసంహరించుకుంటున్నాం

  కామారెడ్డి, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఐ పార్టీకి రాజీనామాలు చేసిన ప్రకటనను ఉపసంహరించుకుంటున్నామని సిపిఐ డివిజన్‌ కార్యదర్శి బాల్‌రాజు తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. క్షణికావేశంలో పార్టీకి రాజీనామా చేశామని, ఆత్మ విమర్శ చేసుకొని రాజీనామాలు ఉపసంహరించుకుంటున్నామని తెలిపారు. తిరిగి పార్టీ ప్రజాసంఘాల్లో కొనసాగుతామని వివరించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి దశరథ్‌, ఏఐటియుసి నాయకుడు రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Read More »

నేడు ఎమ్మెల్యే రాక

  ఆర్మూర్‌, డిసెంబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మంగళవారం ఆర్మూర్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొననున్నట్టు తెరాస నియోజకవర్గ వ్యవహారాల ఇన్‌చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి సోమవారం తెలిపారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఉదయం 10 గంటలకు మానస పాఠశాల, 11 గంటలకు పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో ఎమ్మెల్యే స్వగృహంలో పిఆర్‌ రివ్యు ఉంటుందన్నారు. 12 గంటలకు ప్రజలు, కార్యకర్తలతో ముఖాముఖిలో పాల్గొంటారన్నారు. సాయంత్రం 4 గంటలకు వెల్మల్‌గ్రామంలోగంగపుత్ర సంఘానికి భూమిపూజ చేస్తారన్నారు. 6 ...

Read More »

ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థి భూపతిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

  నిజామాబాద్‌, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికకు తెరాస అభ్యర్థి భూపతిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్‌ అధికారి, సంయుక్త కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు 12వ తేదీ శనివారం చివరి రోజైనందున స్వతంత్ర అభ్యర్థి జగదీష్‌తన నామినేషన్‌ ఉపసంహరించుకోవడంతో బరిలో తెరాస అభ్యర్థి మాత్రమే ఉన్నందున అతని ఎన్నిక ఏకగ్రీవమయిందని తెలిపారు. నామినేషన్లకు చివరి రోజు 9వ తేదీ వరకు తెరాస తరఫున భూపతిరెడ్డి, కాంగ్రెస్‌ తరఫున కె.వెంకటరమణారెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా ...

Read More »

ఘనంగా సోనియా జన్మదిన వేడుకలు

  కామారెడ్డి, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు బుధవారం కామారెడ్డి కాంగ్రెస్‌పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద కేక్‌ కట్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా నాయకులు మహ్మద్‌ నయీమ్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన తెలంగాణ దేవత సోనియా గాంధీ అని ఆమెను ప్రజలు ఎన్నటికి మరిచిపోలేరని అన్నారు. తెలంగాణ ప్రజల మనోభీష్టాన్ని ఆమె నెరవేర్చారని, ప్రజల హృదయాల్లో గూడు కట్టుకొని ఉన్నారని, కార్యక్రమంలో కాంగ్రెస్‌, ...

Read More »

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఏడుగురు ఖరారు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున పోటీచేసే అభ్యర్థులను మరో ఆరుగురు అభ్యర్థుల పేర్లను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఖరారుచేశారు. ఆదివారం తెలంగాణ భవనలో సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. కాగా నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డిని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం పన్నెండు మంది ఎమ్మెల్సీ అభ్యర్థులకుగాను ఏడుగురి పేర్లు ఖరారయ్యాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో అన్నివర్గాలకు న్యాయం జరిగేలా పార్టీ చర్యలు తీసుకుంటుందని ...

Read More »

తెరాస విజయోత్సవ సంబరాలు

  నందిపేట, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరంగల్లు ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి ఘన విజయం సాధించడం పట్ల మండల తెరాస నాయకులు బస్టాండ్‌ ఎదుట, పార్టీ కార్యాలయం ముందు టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకుంటూ ఆనంద సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నక్కల భూమేశ్‌ మాట్లాడుతూ ప్రజా అభివృద్ది సంక్షేమ పథకాలే పార్టీని గెలిపించాయని, ఇది ఇతర పార్టీల వారికి గుణపాఠం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపిటిసి బాల గంగాధర్‌, అహ్మద్‌ ఖాన్‌, ప్రవీణ్‌గౌడ్‌, ...

Read More »

వరంగల్‌ ఉప ఎన్నికలో తెరాస ఘన విజయం

హన్మకొండ: వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో తెరాస ఘన విజయం సాధించింది. సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి సర్వే సత్యనారాయణపై తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్‌ 4,59,092 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. మొత్తం పోలైన ఓట్లలో తెరాస అభ్యర్థి దయాకర్‌కు 6,15,403 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు 1,56,315 ఓట్లు, భాజపా అభ్యర్థి పగిడిపాటి దేవయ్యకు 1,30,178 ఓట్లు లభించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమై నప్పటి నుంచి అన్ని రౌండ్లలోనూ దయాకర్‌ ఆధిక్యం ప్రదర్శించారు. ఎన్నికల అధికారులు మొత్తం ...

Read More »

ఉద్దేశ్యపూర్వకంగా వాస్తవాలను దాచిపెట్టారు -ఎంపీ శ్రీమతి కవిత

జాగృతి అధ్యక్షులు, నిజామాబాద్‌ ఎంపీ శ్రీమతి కవిత గారి పై ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. దానికి సంబందించి ఆంధ్రజ్యోతి ఉద్దేశ్యపూర్వకంగా వాస్తవాలను దాచిపెట్టారని ఒక ప్రకతననలో తెలిపారు. వారి ప్రకటన యథాతథం:   తేదీ. 13 జూన్ 2014 నాడు శ్రీమతి కవిత ఎన్నికల మొత్తం ఖర్చు రూ. 22,39,845 కు సంబంధించిన పూర్తి లెక్కలను జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించడం జరిగింది. తేదీ: 16 జూన్ 2014 న జిలా ఎన్నికల అధికారి తమ అంచనా ప్రకారం మొత్తం ఖర్చు రూ. 53,97,246 ...

Read More »

బిసిలు రాజకీయంగా ఎదగాలి

  ఆర్మూర్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిసిలు ఉన్నత స్తాయికి చేరాలంటే రాజకీయంగా ముందు వరుసలో నిలవాలని తెలంగాణ బిసి సంక్షేమ సంఘం పొలిటికల్‌ అవేర్‌నెస్‌ కమిటీ జిల్లా అధ్యక్షుడు దేవిదాస్‌ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ రాజకీయంగా బిసిలు ఎదిగినప్పుడే తమ హక్కులను సాధించుకోగలుగుతారని ఆయన సూచించారు. గ్రామీణ స్తాయిలో ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ది సాధించాలని ఆయన పేర్కొన్నారు. బిసి యువత రాజకీయాలపై ఆసక్తి కనబరిచి రానున్న ఎన్నికల్లో తమ సత్తా చాటే ...

Read More »

వరంగల్‌లో రాజేశ్వర్‌రెడ్డి ప్రచారం

  ఆర్మూర్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరంగల్‌ లోక్‌సభ స్థానానికి జరగనున్న ఎన్నికల కోసం తెరాస అభ్యర్థి దయాకర్‌ తరఫున ఆర్మూర్‌ నియోజకవర్గ తెరాస వ్యవహారాల ఇన్‌చార్జి గురువారం వరంగల్‌లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ అభ్యర్తి కోసం ప్రచారం చేశారు. వివిధ వర్గాలవారితో సమావేశాలు ఏర్పాటుచేసి తెరాస అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

Read More »

తహసీల్దార్‌ నిర్వాకం వల్ల 1422 ఓట్ల గల్లంతు

  – సిపిఎం డివిజన్‌ కార్యదర్శి చంద్రశేఖర్‌ కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ పరిధిలోని 24వ వార్డులో గత సార్వత్రిక ఎన్నికలకు ముందు 3122 ఓట్లు ఉండగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే తహసీల్దార్‌ నిర్వాకం వల్ల 1422 ఓట్లు తొలగించారని సిపిఎం డివిజన్‌ కార్యదర్శి చంద్రశేఖర్‌ ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారులు ప్రభుత్వానికి తొత్తుగా మారి కనీస విచారణ లేకుండా ఎలక్షన్‌ కమీషన్‌ను తప్పుదోవ పట్టిస్తూ ఒక్క 24వ వార్డులోనే 1422 ఓట్లు ...

Read More »

కేసీఆర్ రావడమే ఆలస్యం.. వెంటనే ప్రకటన

వరంగల్ ఉపఎన్నికకు సంబంధించి పలు పార్టీలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికకు పోటీచేసే విషయంపై టీడీపీ, బీజేపీ మధ్య సమన్వయం కుదిరినట్టు, టీడీపీ బీజేపీకే ఆఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు చర్చమొత్తం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరన్న విషయంపైనే జరుగుతుంది. ఎందుకంటే ఈ పార్టీ తరుపున ఎవరు బరిలో దిగుతారు అన్న విషయంపై ఇంతవరకూ ఓ క్లారిటీ రాలేదు. ప్రస్తుతం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.. ఆయన వస్తేకాని ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దీంతో కేసీఆర్ ఢిల్లీ నుండి ...

Read More »

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో తెరాస నుంచి డాక్టర్‌ భూపతిరెడ్డి

  డిచ్‌పల్లి, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో తెరాస నాయకుడు డాక్టర్‌ భూపతిరెడ్డి రంగంలో ఉన్నట్టు తెరాస వర్గాల ద్వారా తెలిసింది. త్వరలో స్తానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనున్నట్టు సమాచారం. ప్రస్తుతమున్న స్థానిక సంస్తల ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి పదవీకాలం ముగియడంతో స్థానిక సంస్తల ఎన్నికలు నిర్వహించే పనిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని, ఇటీవలే తెరాస నాయకుడు డాక్టర్‌ భూపతిరెడ్డి జడ్పిటిసిలను కలిసినట్టు తెలిసింది. జిల్లాలో జడ్పిటిసి, ఎంపిటిసిలు తెరాసవే అధికంగా ...

Read More »

10న రాష్ట్ర బంద్‌

  – వామపక్ష పార్టీల పిలుపు కామారెడ్డి, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 10 శనివారం రోజున వామపక్ష పార్టీల ప్రజాస్వామిక ఆధ్వర్యంలో తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చినట్టు నాయకులు తెలిపారు. శుక్రవారం మునిసిపల్‌ అతిథి గృహంలో వారు విలేకరులతో మాట్లాడారు. సిపిఐ, సిపిఎం, సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితిలు, కరువు, అప్పుల బాధతో 1400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఇచ్చిన హామీల మేరకు ...

Read More »