Breaking News

Political

అసత్య పత్రికా ప్రకటనలు చేస్తున్నారు

మాక్లూర్‌, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండల‌ బిజెపి సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాలా శివరాజ్‌ కుమార్‌ హాజరై మాట్లాడారు. బిజెపి ఎదుగుదల‌ను చూసి ఓర్వలేక టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు అసత్య పత్రికా ప్రకటనలు చేస్తున్నారని, వారి మాటల‌ను ఇప్పుడు ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ నిధుల‌ను దుర్వినియోగ పరుస్తూ కేంద్రం ఎటువంటి సహాయం చేయడం లేదని అసత్య ఆరోపణలు చేస్తున్న నాయకుల‌కు దమ్ము ధైర్యం ...

Read More »

సామాన్యుల‌పై అసాధారణ భారం

కామారెడ్డి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెట్రోల్‌, డీజిల్ ధరల‌ పెంపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ సోమవారం దేశవ్యాప్త ఆందోళనను చేపట్టింది. అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి, మాజీ మండలి అధ్యక్షుడు షబ్బీర్‌ అలీ ఆదేశాల‌ మేరకు జిల్లా డిసిసి అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాసరావు నియోజకవర్గ ఇంచార్జ్‌లు జుక్కల్‌ సౌదాగర్‌ గంగారాం, బాన్సువాడ కాసుల బాల‌రాజ్‌, ఎల్లారెడ్డి వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి పెంచిన పెట్రో ధరల‌ను వెనక్కితీసుకోవాల‌ని కోరుతూ కామారెడ్డి జిల్లా కలెక్టర్‌కి వినతి పత్రం సమర్పించారు. ...

Read More »

ఉచిత చదువును అందించిన గొప్పవ్యక్తి

కామారెడ్డి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నరసింహారావు జన్మదినాన్ని పురస్కరించుకొని, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మహ్మద్‌ అలీ షబ్బీర్‌ ఆదేశాల‌ మేరకు కాంగ్రెస్‌ పార్టీ కార్యాల‌య ఆవరణలో ఆయన చిత్రపటానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌ రావు, పట్టణ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు పండ రాజు మాట్లాడారు. దేశంలో పివి నరసింహారావు భూ సంస్కరణల‌ ద్వారా పేద రైతుల‌కు, ఆర్థిక సంస్కరణల‌ ద్వారా పేద ప్రజల‌కు, ...

Read More »

ఘనంగా శతజయంతి ఉత్సవాలు ప్రారంభం

నిజామాబాద్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత మాజీ ప్రధాని పి.వి నరసింహ రావు శతజయంతి ఉత్సవాలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి. కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో ఆదివారం రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో పి.వి నరసింహారావు శతజయంతి ఉత్సవాల‌ను జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి, పోలీసు కమిషనర్‌ కార్తికేయతో కలిసి జ్యోతి వెలిగించి, పి.వి నరసింహారావు చిత్రపటానికి పూల మాల‌ వేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ మన ...

Read More »

మూడవ విడత ‘దిశ’ సమావేశం

నిజామాబాద్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మూడవ విడత దిశ సమావేశం నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ అధ్యక్షతన కలెక్టరేట్‌ ప్రగతి భవన్లో నిర్వహించారు. సమావేశంలో ముందుగా జిల్లా కలెక్టర్‌ ఆదేశాల‌ మేరకు క‌ల్న‌ల్‌ సంతోష్‌ కుమార్‌ ఆత్మ శాంతికై రెండు నిమిషాలు మౌనం పాటించారు. అంతకు ముందు ఎంపీ కలెక్టరేట్‌ నందు హరితహారంలో భాగంగా మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్‌ మాట్లాడుతూ గత డిసెంబర్‌ నుండి దిశ సమావేశం నిర్వహించడం అనేక కారణాల వ‌ల్ల‌ వాయిదా ...

Read More »

అమరవీరుల‌కు కాంగ్రెస్‌ సలాం

బీర్కూర్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పూర్వ అధ్యక్షులు రాహుల్‌ గాంధీ, అలాగే టీపీసీసీ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అమర వీరుల‌కు కాంగ్రెస్‌ సలాం అనే కార్యక్రమం ద్వారా ఇచ్చిన పిలుపు మేరకు బీర్కూర్‌ మండల‌ కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో వీర అమర జవానుల‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతూ దేశంలో ఒక వైపు కరోనాతో ప్రజలు చని పోతుంటే మరో వైపు, ...

Read More »

భూభాగాల‌కు రక్షణ లేకుండా చేశారు

కామారెడ్డి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం అఖిల‌ భారత కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల‌ మేరకు అమర జవాన్లకు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నివాళులు అర్పించి మౌనం పాటించారు. గాంధీ గంజ్‌లో గాంధీ విగ్రహానికి పూల‌మాల‌ వేసి అమరవీరులు క‌ల్న‌ల్‌ సంతోష్‌ బాబుకు మరియు ఇతర జవాన్లకు జాతీయ జెండాతో నివాళులు అర్పించారు. కార్యక్రమంలో డిసీసీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ దేశం కోసం అమరులైన వీరుల‌ కుటుంబాల‌కు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని, ...

Read More »

వారిని కఠినంగా శిక్షించాలి

కామారెడ్డి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం న‌ల్ల‌మడుగు గ్రామంలో అంబేద్కర్‌ విగ్రహావిష్కరణను అడ్డుకుని దళిత కుటుంబాల‌న్నింటిని సామాజిక బహిష్కరణ చేయడానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాల‌ని కోరుతూ జిల్లా కలెక్టర్‌ అసిస్టెంట్‌ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఎంసిపిఐయు పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం, బిఎల్‌ఎప్‌ జిల్లాకన్వీనర్‌ జబ్బర్‌, బిఎల్‌పి పార్టీ జిల్లా కన్వీనర్‌ సదానందం మాట్లాడుతూ గ్రామంలో 93 దళితకుటుంబాల‌ను గ్రామంలో ఉన్న అగ్రవర్ణ భూస్వాములు విడిసి కలిసి సామాజిక బహిష్కరణ చేయడం తీవ్రంగా ...

Read More »

వీటి ప్రభావం సామాన్యుల‌పై పడుతుంది

కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధరల‌ను తగ్గించాల‌ని కామారెడ్డిలో వామపక్ష పార్టీల‌ ఆధ్వర్యంలో నిజాంసాగర్‌ చౌరస్తా వద్ద వామపక్ష పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. గురువారం కామారెడ్డి జిల్లాలో నిజాంసాగర్‌ చౌరస్తా వద్ద కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అధికంగా పెట్రోల్‌, డీజిల్‌, ధరలు తగ్గించాల‌ని సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఎం, ఎంసిపిఐయు, ఆర్‌ఎస్‌పి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి, ఎస్‌. వెంకట్‌ గౌడ్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎల్‌.దశరథ్‌ ...

Read More »

రాజకీయ ప్రత్యర్థుల‌ను జైలు పాలు చేశారు

నిజామాబాద్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఏకపక్షంగా అత్యవసర స్థితిని విధించిన 1975-77 మధ్యకాలంలోని 21-నెల‌ల కాలాన్ని భారత అత్యవసర స్థితి లేదా ఎమర్జెన్సీగా వ్యవహరిస్తారని, భారత రాజ్యాంగంలోని 352 (1) అధికరణంలో అంతర్గత కల్లోల‌ స్థితిని ఉద్దేశించి ఏర్పరిచిన అంతర్గత అత్యవసర స్థితిని వినియోగించుకుని అప్పటి ప్రెసిడెంట్‌ ఫక్రుద్దీన్‌ ఆలీ అహ్మద్‌ ద్వారా 1975 జూన్‌ 25 అర్థరాత్రి 11.45 నిమిషాల‌కు అధికారికంగా విధింపజేశారని బీజేపీ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షులు బస్వా ల‌క్ష్మీ ...

Read More »

జన్‌సంఫ్‌ులో పార్టీ నుండి మొట్టమొదటి కేంద్రమంత్రి

ఎల్లారెడ్డి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయవాద నేతల‌తో కలిసి 1951లో శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ జన్‌సంఫ్‌ు పార్టీ స్థాపించారని, కేంద్ర మంత్రిగా పనిచేశారని బిజెపి నేతలు అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యాల‌యంలో శ్యామ ప్రసాద ముఖర్జీ బలిదాన దినోత్సవం పురస్కరించుకొని వారి జ్ఞాపకాల‌ను గుర్తుచేసుకొని వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. జన్‌సంఫ్‌ు పార్టీ నుండి మొట్టమొదటి కేంద్ర మంత్రిగా పనిచేశారని, 1953 జూన్‌ 23న మరణించారన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మర్రి బాల‌కిషన్‌, మండల‌ ...

Read More »

ముఖర్జీని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలి

ఆర్మూర్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జన్‌ సంఫ్‌ు వ్యవస్థాపకుడు డాక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ బలిదాన దివస్‌ సందర్భంగా మంగళవారం ఆర్మూర్‌ జర్నలిస్ట్ కాల‌నీ లోని 19 వ వార్డులో 20 మొక్కలు నాటారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాల‌నీవాసులు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల‌ శివరాజ్‌ కుమార్‌ మరియు స్థానిక వార్డు కౌన్సిల‌ర్‌ జీవి నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివరాజ్‌ కుమార్‌ మాట్లాడుతూ కాశ్మీర్‌ భారతంలో కల‌పడానికి మరియు 370 ఆర్టికల్‌ రద్దు ...

Read More »

దో నిశాన్‌, దో ప్రధాన్‌, దో విధాన్‌ నహీ చలేగా అని నినదించారు

కామారెడ్డి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కార్యాల‌యంలో జనసంఫ్‌ు వ్యవస్థాపకులు శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ బలి దాన దినోత్సవం సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ ఏక్‌ దేశ్‌ మే దో నిశాన్‌, దో ప్రధాన్‌, దో విధాన్‌ నహీ చలేగా అంటూ సమైక్య భారతం కోసం ప్రాణాల‌ను తృణ ప్రాయంగా ...

Read More »

నిర్లక్ష్యం… నిర్లక్ష్యం… నిర్లక్ష్యం…

కామారెడ్డి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరొనా కట్టడిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తీరును ఎండ గడుతూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరసన ప్రదర్శన చేయటానికి వస్తున్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెండల ల‌క్మి నారాయణా, బాణాల ల‌క్ష్మారెడ్డిల‌ను అరెస్ట్‌ చేసి దేవున్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణరెడ్డిని ఉదయం 9 గంటల‌కు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అయినప్పటికీ బీజేపీ ...

Read More »

ఇంధన చార్జీలు పెంచడం దుర్మార్గం

ఆర్మూర్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా కార్మిక వ్యతిరేక విధానాల‌కు నిరసనగా వేల్పూరు మండల‌ కేంద్రంలో సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ మరియు ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసిల్దార్‌ సతీష్‌ రెడ్డికి వినతి పత్రం అందించారు. ధర్నానుద్దేశించి ఐఎఫ్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజలు భయబ్రాంతుల‌కు గురవుతుంటే మరో దిక్కు మోడీ ప్రభుత్వం పెట్రోల్‌ డీజిల్‌ చార్జీలు పెంచి అదనపు భారం వేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ...

Read More »

సార్‌ చూపిన బాటలో పయనిద్దాం

బీర్కూర్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ వర్థంతి సందర్భంగా బీర్కూర్‌ మండల‌ కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అబ్దుల్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో సార్‌కు ఘన నివాళుల‌ర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొఫెసర్‌ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి 1952 ముల్కి ఉద్యమం ద్వారా బీజం వేశారని తరువాత 1954 లో విశాలాంధ్ర ప్రతిపాదనకు వ్యతిరేకముగా పోరాడారన్నారు. 1934 ఆగష్టు 6 న వరంగల్‌ జిల్లా అక్కంపేటలో ల‌క్ష్మి కాంతారావు వరల‌క్ష్మమ్మ ...

Read More »

దోమలు వృద్ధి కాకుండా ఆయిల్‌ బాల్స్‌

నిజామాబాద్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధులు ప్రబల‌కుండా ప్రతి ఆదివారం 10 గంటల‌కు 10 నిమిషాల‌ కార్యక్రమం అని నిజామాబాద్‌ నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ అన్నారు. మంత్రి వర్యులు కెటిఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం ఉదయం10 గంటల‌కు పది నిమిషాలు కేటాయించే కార్యక్రమాన్ని మారుతి నగర్‌ పరిసరాల్లో నిర్వహించారు. నిలువ ఉన్న నీటిలో దోమలు వృద్ధి కాకుండా ఆయిల్‌ బాల్స్‌ వేశారు. మేయర్‌ వెంట మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌. వి.పాటిల్‌, కార్పొరేటర్లు విక్రమ్‌ ...

Read More »

స్వరాష్ట్ర సాధన కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు

నిజామాబాద్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే త్యాగం చేసి, ప్రజల్లో భావజాల‌ వ్యాప్తిని రగిలించిన మహనీయులు, తెలంగాణ ముద్దుబిడ్డ ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ అని నిజామాబాద్‌ నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ అన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. ప్రతీ ఒక్కరూ సార్‌ ఆశయ సాధనకు పునరంకితం కావాల‌ని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు విక్రమ్‌ గౌడ్‌, సాయివర్ధన్‌, బట్టు రాఘవేందర్‌, ధర్మపురి, మల్లేష్‌ ...

Read More »

ఆరోగ్య సిబ్బందికి సన్మానం

బీర్కూర్‌, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కాంగ్రెస్‌ పార్టీ యువ నాయకుడు రాహుల్‌ గాంధీ 50 వ జన్మదినం సందర్భంగా బీర్కూర్‌ మండల‌ కేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అబ్దుల్‌ అహ్మద్‌, కామారెడ్డి జిల్లా ఎస్‌టీ సెల్‌ అధ్యక్షుడు ప్రతాప్‌ సింగ్‌ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఒక వైపు కరోనా వైరస్‌తో ప్రజలు చనిపోతుంటే మరో వైపు భారత చైనా సరిహద్దులో 20 మంది జవానులు ...

Read More »

సామాన్య ప్రజల‌ పట్ల సిఎంకు చిత్తశుద్ధి లేదు

కామరెడ్డి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్‌ ఫంక్షన్‌ హాల్‌లో రాహుల్‌ గాంధీ జన్మదినం సందర్బంగా నిరుపేదల‌కు నిత్యావసర సరుకుల‌ను మాజీ మంత్రి మాజీ, మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ షబ్బీర్‌ అలీ అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భారత్‌ చైనా బార్డర్లో 20 మంది సైనికులు మృత్యువాత పడటం చాలా బాధాకరమైన విషయమని, సైనికుల‌ మరణంపై రెండు నిమిషాలు మౌనం పాటించారు. తెలంగాణకు చెందిన క‌ల్న‌ల్‌ సంతోష్‌ బాబు మృతి చెందితే గవర్నర్‌ లాంటి ...

Read More »