Breaking News

Political

మోదీ ఆహ్వానిస్తే…

  కేంద్రంలో చేరికపై ఎంపి కవిత వ్యాఖ్య మంత్రి పదవి కోసమే డిల్లీలోనే చక్కర్లు నిజామాబాద్‌, మే 21: కేంద్రంలో ఉన్న ఎన్‌డిఎ కూటమిలో చేరడంపై జరుగుతున్న చర్చపై నిజామాబాద్‌ ఎంపి కవిత ఎట్టకేలకు పెదవి విప్పారు. బిజెపి ఆహ్వానిస్తే కేంద్ర ప్రభుత్వంలో చేరడంపై తెరాస ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. తాను కేంద్రంలో చేరుతానన్న మాటలు కేవలం ఊహాగానాలేనని ఇంతలోనే ఈ విషయంపై మాట్లాడడం సరికాదన్నారు. బుధవారం కేంద్రం గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ...

Read More »

జిల్లా అబివృద్దిలో ప్రత్యేకతను చాటుతాను … ఎంపి కవిత

నిజామాబాద్‌, మే 19: నిజామాబాద్‌ జిల్లా అభివృద్దిలో ప్రత్యేకతను చాటుతానని, 60 ఏళ్లలో ఉన్న పరిస్థితిని పూర్తిగా మార్చి, జిల్లాను చక్కబెడతానని నిజామాబాద్‌ ఎంపి కవిత అన్నారు. నిజామాబాద్‌లోని స్వగృహాంలో అమె విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వాలు పూర్తిగా ఎళ్లతరబడి అభివృద్దిని మరిచిపోయాయని, తెలంగాణ రాష్ట్రంలో ఇందూరు జిల్లా కిర్తిని చాటుతానని దీమా వ్యక్తం చేసారు. ఏడాది పాలన కాలంలోనే జిల్లాకు రూ.2,571 కోట్ల అభివృద్ది పనులు మంజూరి చేయించడం జరిగిందన్నారు. 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పెద్దపల్లి- నిజామాబాద్‌ రైలు పనులు పదవి ...

Read More »

రైతులను కేసీఆర్‌ మోసం చేశారు

  – ఏఐసిసి అధికార ప్రతినిధి మధుయాష్కీ నిజామాబాద్‌ అర్బన్‌, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మే 15వ తేదీ వరకు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నా మోడి ప్రభుత్వం, ఇటు కేసీఆర్‌ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో విఫలమయ్యారని ఏఐసిసి అధికార ప్రతినిధి మధుయాష్కీ మండిపడ్డారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి కష్టాలు లేకుండా, రైతులను ఆన్ని విధాలా ఆదుకున్నామని అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ...

Read More »

జైల్‌భరో పోస్టర్ల ఆవిష్కరణ

  కామారెడ్డి, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఐ ఆధ్వర్యంలో ఈనెల 14న తలపెట్టిన జైల్‌భరో కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను బుధవారం పార్టీ నాయకులు కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టాన్ని రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ సిపిఐ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా జైల్‌భరో కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగానే కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఎదుట గురువారం ధర్నాకార్యక్రమం తలపెట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ వ్యక్తుల ...

Read More »

రైతు భరోసా పాదయాత్ర గోడప్రతుల ఆవిష్కరణ

  కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 14న తలపెట్టిన ఛలో కామారెడ్డి కార్యక్రమానికి సంబంధించిన గోడప్రతులను మంగళవారం కామారెడ్డిలో శాసనమండల విపక్ష నేత షబ్బీర్‌ అలీ ఆవిష్కరించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, రైతుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు రాహుల్‌గాంధీ రైతుభరోసా పాద యాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈనెల 14న సాయంత్రం 6 గంటలకు కామారెడ్డిలోని సిఎస్‌ఐ మైదానంలో బహిరంగ సభ ఉంటుందని అన్నారు. రైతుల్లో స్ఫూర్తినింపి వారికి భరోసా ...

Read More »

కేసీఆర్‌ది నయవంచక పాలన

  – శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేసీఆర్‌ది నయవంచక పాలన అని శాసన మండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ అన్నారు. ఈనెల 14న రాహుల్‌గాంధీ పర్యటన నేపథ్యంలో కామారెడ్డికి వచ్చిన ఆయన ఆర్టీసి కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ అధికారం చేపట్టిన నాటినుంచి ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోకుండా మోసపూరిత పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. వాటర్‌గ్రిడ్‌, ...

Read More »

తెలంగాణ అభివృద్ది కి సహకరించాలని ప్రదాని శ్రీ నరేంద్ర మోడిని కోరిన నిజామాబాద్ ఎంపీ

8-05-2015 తెలంగాణ అభివృద్ది కి సహకరించాలని ప్రదాని శ్రీ నరేంద్ర మోడిని కోరిన నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత.   తెలంగాణ కు సంబందించిన వివిధ అంశాలలో సానుకూలంగా స్పందించి రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని ప్రదాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత కోరారు. నేడు డిల్లీలోని ప్రధాని కార్యాలయంలో వారితో సమావేశమైన శ్రీమతి కవిత రాష్ట్రానికి సంబందించిన ముఖ్య అంశాలను ప్రధాని దృశ్టికి తెచ్చారు. 1) విభజన చట్టాన్ని అనుసరించి తెలంగాన లో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు ...

Read More »

ప్లీనరీకి భారీగా తరలిన తెరాస శ్రేణులు

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం హైదరాబాద్‌లో తెరాస ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరి సమావేశానికి ఆర్మూర్‌ పట్టణ అధ్యక్షులు గంగాధర్‌ ఆద్వర్యంలో తెరాస నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఎం కేసీఆర్‌ తిరిగి పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నిక కావడం శుభప్రదమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెరాస పాలనలో ప్రజలు సుఖ శాంతులతో ఉన్నారని, అలాగే కేసీఆర్‌ ఆధ్వర్యంలోనే బంగారు తెలంగాణ అవతరిస్తుందని, దీనికి సైనికులుగా పనిచేస్తామన్నారు.

Read More »

షబ్బీర్‌అలీకి ఘనస్వాగతం… ఘన సన్మానం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనమండలి విపక్షనేతగా ఎన్నికైన తర్వాత తొలిసారి జిల్లాలో అడుగిడిన మాజీ మంత్రి షబ్బీర్‌అలీకి కామారెడ్డి నియోజకవర్గ నాయకులు ఘనస్వాగతం పలికారు. జిల్లా సరిహద్దు గ్రామమైన బస్వాపూర్‌ వద్ద షబ్బీర్‌ అలీకి పూలదండలు వేసి ఆహ్వానం పలికారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అక్కడినుంచి వందలాది ద్విచక్ర వాహనాలతో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. బస్వాపూర్‌ నుంచి కామారెడ్డి వరకు ర్యాలీ కొనసాగింది. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ జరిపారు. అనంతరం ...

Read More »

కొనసాగుతున్న సభ్యత్వ నమోదు

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతుందని బిజెవైఎం పట్టణ అధ్యక్షులు నరేందర్‌ తెలిపారు. గురువారం ఆయన ఆద్వర్యంలో పట్టణంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా నూతనంగా 200 మందికి సభ్యత్వం చేయించి రసీదులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్రమోడి పాలనలో ప్రజలు భారతీయజనతా పార్టీవైపు చూస్తున్నారని, అందులో భాగంగానే సభ్యత్వ నమోదు ఆశించిన స్థాయికంటే ఎక్కువగా జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ...

Read More »

ప్రతిపక్షనేత స్వాగతానికి భారీ సన్నాహాలు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ శాసనసభ ప్రతిపక్షనేతగా ఎన్నికై తొలిసారిగా జిల్లాకు వస్తున్న మాజీ మంత్రి షబ్బీర్‌అలీని సన్మానించేందుకు కాంగ్రెస్‌ నాయకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. షబ్బీర్‌ అలీ గురువారం కామారెడ్డికి రానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా సరిహద్దు గ్రామమైన బస్వాపూర్‌ నుంచి షబ్బీర్‌అలీకి ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బస్వాపూర్‌లో జెండా ఆవిష్కరణ చేయించి అనంతరం అక్కడినుంచి కామారెడ్డి వరకు భారీ బైక్‌ ర్యాలీ చేపట్టనున్నారు. పట్టణంలోని సత్యగార్డెన్స్‌లో షబ్బీర్‌అలీకి పార్టీ, వివిధ సంఘాల ...

Read More »

బిజెపి గూటికి ప్రముఖవైద్యులు డాక్టర్‌ మధుశేఖర్‌

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణమే గాక చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు వైద్యరంగంలో సేవలందించిన ప్రముఖ వైద్యులు డాక్టర్‌ మధుశేఖర్‌ ఆదివారం తన అనుచరులతోకలిసి హైదరాబాద్‌లోని బిజెపి కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి ఆద్వర్యంలో బిజెపిలో చేరినట్టు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని వెల్లడించారు.

Read More »

చురుకుగా బిజెపి సభ్యత్వ నమోదు

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌పట్టణంలో బిజెపి సభ్యత్వ నమోదు ఉత్సాహంగా కొనసాగుతుందని బిజెవైఎం పట్టణ అధ్యక్షులు పూజా నరేందర్‌ తెలిపారు. సోమవారం ఆయన ఆధ్వర్యంలో పట్టణంలోని కొత్త బస్టాండ్‌ ప్రాంతంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా నూతనంగా 300 మందికి సభ్యత్వం చేయించి వారికిరసీదులు అందజేశారు. అనంతరం నరేందర్‌ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్రమోడి పాలనవైపు ప్రజలు ఆసక్తిగా ఉన్నారని, అందుకే బిజెపి సభ్యత్వ నమోదు ఆశించిన స్థాయికంటే ఎక్కువ నమోదు ...

Read More »

రైతుల ఆత్మహత్యలు తెరాస పుణ్యమే…

  – టిడిపి శాసనసభ పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌ కామారెడ్డి, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస అధికారంలోకి వచ్చినప్పటినుంచి రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని, ఈ కారణంగానే 700 మంది రైతులు తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడ్డారని టిడిపి శాసనసభ పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆరోపించారు. కామారెడ్డి పట్టణంలో శనివారం నిర్వహించిన కామారెడ్డి టిడిపి నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వం మాటల్లో చెప్పిన పనులు చేతల్లో ఏమాత్రం చూపడం లేదని, ...

Read More »

నష్టపోయిన పంట రైతులను ఆదుకోవాలి

  బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆనంద్‌రెడ్డి కామారెడ్డి, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంట రైతులను ఆదుకొని పంటకు సరైన మద్దతు ధర ప్రకటించి వారిని ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆనందర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గద్దె భూమన్న, మండల అధ్యక్షుడు బాగారెడ్డి శనివారం అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో జిల్లా రైతాంగాం తీవ్ర ఆందోళనకు గురైందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను ...

Read More »

శాసనమండలి ప్రతిపక్ష నేతకు సన్మానం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీని కామారెడ్డి నాయకులు గురువారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే స్థాయి నుంచి పలు శాఖ ల మంత్రిగా, శాసనమండలి సభ్యునిగా, ప్రతిపక్షనేతగా ఎదగడం కామారెడ్డి ప్రాంతానికే గర్వకారణమని అన్నారు. కామారెడ్డి నియోజకవర్గ అభివృద్దికి మరింత కృషి చేయాలని కోరారు. షబ్బీర్‌ను కలిసిన వారిలో కన్నయ్య, చింతల శ్రీనివాస్‌, కృఫాల్‌, శ్రీధర్‌, శేఖర్‌ తదితరులున్నారు. Opposition ...

Read More »

ప్రభుత్వం తన చిత్తశుద్దిని చేతల్లో చూపాలి ..

– టిడిపి జిల్లా కన్వీనర్‌ అరికెల నర్సారెడ్డి కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం తమ చిత్తశుద్దిని మాటల్లో కాకుండా చేతల్లో చూపాలని టిడిపి జిల్లా కన్వీనర్‌, ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి అన్నారు. కామారెడ్డిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం చెబుతున్న మాటలు కోటలు దాటుతున్నప్పటికి పనుల్లో మాత్రం గడప దాటడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వాటర్‌గ్రిడ్‌ ద్వారా నాలుగేళ్లలో ఇంటింటికి నీటి సరఫరా చేస్తామనిచెబుతున్నారని, కానీప్రస్తుతం నీటి ఎద్దడితో ప్రజలు రోడ్లమీదికి ...

Read More »

మండల నూతన కార్యవర్గం ఎన్నిక

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండల నూతన టీఆర్‌ఎస్‌ కార్యవర్గంలో మండల అధ్యక్షుడిగా చక్కరకొండ కృష్ణను నియమించినట్లు నిజామాబాద్‌ రూరల్‌ శాసనసభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్‌ తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను సన్మానించారు. టీఆర్‌ఎస్‌ మండల కార్యవర్గంలో మరో కొందరిని సీనియర్‌ కార్యకర్తలకు స్థానం కల్పించడం జరిగిందన్నారు. మండల ఉపాధ్యక్షుడిగా బాలాగౌడ్‌, మోజిరాంనాయక్‌, ఈగ రాజరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిగా నర్సయ్య, గోపి, సహాయ కార్యదర్శిగా సాయిలు, కోశాధికారిగా లక్ష్మీనారాయణ, మండల రైతు విభాగం అధ్యక్షుడిగా సాయిరెడ్డి, బీసీ సెల్‌ ...

Read More »

వైకాపా జిల్లా అధ్యక్షుని ఎంపిక పట్ల సంబరాలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైకాపా జిల్లా అధ్యక్షునిగా పట్లోళ్ళ సిద్ధార్థరెడ్డిని నియమించడం పట్ల శుక్రవారం కామారెడ్డి పట్టణంలో పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. పార్టీ జిల్లా యువజన సంఘం ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి ఆద్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ సిద్ధార్థరెడ్డిని జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకుగాను పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అద్యక్షులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో పార్టీ పటిష్టానికి తమవంతు సహాయ ...

Read More »

నేడు మండలానికి ఎమ్మెల్యే షకీల్‌ రాక

రెంజల్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేడు మండలంలోని కల్యాపూర్‌, సాటాపూర్‌, నీలా గ్రామాల్లో మిషన్‌ కాకతీయ పనులు ప్రారంభించడానికి బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ వస్తున్నట్టు రెంజల్‌ మండల తెరాస అధ్యక్షులు పాశం సాయిలు తెలిపారు. అలాగే బోర్గాం గ్రామంలో గ్రామ సర్పంచ్‌ రమేశ్‌, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో తెరాసలో చేరనున్నట్టు అన్నారు. అనంతరం బోర్గాంలోని పుష్కర ఘాట్‌ రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

Read More »