Breaking News

Political

24 నుంచి ఫోటో ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలి

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 24వ తేదీ నుంచి ఫోటో ఓటరు స్లిప్పులను డిసెంబరు 1వ తేదీలోగా బూత్‌ లెవల్‌ అధికారులతో పంపిణీ చేయాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. గురువారం తన చాంబరు ద్వారా కామారెడ్డి, జుక్కల్‌, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులు, సహ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. నూతనంగా ఓటు నమోదు చేయించుకున్నవారికి కార్డులు పంపిణీ చేయాలని తెలిపారు. పంపిణీ ...

Read More »

పోలింగ్‌ శాతం పెంచేలా చర్యలు

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్టు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. కామారెడ్డి మునిసిపల్‌ కార్యాలయంలో గురువారం మునిసిపల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాడల్‌ పోలింగ్‌ స్టేషన్‌ను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్‌ 19నుంచి అన్ని గ్రామాల్లో ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాల ద్వారా ఓటు నమోదు చేయువిధానంపై అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు లక్ష 52 వేల 620 మంది ...

Read More »

ఆనంద్‌రెడ్డి విస్తృత ప్రచారం

  నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ రూరల్‌ అభ్యర్థి ఆనంద్‌రెడ్డి గురువారం నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం మోపాల్‌ మండలం తాడెం, కులాస్‌పూర్‌ గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోపాల్‌ బిజెపి అధ్యక్షుడు శ్రీనివాస్‌ యాదవ్‌ ఆద్వర్యంలో పలు గ్రామాలకు చెందిన నాయకులు బిజెపిలో చేరారు. ఆనంద్‌రెడ్డి మాట్లడుతూ నియోజకవర్గాన్ని గత పాలకులు పూర్తిగా విస్మరించారని, అభివృద్దికి నోచుకోలేదని ఆరోపించారు. ఓటు అనే ఆయుధంతో వారికి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. మరోవైపు ...

Read More »

ప్రజావంచక పాలనకు చరమగీతం పాడండి

  కామారెడ్డి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇన్నేళ్ళ పాటు జరిగిన ప్రజావంచక పాలనకు చరమ గీతం పాడాలని కామారెడ్డి అసెంబ్లీ బిజెపి అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణరెడ్డి అన్నారు. బుధవారం ఆయన కామారెడ్డి పట్టణంతోపాటు దోమకొండలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గాన్ని టిడిపి, కాంగ్రెస్‌, తెరాస అన్ని పార్టీల నాయకులు పాలించారని, కానీ అభివృద్దికి నోచుకోలేదని విమర్శించారు. ఏ ఊరికి, ఏ వార్డుకు వెళ్లినా ప్రజలు తమ సమస్యల గురించే విన్నవిస్తున్నారని, గత పాలకుల ...

Read More »

అహంకార కెసిఆర్‌కు బుద్ది చెప్పాల్సిన సమయం వచ్చింది

  కామారెడ్డి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అహంకార కెసిఆర్‌ పాలనకు బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని కామారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ అన్నారు. పట్టణంలోని క్లాసిక్‌ ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం టేకేదారులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో షబ్బీర్‌ మాట్లాడారు. టేకేదారుల సమస్యలు కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఉన్నాయని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెరాస హయాంలో ప్రశ్నించే హక్కును ఎమ్మెల్యేలు పూర్తిగా కాలరాశారని ఆరోపించారు. కామారెడ్డి నియోజకవర్గంలో గంప ...

Read More »

బాన్సువాడలో భాస్కర్‌రెడ్డి ప్రచారం

  బాన్సువాడ, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ తెరాస అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయుడు దేశాయ్‌పేట్‌ సొసైటీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తండ్రి తరఫున ఆయన పట్టణంలో ప్రచారం కొనసాగిస్తున్నారు. పాత బాన్సువాడలోని పలు కాలనీల్లో ఇంటింటికి వెళ్ళి కారు గుర్తుకు ఓటు వేయాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్దితోపాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు ఆయన వివరించారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు మోహన్‌ నాయక్‌, ఇతర నాయకులు ...

Read More »

దుర్కిలో పోచారం ఎన్నికల ప్రచారం

  బాన్సువాడ, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గంలోని దుర్కి తదితర గ్రామాల్లో బుధవారం ఆపద్దర్మ మంత్రి, తెరాస అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెరాస పార్టీ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. గత అరవై ఏళ్లలో జరగని అభివృద్ది తమ ప్రభుత్వ హయాంలో జరిగిందని ఆయన వెల్లడించారు. సంక్షేమ పథకాలతోపాటు రైతు సంక్షేమానికి కెసిఆర్‌ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని పేర్కొన్నారు. ...

Read More »

కామారెడ్డి అభివృద్ది బిజెపితోనే సాద్యం

  కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ది భారతీయ జనతాపార్టీతోనే సాద్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన పట్టణంలోని 4వ, 5వ, 10వ, 11వ వార్డుల్లో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 30 ఏళ్ళుగా టిడిపి, కాంగ్రెస్‌, తెరాసలు కామారెడ్డిని పాలించినా ఏం అభివృద్ది వెలగబెట్టారని ప్రశ్నించారు. కామారెడ్డి పట్టణంలో కనీస సౌకర్యాలైన తాగునీరు, మురికి కాలువలు, రోడ్లు సైతం లేవని ...

Read More »

హామీలు నెరవేర్చని తెరాస నాయకులకు ఓటు అడిగే హక్కు ఎక్కడిది

  కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చని ముఖ్యమంత్రి కెసిఆర్‌తో సహా తెరాస నాయకులకు ఓటు అడిగే హక్కు ఎక్కడిదని కామారెడ్డి అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ విమర్శించారు. మంగళవారం దోమకొండ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితుని సిఎం చేస్తానని లేకుంటే తల నరుక్కుంటా అని, ఇంటింటికి నల్లా ఇవ్వకపోతే ఓట్లు అడగనన్నాడు, మరి కెసిఆర్‌ ఇచ్చాడా ఆయన ప్రశ్నించారు. ఎంతమందికి రెండు పడక ...

Read More »

సొంత గ్రామంలో పర్యటించిన ఆనంద్‌రెడ్డి

  నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ రూరల్‌ అభ్యర్థి ఆనంద్‌రెడ్డి సోమవారం తన స్వంత గ్రామమైన కేశ్‌పల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా కేశ్‌పల్లిలోని కేశవనాథ ఆలయంలో స్వామివారిని దర్శించుకొని అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. కేశ్‌పల్లి గంగారెడ్డి విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామస్తుల కష్టసుఖాలు తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమన్నారు. తన సొంత గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ది చేస్తానన్నారు. అనంతరం యువకులు నిర్వహించిన ...

Read More »

బిఎల్‌ఎఫ్‌ అభ్యర్థిగా నూర్జహాన్‌ నామినేషన్‌

  నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిఎల్‌ఎఫ్‌ రూరల్‌ అభ్యర్థిగా నూర్జహాన్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్బంగా బిఎల్‌ఎఫ్‌ ఆద్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిపిఎం రాష్ట్ర సీనియర్‌ నాయకుడు రాజారావు, రమ మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, సమస్యలు పరిష్కరించడంలో తెరాస పూర్తిగా విపలమైందన్నారు. తెరాస ఇచ్చిన హామీలు అమలు కాలేదని పేర్కొన్నారు. బిఎల్‌ఎఫ్‌ అభ్యర్థిగా నూర్జహాన్‌ను రూరల్‌ నుంచి గెలిపించాలని కోరారు. బిఎల్‌ఎఫ్‌ ద్వారానే ...

Read More »

18వ డివిజన్‌లో బిగాల విస్తృత ప్రచారం

  నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస అర్బన్‌ అభ్యర్థి బిగాల గణేశ్‌ గుప్త సోమవారం 18వ డివిజన్‌లో విస్తృతంగా పర్యటించారు. ఉదయం జెండా బాలాజీ ఆలయం నుంచి ఇంటింటికి వెళుతూ రానున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రజలను కోరారు. సంక్షేమ పథకాలే తెరాసకు కొండంత అండ అని, ఈ పథకాలతోనే తాము తిరిగి రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఖాయమని తనను కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని గణేశ్‌ గుప్త ప్రజలను కోరారు. కార్యక్రమంలో నగర మేయర్‌ ...

Read More »

తెరాసతోనే అభివృద్ధి

  బాన్సువాడ, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస ప్రభుత్వంతోనే పేదల అభివృద్ది సాధ్యమవుతుందని బాన్సువాడ మండలం దేశాయిపేట్‌ సొసైటీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి అన్నారు. తన తండ్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తరఫున ఆయన బాన్సువాడ మండలంలో సోమవారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. బాన్సువాడ పట్టణంతోపాటు మండలంలోని గుడ్మి గ్రామంలో ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం రైతుల కోసం, పేదల సంక్షేమానికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులున్నారు.

Read More »

సొంత గ్రామంలో పర్యటించిన ఆనంద్‌రెడ్డి

  నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ రూరల్‌ అభ్యర్థి ఆనంద్‌రెడ్డి సోమవారం తన స్వంత గ్రామమైన కేశ్‌పల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా కేశ్‌పల్లిలోని కేశవనాథ ఆలయంలో స్వామివారిని దర్శించుకొని అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. కేశ్‌పల్లి గంగారెడ్డి విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామస్తుల కష్టసుఖాలు తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమన్నారు. తన సొంత గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ది చేస్తానన్నారు. అనంతరం యువకులు నిర్వహించిన ...

Read More »

ఎన్నికల ప్రచారంలో ఆకుల లలిత బిజి బిజి

  నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆకుల లలిత సోమవారం ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపారు. ఆర్మూర్‌ నియోజకవర్గంలోని పెర్కిట్‌ ఎంపిటిసి పద్మజ మోహన్‌ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అనంతరం వారితో కలిసి గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఎంపిటిసి నాగమణి, సాయారెడ్డి, ఎంపిటిసి సాయన్న తదితరులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. నందిపేట గ్రామంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరిగి రానున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. ఆర్మూర్‌ ...

Read More »

నిజామాబాద్‌ రూరల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా భూపతిరెడ్డి నామినేషన్‌

  నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా డాక్టర్‌ భూపతిరెడ్డి సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం భూపతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఖాయమని, రూరల్‌ నియోజకవర్గంలో తాను గెలవడం కూడా ఖాయమని ఈ సందర్భంగా అన్నారు. మహాకూటమిపై తెరాస నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని, గతంలో మహాకూటమిలో తెరాస నాయకులు ఉన్న సంగతి మరిచిపోయారా అని ఆయన ప్రశ్నించారు.

Read More »

బోధన్‌ బిజెపి అభ్యర్థిగా అల్జాపూర్‌ శ్రీనివాస్‌

  నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ బోధన్‌ నియోజకవర్గ అభ్యర్థిగా రాష్ట్ర అధికార ప్రతినిధి అల్జాపూర్‌ శ్రీనివాస్‌ను అధిష్టానం ప్రకటించింది. అల్జాపూర్‌ శ్రీనివాస్‌ ఈ మేరకు హర్షం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైతే నియోజకవర్గంలో ఉన్న షుగర్‌ ఫ్యాక్టరీని వెంటనే తెరిపిస్తామని అన్నారు.

Read More »

ప్రజలకు అందుబాటులో ఎన్నికల పరిశీలకులు

  నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ప్రజలకు అందుబాటులో నియోజకవర్గాలుగా ఎన్నికల పరిశీలకుని నియమించడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు తెలిపారు. వీరికి పర్యవేక్షకులుగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారి ధీరజ్‌కుమార్‌ ఉంటారని, ప్రతిరోజు గంటసేపు ప్రజలకు కూడా అందుబాటులో ఉంటారని కలెక్టర్‌ వివరించారు. ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి 10.30 వరకు అందుబాటులో ఉంటారని, ప్రజలెవరికైనా ఎన్నికలకు సంబందించిన ఫిర్యాదులు, అభ్యంతరాలుంటే 7901619242 నెంబరుకు ఫోన్‌ చేయొచ్చని ...

Read More »

మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయం

  కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి షబ్బీర్‌ అలీ అన్నారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. సిఎం కెసిఆర్‌ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడ్డాడని విమర్శించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రేషన్‌ దుకాణాల ద్వారా 9 రకాల నిత్యవసర సరుకులను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. రెండు లక్షల రుణమాఫీతోపాటు తదితర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అనంతరం కామారెడ్డి మాజీ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ లక్ష్మారెడ్డి ...

Read More »

19న ముగియనున్న నామినేషన్‌ ప్రక్రియ

  నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసెంబ్లీ ఎన్నికల నామినేసన్లు ఈనెల 19వ తేదీతో ముగియనున్నందున మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదని కేంద్ర ఎన్నికల కమీషన్‌ సీనియర్‌ ప్రిన్సిపాల్‌ సెక్రెటరీ కె.యఫ్‌ విల్‌ ఫ్రెడ్‌ అన్నారు. ఆదివారం ఉదయం ఎన్నికల కమీషన్‌ న్యూ ఢిల్లీ నుంచి రాజస్థాన్‌, తెలంగాణ రాష్ట్రాల జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్‌ అధికారులతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సు నామినేషన్లపై అనుమానాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన ...

Read More »