Breaking News

Renjal

కంటి వెలుగు కేంద్రం పరిశీలించిన ఎంపిపి

రెంజల్‌, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఐకెపి భవనంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని ఎంపిపి మోబిన్‌ఖాన్‌, ఎంపిడివో చంద్రశేఖర్‌ పరిశీలించారు. కేంద్రానికి ఎంతమంది వస్తున్నారు. ఎంత మందికి కంటి పరీక్షలు చేస్తున్నారనే వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 1673 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. ఆయన వెంట వైద్యులు డాక్టర్‌ హరిప్రసాద్‌, సాయినాథ్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, తదితరులున్నారు.

Read More »

త్రివేణి సంగమంలో వాజ్‌పాయ్‌ అస్థికల నిమజ్జనం

రెంజల్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పాయ్‌ అస్థికలను సోమవారం కందకుర్తి త్రివేణి సంగమంలో నిమజ్జనం చేశారు. ఈ సందర్బంగా భారతీయ జనతా పార్టీ ప్రముఖులు మాట్లాడారు. దేశంలో ప్రధానమంత్రిగా సమర్థపాలన అందించిన ఘనత వాజ్‌పాయ్‌కే దక్కిందన్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటుగా భావించారు. అలాంటి రాజనీతిజ్ఞుడి శరీర అస్థికలను హరిద్ర, మంజీర, గోదావరి నదుల కలయికతో ప్రవహించే త్రివేణి సంగమంలో నాయకులు కలిపి ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ...

Read More »

ఘనంగా ఉప్పు సంతోష్‌ జన్మదిన వేడుకలు

రెంజల్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సామాజిక పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పు సంతోష్‌ 47వ జన్మదిన వేడుకలను సోమవారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఆయన అభిమానులు రక్తదానం చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పు సంతోష్‌, మండల అధ్యక్షుడు నాగం జలయ్య, కార్యదర్శి శ్రీకాంత్‌, నాయకులు అనంతయ్య, ప్రసాద్‌గౌడ్‌, భూమయ్య, గంగాధర్‌, సునీల్‌ తదితరులున్నారు.

Read More »

రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు మాడల్‌ విద్యార్థులు ఎంపిక

రెంజల్‌, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తెలంగాణ మాడల్‌ స్కూల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థులు ఎస్‌.రేణు, శిరీషలు రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు ఎంపికైనట్టు వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రవీణ్‌ తెలిపారు. ఈ నెల 27,28 తేదీల్లో వరంగల్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీలో పాల్గొననున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ బలరాం ఉన్నారు.

Read More »

నీటమునిగిన పంటను పరిశీలించిన వ్యవసాయాధికారి

రెంజల్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత వారంరోజులుగా కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన సోయా పంటలను మండల వ్యవసాయ అధికారి సిద్దిరామేశ్వర్‌ గురువారం మండలంలోని బోర్గాం గ్రామంలో పరిశీలించారు. నీరునిల్వ ఉన్న సోయా చేనులో స్టింగర్‌ డీల్‌ అనే పురుగు సోకడం వల్ల ఆకులు, కాండము ఎండిపోయాయని వాటి నివారణకు రైతులు ట్రైజోపాస్‌ నాలుగు వందల గ్రాముల ఎకరానికి పిచికారి చేయాలి, లేదా ఫోరోసిన్‌ అరవై మిల్లీ లీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలన్నారు. ...

Read More »

బహుజన రాజ్యాధికారమే టిఎస్‌ పిఎస్‌ ధ్యేయం

రెంజల్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బహుజనుల కోసం అహర్నిశలు కృషి చేస్తు బహుజన రాజ్యాదికారమే ధ్యేయంగా ముందుకు సాగడమే తెలంగాణ సామాజిక పోరాట సమితి లక్ష్యమని టిఎస్‌ పిఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పు సంతోష్‌ అన్నారు. గురువారం మండలంలోని సాటాపూర్‌ శివారులోగల ఉషశ్రీ పాఠశాలలో టిఎస్‌ పిఎస్‌ నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. రాష్ట్రంలో అగ్రవర్ణాలదే రాజ్యం అయిందని బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం శ్రమించాల్సిన అవసరం వచ్చిందని ప్రతి బహుజనుడు ముందుకు వచ్చి ...

Read More »

వర్షాలతో పొంగిపొర్లుతున్న అలుగులు

రెంజల్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత నాలుగురోజులుగా కురుస్తున్న వర్సాలకు మండలంలోని ఆయా గ్రామాల చెరువులు, వాగులు, వంకలు నీటితో కళకళలాడుతున్నాయి. రెంజల్‌, తాడ్‌బిలోలి, బోర్గం, దూపల్లి, బాగేపల్లి, కూనేపల్లి, నీలా గ్రామాల చెరువులు నిండకుండవలె కనిపిస్తున్నాయి. రెంజల్‌, తాడ్‌బిలోలి, వాగులు, అలుగులు నీటితో పెద్ద ఎత్తున పారుతున్నాయి. చెరువులు, కుంటలు కూడా జలకళను సంతరించుకున్నాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ సకాలంలో వర్షాలు లేక రైతుల పంట పొలాలు ఎండుముఖం పడుతున్న ...

Read More »

నేల కొరిగిన నివాసపు ఇండ్లు

రెంజల్‌, ,ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత నాలుగురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని తాడ్‌బిలోలి, సాటాపూర్‌, నీలా, పేపర్‌మిల్‌ గ్రామాల్లో నివాసపు ఇండ్లు నేలమట్టమయ్యాయి. నీలా, పేపర్‌మిల్‌ గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఇండ్ల ముందు పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరువరదగా ప్రవహిస్తుంది.

Read More »

మిషన్‌ భగీరథ పనులు ప్రారంభం

రెంజల్‌, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి ఇంటికి తాగునీటిని అందించడమే లక్ష్యంగా మిషన్‌ భగీరథ పనులను ప్రారంభించడం జరిగిందని రైతుసమన్వయ సమితి మండల అధ్యక్షుడు కాశం సాయిలు అన్నారు. మండలంలోని కళ్యాపూర్‌ గ్రామంలో ఆదివారం రైతుసమన్వయ సమితి జిల్లా డైరెక్టర్‌ మౌలానాతో కలిసి మిషన్‌ భగీరథ పనులను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఇంటికి తాగునీటిని అందించడమే లక్ష్యంగా సిఎం కెసిఆర్‌ మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. కళ్యాపూర్‌ గ్రామంలో ప్రతి ...

Read More »

కుండపోత…. అలుగు మోత

రెంజల్‌, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వాగులు పొంగుతున్నాయి. వంకలు తిరుగుతున్నాయి.. రహదారులపై చేరుతున్నాయి. పైర్లను ముంచెత్తుతున్నాయి. నీరు ఏరైంది. నేల జలమైంది. తడిసి ముద్దైంది. వరుణుని కరుణ మెట్టపైరుకు ఊపిరి పోసింది. వరిసాగుకు మొలకలు తెచ్చింది. ఐదురోజుల ప్రతాపం, సాగుకు తాపం తీర్చినా వరుణుడు మరింత కురిస్తే కష్టమే. ఇప్పటికే కొన్నిచోట్ల నాట్లు వేసిన పొలాలు జలాశయాలను తలపిస్తున్నాయి. లోతట్టు నివాసప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఈవారం వ్యవధిలో భానుడు కనిపించినా అలావచ్చి ఇలా వెళ్తున్నాడు. ఇక వర్షమైతే రాత్రి వేళల్లో ...

Read More »

రాజ్యసభ సభ్యుడిని కలిసిన ముదిరాజ్‌ నాయకులు

రెంజల్‌, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజ్యసభ సభ్యుడు బండప్రకాశ్‌ను రెంజల్‌ మండల ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడు మమ్మాయి నాగరాజు, ప్రధాన కార్యదర్శి పోశెట్టిలు శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ముదిరాజ్‌ల సమస్యలను పరిష్కరించాలని బిసి-డి నుంచి బిసి-ఎలోకి మార్చాలని, ముదిరాజ్‌లకు చెరువులో సభ్యత్వాలను కల్పించాలని విన్నవించడం జరిగిందని ఆయన సానుకూలంగా స్పందించారని నాగరాజు తెలిపారు. ఆయన వెంట తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి అల్లుడు జగన్‌, రెంజల్‌ మండల ముదిరాజ్‌ ఉపాద్యక్షుడు ...

Read More »

విద్యార్థులకు వైద్య పరీక్షలు

రెంజల్‌, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు మండలంలోని రెంజల్‌, వీరన్నగుట్ట పాఠశాలల విద్యార్థులకు శనివారం రక్తపరీక్షలు చేయించినట్టు జాగృతి మండల అధ్యక్షుడు నీరడి రమేశ్‌ తెలిపారు. పాఠశాలలోని 8, 9, 10వ తరగతులకు సంబంధించిన విద్యార్థులకు రక్తహీనత ఉన్నవారిని గుర్తించేందుకే రక్తనమూనా పరీక్షలు చేయిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జాగృతి జిల్లా కో కన్వీనర్‌ కుల్దీప్‌ కుమార్‌, జాగృతి నాయకులు జాదవ్‌ గణేశ్‌, రాజు, టెక్నిషియన్‌ ప్రదీప్‌, రహీంఖాన్‌ తదితరులున్నారు.

Read More »

త్రివేణి సంగమంలో జలకళ

రెంజల్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమంలో వరదనీటి జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్సాలకు త్రివేణి సంగమంలో వరదనీరు వచ్చి చేరింది. దీంతో మొన్నటి వరకు ఎడారిని తలపించిన గోదావరి నది ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదనీటితో పాటు స్థానికంగా కురుస్తున్న వర్షాలకు నది ప్రాంతమంతా నీటితో కళకళలాడుతుంది. ఈ నీరు దిగువ ప్రాంతమైన ఎస్‌ఆర్‌ఎస్‌పికి చేరుతుంది. దీంతో స్థానిక రైతాంగం ...

Read More »

పండగలు శాంతియుతంగా జరుపుకోవాలి

రెంజల్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కులమతాలకు అతీతంగా శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలని బోదన్‌ రూరల్‌ సిఐ గోవర్ధనగిరి అన్నారు. మండలంలోని పోలీసు స్టేషన్‌లో శుక్రవారం బక్రీద్‌ పండుగ సందర్భంగా ఇరు మతాలకు సంబంధించిన పెద్దలతో శాంతికమిటి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కులమతాలకు అతీతంగా పండగలు జరుపుకుని, అందరికి ఆదర్శంగా నిలవాలన్నారు. పండగలు శాంతియుత వాతావరణంలో జరుపుకున్నప్పుడే అందరు సంతోషంగా ఉంటారన్నారు. బక్రీద్‌ పండగ సందర్భంగా ...

Read More »

కంటి వెలుగు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

రెంజల్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని ఐకెపి భవనంలో ఏర్పాటు చేసిన కంటివెలుగు పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు శుక్రవారం పరిశీలించారు. కంటి వెలుగు కేంద్రాల్లో ఉన్న పరికరాలను పరిశీలించారు. వసతులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా కంటి వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఆయన వెంట రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ సాయిలు, వైద్య సిబ్బంది ఉన్నారు.

Read More »

మాజీ ప్రధానికి ఘన నివాళి

రెంజల్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ ప్రధానమంత్రి అటల్‌బిహారీ వాజ్‌పేయి మృతికి శుక్రవారం బిజెపి నాయకులు సంతాపం తెలిపారు. సాటాపూర్‌లోని తెలంగాణ చౌరస్తా వద్ద మాజీ ప్రధాని చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భారతీయ జనతాపార్టీ మండల అధ్యక్షుడు మేక సంతోష్‌ మాట్లాడుతూ బిజెపి అంటేనే వాజ్‌పేయి అన్నంతగా ఆరేడు దశాబ్దాల పాటు రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు చవిచూశారని అన్నారు. వాజ్‌పేయి అమర్‌రహే అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో నితిన్‌, సురేశ్‌ పాటిల్‌, యోగేశ్‌, ...

Read More »

కంటి వెలుగు కేంద్రం ప్రారంభం

రెంజల్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాన్ని మండల కేంద్రంలో ఎంపిపి మోబిన్‌ఖాన్‌, జడ్పిటిసి నాగభూషణ్‌రెడ్డిలు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ కంటి చూపుతో సమస్యలతో బాధపడే ఎంతో మంది ప్రజలకు మేలు చేసే ఉచిత కంటి పరీక్షల కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకునేలా ప్రజలు, ప్రతినిధులు, అధికారులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని వారు సూచించారు. తహసీల్దార్‌ రేణుకాచవాన్‌, వైద్యాధికారి క్రిస్టినా, హెచ్‌ఇవో వెంకటరమణ, విఆర్వో సంతోష్‌, ...

Read More »

ఘనంగా 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

రెంజల్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి మోబిన్‌ఖాన్‌, తహసీల్దార్‌ కార్యాలయంలో రేణుకాచవాన్‌, పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ అంబర్యా, ఐకెపి కార్యాలయంలో ఎపిఎం భాస్కర్‌ జాతీయ జెండా ఎగురవేశారు. పాఠశాల విద్యార్థులు వాడవాడలా మువ్వన్నెల జెండాలతో ర్యాలీలు నిర్వహించి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

Read More »

భక్తి శ్రద్దలతో నాగుల పంచమి వేడుకలు

రెంజల్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాగుల పంచమి వేడుకలు మండలంలో ఘనంగా భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు శివాలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగేంద్రునికి పుట్టలో పాలుపోసి ప్రత్యేకంగా మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులకు ఆవు పాలను ఉచితంగా పంపిణీ చేశారు.

Read More »

మండల పరిషత్‌ సీనియర్‌ అసిస్టెంట్‌గా సుమలత

రెంజల్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల ప్రజాపరిషత్‌ సీనియర్‌ అసిస్టెంట్‌గా సుమలత మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసిన లతీఫ్‌ ఉద్యోగ విరమణ పొందారు. ఆర్మూర్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసిన సుమలత పదోన్నతిపై రెంజల్‌ మండల పరిషత్‌ కార్యాలయానికి సీనియర్‌ అసిస్టెంట్‌గా వచ్చారు.

Read More »