రెంజల్, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా అత్యవసరమని మండల ప్రజాపరిషత్ సభ్యురాలు లోలపు రజినీ అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో బుధవారం జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలను ఎంపీపీ రజినీ, జడ్పీటీసీ సభ్యురాలు విజయ జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసినప్పుడే సత్ఫలితాలు లభిస్తాయని క్రీడలు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించి ...
Read More »మొరం గుంతలను పరిశీలించిన మైనింగ్ ఆర్ఐ
రెంజల్, డిసెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలో అక్రమంగా మొరం తవ్వకాలు చేపట్టిన సాటాపూర్, రెంజల్ శివారులో గల మొరం గుంతలను మైనింగ్ ఆర్ఐ ఆంజనేయులు మంగళవారం పరిశీలించారు. ఎటువంటి అనుమతులు లేకుండా తవ్వకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వ పనులు చేపడితే సంబంధిత అధికారుల అనుమతి పొందాలన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీటీసీ కిషోర్, బీజేపీ నాయకుడు మేక సంతోష్ ఉన్నారు.
Read More »అక్రమ లేఅవుట్ల తొలగింపు
రెంజల్, డిసెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని బొర్గం, నీలా, సాటాపూర్ గ్రామాలలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా లేఅవుట్లు నిర్మిస్తున్న ప్రాంతంలో సరిహద్దులను ఏర్పాటు చేసిన రాళ్లను మంగళవారం మండల పరిషత్ అభివద్ధి అధికారి గోపాలకష్ణ సిబ్బందితో తొలగించారు. పంచాయతీ అనుమతి లేకుండా లేఅవుట్లు నిర్మాణ పనులు చేపట్టరాదని తప్పనిసరిగా పంచాయతీ అనుమతులు తీసుకోవాలన్నారు. ఆయన వెంట ఎంపిఓ గౌస్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు అమ్రిన్, రాణి తదితరులు ఉన్నారు.
Read More »దివ్యాంగులపై వివక్ష వీడాలి
రెంజల్, డిసెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజంలో దివ్యాంగులపై చూపించాల్సింది సానుభూతి కాదని వారికి కావాల్సింది ప్రోత్సాహమని ఎంపీపీ లోలపు రజినీ అన్నారు. మండలంలోని సాటాపూర్ భవిత కేంద్రంలో మంగళవారం దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ రజినీ మాట్లాడుతూ సమాజంలో అన్ని సవ్యంగా ఉన్న వారి కంటే శారీరక మానసిక లోపం ఉన్నవారు ఎందరో ఎన్నో రంగాల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని చెప్పారు. లోపం శరీరానికే తప్ప తెలివి తేటలకు కాదని నిరూపించారన్నారు. వారికి జాలి దయ ...
Read More »తహసీల్దార్‌కు వినతి
రెంజల్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఫిబ్రవరి15న ప్రభుత్వం అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని కోరుతూ లంబాడీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో లంబాడీల ఐక్యవేదిక గౌరవ అధ్యక్షుడు రాథోడ్ సర్దార్ చరణ్ సింగ్, రెంజల్ మండల అధ్యక్షుడు రామారావు, లక్ష్మణ్, గోపీ, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
Read More »సాటాపూర్‌లో ఉచిత రక్తపరీక్షలు
రెంజల్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని సాటాపూర్ గ్రామంలో గురువారం వర్డ్, స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత రక్త పరీక్షల కార్యక్రమాన్ని సర్పంచ్ వికార్ పాషా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్డ్, స్నేహ సొసైటీ వారు ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించడం అభినదనీయమని అన్నారు. గ్రామానికి చెందిన సుమారు మూడు వందల మందికి రక్త పరీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో వర్డ్ కో ఆర్డినెటర్స్ సమత, రహిమ్ తదితరులు పాల్గొన్నారు.
Read More »మహిళలపై దాడి
రెంజల్, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని నీలా గ్రామానికి చెందిన ఇరువురు రైతులు భూమి తమదంటే తమదంటూ తగాదకు దిగారు. జలీల్ ఖాన్ అనే రైతు వరి పంట కోస్తుండగా తమ సొంత భూమిలో పంటను ఎందుకు కోస్తున్నావని నిలదీసిన ఇందూరు లక్ష్మీ, కవితలపై జలీల్ ఖాన్ దాడి చేశాడు. దీంతో మహిళలు తహసీల్దార్‌ను ఆశ్రయించారు. తహసీల్దార్ అసాదుల్లా ఖాన్ పోలీసులకు ఫోన్ చేయగా ఫోన్ అందుబాటులో లేదని రావడంతో డిఎస్పీకి పిర్యాదు చేశారు. డిఎస్పి ఎస్సైని, ...
Read More »పాస్‌పుస్తకాలు అందించండి సారూ…
రెంజల్, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2015 సంవత్సరంలో ప్రభుత్వం ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసిన భూమికి సంబంధించిన పట్టా పాసుపుస్తకాలు అందజేయాలని కోరుతూ లంబాడీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ అసదుల్లా ఖాన్‌కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం లంబాడీల ఐక్యవేదిక జిల్లా కో ఆర్డినేటర్ సరిదాస్ నాయక్ మాట్లాడారు. ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన లంబాడీలకు ప్రభుత్వం 2015 సంవత్సరంలో ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రెంజల్ మండలం తాడ్ బిలోలి గ్రామ శివారులో ...
Read More »ఆపద్బంధు చెక్కు అందజేత
రెంజల్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని దూపల్లి గ్రామానికి చెందిన గంగాధర్ గత కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు మతి చెందడంతో ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ.50 వేల ఆపద్బందు చెక్కును మతుడి భార్య లక్ష్మీకి శుక్రవారం తహసీల్దార్ అసాదుల్లా ఖాన్ అందజేశారు.
Read More »రైతులు దళారులను ఆశ్రయించద్దు
రెంజల్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు పండించిన ధాన్యాన్ని దళారులను ఆశ్రయించకుండా నేరుగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని తహసీల్దార్ అసాదుల్లా ఖాన్ అన్నారు. శుక్రవారం మండలంలోని నీలా గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని దళారుల పాలు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని అన్నారు. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తుందని, ప్రభుత్వ మద్దతు ధర ”ఏ” గ్రేడ్ ...
Read More »బీజేపీ మండల అధ్యక్షుడుగా చుక్క రాజు
రెంజల్, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని నీలా క్యాంపులో బుధవారం జరిగిన బీజేపీ మండలస్థాయి కార్యవర్గ సమావేశంలో బీజేపీ అధికారప్రతినిది అల్జాపూర్ శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మండల అధ్యక్షుడి ఎంపిక జరిగింది. రెంజల్ గ్రామానికి చెందిన చుక్క రాజును పార్టీ అధిష్టానం మండల అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. మండలంలో బీజేపీ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర,జిల్లా నాయకులు గీత రెడ్డి, ...
Read More »కళ్యాణలక్ష్మి చెక్కుల అందజేత
రెంజల్, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలానికి మంజూరైన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను బుధవారం బోధన్‌లో ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేయడం జరిగిందని రెంజల్ తహసీల్దార్ అసాదుల్లా ఖాన్ తెలిపారు. మండలానికి 44 షాదీముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులు మంజూరయ్యాయని వాటిని లబ్దిదారులకు అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రమేష్, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూమరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు రఫిక్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Read More »సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా వికార్ పాషా
రెంజల్, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడిగా రెంజల్ మండలం సాటాపూర్ గ్రామ సర్పంచ్ వికార్ పాషాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సర్పంచుల సంఘం సమావేశంలో నూతన కమిటీని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా వికార్ పాషా మాట్లాడుతూ జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నందుకు సర్పంచులందరికి ధన్యవాదాలు తెలిపారు. సర్పంచుల సమస్యల పరిష్కారానికి తనవంతు సహాయసహకారాలు అందిస్తూ ఎల్లప్పుడూ అందరికి అందుబాటులో వుంటానన్నారు.
Read More »కొడవలి చేతపట్టి వరి కోసిన ఎమ్మెల్యే
రెంజల్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే షకీల్ అమీర్ తన సొంత వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్న వరి పంటను తానే స్వయంగా కొడవలి చేతపట్టి వరి ధాన్యాన్ని కోసి పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే షకీల్ అమీర్ స్వయంగా వరి కోయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కూడా తన సొంత వ్యవసాయ క్షేత్రంలో సామాన్య రైతుగా వరి కోతను ప్రారంభించడం ఆనందంగా ఉందని రైతులు టిఆర్ఎస్ నాయకులు అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రమేష్, ...
Read More »ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేస్తాం
రెంజల్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అకాల వర్షం కారణంగా తడిసిన ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే షకీల్ అమీర్ అన్నారు. శనివారం రెంజల్ గ్రామంలో నష్టపోయిన వరి పంటను పరిశీలించారు. పంట నష్టానికి గల వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. వరి కోత యంత్రాన్ని స్వయంగా నడిపి తన సొంత పొలంలో వరి కోత ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులు అధైర్య పడకుండా ఉండాలని ప్రభుత్వం ...
Read More »చెక్ పోస్ట్ వద్ద పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలి
రెంజల్, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పొరుగున మహారాష్ట్ర నుంచి ధాన్యం జిల్లాలోకి రాకుండా చెక్‌పోస్టు వద్ద పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మండలంలోని కందకుర్తి అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్‌ను బోధన్ ఆర్డీవో గోపిరామ్ రాథోడ్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహారాష్ట్ర ప్రాంతం నుండి ధాన్యాన్ని జిల్లాలోకి దిగుమతి చేస్తున్నారని వీటిని అరికట్టేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. చెక్‌పోస్టులవద్ద పోలీసు, రెవెన్యూ యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఉండాలని, ...
Read More »బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
రెంజల్, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని తాడ్ బిలోలి గ్రామానికి చెందిన మాజీ పట్వారి రామచంద్రరావు ఈ నెల 9 న మతి చెందారు. కాగా ఆయన కుటుంబాన్ని బోధన్ ఎమ్మెల్యే షకీల్ శుక్రవారం పరామర్శించారు. మతికి గల వివరాలు కుమారుడు సుదీర్నీ అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట టిఆర్ఎస్ నాయకులు రఫీక్, మౌలానా, రవీందర్ గౌడ్, లింగం, విజయ్ యాదవ్, అన్వర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Read More »త్రివేణి సంగమానికి భక్తుల తాకిడి
రెంజల్, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కార్తీకమాసాన్ని పురస్కరించుకొని మండలంలోని కందకుర్తి గోదావరి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుండి భక్తులు గోదావరికి చేరుకొని నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. గోదావరి పరివాహక ప్రాంతమైన కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి పిండివంటలు నైవేద్యంగా చేసి దీపాలు వెలిగించి తెప్పలను గోదావరి నదిలో వదిలారు. పవిత్ర శుక్రవారం కావడంతో వివిధ ప్రాంతాలనుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కందకుర్తి శివాలయంలో పూజలు నిర్వహించి ...
Read More »చదువుతోపాటు క్రీడలు అవసరం
రెంజల్, నవంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా అత్యవసరమని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ బలరాం అన్నారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో బుధవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అండర్- 15 బాల బాలికల వాలీబాల్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసినప్పుడే సత్ఫలితాలు లభిస్తాయని, క్రీడలు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించి జ్ఞాపకశక్తి ఏకాగ్రత ల పెరుగుదలకు ఎంతగానో దోహదపడతాయన్నారు. ...
Read More »అక్రమంగా తరలిస్తున్న ధాన్యం పట్టివేత
రెంజల్, నవంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలం కందకుర్తి వద్ద వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రం వద్ద మహారాష్ట్ర నుండి తరలిస్తున్న అక్రమ వరి ధాన్యం లారీని పట్టుకున్నట్లు ఎన్ఫోర్సుమెంట్ డిటి వసంత తెలిపారు.
Read More »